శర్మ కాలక్షేపంకబుర్లు- TV9 తప్పు పట్టిన చాగంటి వారి మాటలు.

TV9 తప్పు పట్టిన చాగంటి వారి మాటలు.

courtesy you tube

TV 9 తప్పుగా భావించిన మాటలు వినండి. మన వారు చాలా మంది దీని గురించి రాశారు కాని అసలు శ్రీ చాగంటి వారన్నదేమో అనే అనుమానం పీడించే సావకాశాన్ని దూరం చేయడానికే ఈ ప్రయత్నం.

ఉన్న నిజాలని చెప్పేరు! ఆయనేం దూషించలేదు ఎవరినీ! మరిదేంటీ?…….అసూయకి పరాకాష్ఠ కదూ!!! దీనినే వ్యసనం అని కూడా అన్నాడు మనువు, అదిమరొకసారి.

image001

సీతాదేవి బంధింప బడిన అశోకవనం

image002

హనుమచే కాల్చబడ్డ రావణ భవనం

image003

సుగ్రీవుని గుహ

image004

సుగ్రీవుని గుహ

image005

సంజీవని పర్వతం

image006

నీటిపై తేలే రామశిల

image007

రామ సేతువు

Photos courtesy: From a friend by mail.

15 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- TV9 తప్పు పట్టిన చాగంటి వారి మాటలు.

 1. ఫొటోలు చాలా బాగున్నాయి!వాటిలో చాలామటుకు ఇదివరకు చూసినవే.ఈ సంజీవని పర్వతం కొడా శ్రీలంక లోనిదే కదా!శ్రీలకలో పుష్పక విమానం యొక్క గ్తారెజీ మరియూ రిపేరింగ్ షాప్ కూడా ఉన్నాయట ఇప్పటికీ!సుగ్రీవుని గుహ మాత్రం భారతదేశంలోనిదే కదా!శ్రీలంక వారు రావణుని ఆనవాళ్ళను కూడా ప్రేమిస్తున్నారు,సంరక్షిస్తున్నారు.కానీ మన దేశంలో మాత్రం రాముడు పెద్ద విలన్ అయిపోయాడు.రామాయణ ధర్మం అంతా అధర్మమేనట!మరి యేది ధర్మామో చెప్పండి అని నిలదెస్తే మాత్రం “అయ్యయో,మేమునూ జాతస్య హిందువులమేనండీ!” అనేసి జారుకుంటారు:-)ఈ జాతస్య హిందువు,జాతస్య అళిత,జాతస్య బోయ అనే మాటల్ని ఎక్కణ్ణించి కొట్టుకొచ్చారో తెలియదు:-(

  • హరిబాబుగారు,
   చాలా పాత టపా చూసి స్పందించారు 🙂
   మిత్రులొకరు పంపిన ఫోటోలు. లంకలో వారికి రావణుడు జీవానధారం. మన దేశంలో కూడా రావణుని పూజిస్తారు, శివాంశగా, గుడులూ ఉన్నాయి. ఎవరిష్టం వారిది, మరొకరికి బాధ కలిగించనంతవరకు అలాగే అనుకోనివ్వండి.
   ధన్యవాదాలు.

 2. Tv9 వెదవలకు పని పాటా లేదా మహానుబావుడు చాగంటి కోటేశ్వరరావు గారిని ఇంకోసారి ఇలా చూపిస్తే జనాలు చెప్పులు తీసి కొడతారు .ఎవరైనా ఆయన జోలికి వెళదామనుకుంటే దమ్ముంటే నాకు ఫొన్ చే యం డ్రా
  B v chowdary 8187076499

  • @అజయ్ గారు,
   స్వాగతం. మనకి వాక్స్వాతంత్ర్యం వుందికదా! దానిని దుర్వినియోగం చేసేవారు ఎక్కువగా కనపడుతున్నారు.
   ధన్యవాదాలు.

 3. ఓం,
  ఈ విషయాల గురించి నేను టీవీలో చూడలేదండి. మీ బ్లాగ్ లోనే చూశాను.
  దైవం సర్వాంతర్యామి. దైవాన్ని ఏ రూపంతోనయినా, ఏ నామంతోనయినా ఆరాధించుకోవచ్చు.
  ( నిరాకారంగా కూడా ఆరాధించుకోవచ్చు.)
  వినాయకుడు, అమ్మవారు, అయ్యవారు, షిర్డిసాయి. .ఇలా ఏ పేరుతో ఆరాధించుకున్నా మన ఆరాధనలు చేరేది సర్వాంతర్యామి అయిన దైవానికే.

