శర్మ కాలక్షేపంకబుర్లు- ట్రంక్ కాల్

ట్రంక్ కాల్

50/30 సంవత్సరాల కితం మాట.మీలో చాలా మందికి ట్రంకాల్ గురించి తెలిసి ఉండదు. ఒకప్పుడు మరొక ఊరిలో ఉన్న వారితో మాటాడుకోవాలంటే ట్రంకాల్ బుక్ చేసుకోవాలి. Trunk call booking 180, Trunk call Enquiry 181.   ఫోన్ ఉంటే  వారు చాలా పెద్ద వారుగానే లెక్క,. లాయర్లు, డాక్టర్ల కి ఫోన్ లూ ఉండేవి.వ్యాపారస్తులు, ఆఫీసులు, రాజకీయ నాయకులు, వీరికే ఫోన్లు. సామాన్యుడు మాటాడుకోవాలంటే పబ్లిక్ కాల్ ఆఫీస్ కు ఫోన్ చేసి ఫలానా అడ్రసులో ఫలానా వారు కావాలని బుక్ చేస్తే పిలుచుకొచ్చేవారు

 ఇది పోస్ట్ ఆఫీసులోనే ఉండేది.,particular person (P.P call)1/4 extra charge on original rate of the call. For calling a particular person, దీనిని మెసెంజర్ సర్విస్ అనేవారు. దానికి వేరుగా ఒక రూపాయి తీసుకునేవారు. P.P Charge extra,Messenger service one rupee extra.public call office charge charge extra.ఇవన్నీ కలిపితే తడిసి మోపెడయ్యేది. సామాన్యులు ట్రంకాల్ కోసం రావడం తక్కువే. ఆ రోజుల్లో ఫోన్ లో మాటాడటమే గొప్ప, అందులో పని చేస్తున్న మాకిచ్చే గౌరవం మరీ గొప్పగా ఉండేది.ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మాకు ఆహ్వానం ఉండేది. అక్కడ ఒకరికో ఇద్దరికో కుర్చీలు కూడా రిసర్వ్ చేసి ఉంచేవారు. సినిమాకి వస్తున్నామని ఫోన్ చేస్తే రెడ్ కార్పెట్ వెల్కం చెప్పేవారు. ఆ రోజుల్లో ఆపరేటర్ గా గొప్ప గౌరవాన్నే పొందాం.రాజకీయ నాయకులతో పరిచయాలు ఎక్కువగానే ఉండేవి.

ఆ రోజులలో ట్రంకాల్ బుక్ చేసి కూచుంటే ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితే ఉండేది.కాల్ ఛార్జి ప్రతి మూడు నిమిషాలు ఆ లోపుకు ఒకటే ఛార్జీ ఉండేది. మూడు నిమిషాలయిందని ముందుగా వార్నింగ్ చెప్పాలి. చెప్పినా వినిపించుకోనివారూ                                        ఉండేవారు. ఆ తరవాత నాకు వార్నింగ్ చెప్పలేదని కంప్లయింట్ ఇచ్చిన ప్రబుద్ధులూ ఉండేవారు.Call can be extended beyond 3 minutes. No extension after 9 minutes. ఈ విషయంలో గుజరాతీలు మంచి ఆదర్శం, ఎంత వినపడని లైన్ లో ఇచ్చినా మాటాడేవారు, కొద్ది సేపటిలో పని పూర్తి చేసుకునేవారు. అనుమానం వచ్చి  మాటాడేరా అని అడిగితే అబద్ధం చెప్పేవారుకాదు. మాటాడేను పనయిపోయిందనేవారు. వారి దగ్గర నుంచి కంప్లయిట్ ఎప్పుడూ వచ్చేది కాదు, అర్ధ రాత్రయినా కాల్ ఇస్తే    మాటాడేవారు.            

Trunk xge

Trunk xge

Classification of Trunk calls.

1.Air raid warning or clear the line call. can be booked by designated officers

2.SOS (Save our soles) by anybody in the event of floods,earthquakes etc.

3.Most immediate. by President and Prime minister of India.

4.Immediate  can be booked by cabinet ministers,Army,Air,Navy chief

5.Most Important  can be booked by ministers of state and CMs

6.Important  can be booked by cabinet ministers of state Govts.

7.International call can be booked  by anybody

8.Lightning by public

9.Press Trunk call can be booked by accredited correspondents. 25% rebate on original charge.

