శర్మ కాలక్షేపంకబుర్లు- వంట చేయడం కళ.

వంట చేయడం కళ.

jdefhfeb

వంట చేయడం నిజంగా కళ, కలకాదు.మానవ సమాజంలో అతిపురాతన వృత్తి. నృసింహ శతకకారుడు చెప్పినట్లు “లక్షాధికారయిన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు” అన్నారు.  మానవులు అగ్నిని ఉపయోగించుకోడం తెలిసినప్పటినుంచి వంట చేసుకుంటూనే ఉన్నాడు, రుచిగా తింటూనే ఉన్నాడు. ఎలా చేసుకుంటే రుచిగా ఉంటుందో కూడా, ఇప్పటికి పరిశోధిస్తూనే ఉన్నారు. వంట చెయ్యడం ఆడవారి పనా? మగవారి పనా? ఎవరు చెయ్యాలన్నదాని మీద చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి, నేటికి కూడా. ఎవరు చేసినా రుచిగా చేస్తే లొట్టలేసుకుంటు తింటారు, లేకపోతే వండుకున్నదంతా పెంటపాలయిపోతుంది. చిత్రం ఏమంటే ఈ వండుకున్న ఆహారం తినడానికి నోటిలో ఉండేది బహు తక్కువ సమయం, కాని ఈ రసనేంద్రియాన్ని సంతృప్తి పరచడానికి పడరాని పాట్లు పడతారు మానవులు. ఎక్కడో ఏదో బాగుంటుందంటే ఒక సారి అక్కడికెళ్ళి అది తినిరావాలనుకుంటారు, నేను అల్లం జీలకర్ర పెసరట్లు తినడం కోసం, పక్క ఊరికి వారానికి భోజనం చేసినతరవాత వెళ్ళే కేంపు ఉదయానికే మార్చుకున్నట్లుగా.

చరిత్రలో చూస్తే మగవాళ్ళలో నలుడు ‘బాహుకు’ని పేరుతోను,భీముడు ‘వలలు’డనే మారుపేరుతోనూ వంట చేసినవాళ్ళే, అవసరం కోసమయినా, గొప్ప వంట చేసేవారిగా పేరుపొందారిప్పటికీ.అందుకే చాలా బాగున్న వంటకాన్ని నలభీమపాకం చేశావనుకో! అనడం పరిపాటి. నలుడిని కాటేసిన కర్కోటకుడిచ్చిన సలహా, ఋతుపర్ణమహారాజు దగ్గర వంటవాడిగా చేరమని. భీముడు తనంత తానే వంటవానిగా వెళతానని చెప్పేడు, దానికీ కారణం ఉంది కదా! సువారం లో ఐతే, వండేవాడు తనే ఐతే, ఎంత తిన్నదీ తెలియదు కదా, భీముడు వృకోదరుడు కదా!! వృకము అంటే తోడేలు, దీనికి ఎంత తిన్నా ఆకలేట….చరిత్రలో ఆడవారి వంట గురించిన ప్రస్తావన కనపడదు. 🙂

ఏను వంటలవాడనై యానరేంద్రు,
గొలిచి గరగరగా గూడు గూర చిత్త
మునకు వచ్చినచందంబునన యొనర్చి
నేర్చి మెలగుదు గరము వినీతి మెఱసి.. భా-విరా ప-అశ్వా1-76

ఆఱురసంబులం జవుల యందలిక్రొత్తలు పుట్ట నిచ్చలున్
వేఱొకభంగి బాకములు విన్ననువొప్పగ జేసిచేసి న
న్మీఱగ బానసీని నొకనిం బురి గాననియట్లుగాగ మేన్
గాఱియ వెట్టియైన నొడికంబుగ వండుదు నెల్ల గూరలున్……77

 నేను వంటవాడిగా ఆ రాజు దగ్గరచేరి రుచిగా అన్నం, కూరలు చెయ్యితిరిగిన వంటవాడిలా చేసిపెడతాను.షడ్రుచులు తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు వీటిని నోరూరేలాగా కొత్తగ కొత్త వంటలుగా చేసి, ఇంతగొప్పగా వంట చేసేవాడు,మరొక వంట వాడు ఈ ప్రాంతం లో లేడనిపించుకుంటా,శరీరాన్ని కష్టపెట్టి అయినా సరే అన్నాడు, భీముడు.

