శర్మ కాలక్షేపంకబుర్లు-కాలో దురతిక్రమణీయః

rama కాలో దురతిక్రమణీయః  

పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం జరిగింది, కౌరవులు నశించారు, తాత భీష్ముడు శరతల్పం మీద ఉన్నాడు. ధర్మరాజు పట్టాభిషేకం చేసుకున్న తరవాత శ్రీకృష్ణుడు “తాత గారి దగ్గర కెళ్ళి రాజనీతి రహస్యాలు,ధర్మాలు తెలుసుకుని వద్దురుగా”నని పాండవులను బయలుదేరదీసి భీష్ముని వద్దకు చేరతారు. వారిని చూచిన భీష్ముడు మహానురాగంతో కళ్ళ నీళ్ళు రాగా

“ధర్మ బద్ధంగా బతకాలని మీరు అనేక పాట్లు పడ్డారు, పాండు రాజు శాపవశాన మరణించగా కుంతి మిమ్మల్ని ’ఇంతప్పటినుంచి’( ఒక చెయ్యి బోర్లా వేసి భూమికి దగ్గరగా చూపడం తెనుగునాట పరిపాటి) కష్టాలు పడి పెంచింది.

వాయు వశంబులై యెగసి వారిధరంబులు మింట గూడుచుం
బాయుచు నుండు కైవడి బ్రపంచము సర్వము గాలతంత్రమై
పాయుచు గూడుచుండు నొకభంగి జరింపదు కాల మన్నియుం
జేయుచునుండు గాలము విచిత్రము దుస్తరమెట్టివారికిన్…..భాగ…స్కం.1….209

గాలి వశంచేత పైకెగసిన వారిధరంబులు=మేఘాలు ఆకాశం లో ఒక చోట చేరుతూ విడిపోయినట్లు ప్రపంచం సర్వం కాలం తో కలుస్తూ కలుస్తూ విడిపోతూ ఉంటుంది, కాలమే అన్ని పనులు చేస్తుంది, కాలం విచిత్రమైనది, దానిని దాటటం ఎవరికైనా అసాధ్యమే” అంటూ

రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవో
ద్వేజకమైన గాండివము విల్లట సారధి సర్వభద్ర సం
యోజకుడైన చక్రియట యుగ్ర గదాధరుడైన భీముడ
య్యాజికి దోడు వచ్చునట యాపద గల్గుట యేమిచోద్యమో!…భా,,స్కం.1..210

ధర్మరాజు రాజుట,దేవేంద్రుని కుమారుడు అర్జునుడు విలుకాడుట, శత్రువులను నిర్జించేవిల్లు గాండివముట,సర్వభద్రసంయోజకుడైన= అన్ని శుభాలనూ కలగచేసేవాడైన శ్రీకృష్ణుడు సారధిట, ఉగ్రమైన గదధరించి యుద్ధంలో తోడు వచ్చువాడు భీముడట, ఆపద కలిగిందయ్యా! ఇదేమి చిత్రం” అని భీష్ముడు అన్నాడన్నారు పోతనగారు.