  నాకు వీలుకుదిరినప్పుడు సాయిసాయి అని అనుకుంటూ ఉంటాను.
  బీజాక్షరాలతో కూడిన నామములను శుచిగా లేనప్పుడు, ఎప్పుడుపడితే అప్పుడు స్మరించుకోవాలంటే కొంచెం బెరుకుగా ఉంటుంది. సాయి నామాన్ని ఎప్పుడైనా బెరుకు లేకుండా స్మరించుకోవచ్చు కదా ! అని నాకు తెలిసినంతలో అనిపించింది.

  శ్రీపాద శ్రీవల్లభస్వామి సంపూర్ణ చరితామృతము… గ్రంధములో షిర్డి సాయి గురించిన ఎన్నో వివరములు ఉన్నాయి. ఆ వివరాలు చదివితే షిర్డి సాయి గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి.

  పాపవిమోచన పొందుట….
  మనుష్యుడు దుర్మార్గ మార్గమునుండి బుద్ధిని మరలించనప్పుడు , తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వార కూడ ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు………షిర్డి సాయిబాబా వారు ఇలాంటి ఎన్నో అపురూపమైన విషయాలను తెలియజేశారు.

  చాగంటి వారు చెప్పినట్లు ఈ రోజుల్లో ఎందరో భక్తులు విపరీతమైన కోరికలతో భక్తిమార్గాన్ని ఆశ్రయిస్తున్నారు.
  కష్టాలలో ఉన్నప్పుడు లేక కొన్నిసార్లు కోరికలు కోరుకోవటం మానవనైజం. అయితే బిడ్డలు అదేపనిగా స్వార్ధపరమైన కోరికలతో విసిగిస్తే తల్లితండ్రులకైనా విసుగు వస్తుంది.

  కోరికలు కోరేముందు అందుకు తగ్గ అర్హతను సంపాదించుకోవాలని ఒక బోధకులు చెప్పారు. అర్హత ఏమీ లేకుండానే తేరగా పెద్దపెద్ద కోరికలు కోరే స్వార్ధపరులైన భక్తుల సంఖ్య పెరిగిన మాట వాస్తవం.
  అయితే మొదట కోరికల కోసం భక్తి మార్గాన్ని ఆశ్రయించినా క్రమంగా కోరికలను తగ్గించుకునే స్థాయికి వచ్చే అవకాశమూ ఉంది.
  రామసేతు మొదలైన చిత్రాలు చాలా బాగున్నాయండి.

 4. శర్మగారూ,

  ఈ విషయమై TV9 వారికి ఒక లేఖ కూడా వ్రాసాను. చింతా వారు జవాబు రాదన్నట్లే అయింది. పోనివ్వండి. వివాదాలు లేకుండా ఛానెళ్ళు బ్రతకలేవు కదా? వివాదాలను తయారుచేయటానికీ, ఎగదోయటానికీ ఛానెళ్ళవారు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. కోటేశ్వరరావు కోటేశ్వరరావు అంటూ కుర్ర యాంకర్లు తామేదో‌ ఆయనకు బొడ్డుకోసి పేరు పెట్టినట్లు మాట్లాడటం ఎబ్బెట్టుగా ఉంది. ఛానెల్ వారు ఉటంకించి తప్పుపట్టిన చాగంటి వారి వాక్యాల మీద వివరణాత్మక వ్యాసాలు వ్రాయావలసి ఉంది. కుదిరితే వ్రాస్తాను. ఆయనమాటలు అక్షరసత్యాలు. ఆమనకు తెలిసిన దానిలో శతసహస్రాంశమూ తెలియని వారు చాంగటివారిని తప్పు పట్టటంలో ఆశ్చర్యం లేదు. అల్పజ్ఞులే తరచుగా సర్వజ్ఞులమని భ్రమపడుతూ ఉంటారు, లోకాన్నీ భ్రమింపజేస్తూ ఉంటారు. చాగంటివారికి వచ్చిన లోటు యేమీ‌ లేదు.

