శర్మ కాలక్షేపంకబుర్లు- గోదావరి వంతెన అమ్మేస్తున్నారోచ్!

bridge

havlock

See my post https://kastephale.wordpress.com/2012/10/11/

See link http://indiarailinfo.com/news/post/havelock-bridge-to-be-auctioned-as-scrap-agitations-planned-indian-railways-news/137542#top

గోదావరి వంతెన అమ్మేస్తున్నారోచ్!

మా సత్తి బాబొచ్చాడు, సత్తిబాబుని చూస్తూనే “ఏమోయ్! మీ అన్నయ్యొచ్చేడు కాఫీ,ఆలస్యమైతే మీ అన్నయ్యకి కోపం వస్తుం”దన్నా!. “అంటే కోపం వస్తుందని కాఫీ ఇస్తున్నారు కాని మరేం కాదనమాట, సరేకానండి ఈ వార్త చూశారా! రాజమంద్రి గోదావరి వంతెన హేవ్ లాక్ బ్రిడ్జ్ అమ్మేస్తున్నారట తుక్కు కింద, తెలుసా?.”అన్నాడు. “అదేంటి పదిహేనేళ్ళనుంచి దానిని చారిత్రాత్మ్యక కట్టడంగా ఉంచాలని, ఉపయోగం లో కి తేవాలని అనుకుంటున్నారుగా,” అన్నా.

అదేనండి గత పదేళ్ళుగా అనుకుంటూనే ఉన్నారండి. అందరూ మనవాళ్ళేనండి పని మాత్రం జరగదండి. ఉండవిల్లి గారు కోట్ల గారితో మాటాడేరట, అబ్బే అదెంత! ప్రజలకోరిక కాదంటామా? ఇంతకీ ఎవరు తీసుకుంటారూ? చూస్తానన్నారటా. చిరంజీవిగారూ అబ్బే చూద్దాం అన్నారట. తూ.గో.జీ లో ఉన్న నాయకులంతా అది చారిత్రాత్మ్యక కట్టడం ప్రజల అభీష్టం  నెరవేర్చాలిసిందే అన్నారట. అందరూ  మనవళ్ళేనండి. ఇక ప్రతి పక్షాలూ, ప్రజలూ ఆ వంతెన అమ్మితే వచ్చేడబ్బుకు సరిపడిన సొమ్ము చందాలేసుకుని రయిల్వే బోర్డ్ కి చెల్లిస్తాం కావాలంటే అంటున్నారు,.ప్రజలేమో ఉద్యమమే చేస్తామంటున్నారు. ఈ సమస్యని పదేళ్ళుగా మురగబెట్టేరు. ఇప్పుడయినా అనుకున్నట్లు చేయకపోతే  గిరీశం చెప్పినమాట ” మనవాళ్ళుట్టి………” నిజమేనేమో!

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- గోదావరి వంతెన అమ్మేస్తున్నారోచ్!

 1. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపంకబుర్లు- గోదావరి వంతెన అమ్మేస్తున్నారోచ్! | Bagunnaraa Blogs

 2. శర్మ గారు,

  అమ్మకానికో వంతెన పెట్టి తరువాయి ఏమీ రాయటం లేదు ! ఈ బ్రిడ్జీ గురించి దాని కథా కమామీషు ల గురించి రాయగలరు !

  జిలేబి

 3. ఈ ముందు కనపడుతున్న బ్రిడ్జి కాంక్రేట్ బ్రిడ్జి, అది ఒక 30ఎల్ల పాతది. ఆ వెనక కనపడుతున్న దిమ్మలు కాటన్ కట్టినవి.

  • @శేషు గారు
   జవాబివ్వడం లో ఆలస్యానికి మన్నించాలి.స్వాగతం.
   ఎదురుగా కనపడేదే హేవ్ లాక్ బ్రిడ్జ్. దీనికి కాటన్ కి సంబంధం లేదు. దీనిని 1897 లో మొదలు పెట్టి 1900 సం.రంలో పూర్తి చేసేరు. దీనిపై ఉన్న ఇనుమును అమ్మేస్తున్నారు. వెనక ఉన్నది మూడవ రైలు వంతెన. దానిపై ప్రస్తుతం ఒక మార్గం ఉంది. రెండవ మార్గం తయారు చేసుకోడానికి సావకాశం ఉంది. అక్కడ ఖాళీ ఉంది చూడండి. మీ కోసం మొదటి వంతెన మరల బ్లాగులో ఉంచుతున్నా.