DSCN3176

ఇం దులో ఒక మంచి సంగతుంది చూడండి. కూడు ఎవరొండినా ఒకటేననుకోకండి, దీనికీ పదునుంది, ఇప్పుడు కుక్కర్లొచ్చి పదును తెలియటం లేదనుకోండి.ఉడుకెక్కువయితే ‘చిమిడి’పోతుంది, ఉడుకు తక్కువయితే మేకుల్లా ఉంటుంది,ఉడుకు పూర్తికాకపోతే ‘ననువాయి’ అంటే సగం ఉడికి సగం ఉడకక ఉంటుంది. దీన్నే అన్నం ‘పలుకుం‘దంటారు. ఈ మాటలన్నీ కొత్తగా ఉన్నాయా? .అసలు సంగతి కూరలోనే ఉంది. అన్నం ఎంత బాగున్నా ఉపయోగం లేదు, కూర బాగో పోతే, అందుకే భాస్కర శతకకారుడు…..పదునుగ మంచి కూర నలపాకము చేసినయైన అందు యింపొసగెడు ఉప్పులేక రుచి చేకూర్చునటయ్య భాస్కరా!… అన్నారు కదా! మరి అలా వండట చేతనయితేనే రుచి మరి. అప్పుడే లొట్టలేసుకుని తింటారు.సరిపడా ఉప్పు,పులుపు, కారం వేయడంలోనే ఉంది అసలు మజా. అది చేతనయితే….అదే రసజ్ఞత .వంట చేసుకుంటే ఎంత వుపయోగమో చూశారా? 🙂 అందుచేత, అందువలన, అందుకొరకు వంట చేయండి.వంట చేయడం వచ్చినవాడు భర్తయితే ఆబ్బో! ఆ భార్య ఆనందమే అనందంట. మా ఆయన బంగారం అని వూరూ వాడా చెప్పుకుంటారట. 🙂 ఇప్పటికీ ఇంటికి సరిపడ వంట తప్పించి పెద్ద పెద్ద వంటలయితే చేసేవారు మగవారే! ఎక్కువగా!! స్టార్ హోటళ్ళలో కూడా ఛెఫ్ లంతా మగవాళ్ళే, ఎక్కువగా.

‘ఈ వేళ నీ చేతి పనసపొట్టు కూర అదిరిందోయ్’ అన్నా మొన్నా మధ్య!, నిజమేలెండి, అలా అన్నానని మరి నాలుగురోజుల తరవాత అదే కూర మళ్ళీ చేసింది, ‘మాటాడరేం? ఎలా ఉంది కూర?’ అంది ఏం చెప్పను, ‘నీ మొహంలా ఉం’దన్నా, ముందు జాగ్రత్త చర్యగా! వాతావరణం బాగోకపోతే కూర అదిరిందని తప్పుకోవచ్చు, లేకపోతే బాగోలేదని అనుకోమనచ్చు, అని.  అలా మొదలయ్యింది, మళ్ళీ..’నా మొహానికేం వెలిగిపోతోంటె, మరి అందుకేగా వెనకబడి మరీ కట్టుకున్నారు’ అని దెప్పింది కూడా. కట్టుకున్న తరవాత తప్పుతుందా?తగిన అన్నం లోకి తగిన కూర దొరకదంటారు. ఆవిడకేమో సినిమాలు షికార్లు, స్నేహితులు, కార్లు, హోదా, గొప్ప, డాబు, దర్పం కావాలి. ఈయనంటాడూ, ఎందుకీ ఆడంబరం వద్దంటాడు, అదుగో అలా మొదలవుతుంది 🙂 ఆవిడేమో చదువు, సంబరం, కవితలు, గోష్టులు, సమ్మేళనాలు, సత్కారాలు, సన్మానాలు, పొగడ్తలు,పూల దండలు, బహుమతులు అని తిరుగుతుంది, ఈయనకి పొట్టకోస్తే అక్షరం కనపడదు, అలా మొదలవుతుంది మళ్ళీ…ఆయ్! తేడా వచ్చేదంతా కంచం, మంచం దగ్గరేనండి. ఇవి రెండు బాగుంటే జీవితమే హాయిలే హలా!