10.Service  by officers of the Department

11.Urgent  by public

12.Ordinary. by public

ఆర్డినరీ కాల్ కి ఇన్ని అగచాట్లు, దానికి తోడు ఉండేది ఒకటే లైన్ అయి ఉండేది. అన్ని కాల్స్ ఎదురువాలు ఆ లైన్ లోనే పోవాలి. మరి ఎప్పుడొస్తుందో చెప్పగలరా? ఉజ్జాయింపుగా ఎప్పుడొస్తుందని అడిగితే రెండు గంటలని చెబితే అది పెరిగే సావకాశమే ఉండేది. కారణం ఈ లోగా అర్జంట్ కాల్స్ రావడమే. ఇక ఆర్డినరీ కాల్ కి రెట్టింపు ఛార్జీ అర్జంటుకి తీసుకునేవారు. లయిట్నింగ్ కాల్ అన్నది తరవాత రోజులలో వచ్చింది. దీనికి ఛార్జి ఆర్డినరీకి కి పదహారు అక్షరాలా పదహారు రెట్లు ఉండేది.

multiple exge

ఒక ఉదాహరణ మండపేట నుంచి రామచంద్రపురం 8 కిలో మీటర్లు, కాల్ బుక్ చేస్తే అది రాజమంద్రి ద్వారా కాకినాడ లైన్ కలుపుకుని రామచంద్రపురం ఆపరేటర్ కాల్ బుక్ చేసుకుని కావల్సిన నంబర్ ఇచ్చేవాడు. రాజమంద్రిలోనూ కాకినాడలోనూ కూడా ఈ కాల్ వివరాలుండేవి. మరో ఉదాహరణ ఆ రోజులలో రావులపాలెం బ్రిడ్జ్ లేదు, సిద్ధాంతం బ్రిడ్జ్ లేదు.అమలాపురం కాల్ రాజమంద్రి నుంచి మాటాడాలంటే రాజమంద్రి నుంచి విజయవాడ అక్కడినుంచి పాలకొల్లు అక్కడినుంచి అంబాజీపేట అక్కడినుంచి అమలాపురం లైన్ కలవాలి. పాలకొల్లు అంబాజీ పేట మధ్య ఒకటే లైన్ ఎత్తయిన స్థంభాలమీద ( high masts) గోదావరి పాయకి అడ్డంగా ఉండేది. కాల్ దొరికేనా? కర్మచాలి దొరికినా వినపడి చచ్చేనా? మమ్మల్ని తిట్టుకునేవారు. వినపడకపోతే అక్కడ ఆపరేటర్ మేము సాయం పట్టి అది పూర్తి చేసేవారం.

Trunk xge

Trunk xge

ఎన్నని చెప్పను, చావు కబుర్లు, పెళ్ళి కబుర్లు, కట్నాల మాటలు, మధ్యలో మా మధ్యవర్తిత్వాలు.అన్ని లయిన్లూ స్థంభాలమీద ఉన్న వైరలమీద పని చేసేవే. దూరం ఎక్కువైతే వినపడేది కాదు. దీనిని అధిగమించడానికి వైర్ల లయిన పై కొన్ని యంత్రాలమరిచి మొదటగా Physical 1+1 Channel వచ్చింది. ఆ తరవాత 1+3 వచ్చింది. తరవాత 1+8,  1+12 వచ్చాయి. దీనితో  కొంత మెరుగుపడినా ఉపయోగం లేక పోయింది. ఆ తరవాత కోఏక్సియల్ వచ్చి చాలా మార్పు తెచ్చి ఏస్.టి.డి కి దోహదం చేసింది. ఆ తరవాత వచ్చినదే అసలు విప్లవం ఆప్టిక్ ఫైబర్ కేబుల్. ఇప్పుడు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ లేని చోటు వూహించలేం. ఇప్పుడు మనం వాడే ఈ నెట్ అంతా పైబర్ కేబుల్ దయే. science terminology usage మీకు బోర్ కొడుతుందని మానేశాను.

international xge

international xge

సాధారణంగా పల్లెటూరినుంచి ఇంటరనేషనల్ కాల్స్ ఉండవు, కాని నాకు అక్కడ ఆ సావకాశం వచ్చింది. మరొక సంగతి మొదటి దేశ ప్రధాని మాట ఫోన్ లో వినే అదృష్టం కూడా కలిగింది. ఈ ఆనుభవాలిక్కడ రాస్తూ పోతే పెద్దదయిపోతుంది కనక మరో టపాకి వదిలేస్తున్నా. ఈ టపాను అభివృద్ధి పరిచయానికే సరిపెడుతున్నా. The change is really wonderful and it is a real revolution in communications.

