శర్మ కాలక్షేపంకబుర్లు-SMS,email-నాలుగు కోట్ల రూపాయలేం చేసుకోను?

SMS,email-నాలుగు కోట్ల రూపాయలేం చేసుకోను?

dhjcfeaf

+919654349076

YOUR MOBILE HAS WON 500,000.00GBP FROM CHEVROLET ANNIVERSARY.TO CLAIMS SEND YOUR NAME:ADRES:PhoneNO.,AGE,OCCUPATIONSEX,VIA

EMAIL:chevoletcompay322@outlook.com

message dated.03.07.2013.22.50.07

ఇలా వచ్చిందో రోజు SMS చూస్తే నాలుగు కోట్ల రూపాయ ప్రయిజని చెబుతున్నది.మోమోటమి లేని మోసమని తెలుస్తూనే ఉంది.

ముసలివయసులోవడియాలు ( పడుచు పెళ్ళాం)  కావాలా అన్నట్లు ఈ వయసులో నాలుగుకోట్ల రూపాయలేం చేసుకోను చెప్పండి. ఇటివంటి SMS.లు చాలా వస్తున్నాయి ఈ మధ్య. పాపం చదువుకున్నవాడు ఒక బేంక్ మేనేజరు గారు ఇటువంటి మోసానికి గురయ్యి, బేంక్ డబ్బు దుర్వినియోగం చేసి, కటకటాలు లెక్కపెడుతున్నాడు. ఇటువంటి ప్రలోభాలకు లొంగితే ఇంతే సంగతులు. ఇటువంటివి email లో కూడా వస్తున్నాయి, వాళ్ళకి మెయిల్ అడ్రస్ ఎలా తెలుస్తోందో?ప్రభుత్వం.. ఆగండి ఆగండి…వారికెన్ని అపనులు చెప్పండి. ప్రజలని నడి రోడ్ మీద నరైకేస్తోంటేనే దిక్కులేదు. ఇటువంటి మోసాలు కనిపెట్టడానికి సమయమేదీ. అదీగాక ఇటువంటి మోసాలు పెద్దవారి దన్నుతోనే జరుగుతోంటే దిక్కేదీ? అందుకు మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది కదా…..హైదరాబాద్ లో ఆఫ్రికన్ ముఠా మత్తు మందులమ్ముతోందని తెలుసు, ఎందుకు వారిని దేశం నుంచి బహిష్కరించలేకపోతున్నారో తెలియదు! పొరపాటున దీనిలో చిక్కుకుంటే మిగిలేవి కన్నీళ్ళు, కక్కలేక మింగలేని పరిస్థితి ఏర్పడుతుంది.మోసం, ప్రతిచోట ప్రతి విషయంలోనూ మోసం,జాగ్రత్త అవసరం తప్పించి, చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకోడమే అవుతుంది. మనకు కాని దాని గురించి,ఊరికే వస్తున్నదన్నదాని గురించి ఆశ పడకపోతే మోసానికి గురికాము.