potana

ఇందులో అంత చెప్పుకోవలసినదేమంటారా? భీష్ముడేమన్నాడూ? “రాజు ధర్మరాజుట అంటే ధర్మ రాజెంతవాడంటే “అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నియు యేకము కాకపోవూ….”అన్నారు  తిరుపతి వేంకట కవులు. ధర్మరాజుకి కోపంవస్తే సునామీ వచ్చి మొత్తం సముద్రాలు ఏకమైపోతాయన్నాడు. ఇక దేవేంద్రుని కుమారుడయిన అర్జునుడు విలుకాడు, అంటే అర్జునుడు సవ్యసాచి, రెండు చేతులతోనూ బాణాలు సంధించగలడు. ఈ విద్య అందరివల్లా కాదు. అంత గొప్ప విలుకాడు, గురితప్పని వాడు, అంత గొప్పవాడట. పోనీ! అర్జునుని ఆయుధమో గొప్పదయిన గాండీవం, సాక్షాతు అగ్ని దేవునిచే బహూకరింప బడింది కదా! ఖాండవ వన దహన సమయంలో, గాండీవానికి తిరుగులేదు.అంతటి గొప్ప విల్లు పుచ్చుకుని సదా శివుని నెత్తి మీద మోదడానికి సిద్ధమయి, శివుని మెప్పించి పాశుపతం సంపాదించిన వీరుడు అర్జునుడు. ఇక సారధి సర్వభద్రసంయోగకుడైన చక్రియట, అనగా సర్వశుభాలనూ సంపాదించి పెట్టేవాడైన చక్రి,       సారధిఅన్నారు, ఈ పద ప్రయోగానికీ ప్రత్యేకత ఉంది కదా! సైంధవుణ్ణి సూర్యాస్తమయం లోగా యుద్ధంలో చంపలేకపోతే, గాండీవంతో సహా అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన అర్జునుని కాపాడుకోడానికి చక్రం అడ్డం వేసినవాడు కదా కృష్ణుడు, కావలసినవారిని కాపాడుకోడానికి ఏంత చేయగలడో చూపించిన పరమాత్మ (సారధి) మార్గదర్శిగా ఉన్నాడు, ఉగ్రమైన గదతో శత్రు పక్ష సైన్యంలో సగం మందిని అంతమొందించిన మహావీరుడు భీముడు, అంత గొప్పవారు ఉండి కూడా పాండవులకి చిత్రంగా కష్టం వచ్చిందే!” అన్నాడు. పాండవులకు వచ్చిన కష్టం ఏమి?

యుద్ధం అయిపోయింది, చివరలో ఉప పాండవుల మరణం, యుద్ధం మధ్యలో అభిమన్యుని మరణమే పాండవులను ఎక్కువగా బాధించే కష్టం. ఉప పాండవుల కంటే కూడా ఎక్కువ కష్టం మహా వీరుడయిన అభిమన్యుని మరణం. ఇంతకీ అభిమన్యుడెవరు? సాక్షాత్తు కృష్ణపరమాత్మకి మేనల్లుడు, అతి ప్రియమైన బావ అర్జునుని కొడుకు, మరి అటువంటి వాడిని రక్షించుకోలేదేమని భీష్ముని ప్రశ్న, ఎవరికీ ఈ ప్రశ్న సంధింపబడింది? శ్రీ కృష్ణునికి. ఆ తరవాత భీష్ముడే చెప్పేడు మానవులకు కాలం అతిక్రమించరానిది, శ్రీకృష్ణుడు కూడా మానవునిగా ఉన్నందున కాలాన్ని శాసించడం జరగని పని అని భీష్ముడు చెప్పేడన మాట.

ఆ తరవాత కృష్ణ నిర్యాణం జరిగింది. అర్జునుడు శ్రీకృష్ణుని ఇల్లాండ్రను తీసుకుని ఇంద్రప్రస్థం బయలు దేరి వస్తూ మధ్యలో దొంగలచేత ఓడిపోతాడు, అంతటి గొప్పవిలుకాడు, గాండీవం చేతిలో ఉండి కూడా అవమానం లో చిక్కుకుంటాడు, దీనినే కుంజరయూధమ్ము దోమ కుత్తుకచొచ్చెన్ అన్నారు.

