శర్మ కాలక్షేపంకబుర్లు-మనం వ్రాస్తే ఊరికి ఉపకారమా? వ్రాయకపోతే దేశానికి నష్టమా?

మనం వ్రాస్తే ఊరికి ఉపకారమా, వ్రాయకపోతే దేశానికి నష్టమా,

cgeajjai

Courtesy: From a friend by mail

జూన్ 21 న టపా రాసిన తరవాత తారీకు చూస్తే ఇది లాంగెస్ట్ డే కదూ అనీ, పాత సినిమా కూడా గుర్తొచ్చింది, పాతికి సంవత్సరాల వయసులో చూసినది. మంచి సినిమా అనిపించిందపుడు. రోజు టపా రాసి ఉయ్యలలో కూచుంటే ఉక్కపోత చంపుతోంది, జూన్ నెల మొదలు ఎండ కనపడకపోయినా. ఆపసోపాలు పడుతుండగా నాలుగయింది, ఒక్క సారి చల్లబడింది, చినుకులు పడ్డాయి, వర్షమే అయింది, కరంటూ పోయింది.చల్లగా ఉంటే అలాగే కూచున్నా, ఒళ్ళు తెలియలేదు, అంకపంకాల మీద జ్వరం వచ్చేసింది. సమయమూ తెలియలేదు, ” అదేంటీ అలాగే కూచునిపోయారు” అంటూ ఒంటిమీద చెయ్యేసి చూసి “ఒళ్ళు కాలిపోతోంది, జ్వరం వస్తే చెప్పద్దూ, మరీ చిన్నపైల్లలయి పోతున్నా”రంటూ ఒక మాత్ర పడేసి, కొద్దిగా అల్పాహారమిచ్చి, “వర్షం తగ్గలేదు,పడుకోండి, ఉదయం డాక్టర్ దగ్గరకేళదామంటే” పడుకున్నా. రాత్రెప్పుడో ఊరంతకీ కరంట్ వచ్చినా మాకు రాలేదట, ఉదయమే డాక్టర్ దగ్గరకెళితే అక్కడో తిరనాళ్ళకి ఉన్నట్లున్నారు జనం. చీటి రాయించుకొచ్చి, కూచోడానికి చూస్తే కాళీ లేదు, ఎండ దంచేస్తోంది, ఎదురుగా చెట్టు, దాని మొదలుకి దగ్గరగా సిమెంట్ బెంచీలు కనపడ్డాయి. అక్కడ కూచునిపోయాం, మా వంతు వచ్చినప్పుడు పిలవమని నర్స్ కి చెప్పి వచ్చి. డాక్టర్కి చూపించుకువచ్చేటప్పటికి కరంట్ వారు చావు కబురు చల్లగా చెప్పేరు, ట్రాన్స్ఫార్మర్ పోయిందని, కొంచం దూరం లో మరొక దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసేరు. అప్పటినుంచి ప్రతి గంటకీ పోవడం మేము చెప్పడం, వాళ్ళు రావడం, ఇదొక ఆటయిపోయింది. మూడు అరోజుల్లో ఆ ట్రాన్స్ఫర్మరూ పోయింది. మరికొద్ది దూరం లో మూడో దానిమీదకి ఈ మొత్తం లోడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అదీ అంతే చేసింది. ఇక మనం చెప్పడం అనవసరమనుకుంటూ ఉండగా పదిరోజులు దొర్లిపోయాయి. నాలుగో రోజుకే జ్వరం తగ్గినా దగ్గు, రొంప పట్టి పీడించాయి. ఇల్లాలు పాపం ఇన్ని రోజులూ అవస్థ పడుతోనే ఉంది నాతో. ఏమీ చెయ్యలేని నిస్సహాయత, నిమిషానికి ఒక సారి వచ్చి చూసి “ఎలా ఉన్నారు?” అంటూ వచ్చింది.జ్వరం తగ్గిన దగ్గరనుంచి కూచుని ఏం చెయ్యడం అని అల్లోచిస్తే….