మొన్న ఒక పదిరోజులు మెయిల్ చూడలేదు కదూ  ఒక అడవిలా తయారయింది. అందులో అనామిక గుప్తా, పరుల్ జైన్,నైనా జైన్,పూనం తివారీ,పాఖి మాథుర్,హీనా శర్మ, హిమాని గుప్తా,మహీ సింగ్, పియాంకాకుమారి,శ్వేతా సక్సేనా,నిషా అంబ్వాని,ప్రియాంక బన్సాల్, ప్రియాంకా శర్మ,దివ్యా గార్గ్,అబ్బో! ఈ లిస్ట్ కి అంతులేదండి, వీరందరి దగ్గర నుంచి మెయిళ్ళే!  ఏమండీ! బాగున్నారా! మీకు పది లక్షల ఇన్సూరెన్స్ ఆన్ లైన్ చేస్తామన్నవారొకరు, వెంఠనే లోన్ ఇచ్చేస్తాం అన్నవారొకరు,మంచి హాస్పిటల్ ఉంది ఇన్సూరెన్స్ కవర్తో కావాలంటే చెప్పండి అన్నవారొకరు,స్థిరాస్థులు కొంటారా? మంచివి ఏర్పాటు చేస్తాం, మీకు ఆన్ లైన్ లాటరీ తగిలింది వివరాలివ్వమన్నవారొకరు,డిమేట్ అక్కౌంట్ వెంటనే ఖర్చులేకుండా ఇస్తామన్నవారొకరు, మీకు పెళ్ళయిందా? మంచి పిల్ల కావాలా? వెంటనే సంప్రదించమన్నవారొకరు, నాతో మాటాడరూ అన్న పిల్లొకతె,ఇలా ఎన్నని చెప్పను,రోజుకో కొత్తది కనపడుతోంది.ఇక సమాజ వెబ్ సైట్లనుంచి రోజూ వారు తెలుసా, వీరు తెలుసా? వీరిని ఫ్రెండ్ చేసుకోండి,వారిని చేసుకోండి,ఫేస్బుక్ లో అక్కౌంట్ ఓపెన్ చెయ్యండి, సమాచార విప్లవం పేరు చెప్పి వెర్రి తలేస్తోందా?కాలేజిల దగ్గర ఆడ మగ పిల్లలను చూస్తోంటే భయమేస్తోంది. ప్రతివారి చేతిలోనూ సెల్, అదీ ఆండ్రాయిడో మరొకటో. ఇక మగపిల్లలయితే ఒక బైక్, ఒక సెల్ తప్పని సరి. అసలు క్లాస్ లో ఏం వింటున్నారో తెలియదు కాని బయటికొస్తే చెవుల్లో ప్లగ్గులు,బండి మీద రివ్వున దూసుకుపోడం, నిలబడితే ఇక బయటి ప్రపంచంతో సంబంధం లేదు, శివుడు తనలో తను రమిస్తున్నట్లుగా, ఏ సోషల్ నెట్ వర్క్ లోనో ఛాటింగులోనో, పలకరించి పలికే దిక్కూ కనపడటం లేదు. ఇది నాకు నిత్యం కనపడుతున్న సంగతి,రోజూ నాలుగు గంటలికి, సాయంత్రం. ఒక్కొకప్పుడు ఈ సోషల్ నెట్ వర్క్ లను బేన్ చేయమని మనం కోరడం మంచిదేమో అన్న ఆలోచనలు కూడా వస్తాయి, నాకు.  మార్కెటింగ్ పేరు చెప్పి, పిచ్చి పనులు జరుతున్నాయి.పిల్లల విషయం లో తల్లి తండ్రులు ఇంత అజాగర్తగా ఎందుకుంటున్నారో, ఇటువంటి సాధనాలని ఎందుకు వారికి అందుబాటులో ఉంచుతున్నారో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కావటంలేదు. పిల్లలని కాలేజ్ లో చేర్పించేశాం అంతే, మన హోదాకి తగినట్లు అడిగినవన్నీ ఇచ్చేస్తున్నాం అన్నదే తప్పించి పిల్లలు ఇలా పెడతోవలు పడుతున్నారన్న సంగతి  ఎందుకు తెలుసుకోటం లేదో తెలియదు. 

వీటికి తోడు లేండ్ లైన్ లో సంవత్సరం కితం ఎవరో పిలిచి మీకు ప్రయిజ్ వచ్చింది వివరాలు చెప్పమంటున్నారని వచ్చింది కోడలు. అదేంటమ్మా! మనమే లాటరీ కట్టలేదు ప్రయిజ్ ఎందుకొస్తుంది అంటే ఏదో చెబుతోంది చూడండి అని ఫోన్ ఇచ్చింది. అంతావిని, మాకేం ప్రయిజ్ వద్దని చెప్పి పెట్టేసేను. అప్పుడు చెప్పేను మోసాలు ఎలా ఉంటాయో! అది మొదలు ఇటువంటి కాల్స్ వస్తే కోడలు ఆట పట్టించడం మొదలెట్టింది వాళ్ళని.ఏం ప్రైజ్ ఇస్తారు ? ఎక్కడిస్తారు? ప్రయిజ్ ఖరీదెంత? ఎక్కడికి రావాలి? మీకు కావల్సిన వివరాలేంటి? ఫోన్ లో చెప్పను వివరాలు పట్టుకొస్తా, ఎక్కడికి రావాలి? వచ్చి ఎవరిని కలవాలి? ఇలా యక్ష ప్రశలేసి ఛంపుతోంటే టక్కున ఫోన్ పెట్టేసి పోతున్నారు 🙂

