శర్మ కాలక్షేపంకబుర్లు-బోడిగాడి మొదటితప్పు (సొమ్మలు పోనాయండి. రావిశాస్త్రి)

బోడిగాడి మొదటితప్పు(సొమ్మలు పోనాయండి.రావిశాస్త్రి)

buffelows

సొమ్మలు అంటే పశువులని ఉత్తరాంధ్రలో వాడుక.

రావిశాస్త్రి చదువుతున్నాకదా! గోవులొస్తున్నాయి దగ్గర తేలేను ఆ తరవాత ములిగేను మళ్ళీ సొమ్ములుపోనాయండి దగ్గర తేలేనో ములిగేనో, ములిగితేలేనో, తేలి ములిగేనో తెలియలేదు. ఈ లోగా మా సత్తిబాచ్చేడు.

‘రావయ్యా!రా!! నువ్వు కనపడి చాలా రోజులయిందే’ అంటూ

‘మీ అన్నయ్యకి వేడి కాఫీ’ అని ఒక అరుపు అరిచి ‘కూచో’ అన్నా.కూచుంటూ

‘ఏంటి సంగత’న్నాడు పక్కనే ఉన్న ఉద్గ్రంధాన్ని చూస్తూ.

‘రావి శాస్త్రి సొమ్ములు పోనాయి చదివేను, పాపం! అందులో బోడిగాడికి చదువొచ్చుంటే అన్ని అవస్థలొచ్చుండేవి కాదు కదా!’అన్నా. ఈలోగా ఇల్లాలు కాఫీ తెస్తే తాగి

‘ఏంటన్నారూ? చదువొచ్చుంటే కదూ!’

అంటే మీ ఉద్దేశం, చదువొచ్చిఉంటే, మూడొందలకి బదులు ఆరొందలకి నోటు రాసిచ్చీవాడు కాదని కదా మొదటి అనుమానం, తర్వాతవన్నీ ప్రస్తుతానికి వదిలేదాం’ అన్నాడు.

‘అవున’న్నా!

ఈరోజు మన వూళ్ళో అప్పు ఎలా ఇస్తారో తెలుసా? లక్ష రూపాయలకి నోటు రాయించుకుంటాడు, హామీ లక్కరలేదు, మీ పే స్లిప్ చాలు, లేదా మీరు అస్థిపరులయి అప్పిచ్చేవారికి తెలిసున్నా చాలు.. తొంబయి వేలు చేతులో పెడతాడు. నెలనెలా పదివేలు వడ్డీ కట్టాలి అసలెప్పుడుతీర్చేది మీ ఇష్టం. బ్లాంక్ చెక్కుల మీద సంతకాలెట్టిస్తే చాలు. మీకు అత్యవసరం ఏం చేస్తారు?అప్పిచ్చినవాడేం చేస్తున్నాడు? ఏ నెల వడ్డీ కట్టకపోయినా చెక్ బేంక్ లో వేసి డిసానారయితే కోర్ట్ లో కేస్ వేస్తున్నాడు, అక్కడ ప్రెసిడెంటూ అదే చేసేడు కదా!

రెండు వేలు కడితే మోటార్ సైకిలిస్తున్నారు, నొట్లు, చెక్కుల మీద సంతకాలు, హామీదారుల సంతకాలు తీసుకుని బండిచ్చేస్తున్నారు కదా! ఏ నెల సొమ్ము కట్టకపోతే ఆ నెల బండి పట్టుకుపోతున్నారు కదా!!

మరో సంగతి క్రెడిట్ కార్డ్ లకి కట్టడం ఆలస్యమయితే తీసుకునే వడ్డీ ఎంతో తెలుసా? 36% నుంచి 48%.సొమ్ము కట్టకపోతే బేంక్ లు కలక్షన్ పార్టీ లని రౌడీలని ఇంటి మీదకి పంపటం లేదా?ఈ వేళే పేపర్ లో చూశాను, ఆడవారు కూడా కలక్షన్ ఏజంట్లుగా పని చేస్తున్నారట. హాట్ గా మాటాడే బదులు స్వీట్ గా మాట్డాడి వసూలు చేస్తున్నారట.ఆవిడ కలక్షన్ ఏజంటుగా వచ్చి ఇంటావిడ ముందు పరువు తీసేస్తోంటే, కిక్కురు మనక కడుతున్నారటండీ 🙂

మీరు,ఇలా అప్పుతీసుకునేవారంతా  చదువుకున్నారు కదూ? మరి సంతకాలెందుకు పెట్టి తీసుకుంటున్నారు?