DSCN3168

మహానుభావా! పొతనామాత్యా!! నువ్వు చిరంజీవివయ్యా!!! తెనుగు భాషకి గొప్ప కీర్తి తెచ్చినవాడివి. తెనుగు తీపిని తెలిపినవాడివి, తెనుగెంత తియ్యగా ఉంటుందో నిన్ను చదివితే చాలయ్యా!.నువ్వు రాసినదే అర్ధం కాకపోతే….. భగవంతుడే రక్షించాలి. నీకు సాష్టాంగ దండ ప్రణామం, ఎన్ని వేల సంవత్సరాలు తెనుగు గురించి ఇంగ్లీషులో ఆలోచించినా ఉపయోగం లేదు. ఒక ఇంగ్లీషు వాడు తెనుగును అభిమానించి ఏకంగా ఒక గొప్ప నిఘంటువే రాసిపోయాడండీ! ఇప్పుడు మనం చేస్తున్నదేమిటి భాషను ఎగతాళీ, మిగిలినది హేళన, దెబ్బలాట. మనం పూరేడు పిట్టలలాటివాళ్ళం. ఏంచేస్తాం కాలో దురతిక్రమణియః..

ప్రకటనలు

17 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కాలో దురతిక్రమణీయః

 1. ఇందులో అంత చెప్పుకోవలసినదేమంటారా? భీష్ముడేమన్నాడూ? “రాజు ధర్మరాజుట అంటే ధర్మ రాజెంతవాడంటే “అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నియు యేకము కాకపోవూ….”అన్నారు తిరుపతి వేంకట కవులు. ధర్మరాజుకి కోపంవస్తే సునామీ వచ్చి మొత్తం సముద్రాలు ఏకమైపోతాయన్నాడు. ఇక దేవేంద్రుని కుమారుడయిన అర్జునుడు విలుకాడు, అంటే అర్జునుడు సవ్యసాచి, రెండు చేతులతోనూ బాణాలు సంధించగలడు. ఈ విద్య అందరివల్లా కాదు. అంత గొప్ప విలుకాడు, గురితప్పని వాడు, అంత గొప్పవాడట. పోనీ! అర్జునుని ఆయుధమో గొప్పదయిన గాండీవం, సాక్షాతు అగ్ని దేవునిచే బహూకరింప బడింది కదా! ఖాండవ వన దహన సమయంలో, గాండీవానికి తిరుగులేదు.అంతటి గొప్ప విల్లు పుచ్చుకుని సదా శివుని నెత్తి మీద మోదడానికి సిద్ధమయి, శివుని మెప్పించి పాశుపతం సంపాదించిన వీరుడు అర్జునుడు. ఇక సారధి సర్వభద్రసంయోగకుడైన చక్రియట, అనగా సర్వశుభాలనూ సంపాదించి పెట్టేవాడైన చక్రి, సారధిఅన్నారు, ఈ పద ప్రయోగానికీ ప్రత్యేకత ఉంది కదా! సైంధవుణ్ణి సూర్యాస్తమయం లోగా యుద్ధంలో చంపలేకపోతే, గాండీవంతో సహా అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన అర్జునుని కాపాడుకోడానికి చక్రం అడ్డం వేసినవాడు కదా కృష్ణుడు, కావలసినవారిని కాపాడుకోడానికి ఏంత చేయగలడో చూపించిన పరమాత్మ (సారధి) మార్గదర్శిగా ఉన్నాడు, ఉగ్రమైన గదతో శత్రు పక్ష సైన్యంలో సగం మందిని అంతమొందించిన మహావీరుడు భీముడు, అంత గొప్పవారు ఉండి కూడా పాండవులకి చిత్రంగా కష్టం వచ్చిందే!” అన్నాడు. పాండవులకు వచ్చిన కష్టం ఏమి?

