శర్మ కాలక్షేపంకబుర్లు- గోదావరి వంతెన-తెలుగువారి గుండె చప్పుడు, ఆయ్!.

havlock

Havelock Bridge

tabloid godavari bridge

Construction Commenced on 11.11.1897

Opened for traffic on 30.08.1900.

bridge

 

గోదావరి వంతెన– తెలుగువారి గుండె చప్పుడు, ఆయ్!.

గోదారమ్మంటే మాకు ప్రాణం. అమ్మకి చెరొకపక్కా ఉంటాం కనక మమ్మల్ని తూ.గో.జి, ప.గో.జి అంటారు తప్పించి మేంమంతా ఒకటే. కోస్తాలో ఉత్తర దక్షణాలను కలుపుతూ అమ్మ మీద ఒక వంతెన నిర్మించాడో తెల్లవాడు, వాడిపేరు హేవ్ లక్, ఆ పేరే పెట్టేరు వంతెనకి కూడా. తెల్లవాడు వాడి తాతముల్లె తెచ్చి కట్టించలేదు, మన సొమ్ముతోనే కట్టించేడు, గట్టిగానే కట్టించేడు, నాటి రోజులకి నలభై వేలకి,మూడేళ్ళలోపు, వందేళ్ళు మన్నింది. వంతెనకి రంగెయ్యడానికయిన ఖర్చు ఆరు రూపాయలు అక్షరాలా,ఆ రోజులలో. వంతెనకంత చరిత్ర వుంది. మా తెలుగు వారికి అందునా గోజిల వాళ్ళకి ఎవరికైనా పెట్టడమేకాని దేహీ అని అడగటం అలవాటు లేదు. ఈ వంతెన శతసంవత్సరాలు జరుపుకుందని దానిపై రాకపోకలు మానేశారు, పదిహేనేళ్ళకితమే. అప్పుడు అడిగేం, దీనిని పాదచారులు, ద్విచక్ర వాహనదారులు వాడుకునేలా చేస్తే, పాతకాలపు ఆస్థిని వాడుకున్నట్లూ, సంరక్షించుకున్నట్లూ అవుతుందని. తమరీ విషయం అప్పటినుంచీ మురగబెట్టేరు.మేం అడిగినది అదొకటే, మిమ్మల్ని మడులు, మాన్యాలు ఇమ్మని అడగలేదు. కాని వంతెనని వాడకంలోకి తెమ్మని చెప్పడానికి మీకు నోరు రావడం లేదు. పాతవాటిని జ్ఞాపక చిహ్నాలుగా దాచుకోడం మానవుల అలవాటు,  ఇది కూడా అటువంటిది కాదని మీ నమ్మకమా? ఈ వంతెన నిలబెట్టుకోవాలన్నది భరత జాతి, తెలుగువారి అందునా ముఖ్యంగా గోజి ల వారి గుండెచప్పుడు. మీకు వినపడటం లేదా? మొన్న మీ పాలికాపులు వంతెన తుక్కు కింద అమ్మేస్తున్నామన్నారు,ఎంతకీ? అయిదు కోట్ల నుంచి పాట మొదలెట్టి, అన్నారు.ముసలాళ్ళందరినీ పాట పెట్టి అమ్మెయ్యండి ఎవరేనా కొంటారేమో! మావాళ్ళు అడ్డుకుంటే ప్రస్తుతానికి వేలం ఆపుతున్నాం, మీరు కొనుక్కొవాలంటే 67 కోట్లిచ్చి కొనుక్కోమన్నారు. దీనిని ఎకసెక్కెం, ఎగతాళి అనుకోవాలా?

మీ పాలికాపులు 67 కోట్లని ఎకసెక్కెంచేసినా మావాళ్ళు మాటాడలేదు, మీ మరో పాలికాపు ఇటువంటి వంతెనలు చాలా వదిలేశాం, దీని బతుకు అంతే అన్నారట, మరి వారు ఎంత పాలికాపుతనానికి ఒప్పుకున్నా జాతిలో మనిషి కాదా? పరాయి దేశం వాడా? అధికారంలో ఉన్నంతలో నోరు అంత పారేసుకోవాలా?తెలుగువారంటే అంత లోకువా? ఇన్ని మాటలు మాటాడినా మా వాళ్ళు నోరు పెగిల్చి, మాటాడలేదు,ఏం ఎందుకో మీకు తెలీదా? వంతెన ఖరీదు 67 కోట్లు ఎలాఅవుతుందని అడగలేదే! ఎవరినీ నిలతియ్యలేదే!! ఎంత ఓర్పు!!! ఎంత సహనం, అది మీరు గుర్తించారా? మీరేదీ చెయ్యక ఈ సమస్య మరొక పదిహేనేళ్ళు మళ్ళీ మురగబెట్టి, వంతెనని కాల గర్భం లో కలిపేసి, ప్రజలని వంచిస్తారా?మీరు కూచున్న అధికారపు కుర్చీ నాలుగోకోడు మా తెలుగువారు మోస్తున్నది, మరిచారా? మా వాళ్ళు కాళ్ళ దగ్గర కూచున్నారని చులకనగా చూడకండి, మా కసలే లిటిగేషన్ మనుషులమని పేరు, అమాయకులమైనా!, ఆ మాట నిజం చేయకండి………అసలే గుర్రాన్ని గుడెక్కించిన వాళ్ళం కూడా.. .. సహాయ నిరాకరణ, అసలైన సత్యాగ్రహం మాకే తెలుసు, ఆలోచించండి. వంతెనని పాదచారులు,ద్విచక్ర వాహనదారులు ఉపయోగించుకునేలా చేసి జాతికి అంకితమివ్వండి,దానిని ఒక విలువైన కట్టడంగా చూడండి తుక్కు కింద కాక, విలువైన కట్టడాన్ని పరిరక్షించండి. .