  తమకు నచ్చిన ఇచ్చకపు మాటలు వినటానికి పురాణప్రవచనం జరిగే చోటుకు పోరాదు. ఆర్యుల మాటలు మన తప్పులను ఎత్తిచూపితే సరిజేసుకుందుకు ప్రయత్నించాలి కాని, మా నమ్మకాలే మాకు ప్రమాణం కాబట్టి అయ్యా మీరే మారండి అని వారికే నామాలు దిద్దాలనుకునే వారు తమకూ జాతికీ కూడా ద్రోహం చేసుకుంటున్న వారే.

  అప్రియస్యచ పథ్యస్య వక్తశ్రోతాచ దుర్లభః. మంచి చెబితే కటువుగా ఉండదా మరి. ఔషధం తీయగా హితవుగా లేదని నిరాకరించితే ఎవరికండీ‌ చేటు?

 5. శర్మ గారూ ,

  నమస్తే .

  చాగంటి వారి ప్రవచనం శ్రీ సాయి సత్చరిత్ర పై విన్న తర్వాత అపార్ధానికి దారి తీసిన సందర్భంఇదే .

  ఇది మనమందరం నిత్యం చూస్తున్నదే .

  ఉదాహరణకి : మనకు అనారోగ్యంగా వున్నపుడు పక్కింటి / అయినవాళ్ళ ఉచిత సలహా మేరకు రక రకాల వైద్యులని సంప్రదిస్తుంటాం . ఏ ఒక్క వైద్యుడి పరిశీలన ఒకళ్ళకొక్కళ్ళకు కలవదు . కారణం వాళ్ళు చదువుకున్న / పేరు ప్రఖ్యాతులు గడించిన పరిధిలోనే వుండటమే . ఆయన్ అచదీవిన / గడించిన సాధనతోనే ఆధారాలు లేనిదే ఏదీ ఒప్పుకొనే స్థాయి లెనివారు .
  ప్రతిదానికీ ప్రమాణం కావాలి , లేకుంటే ఆయన పరిసరాల్లో కూడా నిలబడదు , ఆయన నరనరాల్లో ఇదే జీర్ణించుకుపోయింది . ఇది ఆయన స్థితి / అభిప్రాయమే .
  దీనికి సాయి సత్చరిత్ర పై నమ్మకమున్నవారు తప్పుగా స్పందిచాల్సిన అవసరం లేదు . దీనిని ప్రత్యేక ఆకర్షణగా చూపే దోహదం అవసరం లేదు .

  ఇక సుధాముడి కధ : ఏ కధలోనైనా అంతరార్ధం అవసరం గాని అనవసరమైన అర్ధాలు తీసి అపార్ధాలకు ఆసరా ఈయకూడదు .

  సాయి సత్చరిత్రను చదివే వారు కోరికలతో చదువుతున్నారు , అది తప్పు అని అన్నారు . మానవజన్మ అంటేనే కోరికల పుట్ట . లేకుంటే అసలు జన్మే లేదు . అయితే అందరూ ఆయనల కోరికలు లేకుండా ఉండరు , సారీ ఆయన కూడా అలా వుండరు . ఏ కోరిక లేనిదే దేవుని / పెద్దవాణ్ణి ఎవరూ చేరరు . ఆయన ప్రవచనాలను మెచ్చుకున్నంత మాత్రాన ఆయనంటే యిష్టపడ్తున్నారని భావించటం పొరపాటు . కెమేరా ఫోకస్ మనమీద పడ్డంతమాత్రాన మనకు ఫ్హొటో తీశారనుకోవటం పొరపాటు .
  ఇక పారాయణ : పారాయణ అంటే పైకి కనపడేది పఠనం , అంతర్లీనంగా మననం , ఆచహ్రణీయం . సంసారంలో వుంటూ , తామరాకు మీద నీటి బొట్టులా ఏవీ అంటించుకోకుండా వుండటమెలాగో తెలియచేశారు . గురు శిష్య సంబంధం ఎల వుండాలో వివరించారు .

  ఈ ప్రపంచంలో ప్రశాంతత పొందటానికి పలు మార్గాలున్నాయి . రామాయణ , పురాణ గాధలు చదివితేనే ప్రశాంతత కల్గుతుందనేది భ్రమ మాత్రమే . మనసు నిశ్చలంగా వుంచుకొంటే ఏదైనా సాధించగలం .

 6. ఆహా,

  టీవీ నైన్ వారు నిజంగానే తాము ‘నెంబర్ నైన్’ అని ప్రూవ్ చేసేసు కున్నారు సుమీ !

  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s