   ధన్యవాదాలు.

 4. మాతృ దేశాన్ని ఇక్కడి సంస్కృతిని చిన్నచూపు చూసే ప్రజలు కూడా ఉన్న ఈ కాలంలో ఇలాంటివి జరగకపోతేనే ఆశ్చర్యపడాలి.

  • అంటే నా అభిప్రాయం ఏమిటంటేనండి,
   మాతృ దేశాన్ని , తరతరాల మన సంస్కృతిని, మన ప్రాచీన చారిత్రిక కట్టడాలను …. నిర్లక్ష్యం చేసే ప్రజలు కూడా ఉన్న ఈ దేశంలో 1900 కాలంలో నిర్మించిన కట్టడాల పరిరక్షణ గురించి పట్టించుకునే శ్రద్ధ ఉంటుందా ? అని వ్రాయాలనుకున్నానండి.

   • @అనురాధ,
    జవాబివ్వడం లో ఆలస్యానికి మన్నించాలి.
    మీ భావాన్ని మొదటనే గ్రహించాను. దానిని మరల చెప్పేరు. దేశం మీద తల్లి మీద మమకారం లేని వారి పాలబడి కొట్టుకుంటున్నాం. ఎప్పటికి మోక్షం కలుగుతుందో. మరో స్వతంత్ర సంగ్రామం కావాలేమో!
    ధన్యవాదాలు.

  • @వర్మాజీ,
   జవాబివ్వడం లో ఆలస్యానికి మన్నించాలి.
   ఏమీ చేయలేనపుడు చేసేపని అదేకదా!
   ధన్యవాదాలు.

 5. శర్మగారూ, మీరు కాటన్ బ్రిడ్జ్ సంగతేగా చెబుతున్నారూ? అవునండీ అదొక చారిత్రాత్మికమైన విలువగల కట్టడం. నడకదారిగానూ, సైకిల్ ప్రయాణానికికీ దానిని మరొక యాభై సంవత్సరాలపాటు వాడవచ్చును భేషుగ్గా. ఆ తరువార అయినా చారిత్రాత్మిక కట్టడంగా అలాగే వదలివేస్తే వచ్చిన నష్టం యేమీ ఉండదు. కేవలం కొన్ని కోట్లకోసం అమ్మేసియేం సాధిస్తారు? అందులో బొక్కేసే దానిమీద కక్కూర్తితో ఈ‌పని చేస్తున్నారనిపిస్తుంది.

  వెలుగునీడలు సినీమాలో రేలంగివారి పాత్రకు ఒక డైలాగ్ ఉంది “ఇచ్చే వాడుంటే ఇండియాను కూడా కొంటారు” అని. ఈ రోజు మన దొరలు కొనే వాడుంటే ఇండియానీ అమ్మేస్తారు నిజంగా!

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   జవాబివ్వడం లో ఆలస్యానికి మన్నించాలి.
   కాటన్ కి వంతెనకి సంబంధం లేదు. కాటన్ ఆనికట్ అమాత్రమే కట్టేడు 1852 ప్రాంతంలో ఆ తరవాత వచ్చినదే 1900 సం.రం లో ఈ వంతెన. మీరు చెప్పిన మాటలు అక్షరాల నిజం.
   ధన్యవాదాలు.

 6. శర్మ గారూ ,

  నమస్తే .

  ప్రజలు నమ్ముకున్న బ్రిడ్జిని సైతం అమ్ముకుంటున్న ప్రభుత్వం మనది అని తలచుకుంటేనే , మదిలో ఎక్కడో తొలుస్తున్నది .
  మీరన్నట్లు ద్విచక్ర వాహన చోదకులకు అనువుగా చేయిస్తే ( వలసిన అన్ని సదుపాయాలతో ) మంచిది .

  • @ శర్మాజీ,
   జవాబివ్వడం లో ఆలస్యానికి మన్నించాలి.
   ప్రజలకు ఆ వంతెనతో ఉన్న అనుబంధం ప్రభుత్వానికి లేదని తేలిపోయింది కదా.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s