 2. ఇందులో అంత చెప్పుకోవలసినదేమంటారా? భీష్ముడేమన్నాడూ? “రాజు ధర్మరాజుట అంటే ధర్మ రాజెంతవాడంటే “అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నియు యేకము కాకపోవూ….”అన్నారు తిరుపతి వేంకట కవులు. ధర్మరాజుకి కోపంవస్తే సునామీ వచ్చి మొత్తం సముద్రాలు ఏకమైపోతాయన్నాడు. ఇక దేవేంద్రుని కుమారుడయిన అర్జునుడు విలుకాడు, అంటే అర్జునుడు సవ్యసాచి, రెండు చేతులతోనూ బాణాలు సంధించగలడు. ఈ విద్య అందరివల్లా కాదు. అంత గొప్ప విలుకాడు, గురితప్పని వాడు, అంత గొప్పవాడట. పోనీ! అర్జునుని ఆయుధమో గొప్పదయిన గాండీవం, సాక్షాతు అగ్ని దేవునిచే బహూకరింప బడింది కదా! ఖాండవ వన దహన సమయంలో, గాండీవానికి తిరుగులేదు.అంతటి గొప్ప విల్లు పుచ్చుకుని సదా శివుని నెత్తి మీద మోదడానికి సిద్ధమయి, శివుని మెప్పించి పాశుపతం సంపాదించిన వీరుడు అర్జునుడు. ఇక సారధి సర్వభద్రసంయోగకుడైన చక్రియట, అనగా సర్వశుభాలనూ సంపాదించి పెట్టేవాడైన చక్రి, సారధిఅన్నారు, ఈ పద ప్రయోగానికీ ప్రత్యేకత ఉంది కదా! సైంధవుణ్ణి సూర్యాస్తమయం లోగా యుద్ధంలో చంపలేకపోతే, గాండీవంతో సహా అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన అర్జునుని కాపాడుకోడానికి చక్రం అడ్డం వేసినవాడు కదా కృష్ణుడు, కావలసినవారిని కాపాడుకోడానికి ఏంత చేయగలడో చూపించిన పరమాత్మ (సారధి) మార్గదర్శిగా ఉన్నాడు, ఉగ్రమైన గదతో శత్రు పక్ష సైన్యంలో సగం మందిని అంతమొందించిన మహావీరుడు భీముడు, అంత గొప్పవారు ఉండి కూడా పాండవులకి చిత్రంగా కష్టం వచ్చిందే!” అన్నాడు. పాండవులకు వచ్చిన కష్టం ఏమి?

 3. ఇందులో అంత చెప్పుకోవలసినదేమంటారా? భీష్ముడేమన్నాడూ? “రాజు ధర్మరాజుట అంటే ధర్మ రాజెంతవాడంటే “అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నియు యేకము కాకపోవూ….”అన్నారు తిరుపతి వేంకట కవులు. ధర్మరాజుకి కోపంవస్తే సునామీ వచ్చి మొత్తం సముద్రాలు ఏకమైపోతాయన్నాడు. ఇక దేవేంద్రుని కుమారుడయిన అర్జునుడు విలుకాడు, అంటే అర్జునుడు సవ్యసాచి, రెండు చేతులతోనూ బాణాలు సంధించగలడు. ఈ విద్య అందరివల్లా కాదు. అంత గొప్ప విలుకాడు, గురితప్పని వాడు, అంత గొప్పవాడట. పోనీ! అర్జునుని ఆయుధమో గొప్పదయిన గాండీవం, సాక్షాతు అగ్ని దేవునిచే బహూకరింప బడింది కదా! ఖాండవ వన దహన సమయంలో, గాండీవానికి తిరుగులేదు.అంతటి గొప్ప విల్లు పుచ్చుకుని సదా శివుని నెత్తి మీద మోదడానికి సిద్ధమయి, శివుని మెప్పించి పాశుపతం సంపాదించిన వీరుడు అర్జునుడు. ఇక సారధి సర్వభద్రసంయోగకుడైన చక్రియట, అనగా సర్వశుభాలనూ సంపాదించి పెట్టేవాడైన చక్రి, సారధిఅన్నారు, ఈ పద ప్రయోగానికీ ప్రత్యేకత ఉంది కదా! సైంధవుణ్ణి సూర్యాస్తమయం లోగా యుద్ధంలో చంపలేకపోతే, గాండీవంతో సహా అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన అర్జునుని కాపాడుకోడానికి చక్రం అడ్డం వేసినవాడు కదా కృష్ణుడు, కావలసినవారిని కాపాడుకోడానికి ఏంత చేయగలడో చూపించిన పరమాత్మ (సారధి) మార్గదర్శిగా ఉన్నాడు, ఉగ్రమైన గదతో శత్రు పక్ష సైన్యంలో సగం మందిని అంతమొందించిన మహావీరుడు భీముడు, అంత గొప్పవారు ఉండి కూడా పాండవులకి చిత్రంగా కష్టం వచ్చిందే!” అన్నాడు. పాండవులకు వచ్చిన కష్టం ఏమి?

