శర్మ కాలక్షేపంకబుర్లు-నంబర్ ప్లీజ్

Graham Bell

Graham Bell

magneto telephone

magneto telephone

నిన్న టెలిగ్రాం గురించి చెప్పుకున్నాం కదా! నేడు మన చేతిలో ఇమిడిపోతున్న, నిత్యం తిట్టుకుంటున్న “బుజ్జి ముండ” సెల్ ఫోన్ కి ఈ రూపురావడానికి, ఇంత అభివృద్ధికి వెనక కధ చాలా ఉంది. చూద్దాం.

పైన కనపడుతున్న దానిని మేగ్నెటో ఫోన్ లేదా ఫీల్డ్ ఫోన్ అంటారు. దీనిని కొంత మంది చూసి ఉండచ్చు. లాకు ఫోన్ అని కూడా అంటారు. ఇటువంటి రెండు ఫోన్లు రెండు ప్రదేశాల మధ్య ఏర్పాటు చేసుకోవచ్చు, నిమిషాలలో, దీనిని ఆర్మీవారు వాడతారు కనక ఫీల్డ్ ఫోన్ అన్నారు. ఫోన్లు రెండు బేటరీలు చాలు 3v. దీనికి ఒకటే లైన్ చాలు.నిన్న టెలిగ్రాం లైన్ చూశాంకదా! ఆలైన్ లో టెలిగ్రాం పరికరం బదులు ఈ ఫోన్ పెట్టుకుంటే కొన్ని ఊళ్ళలో ఒక్క ప్రదేశం నుంచి మాటాడుకోవచ్చు. అన్ని ఊళ్ళవాళ్ళూ ఒక్క సారి కూడా మాటాడుకోవచ్చు. దీనిని కొంత మంది మీరు చూసీ ఉండచ్చు, లాకులలో. ఈ రంగంలో, ఏబై సంవత్సరాలలో వచ్చిన మార్పులు, నేను దగ్గరగా చూసినవి చూద్దాం.

ఇటువంటి ఫోన్లు ఒక ఊళ్ళో ఏర్పాటు చేసుకుని ఒక స్విచ్ బోర్డుకి కలుపుకుని ఒకరితో మరొకరు మాటాడుకుని విడిపోయే వ్యవస్థ ఏర్పడింది. దీనితో మాటాడాటానికి ముందు హేండిల్ తిప్పి అటునుంచి మళ్ళీ వారు హేందిల్ తిప్పితే మనకు రింగ్ వస్తే ఫోన్ ఎత్తి మాటాడాలి. మేగ్నెటో ఎక్స్చ్ంజిలో అయితే హేండిల్ తిప్పి ఫోన్ ఎత్తి పట్టుకుని చెవి దగ్గర పెట్టుకుంటే ఆపరేటర్ పలికేవారు.   అదే  మొదటి టెలిఫోన్ ఎక్స్ఛేంజి.ఇందులో ఇబ్బందులున్నాయి, బేటరీ ఫోన్ దగ్గరుంటుంది, ఫోన్ లో అక్కరలేని శబ్దం వస్తుంటుంది (noise). దీనిని తగ్గించుకోడానికి Central Battery Non multiple Exchange వచ్చింది. కావలసిన బేటరీ exchange లోనే పెట్టుకోవాలి, ఫోన్ దగ్గర అక్కరలేదు. దీనితో మాటాడాటానికి ఫోన్ ఎత్తి పట్టుకుని చెవి దగ్గర పెట్టుకుంటే ఎక్స్ఛేంజ్ లో ఆపరేటర్ నంబర్ ప్లీజ్ అంటారు. అప్పుడుఅ మనకు కావలసినది చెప్పాలి. వారు కనక్షన్ ఇస్తే రింగ్ అవుతున్నట్లు వినపడుతుంది.