vyasapitham

పోతనగారు, కవిత్రయం, వ్యాసుడు కనపడ్డారు. నమస్కారం పెట్టేసేను.వీరేశలింగం,గురజాడ,శ్రీపాద కనపడ్డారు, అబ్బే మీతో ఇప్పుడు లాభం లేదని చెయ్యి ఊపేశాను. ఇంకెలా అనుకుంటూ ఉండగా రావి శాస్త్రి కనపడ్డారు, 1395 పేజీల పుస్తకం తలగడ దిండు సైజ్ లో ఉన్నది ఐదు వందల రూపాయలెట్టి కొని, కొన్ని చదివి ఊరుకుంటావా? అన్నట్లు కనపడింది పుస్తకం,రావిశాస్త్రి రచనా సాగరం. బాబూ మీరేకావాలిప్పుడు అని అనుకుంటూ వ్యాసపీఠం ఎక్కించా. రావి శాస్త్రీయం లో ములిగిపోయా, సమయమూ తెలియలేదు, రోజులూ తెలియలేదు, ఒక చోట గోవులొస్తున్నాయి దగ్గర తేలేను, పదిరోజులయింది, మళ్ళీ ములిగాను సొమ్ములుపోనాయండి దగ్గర తేలేనా? ములిగానా? ములిగి తేలేనా? తేలి ములిగానా? తెలియలేదు.

racana sagaram

ఈ లోగా కరంట్ వారు ట్రాన్స్ఫార్మర్ బాగు చేసి వేసేమన్నారు. బ్లాగు చూదామనేటప్పటికి మామూలే, హతవిధీ! అనుకుని కట్టేసేను, మరి రెండు రోజులకి అమ్మయ్య! ఊరంతకీ పోతే మనకీ పోతోంది, వస్తే మనకీ వస్తోందనుకుని సంతోషిస్తే,గంటల తరబడి కట్టేస్తున్నాడు కరంటిప్పుడు, సమయం సందర్భం లేకుండా, రాత్రి పగలు తేడా లేకుండా. ఏం చేస్తాంలే అని ఊరుకున్నా. మొన్నటికి ఫరవాలేదనుకుని బ్లాగ్ ఓపెన్ చేస్తే అంతా కొత్త కొత్తగా ఉంది. ఎవరో పాపం కొన్ని టపాలు చదివేరు, ఏం రాశానా టపాలో అని చదివితే ఇది అనేనే రాశానా? ఇంత చెత్తగా ఉందేమో అనిపించి, అసలు ఎందుకు రాయాలి? అని ప్రశ్న ముందు నిలిచింది, రాద్దాం లే అని మనసు బుజ్జగించింది. కొట్టుకట్టేసేను. మరో రోజు బ్లాగుల్లోకొచ్చి చూస్తే ఎవరెవరో ఏదేదో రాస్తున్నారు, మన పాత చింతకాయ పచ్చడి ఎవరికి కావాల్లే మరో నాలుగు రోజుల తరవాత చూదాంలే అనుకుని మళ్ళీ కట్టేసేను.అప్పుడు గుర్తొచ్చింది మా మిత్రులు బోనగిరి గారన్నట్లు మనం వ్రాస్తే ఊరికి ఉపకారమా? వ్రాయకపోతే దేశానికి నష్టమా? అన్న మాట. మనకి ఊతం దొరికింది కదా,అది నిజం కదా!, మనలనెవరు గుర్తుపెట్టుకుంటారని మెయిల్ చూస్తే అదో పెద్ద అడవిలా కనపడింది. అనవసరమైనవి నరుక్కుంటూ పోతే చివరికి అవసరానికి మిగిలినవి కొద్దే. ఈలోగా ఉషగారు, మా జిలేబమ్మగారు ఊరుకోక రాయడంలేదేమని ప్రశ్నిస్తే మళ్ళీ ఇదుగో ఇలా మీ ముందు తయారు. రావి శాస్త్రీయం పూర్తి చెయ్యలేదింకా.బద్ధకం పెరిగింది, చూదాం నందో రాజా భవిష్యతిః

govulostunnaayi

ప్రకటనలు

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మనం వ్రాస్తే ఊరికి ఉపకారమా? వ్రాయకపోతే దేశానికి నష్టమా?