ఏదయినా సరే! వంట చేస్తే రుచుగా వుందని చెప్పడానికి మా ఇలాకాలో ఒక కథ చెపుతారు, తద్వారా ఒక మాన్యం కూడా పుచ్చుకున్నారంటారు. దానికి గఱికెల మాన్యం అని పేరు, మరి ఇప్పుడు కాదు, ఆ టపా చాలా రోజుల కితం సగం రాసి వుంచా, వీలు చూచుకుని పూర్తి చేస్తా,వస్తా!..ఇంతకీ వంటెవరు చేయాలో చెప్పలేదన్నారు కదూ… ఆగండి.ఆగండి..మరోసారి చెబుతా. ఉండండి, ఇల్లాలు పిలుస్తోంది భోజనానికి, ఈ వేళ స్పెషల్ పాటోళీట…!

cgghgbae

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- వంట చేయడం కళ.

  • @పద్మ గారు,
   పునః స్వాగతం. చాలా కాలం తరవాత కనపడ్డారు.వంట కమ్మగా చేస్తే అద్భుతంగానే ఉంటుంది కదండీ! ఫోటో లు నచ్చినందుకు
   ధన్యవాదాలు.

 1. చరిత్రలో ఆడవారి వంట గురించిన ప్రస్తావన కనపడదు. 🙂

  అబ్బే, ఆడవారి గురించి ఎక్కువ గా వీరాంగణలు గానే ప్రస్తావన ఉంటుందండీ !!

  జిలేబి

  • @జిలేబి గారు,
   నిజమయిన మాటే చెప్పేరు. పిల్లలని రక్షించుకోడానికి తల్లి ప్రాణాలకి తెగించి పోరుతుంది.
   ధన్యవాదాలు.

  • @మిత్రులు లక్కాకుల వేంకట రాజారావు గారు,
   అనుమానం బాగానే వచ్చింది. తిని పెట్టడం తప్పించి కాఫీ పెట్టడo కూడా రాదు. ఈ వేళ టపా చూడండి.
   ధన్యవాదాలు.

  • @మిత్రులు శర్మాజీ,
   రుచి అయిన టపా వండేనని లొట్టలేసుకుంటూ చదివి వ్యాఖ్య పెట్టినందుకు
   ధన్యవాదాలు.

 2. శర్మ గారూ ,

  నమస్తే .

  నిజంగా వంట చేయటం కళే , అయితె భార్యా భర్తల యిరువురిలో ఎవరికి వచ్చినా యిబ్బందిలేదు , సర్దుకుపోవటమనే కళ వచ్చుంటే .
  శాస్త్రాలలో మగవాళ్ళను మాత్రమే హైలైట్ చేశారంటే , దానికి కారణం ఆడవాళ్ళకు అది అనాదిగా హక్కుగా వచ్చుంది కనుక , వాళ్ళను ప్రత్యేకంగా ఎత్తి చూపించాల్సిన అవసరం లేకపోయింది .

  • @మిత్రులు శర్మాజీ,
   సద్దుకుపోవడం కళ. అది తెలిసుంటే ఆలు మగల జీవితమే ఆనందమయం.
   ధన్యవాదాలు.

 3. బాగుందండి.
  నాకు ఈ కళ అంత బాగా రాదు కాని, తినడం అనే కళ బాగా వచ్చు.
  వంట బాగా వచ్చినవాడిని చేసుకునే ఆడవాళ్ళకి చాలా తిప్పలు ఉంటాయండి.
  ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, అది బాగోలేదు, ఇది బాగోలేదు అని భలే వంకలు పెడతారు.

  • @మిత్రులు బోనగిరి గారు,
   “భోజనం చేయడం ఒక కళ” టపా రాస్తున్నా.తలకట్టు మీదే, టపా కొన్ని కాగితాలు స్కేన్ కోసం ఆగింది :).వంట చేయడం వచ్చిన వాణ్ణి కట్టుకుంటే అటువంటి వాళ్ళకి తిప్పలే 🙂
   ధన్యవాదాలు.

 4. మగవారే గొప్పగా వంట చేస్తారు అని వ్రాస్తే, మగవారికి వంటపని అప్పజెప్పేస్తారు . జాగ్రత్తండి.

  • @అనురాధ
   వంట చెస్తే తప్పుకాదండి. వంటెవరు చెయ్యాలని మీకామెంట్ చూసిన తరవాత రాశాను, చూడండి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s