 4. చక్కటి విషయాలను తెలియజేసారు.
  శ్రీకృష్ణపరమాత్మ తమ గురు పుత్రులను సజీవులుగా తెచ్చి ఇచ్చారు. కురుక్షేత్ర సంగ్రామం తరువాత పరీక్షిత్తును కూడా పునరుజ్జీవుతుడిని చేసారు.
  అయితే , మృతులను పునరుజ్జీవితులను చేసే శక్తి ఉండి కూడా ఉపపాండవులను, అభిమన్యుని తిరిగి బ్రతికించలేదు.
  శ్రీకృష్ణపరమాత్మ చర్యల ద్వారా మనము ఎన్నో ధర్మాలను, ధర్మ సూక్ష్మాలను, మరెన్నో విషయాలను తెలుసుకోవచ్చు.

  • @అమ్మాయ్ అనురాధ,
   పరమాత్మ “నేను చెప్పినట్లు చేయండోయ్! చేసినట్లు కాదన్నారు” పరమాత్మను అర్ధం చేసుకోగలిగితే అసలు సమస్య లేదు కదమ్మా!.
   దయ ఉంచండి

  • అవునండీ శ్రీకృష్ణులవారు మహాభారతయుధ్ధనిహతులైన అభిమన్యాదులను పునర్జీవితులను చేయలేదు. కారణం ఉంది. వారంతా దివ్యాస్త్రవేదులు. కలియుగంలో దివ్యాస్త్రవేదులుండి వారు తదస్త్రసాంప్రదాయాలను వ్యాప్తిచేయరాదు. రానురాను కలియుగంలో తీవ్రంగా ధర్మేతరప్రవర్తనులు కాబేయే మానవులకు దివ్యాస్త్రాలను అందుబాటులో ఉంచటం భగవానుని అభిమతం కాదు. అందుకే వారిని బ్రతికించలేదు మరలా.

   అశ్వథ్థామ తపోవనాలకు వెళ్ళాడు. కృపుడు పరీక్షిత్తుకు పరమాత్మ హృదయమెరిగినవాడు కాబట్టి దివ్యాస్త్రాలను ప్రదానం చేయ లేదు. యాదవప్రళయంలో అర్జునశిష్యుడూ కృష్ణసహోదరుడు అయిన సాత్యకి, కృష్ణుడి సేనాపతి కృతవర్మా అంతర్హితులైనారు. శ్రీకృష్నులే స్వయంగా యాదవులు నా అనంతరం భూమిమీద చెలరేగి భీభత్సం కలిగించటం నాకు అసమ్మతం అని అన్నారు. అలాగే మరొక మహాధానుష్కుడు ఘటోత్కచుడు ఇంద్రశక్తికి బలైనప్పుడు సంతోషంతో‌ శంఖం పూరించాడు. అదేంటి అంటే, ‘వీడు రావణు నట్టివాడు. ఇప్పుడంతరించకున్న మరల నా కవతరించ వలసిన పని బదునదే’ అన్నాడు. అర్థమైందిగా పరమాత్మ హృదయం? దివ్యాస్త్రవేత్తలు కలియుగంలో లేరు స్వామి దయ వలన.