220px-Switchboardof1924

CBNM xge

CBNM xge

CBNM xge

ఇందులో నాయిస్ లేదు, బేటరీ బెడదలేదు కాని మరో బెడద వచ్చింది. ఒక స్విచ్ బోర్డుకి వంద ఫోన్ లు తగిలించచ్చు, ఆ పై మరొకటి board అలా పెంచుకుంటూ పోతే కనక్షన్ ఇవ్వడం ఆపరేటర్ వల్లకాదు. ఫోన్ లూ పెరుగుతున్నాయి. అప్పుడు మరొక exchange వచ్చింది అదే Central Battery multiple exchange.ఇందులో ఆపరేటర్ వందమందిని ఆన్సర్ చేస్తూ ఎవరికైనా కనక్షన్ ఇవ్వగలడు.ఆపరేటర్ అవసరం లేకుండా. మీలో చాలా మంది ఫోన్ ఎత్తితే  ఆపరేటర్ నంబర్ ప్లీస్ అన్నమాట విని ఉండరని నా నమ్మకం. 🙂

hd-telecommunications_timeline

CB multiple exchange

కొంత కాలం ఇది నడచింది, ఫోన్లు పెరుతున్నాయి, ఈ ఎక్స్ఛేంజి కి కూడా పరిమితి ఏర్పడిపోయింది.అదీ కాక ఒక సంఘటన ఆటోమేటిక్ exchange కి దోహదం చేసింది.   New York  లో  Strowger అనే వ్యక్తి కాటన్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవాడు.

stroger

ఆ రోజులలో టెలిఫోన్ ఆపరేటర్ అంటే అంతా స్త్రీలే. ఇతను వారితో అసభ్యంగా ప్రవర్తించడం తో వారంతా కట్టు కట్టి ఇతనికి సమాచారం అందకుండా చేసి నష్టం వచ్చేలా చేసేరు. అప్పుడు ఆ అవసరం నుంచి అతను కనిపెట్టినదే  Automatic Telephone exchange (Strowger).

auto xge

Automatic telephone exchange (Strowger)

drawing

దీనికీ పరిమితి ఏర్పడటం తో చోటు ఆక్రమిస్తుండటం తో క్రాస్ బార్ exchanges వచ్చాయి.

crossbar xge

crossbar xge

వీటికీ పరిమితి ఏర్పడిపోయింది, అదీకాక కదలే భాగాలుండటం తో రాంగ్ నంబర్ల గోల చాలా ఎక్కువగా ఉండేది. ఈ రాంగ్ నంబర్ రంగనాధం గోల చాలా చిత్రం గానూ ఉండేది. ఏం చేయలేని పరిస్థితిగా ఉండేది. అదుగో అప్పుడు వచ్చినదే Digital exchange. దీనినే Electronic exchange అన్నారు. దీనితో స్థల పరిమితి తగ్గింది, సంఖ్య పరిమితీ అందుబాటులోనే ఉందనుకుంటా.  ఆటో ఎక్స్ఛ్ంజి లన్నిటిలోనూ మాటాడాలంటే ఫోన్ ఎత్తి గుర్ మని డయల్ టోన్ వినపడిన తరవాత కావలసిన నంబర్ డయల్ చేయాలి. ఇప్పుడు సెల్ ఫోన్ లో సిగ్నల్ ఉందో లేదో కూడా చూడకనే కావలసిన నంబర్ పేరు మీద నొక్కేస్తున్నాం 🙂

digital xge

digital xge

ఇక ఫోన్ సంగతి చూస్తే మేగ్నెటో ఫోన్ తరవాత వచ్చిన ఫోన్ లలో పెద్ద మార్పులు లేవు, రూపులో తప్పించి. ఆ తర్వాత ఆటోమేటిక్ exchanges వచ్చినపుడు మాత్రం అదనంగా డయల్ చేరింది. ఇప్పటికి మార్పులు లేవు రూపులో తప్పించి.

oldest telephone

phone

priyadarsini

priyadarsini

దీని పేరు “ప్రియ భాషిణి” అని పెట్టి ఉంటే బాగుండేదేమో అప్పటి ప్రధాని పేరు పెట్టేసేరు.దేశం అభివృద్ధి పొందాలంటే కావలసినవి కమ్యూనికేషన్లు, విద్యుత్తు. ఇందులో కమ్యూనికేషన్ లో నిజంగానే అభివృద్ధి ( విప్లవనే చెప్పాలి) సాధించాము కాని విద్యుత్ లో సాధించలేకపోతున్నాం. మరొక విప్లవం కూడా సాధించాం. అది క్షీరవిప్లవం. దానిని నిలబెట్టుకునేలా కనపడటం లేదు.