ఇక నేను కనక ఫోన్ ఎత్తి ఇటువంటి కాల్ కనక తగిలితే పూర్తిగా చెప్పనిచ్చి, మళ్ళీ మొదలు కొచ్చి, మీరెవరన్నారూ? అని ప్రశ్నిస్తుంటే, మళ్ళీ చెప్పమంటే, చెప్పిన వాటి మీద అనుమానాలు అడుగుతూ సంభాషణ  సాగతీస్తుంటే, వినపడలేదు మళ్ళీ చెప్పమంటూ ఏడిపించడం మొదలెట్టేం. ఇది కాక సగం వినేసి ఉండమ్మా! వస్తానని ఫోన్ పక్కన పారేసి పోతే, కాసేపు వాళ్ళు ఫోన్ లో అరుచుకుని పెట్టేయడం జరుగుతోంది :)కొంత సేపు విన్న తరవాత మళ్ళీ గంట లో ఫోన్ చెయ్యండి ఎవరో వచ్చారు తరవాత మాటాడతానని చెప్పి పెట్టేయడం. 🙂  కొత్త కొత్త విరుగుళ్ళు మనం కూడా కనిపెట్టాలి, మీకేమయినా తెలిస్తే చెప్పండి….

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-SMS,email-నాలుగు కోట్ల రూపాయలేం చేసుకోను?

 1. “సరే, ఒక ముచ్చట తీరిపోయింది”, అనుకొన్నా! మనమేమైనా పేరు గన్న చేయి తిరిగిన రచయితలమా? పాడా?! నేను మొట్ట మొదట గిలికిన పుస్తకమే ఈ సాఫ్ట్-వేర్ కథ. కానీ ఈ ముచ్చట మూణ్ణాళ్ళది కాదు. మరోసారి కూడా తీరింది. మళ్ళీ ఓ మూడునెలలోనే ఇంకొక విడత డబ్బు బట్వాడా అయింది. అంతకు ముందు కంటె ఎక్కువ గా. ఇంటర్నెట్ వినియోగం ఆంధ్ర దేశం లో పెరగబోతోంది. తెలుగు చదవటాన్ని కుర్ర తరాలకు అలవాటు చేయగలిగితే, నిస్సందేహం గా ఇంటర్నెట్ పబ్లిషింగ్ కి తెలుగు లో భవిష్యత్తు ఉంటుంది. ఒక సారి పెట్టిన పుస్తకాన్ని ఎన్ని కాపీలయినా విక్రయించవచ్చు (కాపీలని కొన్న వారు వాటిని ఎంతమంది తో అయినా పంచుకోవచ్చుననుకోండి!) తెలుగు లో రచనలు చేయటం ద్వారా ఈ రోజుల్లో జీవితాన్ని గడపలేమనే విషయం తెలిసినదే. కానీ మీరు అందులో వెచ్చించిన సమయానికీ శ్రమకూ కొద్దిగానైనా సాఫల్యత చేకూరాలంటే మీరు కూడా మీ పుస్తకాన్ని కినిగె లో పెట్టి చూడవచ్చు.