   కలియుగాంతంలో హిమవత్పర్వతప్రాంతాలలోని కలాపగ్రామంలో‌తపోదీక్షలో నున్న దేవాపి (శంతనుడి అన్న), మరుత్తు తిరిగి చంద్రసూర్యవంశాలను పునఃప్రకాశింప జేస్తారని పురాణోక్తి.

 5. శర్మ గారూ ,

  నమస్తే .

  ఎంతటి వారైనా కాలానికి తలొంచాల్సిందేనని స్పష్టమౌతున్నది . అది దేవుడు కాని , లేదా ఆదిదేవుడు కాని భూమ్మీదకు వచ్చిన తర్వాత ఆ భూమి నియమాలు పాటించి తీరవలసిందే .
  నేను దేవుణ్ణి గదా అంటే కుదరదిక్కడ . లేకుంటే ఈ మానవులు ఆ దేవుణ్ణైనా చంపేస్తారు , మాకు కూడా ఆ అమృతం యిచ్చి మమ్మల్ని కూడా దైవాలుగా కాకున్నా , చిరంజీవులుగా ఇక్కడే జీవించనీయమని . అందుకే ” ఎంతటివారలైనా కాలాధీనులే .

  • @శర్మాజీ,
   మానవుడై పుడితే మానవ ధర్మాలు పాటించక తప్పదు. శ్రీ కృష్ణుడు భగవంతునిగానే అవతరించి ఆ తరవాత మానవ రూపం పొందారు. అందుచేత కాలాతీతులుగా గురు పుత్రులను బతికించారు, మేనల్లుడిని బతికించలేదు, ఏదో ధర్మ సూక్ష్మం ఉంటుంది, నాకు తెలిఅయలేదు.
   దయ ఉంచండి

 6. కాలో దురతిక్రమణీయః
  ఇప్పుడు అర్ధం తెలిసింది మాష్టారూ మీరిచ్చిన చక్కని వివరణతో.
  కాలాన్ని అతిక్రమించటం ఎవరికీ సాధ్యం కాదు, అనేనా?

  • @మోహన్జీ,
   మొన్న చి. లాస్య కి ఇచ్చిన ముఖాముఖిలో చెప్పినది యధాతధంగా మనవి చేస్తున్నా.

   పేరు:-
   “పుట్టినప్పటినుంచి పేరొకలా ఏడిచిందా? చిన్నప్పుడు, గిర్రడని, ఆతర్వాత గిరీశమని, గీరీశంగారని” గురజాడ వారన్నట్లు నాకు ఒక పేరు కాదమ్మాయ్! రెండు పేర్లు. పెద్ద కధే ఉంది మరి, చెప్పమన్నావా? ఒక పేరు కన్నమ్మ పెట్టింది, పెంచుకున్నమ్మ పొద్దుచూసేది, చూడలేక నాకు ’భాస్కరశర్మ’ అని పేరు కన్నమ్మ చేత పెట్టించి, తనుపొద్దు చూడటం మానేసిందిట. అలా మొదటిపేరు కన్నమ్మ పెట్టినా అది పెంచుకున్నమ్మ ఆలోచనే. ఆ తరవాత పద్నాలుగో సంవత్సరం లో పెంచుకున్నమ్మ పుట్టినప్పుడు తను పెట్టించిన పేరు మార్చేసి ’వేంకట దీక్షితులు’ అని మళ్ళీ నామ కరణం చేసింది. రెండు పేర్లూ చెప్పుకుంటాను. అప్పటికే బడిలో పుట్టినప్పటి పేరు రాసేయడం తో ఆ రోజులలో మార్పులు చేసేసావకాశం లేక మొదటి పేరుతో మిగిలిపోయా.”
   నేను ఇద్దరు తల్లుల ముద్దుల పాపను 🙂

   దయ ఉంచాలి.