 1. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపంకబుర్లు-మనం వ్రాస్తే ఊరికి ఉపకారమా? వ్రాయకపోతే దేశానికి నష్టమా? | Bagunnaraa Blogs

 2. జూన్ 21 న టపా రాసిన తరవాత తారీకు చూస్తే ఇది లాంగెస్ట్ డే కదూ అనీ, పాత సినిమా కూడా గుర్తొచ్చింది, పాతికి సంవత్సరాల వయసులో చూసినది. మంచి సినిమా అనిపించిందపుడు. రోజు టపా రాసి ఉయ్యలలో కూచుంటే ఉక్కపోత చంపుతోంది, జూన్ నెల మొదలు ఎండ కనపడకపోయినా. ఆపసోపాలు పడుతుండగా నాలుగయింది, ఒక్క సారి చల్లబడింది, చినుకులు పడ్డాయి, వర్షమే అయింది, కరంటూ పోయింది.చల్లగా ఉంటే అలాగే కూచున్నా, ఒళ్ళు తెలియలేదు, అంకపంకాల మీద జ్వరం వచ్చేసింది. సమయమూ తెలియలేదు, ” అదేంటీ అలాగే కూచునిపోయారు” అంటూ ఒంటిమీద చెయ్యేసి చూసి “ఒళ్ళు కాలిపోతోంది, జ్వరం వస్తే చెప్పద్దూ, మరీ చిన్నపైల్లలయి పోతున్నా”రంటూ ఒక మాత్ర పడేసి, కొద్దిగా అల్పాహారమిచ్చి, “వర్షం తగ్గలేదు,పడుకోండి, ఉదయం డాక్టర్ దగ్గరకేళదామంటే” పడుకున్నా. రాత్రెప్పుడో ఊరంతకీ కరంట్ వచ్చినా మాకు రాలేదట, ఉదయమే డాక్టర్ దగ్గరకెళితే అక్కడో తిరనాళ్ళకి ఉన్నట్లున్నారు జనం. చీటి రాయించుకొచ్చి, కూచోడానికి చూస్తే కాళీ లేదు, ఎండ దంచేస్తోంది, ఎదురుగా చెట్టు, దాని మొదలుకి దగ్గరగా సిమెంట్ బెంచీలు కనపడ్డాయి. అక్కడ కూచునిపోయాం, మా వంతు వచ్చినప్పుడు పిలవమని నర్స్ కి చెప్పి వచ్చి. డాక్టర్కి చూపించుకువచ్చేటప్పటికి కరంట్ వారు చావు కబురు చల్లగా చెప్పేరు, ట్రాన్స్ఫార్మర్ పోయిందని, కొంచం దూరం లో మరొక దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసేరు. అప్పటినుంచి ప్రతి గంటకీ పోవడం మేము చెప్పడం, వాళ్ళు రావడం, ఇదొక ఆటయిపోయింది. మూడు అరోజుల్లో ఆ ట్రాన్స్ఫర్మరూ పోయింది. మరికొద్ది దూరం లో మూడో దానిమీదకి ఈ మొత్తం లోడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అదీ అంతే చేసింది. ఇక మనం చెప్పడం అనవసరమనుకుంటూ ఉండగా పదిరోజులు దొర్లిపోయాయి. నాలుగో రోజుకే జ్వరం తగ్గినా దగ్గు, రొంప పట్టి పీడించాయి. ఇల్లాలు పాపం ఇన్ని రోజులూ అవస్థ పడుతోనే ఉంది నాతో. ఏమీ చెయ్యలేని నిస్సహాయత, నిమిషానికి ఒక సారి వచ్చి చూసి “ఎలా ఉన్నారు?” అంటూ వచ్చింది.జ్వరం తగ్గిన దగ్గరనుంచి కూచుని ఏం చెయ్యడం అని అల్లోచిస్తే….