 2. ఈ రకమైన మెసేజ్ లు అందుకుంటున్న వారు ముఖ్యం గా చేయవలసినవి :
  1. ఎప్పుడూ ఆ మెసేజ్ కు రిప్లై చేయకూడదు ఫోను కాల్ ద్వారా కానీ , మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ , ఎందుకంటే , అప్పుడే మీ ఫోను నంబర్ వారికి తెలిసేది !
  అప్పటి వరకూ వారు ఒక మెసేజ్ నే కొన్ని వేలమంది కో , లేదా లక్షల మందికో పంపిస్తూ ఉంటారు , ఆ సమయం లో మీ సెల్ ఫోను నంబర్ వారికి తెలియదు !
  2. అతి ముఖ్యమైన రెండో విషయం , ఎట్టి పరిస్థితులలోనూ , వారి మోసాలకూ , ప్రలోభాలకూ లొంగిపొక , మీ బ్యాంకు అకౌంట్ నంబర్ లు ఇవ్వ కూడదు ! ఎందుకంటే ,అప్పుడు మీ అకౌంట్ నుంచి డబ్బు మాయవుతుంది, ఖచ్చితం గా ! ఇట్లా జరిగిన మోసాలు చాలా నాకు తెలుసు !

  • @సుధాకర్ జీ,
   మీరు చెప్పినవన్నీ నూటికి నూరు పాళ్ళు నిజం. చదుకున్నామనుకున్నవాళ్ళు, తెలివయిన వాళ్ళ మనుకునేవారు కూడా మోసపోతున్నారు, అదే నా బాధ.
   ధన్యవాదాలు.

 3. లక్షలూ , కోట్లూ గెలిచారని ఈమెయిలు ద్వారానూ , టెక్స్ట్ మెసేజ్ ల ద్వారానూ , అమాయకులకు సందేశాలు పంపి వారి డబ్బును పిండుకోవడం ఒక పెద్ద రాకెట్ !
  అధునాతన టెక్నాలజీ ని ఉపయోగించి , ఈ రకమైన మోసాలు చేయడం చాలా సులువు కూడా అవుతుంది, ఈ రోజులలో ! ఎందుకంటే, ఒక దేశం నుంచి సందేశాలు ఇంకో దేశానికి పంపిస్తే , సందేశం వచ్చిన చోట ఉండే చట్టాల బట్టే వారిని విచారణ చేయడం జరుగుతుంది ! అంటే, ఈ ముఠా లు అంతర్జాతీయమైన వి కూడా అయి ఉంటాయి ! ఈ మధ్యే చదివాం మనం, ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఒక విద్యార్ధిని నైజీరియా లో పీజీ కోర్సు కోసం కొన్ని లక్షల రూపాయలు కట్టి ఆశగా అడ్మిషన్ కోసం ఎదురు చూశాక , అదంతా సుద్ధ మోసం అని తెలిసుకుందని ! ఇక పది వేలు కడితే ఇరవై వేలు ఇస్తామనీ , గొలుసు కట్టు మోసాలూ , పిరమిడ్ మోసాలూ ! ఇట్లాంటివి అనేకం ! ఈ మోసాలు చేసే వారి మతం, కేవలం ‘ మోసం’ అనే మతమే ! కాక పొతే ఈ మతస్థుల సంఖ్య విపరీతం గా పెరుగుతుంది ఈ రోజుల్లో ! ఈ మతం వారి గురించిన
  సర్వ సమాచారమూ బడిలో చదివే పిల్లలనుంచీ అందరికీ తెలియ చేయాలి , కేవలం ” రాముడు మంచి బాలుడు ” అనే కధలు కాకుండా ! ఎందుకంటే , నిజ జీవితం లో మోసాలను కనిపెట్టి , మోస పోకుండా ఉండాలంటే , అట్లాంటి అవగాహన అందరికీ ఎంతో అవసరం !