 7. >శ్రీకృష్ణుడు కూడా మానవునిగా ఉన్నందున కాలాన్ని శాసించడం జరగని పని అని భీష్ముడు చెప్పాడు..
  శ్రీకృష్ణులవారు మృతులైన గురుపుత్రులను మముని వద్దనుండి తెచ్చి యివ్వటం వంటి పనులను చేశి తనను కాలం బంధించదని స్పష్తం చేసారు. అయితే అటువంటి శ్రీకృష్ణపరమాత్మ తన మేనల్లుడైన సౌభద్రుడు వీరమరణం చెందిన పిమ్మట యెందుకు పునర్జీవితుని చేయలేదన్న ప్రశ్న నాకూ కలిగింది ఒకప్పుడు. దానికి సమాధానం ఉంది. ఆయన ఒకవేళ అభిమన్యుని పున్ర్జీవితుని చేసిఉంటే, ఆ యువవీరుడు తిరిగి బ్రతికినందుకు సంతోషించే‌వాడు కాదు. వీరమరణగౌరవం కోల్పోయినందుకు విచారించేవాడు. దాక్షిణ్యప్రాప్తమైన ప్రాణాలతో తిరిగి యుధ్ధానికి పోతే శాత్రవులు గేలిచేస్తారని ఆవేదన చెందేవాడు.

  >అర్జునుడు గాండీవం చేతిలో ఉండి కూడా అవమానం లో చిక్కుకుంటాడు, దీనినే కుంజరయూధమ్ము దోమ కుత్తుకచొచ్చెన్ అన్నారు.
  క్షమించండి. అలాకాదండీ అన్వయం యీ‌నానుడికి. యూధము అంటే సమూహము. అర్జునుడి నొక్కడినే సమూహవాచకంగా చెప్పరాదు కదా! పాండవులైదుగురూ ఒక యేనుగుల గుంపు. విరాటుడేమో వారిముందు ఒక దోమ వంటి వాడు. అలాంటి పాండవులనే గజ సమూహం పోయి దోమవంటి చిన్న రాజు విరాటుడి కొలువు చేసుకోవలసిరావటం విధి వైపరీత్యం అనే అర్థంలో యీ నానుడి పుట్టింది. శ్రీకృష్ణరాయలు వారు దీన్ని ఒక సమస్యగా పూరించమంటే తెనాలి వారు ఇలా చెప్పరని ఐతిహ్యం.

  >క ఇంగ్లీషు వాడు తెనుగును అభిమానించి ఏకంగా ఒక గొప్ప నిఘంటువే రాసిపోయాడండీ!
  అవునండీ. శ్రీబ్రౌను దొరగారు తెలుగులో కవిత్వం కూడా చెప్పారు! మనం మన తెలుగులో కనీసం సుష్టువుగా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం. కాలవైపరీత్యం.

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   పరమాత్మ గురువు గారి కుమారుడిని బతికించిన సంఘటన పొరపాటుగా విస్మరించా. స్వామి కాలాతీతుడే! అభిమన్యుని తిరిగి బతికించకపోడానికి కారణం ఊహించలేను. బహుశః స్వామికి అందరూ ఒకటే కదా! యుద్ధం లో చనిపోయినవారినెవరినీ బతికించలేదు.

   కుంజర యూధం దగ్గర పొరబడ్డాను.

   నా బాధ అదే కదా. సరిగా మాట కూడా మాటాడ లేక పోతున్నారు. గ్రేట్ అంటున్నారు తప్పించి గొప్ప అన్న మాట ఎందుకు మరచిపోతున్నారో!
   దయ ఉంచండి.

 8. దీక్షితులు గారు,

  మా బాగా చెప్పేరు!

  అట్లా అప్పుడప్పుడు పెద్దలు చెబుతూంటే నే కాల గతి లో సరియైన మార్గ దర్శ కత్వం లభ్యం.

  కాకుంటే, ‘ఫాన్ ఫ్లో (గాలి వాటు లో) ఫాన్ ఫాలో లో అత్యంత గర్హనీయ మైనది కూడా శెభాష్ అనిపించు కుంటుంది !

  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s