 3. మీ ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడిందని భావిస్తున్నానండి.
  మీడియా ద్వారా, బ్లాగ్స్ ద్వారా మీ వంటి వారు తెలియజేసే ఎన్నో చక్కటి విషయాల వల్ల నేను ఎన్నో విషయాలను తెలుసుకున్నానండి. ( ఇంకా ఎందరో కూడా తెలుసుకుంటున్నారు )
  మీకు శ్రమ అనుకోకపోతే, వీలు కుదిరితే మీకు తెలిసిన విషయాలను వ్రాస్తూ ఉంటారని ఆశిస్తూ…

  • @అమ్మాయ్ అనురాధ,
   ఒక్క సారిగా వాతావరణం మారింది కదా! అందుకు ఇబ్బంది పడ్డాను,రావిశాస్త్రి గారిని చదువుతూ బద్ధకమూ చేసేను చెప్పకపోవడమేం!
   ధన్యవాదాలు.

 4. “బ్లాగులోకం” లోగో ని మీ బ్లాగ్ లో జతపరచినందుకు ధన్యవాదములు కష్టేఫలే గారు. సదా మీ ఆశీస్సులు కోరుతూ – లాస్య రామకృష్ణ.

 5. ఆరోగ్య పరంగా తేరుకోవాలని ,
  మీకు విద్యుత్సరఫరా నిరంత రాయంగా
  ఉంచాలని కోరు కుంటున్నాను

  • @మోహన్జీ,
   చిన్న అనారోగ్యం, పడిశెం పదిరోగాలపెట్టు కదండీ! రెండు రోజులనుంచి కరంట్ బాగుందండి, మీ దయవల్ల.
   ధన్యవాదాలు.

  • @మిత్రులు మురళిగారు,
   ఖాళీ గా కూచుని చేసేపని లేదు కదండీ, ఈతి బాధలు తప్పవు కదా! కరంట్ బాధొకటి కురుపులా సలుపుతుంది.ఈ మధ్య అసలు చదవటం లేదండి, సమయం అలా సద్వినియోగమయిందనమాట.
   ధన్యవాదాలు.

 6. నేను వ్రాసేది నా కాలక్షేపం కోసం. నా మెదడుకి పదును పెట్టడం. నేను ఆలోచించగలను అనే నమ్మకం కోసం. నేను వ్రాసింది నచ్చితే అది వాళ్ళ అదృష్టం.నచ్చకపోతే వాళ్ళ దురదృష్టం. ఇతరులని నొప్పించకుండా మనం వ్రాస్తే చాలు. లాభ నష్టాల గురించి పట్టించుకో నవసరం లేదనే అనుకుంటాను.

  వ్రాయడం మానకండి…….దహా.

  • @మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యం గారు,
   రాయడం మానెయ్యటం లేదు, అనారోగ్యం కరంట్ ఇబ్బందులు, ఈతిబాధలు….మీకు తెలియనివా?
   ధన్యవాదాలు.

 7. నా కామెంటుని టైటిల్ చేసేసారు. సంతోషం.
  మళ్ళీ చెప్తున్నానండి, ఆ మాట నాలాటి వాళ్ళ బద్ధకాన్ని సమర్థించుకోవడానికి వ్రాసింది మాత్రమే.
  మీలాంటి అనుభవజ్ఞులు వ్రాస్తుంటే, వాటిలో మాకు కొంతైనా ఉపయోగపడేవి ఉంటాయి.

  • @మిత్రులు బోనగిరిగారు,
   మీ కామెంట్ ఎంతనచ్చేసిందో! అందుకే తలకట్టు చేసేను, వజ్రోత్సవం దగ్గర పడుతున్నా కదండీ, అప్పుడప్పుడు ఇలా వైరాగ్యం వస్తూ ఉంటుంది.
   ధన్యవాదాలు.

 8. దీక్షితులు గారు,

  రావి శాస్త్రి మీ మీద పడ్డా రంటే (అంటే మీరు వారి రచనల మీద పడ్డా, వారొచ్చి మీ మీద పడ్డా రెండింటికి వ్యత్యాసం లేదని !) డాటేరు రమణ బాబు గారే ఇక దిక్కు చూపించాలి మరి !!

  మీరూ రావి శాస్త్రి గారి ఫంకాయా ?

  జిలేబి

  • @జిలేబిగారు,
   రమణ గారి దగ్గరికిపోవాల్సినంత పని ఉండకపోవచ్చు. అభిమానినే కాని మీరన్నంత కాదేమో 🙂
   Thanx

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s