ప్రకటనలు

17 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- ట్రంక్ కాల్

 1. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపంకబుర్లు- ట్రంక్ కాల్ | Bagunnaraa Blogs

 2. ఆర్డినరీ కాల్ కి ఇన్ని అగచాట్లు, దానికి తోడు ఉండేది ఒకటే లైన్ అయి ఉండేది. అన్ని కాల్స్ ఎదురువాలు ఆ లైన్ లోనే పోవాలి. మరి ఎప్పుడొస్తుందో చెప్పగలరా? ఉజ్జాయింపుగా ఎప్పుడొస్తుందని అడిగితే రెండు గంటలని చెబితే అది పెరిగే సావకాశమే ఉండేది. కారణం ఈ లోగా అర్జంట్ కాల్స్ రావడమే. ఇక ఆర్డినరీ కాల్ కి రెట్టింపు ఛార్జీ అర్జంటుకి తీసుకునేవారు. లయిట్నింగ్ కాల్ అన్నది తరవాత రోజులలో వచ్చింది. దీనికి ఛార్జి ఆర్డినరీకి కి పదహారు అక్షరాలా పదహారు రెట్లు ఉండేది.

 3. మీరు ఏదైనా ఫైల్ గానీ, డాటా గానీ, ఫొటోస్ గానీ, పాటలు గానీ ఒక డిస్క్ లో నింపాలీ ( బర్న్ ) అనుకున్నప్పుడు ఒక DVD ని DVD రైటర్ లో పెట్టి, సమాచారాన్ని నీరో ద్వారా గానీ, మరే ఇతర సాప్ట్ వేర్ తో గానీ, మీరు అందులో బర్న్ చేస్తున్నారే అనుకుందాము. అందులో సింగిల్ లేయర్ DVD [DVD-5] (మనదగ్గర దొరికేవి అన్నీ ఇవే..) మరియు DVD-9 అంటే డబుల్ లేయర్ DVD లు ఉంటాయి. DVD రైటర్ లో పెట్టాక అందులో ఆ DVD లో 4485 MB డాటా అందులో పడుతుంది. ఇందులో కొంత డాటా స్పేస్ సిస్టం అవసరాలకి పోతుంది. అంటే నికరముగా మనకి అందుబాటులో ఉండేది 4450 MB మాత్రమే. ఇప్పుడు మీకు చెబుతున్నది ఏమిటంటే ఈ 4483 MB జాగాలో అంతకన్నా ఎక్కువ డాటా స్టోర్ చెయ్యాలి అనుకున్నప్పుడు ‘Overburn CD’ అనే ఆప్షన్ ఎంచుకోకండి. అలా ఎంచుకున్నప్పుడు ఆ ఎక్కువగా ఉన్న డాటా అందులో స్టోర్ అవుతుంది.. కాని కొన్నిసార్లు (చాలాసార్లు) ఆ డాటా రీడ్ అవ్వదు. అప్పుడు కొంత (విలువైన) డాటా కోల్పోతాము. అందుకే ఎక్కువ డాటా స్టోర్ ఈ ఆప్షన్ ఉపయోగించి చెయ్యకండి.

 4. శ్రీ శర్మగార్కి, నమస్కారములు.

  చక్కటి పాత విషయాలను నేటి తరానికి తెలియచేశారు.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • @మిత్రులు మాధవరావు గారు
   జవాబివ్వడం లో ఆలస్యానికి మన్నించాలి.
   ఇప్పటివారి చేతిలో పట్టుకుని విచ్చల విడిగా వాడుతున్నది ఎన్ని కష్టాలతో సాధించుకోవలసి వచ్చేదో తెలియ చెప్పాలనే నా కోరిక.

   ధన్యవాదాలు.

 5. ఉద్యోగ రీత్యా సరిహద్దు ప్రాంతాలలో
  కుటుంబాని కి దూరం గా, పని చేసే రోజుల్లో
  ఎప్పుడో వచ్చే ఉత్తరాలు, అనుకున్నప్పుడు దొరకని సెలవులు,
  ఖర్చు ఎక్కువైనా, సర్రిగ్గా వినపడక పోయినా,
  ట్రంక్ కాల్ ఒక్కటే మార్గం , ఆ రోజులు గుర్తుకు తెచ్చారు.
  సంచారిణి , అదే చేతిలో చిలుక (మొబైల్) వల్ల ఎంతో మార్పు

  • @మోహన్జీ,
   ఆ రోజుల్లో కుటుంబానికి దూరంగా ఉండి వారానికి ఒక రోజు కుటుంబ యోగక్షేమాలు తెలుసుకోడానికి ఎన్ని పాట్లు పడేవాళ్ళమో బాగా గుర్తించారు.
   ధన్యవాదాలు.