 4. ఈ వయసులో నాలుగుకోట్ల రూపాయలేం చేసుకోను చెప్పండి.
  ………………
  ఈ పెట్టుబడితో రాజకీయాల్లోకి వచ్చి జీవితాన్ని ప్రజలకు అంకితం చేయ వచ్చు కదా . ఎలాగో ఇది ఎన్నికల సీజన్

  • @మిత్రులు మురళి గారు,
   వాడే నా దగ్గర డబ్బులు కొట్టేయ్యాలనుకుంటూ ఉంటే నాకెలా వస్తాయి. ఒక వేళ సొమ్ము వచ్చినా రాజకీయాలలోకి వద్దండి. నాలుగుకోట్లొస్తే ఒక కోటి టాక్స్ కట్టాలా? మిగిలినదాంట్లో ఏమ్.ఎల్.ఎ కిపోటీ చెయ్యలన్నా మా దగ్గర కోటి ఖర్చు తక్కువమాట. ఇంక మిగిలేదేంటి, నా బొంద, ఈ వయసులో వజ్రోత్సవ వేళ 🙂 సంఘసేవ చేయాలనుకుంటే రాజకీయాలే అక్కర లెదనుకుంటా
   ధన్యవాదాలు

 5. శర్మగారూ
  మీకు ఇన్నేసి మెయిళ్ళు యెందుకు వస్తున్నాయో‌ఆలోచించాలి ముందు. మీరు ఏదన్నా వెబ్ సైట్‌లో మీ‌మెయిల్ ఐడి టైప్ చేసారా? మీరు జిమెయిల్ వాడుతున్నారు కాబట్టి జంక్ మెయిళ్ళు తక్కువగానే రావాలి మరి. మెయిల్ ఐడిలని సేకరించి అమ్ముకునే కంపెనీలూ ఉంటాయి. మీరొక పని చేయండి. ఏ హాట్ మెయిల్ అక్కౌంట్ వంటిదో మరొకటి వాడండి వెబ్ సైట్ ఫారాల్లో నింపటానికి. ఎవరికోసమైనా వ్యాఖ్యల్లో మీ మెయిల్ ఐడిని టైప్ చేయవలసి వస్తే అక్షరాలమధ్య గేప్ ఇచ్చి టైప్ చేయండి. ఉదా హరణకు s a r m a x x x AT g m a i l DOT c o m అన్నట్లుగా అన్నమాట.

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   ఎక్కడో పొరపాటు జరిగిపోయి ఈ మెయిల్ అడ్రస్ వాళ్ళ బారిన పడిపోయింది. దీనిని మూసేద్దామనుకున్నా, చాలా ఇబ్బందులు కనపడ్డాయి, మౌనంగా ఈ మెసేజ్ లు డిలీట్ చేస్తుంటా రోజూ. ఎప్పుడేనా పదిరోజులు మెయిల్ చూడకపోతే మాత్రం అడవిలా ఉంటుంది.మరో మెయిలుంది దానిది మరో కధ.
   ధన్యవాదాలు

   • శర్మగారు,
    అనవసరమైన ఐడిలనుండి వచ్చే mail అంతా మీరు filter చేసెయ్యవచ్చును గదండీ. అటువంటి వాటికి మీరు permanent actions ఏర్పాటు చేసుకుంటే అవి automarticగా delete చేయవచ్చును.

   • @మిత్రులు శ్యామలరావు గారు,
    నాకున్న పరిజ్ఞానంతో ఆ పని చేయలేకపోయాను. నిన్న మీరన్న తరవాత ప్రయత్నించి ఫిల్టర్ పెట్టేను. ఈ వేళ చూడాలి.మీ సూచనకు
    ధన్యవాదాలు.

 6. వామ్మో శర్మ గారు సోషియల్ మీడియా లో ఎక్స్ పీరిఎన్సేడ్ పెర్సనాలిటీ అయిపోయారు లా ఉన్నది !! ఇన్నేసి , మేయిల్సా !!

  జిలేబి

  • @జిలేబి గారు,
   రోజూ దగ్గరగా ముఫై దాకా ఇటువంటి మెసేజ్ లు వస్తాయి, ఆదివారం తప్పించి. ఎక్కడో పొరపాటు వుంది
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s