నేను ఈ అన్నిటిని చూశాను, వీటిలో నంబర్ ప్లీస్ ఆపరేటరుగా జీవితం ప్రారంభించా, ఒక పల్లెలో. కమ్యూనికేషన్ అభివృద్ధిని కళ్ళారా చూసి,కమ్యూనికేషన్ డిపార్టుమెంట్ పెరగడం తో నేనూ పెరిగాను.  అందులో పాలు పంచుకున్నవాడిని, అందుకు గర్విస్తున్నా.

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నంబర్ ప్లీజ్

  1. ఇటువంటి ఫోన్లు ఒక ఊళ్ళో ఏర్పాటు చేసుకుని ఒక స్విచ్ బోర్డుకి కలుపుకుని ఒకరితో మరొకరు మాటాడుకుని విడిపోయే వ్యవస్థ ఏర్పడింది. దీనితో మాటాడాటానికి ముందు హేండిల్ తిప్పి అటునుంచి మళ్ళీ వారు హేందిల్ తిప్పితే మనకు రింగ్ వస్తే ఫోన్ ఎత్తి మాటాడాలి. మేగ్నెటో ఎక్స్చ్ంజిలో అయితే హేండిల్ తిప్పి ఫోన్ ఎత్తి పట్టుకుని చెవి దగ్గర పెట్టుకుంటే ఆపరేటర్ పలికేవారు. అదే మొదటి టెలిఫోన్ ఎక్స్ఛేంజి.ఇందులో ఇబ్బందులున్నాయి, బేటరీ ఫోన్ దగ్గరుంటుంది, ఫోన్ లో అక్కరలేని శబ్దం వస్తుంటుంది (noise). దీనిని తగ్గించుకోడానికి Central Battery Non multiple Exchange వచ్చింది. కావలసిన బేటరీ exchange లోనే పెట్టుకోవాలి, ఫోన్ దగ్గర అక్కరలేదు. దీనితో మాటాడాటానికి ఫోన్ ఎత్తి పట్టుకుని చెవి దగ్గర పెట్టుకుంటే ఎక్స్ఛేంజ్ లో ఆపరేటర్ నంబర్ ప్లీజ్ అంటారు. అప్పుడుఅ మనకు కావలసినది చెప్పాలి. వారు కనక్షన్ ఇస్తే రింగ్ అవుతున్నట్లు వినపడుతుంది.

  2. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపంకబుర్లు-నంబర్ ప్లీజ్ | Bagunnaraa Blogs

  3. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపంకబుర్లు-నంబర్ ప్లీజ్ | Bagunnaraa Blogs

  4. Xi said the successful formation of the new leadership of China’s National People’s Congress recently would be a new starting point for enhancing exchanges and cooperation between the legislatures of the two countries and for deepening the sharing of law-making and state-governing experience.

  5. ఇటువంటి ఫోన్లు ఒక ఊళ్ళో ఏర్పాటు చేసుకుని ఒక స్విచ్ బోర్డుకి కలుపుకుని ఒకరితో మరొకరు మాటాడుకుని విడిపోయే వ్యవస్థ ఏర్పడింది. దీనితో మాటాడాటానికి ముందు హేండిల్ తిప్పి అటునుంచి మళ్ళీ వారు హేందిల్ తిప్పితే మనకు రింగ్ వస్తే ఫోన్ ఎత్తి మాటాడాలి. మేగ్నెటో ఎక్స్చ్ంజిలో అయితే హేండిల్ తిప్పి ఫోన్ ఎత్తి పట్టుకుని చెవి దగ్గర పెట్టుకుంటే ఆపరేటర్ పలికేవారు. అదే మొదటి టెలిఫోన్ ఎక్స్ఛేంజి.ఇందులో ఇబ్బందులున్నాయి, బేటరీ ఫోన్ దగ్గరుంటుంది, ఫోన్ లో అక్కరలేని శబ్దం వస్తుంటుంది (noise). దీనిని తగ్గించుకోడానికి Central Battery Non multiple Exchange వచ్చింది. కావలసిన బేటరీ exchange లోనే పెట్టుకోవాలి, ఫోన్ దగ్గర అక్కరలేదు. దీనితో మాటాడాటానికి ఫోన్ ఎత్తి పట్టుకుని చెవి దగ్గర పెట్టుకుంటే ఎక్స్ఛేంజ్ లో ఆపరేటర్ నంబర్ ప్లీజ్ అంటారు. అప్పుడుఅ మనకు కావలసినది చెప్పాలి. వారు కనక్షన్ ఇస్తే రింగ్ అవుతున్నట్లు వినపడుతుంది.