 6. శర్మ గారూ , టెలి ఫోను , టెలిగ్రాం ల గురించి మీ టపాలు చూస్తూ ఉంటే మీ వృత్తి ధర్మాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలుస్తుంది.
  పని లో పడే శ్రమ, తృప్తీ , ఆనందాన్ని ఇస్తుందన్న మాట కూడా మీ అనుభవం లో నిజమయింది కదా !
  ఇంగ్లండు లో పొగ బండి, అంటే బొగ్గు తో నడిపే స్టీ మ్ ఇంజన్ రైళ్ళు , ఈ తరాల వారికి తెలుపడానికి , ప్రత్యేకమైన సర్విస్ లు నడుపుతూ ఉంటారు !
  అదే విధం గా, మీరు తంతుల ద్వారా టెలిఫోను , టెలిగ్రాఫ్ లు నడిచే ఒక చిన్న వ్యవస్థ ను మిగతా సహచరులతో కలిసి మొదలు పెడితే , ముందు తరాల వారికి విజ్ఞాన దాయకం గా ఉంటుంది కదా ! ( దీనికి పెద్దగా ఖర్చు అవుతుందని నేననుకోవట్లేదు ! )

  • @సుధాకర్ జీ,
   వీటిని ఏర్పాటు చేయడం కంటే నిర్వహించడమే కష్టం. మరొక సంగతి ఆసియాలోనే పెద్దదయిన టెలికం ట్రయినింగ్ సెంటర్ జబల్పూర్ లో ఉంది. దానిలో నేను చెప్పినవన్నీ పని చేస్తున్న పరిస్థితులలో ఉన్నాయి. చాలా చోట్ల చిన్న టెలికం ట్రయినింగ్ సెంటర్లు ( కాకినాడలొ కూడా) ఉంది అక్కడా కొన్ని ఉన్నాయి. చూడాలనిపించేవారికి అభ్యంతరం ఉండదు. టి.టి.సి జబల్పూర్ ఒక డీమ్డ్ టెలికం యూనివర్సిటీ, నేను అక్కడ చదువుకున్నా!
   ధన్యవాదాలు.

  • @అనురాధ,
   ఇప్పుడు సెల్ లో మాటాడే వారికి పొరుగూరిలో ఉన్నవారితో మాటాడాలంటే ఇంత తతంగం ఉండేదని తెలియాలికదా!
   ధన్యవాదాలు.

 7. mee trunk call vishesalu chadavutunte naku 30 years back operator anubhavanlu Guntakal lo gurtu kochhaiai. nejame. anati gowravalu and apanindalu, complaints, a ennonno anubhavalu meetho panchukovalanipincindi. namkskaram. ramana.

  • @మిత్రులు రమణ గారు,
   మీ వ్యాఖ్యను నేను తప్పుగా అర్ధం చేసుకోకపోతే మీరు కూడా ఆపరేటర్ గా పని చేసినట్లనిపించింది. మీకు మెయిలిస్తా జావాబివ్వగలరు.
   ధన్యవాదాలు.

 8. శర్మ గారూ ,

  నమస్తే ,

  మీ టపాలు చదువుతున్న కొద్దీ ” అరుగుతున్న కొద్దీ మెరుగు ” అన్నది గుర్తుకొస్తున్నది . ఆ నాటికి ఈ నాటికి ఎంత తేడా , ఆ తేడా కూడా ప్రగతి దిశగా పయనిస్తే సర్వజనానందమే .
  ఏదైనా , ఎపుడైనా కొమ్మను చెట్టుగా పెంచి పోషించేవారొకరైతే , వాటి ఫలాలను ఆరగించేవారు వేరొకరు అన్నది అక్షరసత్యం . మీ టపా వల్ల చాలామందికి చాలా సంకేతిక పరిజ్ఞానం అందుతోంది , సంతోషం .

  • @శర్మాజీ,
   చాలా విషయాలు పెద్ద వారికి తెలుసు. నేటి తరానికి ఆ రోజులనాటి కష్టాలు తెలియాలనే నా ఉద్దేశం.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s