ఇప్పుడు చెప్పండి తప్పు బోడిగాడిదా?, అవసరానిదా?? చదువుదా???

jjdgdbda

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బోడిగాడి మొదటితప్పు (సొమ్మలు పోనాయండి. రావిశాస్త్రి)

 1. గురువుగారూ… ఆ నవల పేరు “సొమ్ములు” కాదు “సొమ్మలు” అనుకుంటా… ఆ పదానికి ఉత్తరాంధ్ర మాండలికంలో నిర్దిష్టమైన అర్ధం కూడా ఉంది. (బహుశా పశువులు అనుకుంటా). ఒక్కసారి చూడగలరు.

 2. అప్పు కధ బావుంది ! విదేశాలలో క్రెడిట్ కార్డు మీద అప్పు క్రమం గా చెల్లించని వారి ‘ క్రెడిట్ స్కోరు ‘ తగ్గి పోతుంది ! అంటే, వారు ” తీసుకున్న అప్పు తీర్చలేరు ” అనే ” ముద్ర ” కంప్యూటర్ లోకి ఎక్కుతుంది ! ఒక సారి అట్లా కనక
  ” ముద్ర ” పడితే , వారికి మళ్ళీ అప్పు పుట్టదు !
  అసలు ఎప్పుడూ అప్పు తీసుకోని వారికి కూడా తిప్పలే ! ఎందుకంటే వారికి క్రెడిట్ కార్డు లేకపోతే , వారి క్రెడిట్ స్కోరు తెలుసుకోవడం కష్టం కనుక , వారికి అప్పు పుట్టదు , ఏ షాపు వాడి దగ్గర నుంచి కూడా ! అంటే, వారి దృష్టి లో క్రెడిట్ కార్డు లేని వారు , డబ్బు పెట్టి కొనగలిగే స్థోమత ఉన్న వారైనా కూడా , వారు చేసిన అప్పు తీర్చక పోవడం వల్ల నే వారికి క్రెడిట్ కార్డు క్యాన్సిల్ అయి ఉంటుందని అనుకుంటారు ! ఒక రకం గా చెప్పుకోవాలంటే క్రెడిట్ కార్డులు , మన జేబుల్లో
  ‘ పరకాయ ప్రవేశం చేసే కాబూలీ వాలాలు’ ! తస్మాత్ జాగ్రత్త !

  • @సుధాకర్ జీ,
   ఇప్పుడు భారత దేశం లో కూడా ఈ క్రెడిట్ రేటింగూ ఉందండి. ఒక సారి అందులో పడితే పీక్కోలేరు.సొమ్ములు పోనాయండిఅ నవలలో రావిశాస్త్రి బోడిగాడు అనే వ్యక్తి చదువుకోనివాడు పోతులు కొనుక్కోడానికి ౩౦౦ అప్పు చేసి ౬౦౦ కి నోటు రాయడం తో కష్టాలు ప్రారంభమవుతాయి…అతను చదువుకోని వాడు,౬౦౦ కే వేలి ముద్ర వేసేడు ఇప్పుడు చదువుకున్న వారం కూడా అలాగే సంతకాలెడుతున్నాం కదా! చదువు దీనికి ప్రతిబంధకము కాని ఉపయోగం కాని కాదనిఅ నా అభిప్రాయం.
   ధన్యవాదాలు.

  • @అనురాధ,
   చిత్రాలు ఒక మిత్రుడు మెయిల్ ద్వారా పంపేరు. ఎక్కడివో తెలియదు. నాకు బాగా నచ్చినవి ఇలా …మీకూ నచ్చినందుకు..
   ధన్యవాదాలు.

 3. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపంకబుర్లు-బోడిగాడి మొదటితప్పు (సొమ్ములు పోనాయండి. రావిశాస్త్రి) | Bagunnaraa Blogs

 4. Neither a borrower nor a lender be-
  అన్నారు షేక్స్పియర్ గారు.
  తెలుగు లో మాత్రం ఋణానంద లహరి అని
  అప్పు చేయడం గొప్ప అని , అది దొరకని చోట
  ఉండ రాదన్నారు సుమతీ !!

   • నేను మాత్రం షేక్స్పియర్ గారు ఇచ్చిన సలహా
    తూచా తప్ప కుండా పాటించాను .
    రోజూ హాయిగా నిద్ర పోగలిగాను

   • @మోహన్జీ,
    నుజమే కాని అన్నివేళలా అందరికి అది సాధ్యం కాదేమో కదా. నిజంగానే మీరు అదృష్టవంతులు, అప్పు చెయ్యక, ఇవ్వక బతకడం సాధ్యం కాదు. 🙂
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s