శర్మ కాలక్షేపంకబుర్లు-గోదావరి వంతెన ప్రజల రోడ్ మేప్. Havlock bridge- people’s road map

గోదావరి వంతెన- ప్రజల తరఫున రోడ్ మేప్. Havlock bridge-people’s road map

feagcagb

1. హేవ్ లాక్ వంతెన రయిల్వే వారి సొత్తు మాత్రమే. దీనిని మరొక శాఖకి కట్టబెట్టవద్దు.

2.ఈ వంతెనను కాలిబాట,ద్విచక్ర వాహన దారుల ఉపయోగానికి మాత్రమే ఉపయోగించాలి, మరే ఇతర వాహనం దానిపై ప్రయాణించే వీలు లేకుండా ఉండాలి.

3.రైల్వే వారికి రోడ్ వంతెనగా మార్పు చేయడానికి అప్రోచ్ రోడ్ లకి స్థలం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి.

4.రాష్ట్ర ప్రభుత్వ0  దీనినుంచి ఏ ఇతర కట్టడాలూ నదీ గర్భంలోకి చేసి పర్యావరణాన్ని పాడు చేయద్దు. నదీ గర్భంలో కట్టడాలు వద్దు.ఇప్పటికే ఇసుక తిప్పలపై అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. టూరిజం పేరిట దీనినుంచి కట్టడాలు చేస్తే నేడు కాకపోయినా రేపయినా అక్కడ స్థిరమైన కట్టడాలొస్తాయి. నది దెబ్బ తింటుంది. పర్యావరణం రక్షిద్దాం. 

5.రైల్వే వారు ఈ వంతెనపై ప్రయాణించే ప్రతి పాదచారి నుంచీ రెండు రూపాయలు,ద్విచక్ర వాహనదారు నుంచి ఐదు రూపాయలు కాని, నిర్వహణకు అవసరమయ్యే సొమ్ము నిమిత్తం టిక్కట్టుగా వసూలు చేసుకోవాలి.

6.రైల్వే వారు ఈ వంతెనను ఉపయోగంలో ఉన్న వంతెనగా భావించి మరమ్మత్తులు వగైరా చేపట్టాలి.

7.దీనిపై పాత కాలపు అనిమో మీటర్ ఉందేది. అది ఎక్కడ పడేసేరో వెతికి పునఃప్రతిష్ఠ చేయాలి. ఇది రాజమంద్రి నుంచి కొవ్వూరు వెళ్ళేటప్పుడు కుడివైపున 25 గాని 26వ స్థంభం పై ఉండేది.

8.గోదావరి వరద ముందూ ఆ తరవాత వంతెనను పరిశీలించి దాని నిర్వహణ చేపట్టాలి.

9.ఈ వంతెన రక్షణ బాధ్యత రాష్ట్రప్రభుత్వం మరియు స్థానిక ప్రజదే.ఈ వంతెనపై హాకర్స్ ని అరికట్టే బాధ్యత రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలదే.

10.సమస్యలని మురగబెట్టకండి, కాలం సమస్యలన్నిటినీ తీర్చలేదు.

అందరూ రోడ్ మేప్ లు వేసేస్తున్నారు,ఏదో ఒక విషయానికి. ప్రజలకి రోడ్ మేప్ లు ఉండాలా? అక్కరలేదా? ఇది ప్రజల రోడ్ మేప్ హేవ్ లాక్ వంతెన గురించి.మీరంతా మీ సూచనలు తెలియ చేయాలని కోరిక.

Anemometer

Anemometer

meter

bridge

ప్రకటనలు

3 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గోదావరి వంతెన ప్రజల రోడ్ మేప్. Havlock bridge- people’s road map

 1. అందరూ రోడ్ మేప్ లు వేసేస్తున్నారు,ఏదో ఒక విషయానికి. ప్రజలకి రోడ్ మేప్ లు ఉండాలా? అక్కరలేదా? ఇది ప్రజల రోడ్ మేప్ హేవ్ లాక్ వంతెన గురించి.మీరంతా మీ సూచనలు తెలియ చేయాలని కోరిక.

 2. చక్కటి సూచనలను చేశారు.

  రామసేతునే పడగొట్టి డబ్బు సంపాదించాలనే వారు ఉన్న ఈ దేశంలో ఈ వంతెనను ఎంతవరకు ఉంచుతారో వేచి చూడాలి.
  పురాతన కట్టడాలను కూడా కూల్చి డబ్బు సంపాదించాలి అనేంతలా దేశ ప్రజలకు డబ్బు యావ పెరిగిపోవటం అత్యంత దురదృష్టకరమైన విషయం.

  • @దేశానికి సంబంధించిన అన్నిటిని అమ్మేసుకోవాలనుకుంటున్నారు, ఇదేమి చిత్రమో
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s