ప్రకటనలు

9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- గోదావరి వంతెన-తెలుగువారి గుండె చప్పుడు, ఆయ్!.

 1. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపంకబుర్లు- గోదావరి వంతెన-తెలుగువారి గుండె చప్పుడు, ఆయ్!. | Bagunnaraa Blogs

  • @జిలేబి గారు,
   ఆహా! టపా చూసితిన్, కామెంట్ చేసితిన్, అలా చేస్తే ఎంత బావుంటుందో!
   ధన్యవాదాలు.

 2. ఏ గో.జి.. వాసులయినా అనాధలే. అసలు తెలుగువాడు అనే మాటకే అనాధ అన్న అర్థం స్థిరపడిపోయింది.

  ఇన్నేళ్ళ స్వతంత్రభారతదేశంలో తెలుగువాళ్ళు కాంగ్రేసు వాళ్ళకు నిచ్చెన మెట్లుగానే ఉపయోగపడ్డారు కాని, స్వాత్మాబిమానం ఉన్న మనుషుల్లా యెప్పుడూ జీవించినది లేదు. తెలుగు రాజకీయవేత్తలపట్ల చులకనకు పీవీకి మరణానంతరంజరిగిన మహదవమానం చాలు ఉదాహరణగా. తెలుగు కళారంగానికి జరుగుతున్న అవహేళనకు ఉదాహరణలు రాస్తూ పోతే పేజీలు నిండిపోతాయి. తెలుగునాట జరుగుతున్న అభివృధ్దిలో డొల్లతనాన్ని చాటడానికి ఇన్నేళ్ళలోనూ‌ వీసమెత్తు కూడా అబివృధ్ధి యెరగని కోనసీమను చూస్తే చాలు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగువాళ్ళు తమదేశంలో తామే బానిసల్లాగా జీవిస్తున్నారు.

  గౌరవహీనులుగా జీవించేవారి మనోభావాలు యెవరికి పడతాయి? పరిస్థితిని మార్చటానికి స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు కొంత ప్రయత్నం విజయవంతంగా చేసారు. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవటంలో ఘోరాతిఘోరంగా విఫలమైనది తెలుగునేల. ఫలితంగా మనలోమనం తన్నుకు చావటంలో తప్ప శ్రధ్ధపెట్టని మనని ముక్కలు చెక్కలు చేయటానికి కాలం‌ కాచుక్కూర్చుంది.

  ఒకరకంగా దేశం పరిస్థితికూడా ఇలా తన్నుకు చావటాలతోనే తలమునకలుగా ఉంది. ఏదో‌ఒక రోజున మనని పరిపాలించే దిక్కు కోసం మనం విడేశాలకేసి బేలగా చూస్తామా అని అనిపించి బాధ కలుగుతోంది. చర్చిల్ అన్నాడట, భారతీయులకు స్వాతంత్రం ఇస్తే వాళ్ళకు తమను తాము పాలించుకునే సామర్థ్యం లేదూ‌ అని. ఆ మాటను మనం‌ ఋజువు చేసి చూపించటానికి తయారవుతున్నాం.

  ఏదో ఒక రోజున తాజ్ మహల్ కూడా అమ్మకానికి వస్తుంది. ఇండియాను కూడా అమ్మకానికో/లీజుకో ఇచ్చుకుందుకూ మనం సిథ్థపడే రోజూ రాకూడదనే దేవుణ్ణి ప్రార్థిద్దాం!

  • మిత్రులు శ్యామలరావు గారు,
   >>>ఏదో ఒక రోజున తాజ్ మహల్ కూడా అమ్మకానికి వస్తుంది. ఇండియాను కూడా అమ్మకానికో/లీజుకో ఇచ్చుకుందుకూ మనం సిథ్థపడే రోజూ రాకూడదనే దేవుణ్ణి ప్రార్థిద్దాం!

   నిజం, మీరన్నది ఏదీ కాదనలేను.
   Thank u

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s