శర్మ కాలక్షేపంకబుర్లు-ఏక క్రియా! అద్వానీ రాజీనామా!!

ఏక క్రియా...

మా సత్తిబాబు వస్తూనే చెల్లెమ్మా! కాఫీ తల్లీ అని ఒక కేకవేసి కూచున్నాడు. కూచుని

ఏంటండీ సంగతులు వార్తలు అంటే,

ముఖ్యంగా చెప్పుకోవలసినది అద్వానీగారి రాజీనామా! అన్నా.అందుకు సత్తిబాబు

“బలేవారే! ఏక క్రియా ద్వర్ధికరీ అంటారన్నారుగా! ఆయన రాజీనామాలో ఎన్ని పరమార్ధాలు దాగున్నాయో,పార్టీతో సహా ఎన్ని పరమార్ధాలు సాధించబడ్డాయో తెలుసా?

1. అద్వానీ గారు ఇంకా బి.జె.పి లో తిరుగులేని నాయకుడే.
2. వ్యక్తిగతంగా ఆయనకున్న బాధ తీరింది. వ్యతిరేకత వెలిబుచ్చేరు. కొంతలో కొంత పట్టూ సాధించేరు ప్రచారం మీద.
3. విధానాలకి కట్టుబడి ఉంటామన్న సంగతీ చెప్పినట్లయింది.

ఇక పార్టీ సాధించినవి.

1. మోడీలాటి కుర్రకారును లొంగదీసేవాళ్ళున్నారు సుమా అని ఒక సూచన వెలువడింది.
2. ఆర్.ఎస్.ఎస్. తో తమ సంబంధాలు అంత ఇబ్బందులలోకి నెట్టేయ్యవని చెప్పక చెఫ్ఫేరు, రాజీనామా ను వెనక్కు తీసుకునేలా చేయడం లో.
3. మోడీ తో ఢీ కొట్టడం తేలికయిన విషయం కాదని తెలిసినా మరొక సారి ధృవపరచేరు, ఎదుటి పక్షానికి.
4. ఎన్.డి.ఎ మిత్రులకు మోడీ యే సర్వస్వం కాదనే సూచనా ఇచ్చారు. పార్టీ నెగ్గితే మోడీ ప్రధాని అవుతాడన్నది నిజం కాదనీ చెప్పినట్లయింది.
5. మోడీ ని ఉపయోగించుకున్నట్లూ అవలేదుటండీ అన్నాడు.

ఈలోగా నా ఇల్లాలు కాపీ తెస్తే తాగేసి, ఎంతయినా బి.జె.పి వారిది  ప్రభుత్వ పక్షంతోసహవాస దోషంకదూ!, వస్తా!!” అని చెప్పి వెళ్ళి పోయాడు.

ఔరా! రాజకీయం!!  అనుకున్నా.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏక క్రియా! అద్వానీ రాజీనామా!!

 1. మోడీ అండతో నితిన్ గడ్కారీ రెండో సారి అధ్యక్షుడు కావడం అంటే పార్టీపైన మోడీకి పట్టు పెరుగుతున్నదనే అర్ధం. పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ప్రధాని పదవి చేజిక్కించుకోవడానికి ఈ పట్టు తప్పనిసరిగా సహాయ పడవచ్చు. బహుశా ఈ అంశమే బి.జె.పి సీనియర్ నాయకుడు అద్వానీ పార్టీ విభేదాలను బహిరంగపరచడానికి ప్రోద్బలించి ఉండవచ్చు.

 2. బి. జె. పి. కురువృద్ధుడు ఎల్ . కె. అద్వాని ఆ పార్టీలోని తన అన్ని పదవులకు రాజీనామా చేశారు. బి. జె. పి తరఫున మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగించిన తక్షణం ఆయన ఇలా రాజీనామా చేయటం దేశ ప్రజలందరిని ఒకింత విస్మయానికి గురి చేసింది. అద్వాని తన రాజీనామా లేఖలో నేడు వ్యక్తుల సొంత ఎజెండాతో నడుస్తున్న పార్టీయే గాని,నాడు శంకరముఖర్జీ,వాజిపేయి ల నాటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ కాదు అని పేర్కొనడం జరిగింది. అంటే ఇది పరోక్షంగా నరేంద్ర మోడీ ని గురించిన వ్యాఖ్యానమనే అనుకోవచ్చా?అయితే 86సం’ల అద్వాని కొత్త నీరు వస్తున్నపుడు పాత నీరు దానికి ఆహ్వా నమ్ పలకాలి అనే సంగతిని విస్మరించారా?

 3. ఏమండీ దీక్షితులు గారు,

  మీరూ, డాటేరు రమణ బాబు గారు కలిసి ఏమైనా ‘టపా’ ల ఖార్ఖానా పెట్టేరా ?

  ఇద్దరూ ఇంచు మించు గంట ల సమయం తేడా లో ఒకే మేటర్ పై ఒకరేమో సుబ్బు ని వెనకేసుకుని, మరొకరేమో సత్తి బాబుని అటకాయించి టపాలు రాస్తున్నారు !!

  జేకే !

  ఇంతకీ (మీకూ అదే ప్రశ్న!) మోడీ గారు డిల్లీ లో ఇల్లు పెడతా రంటారా ? సత్తి బాబు ఉద్దేశం ఏమిటి ?

  జిలేబి

  • @జిలేబి గారు,
   మోడీ గారు ఎన్.డి.ఎ ను అధికారం లో కి తెచ్చేదాకానే, ప్రచార బాధ్యతే! ఇదే సత్తి బాబు ఉద్దేశమన్నాడు.
   దయ ఉంచండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s