  6. శర్మ గారూ ,

    నమస్తే .

    ఈ టపా చదివిన తర్వాత మనకు తెలిసివచ్చేదేమిటంటే ఒక చెడు , ఇంకొక పొరపాటు వలన
    మంచి జరిగే అవకాశాలు వున్నాయన్నదే . అలాగని పొరపాట్లను మనం ప్రోత్సహించకూడదు .

    దుఃఖం తర్వాత , సుఃఖం వస్తుందంటుంటారు . ప్రసవ నొప్పులు తట్టుకున్న తర్వాత బేబి జననం
    ఆనందదాయకమైనట్లు .

    మీ జీవితానుభవాల్ని యిలా అందరికీ పంచుతూ , ఒకమారు ఆ గతస్మృతులలోకి వెళ్ళటం చాలా
    ఆనందదాయకం.

    • @శర్మాజీ,
      జరిగినది చరిత్ర. ఒక సారి తప్పువల్ల మంచి జరిగితే అన్ని సార్లూ జరగదు కదా! తప్పు తప్పే!
      ధన్యవాదాలు.

  7. టెలిగ్రాం, టెలిఫోన్ గురించి చక్కటి వివరాలను తెలియజేశారు.
    టెలిఫోన్ వల్ల ఉపయోగాలున్నాయి.
    ఉదా.. ఉత్తరాఖండ్ వరదలలో చిక్కుకున్న వారు ఫోన్ ద్వారా తమ విషయాలను తెలియజేశారు కదా !

    • @అనురాధ,
      అభివృద్ధి కావాలి, కాని మూలాలు మరచిపోకూడదు.దేన్నయినా మితంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా
      ధన్యవాదాలు.

      • దేన్నయినా మితంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా………….

        నిజమేనండి, పర్యావరణానికి హాని కలగని విధంగా చూసుకోవాలి.

  8. టెలిఫోన్ చరిత్ర బాగా రాసారు.ఆ రోజుల్లో చాలామంది ఇళ్ళల్లో స్వంత ఫోన్లు ఉండేవి కావు.కావాలన్నా,అప్లైచేస్తే ఏ రెండు మూడేళ్ళకో శాంక్షన్ అయేది. (licence permit raj ).రాజీవ్ గాంధి ప్రధాని అయాక S.T.D.BOOTHS పెట్టించాడు. వీటిని ప్రైవేటు ఆపరెటర్లు నిర్వహించేవారు.అక్కడకు వెళ్ళి కావలసినవారితో మాట్లడుకోడం సులువైంది.ఫోన్ల శాంక్షన్ కూడా సరళతరం అయింది.ఆ తర్వాత శాటిలైటు ద్వారా సెల్ ఫొన్ల విప్లవం వచ్చి ,టెలిఫోన్ సౌకర్యం కోట్లాది ప్రజలకు సులువుగా అందుబాటు లోకి వచ్చిన వైనం అందరికీ తెలిసిందే.ఐనా ఇంకా ఇప్పటికీ ఇంకా ల్యాండ్ ఫోన్లు ,వాటిద్వారా అంతర్జాలం(internet) సౌకర్యం కొంతవరకూ అమల్లోవుంది.

    • @మిత్రులు రమణరావు గారు,
      ఎలా అభివృద్ధి చెందిందన్నదే రాశా. మిగిలిన విషయాలు రాస్తూ పోతే అసలు చెప్పడం అవదేమోనని. వాటిని మరొక సారి చెప్పాలని ఉంది. ఇప్పటివారికి అప్పటి పరిస్థితులు తెలియాలనేదే నా ఉద్దేశం
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s