శర్మ కాలక్షేపం కాని కబుర్లు-జాతస్య మరణం ధృవమ్

జాతస్య మరణం ధృవమ్

ఈ మాట అందరం చెబుతాం కాని అనుభవం లో కొచ్చేటప్పటికి తట్టుకోలేము. మొన్న 25 వ తారీకు గురువారం మధ్యాహ్నం తెలిసినవార్త విని కుప్ప కూలిపోయాను. ఇప్పటికే ఒక సోదరుని ఒక చిన్న సోదరిని నాలుగురోజుల తేడాలో మే నెలలోనే పోగొట్టుకున్న నాకు నా తరవాత చెల్లెలి హఠాన్మరణ వార్త పూర్తిగా కలచివేసింది. నేను వివాహం జరిపించి కష్ట సుఖాలు చూసిన తోబుట్టువికలేదన్నమాట, అశనిపాతమే అయింది. ఏమయినా కాలం ఆగదు, కావలసిన కార్యక్రమాలూ ఆగవు కదా! అన్నీ పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి శనివారం రాత్రయింది.

చిత్రమైన చిత్ర వధ అనుభవించే సన్నివేశాలే ఎదురయ్యాయి, ఈమధ్య జీవితంలో. కరువు తీరా ఏడ్చేందుకు కూడా సావకాశం లేని సందర్భమయిపోయింది. ఎక్కడ చూసినా అందరూ చిన్న వారే, నాకంటే. నేనే అందరిని ఓదార్చేస్థితి, నా గతేమీ……….విధిలీల విచిత్రమేకాని, మరీ ఇంత విచిత్రమా! ఒక అమ్మ కడుపున పుట్టిన ఆరుగురిలో ముగ్గురు మూడు నెలలలో, ఒక సంవత్సరం లో గతించడం, మిగిలి వున్నవారికి శరాఘాతం…అనుభవి0చక తప్పదు కదా!

అదే జీవితం
ఇదే విష్ణుమాయ.

18 thoughts on “శర్మ కాలక్షేపం కాని కబుర్లు-జాతస్య మరణం ధృవమ్

 1. తాతగారు ఇప్పుడిప్పుడే ప్రజలలో పడ్డాను అన్న మీ మాట విని స్థిమితపడ్డాను. మళ్ళీ ఇంతలోనే ఇలా జరగడం బాధాకరం..
  మామ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
  అలాగే పెద్దరికం వయసు బట్టి కాక,మనుషుల పరిస్తితులబట్టేనని నా నమ్మకం..
  అమ్మకి అమ్మ చనిపోయినప్పుడు,
  అమ్మ చిన్నపిల్లై ఏడుస్తుంది.
  కూతురు అమ్మకి తల్లిలా ఓదారుస్తుంది.మీరు మనసులోనె బాధ పడకంది తాతగారు.బాధను పంచుకోండి. మీకు చెప్పేతంతటిదాన్ని కాదు. కానీ ,
  మా తాతయ్య ఈ బాధనించి కోలుకోవాలని చేసే ప్రయత్నం.

  • @చిరంజీవి ధాత్రికి,
   ఇంత చిన్న వయసులో జీవితానుభవాన్ని చక్కగా చెప్పేవు.నీ మాటలు అమృతపు గుళికలలా పని చేస్తాయి. మళ్ళీ నిలదొక్కుకుంటున్నాను.
   ధన్యవాదాలు

 2. శర్మాజీ..పెద్ద వారు..మీకు తెలియనివి కాదు…ఒక విషయం చెపుతా…కాంతి వేగం ఆధారం గా అనేక సిద్ధాంతాలు వచ్చాయ్..అలానే బ్లాక్ హోల్ సంబందించి..కూడా..
  అలానే ప్రస్తుతం జరుగుతున్న, నడుస్తున్నదంతా …ఒకప్పుడు జరిగినదే..మరో డైమెంషన్లో మనం ఇప్పుడు దాన్ని చూస్తున్నాం…అంటే రిపీట్ అవుతున్నట్టు మనం భావించాలి….
  చాలా మంది అంటూ ఉంటారు…అంతా ముందే రాసి పెట్టి ఉంటుంది…అనేదానికి…ఇదే సంబంధమయి నట్టు మనం భావించాల్సి ఉంటుంది…
  అలానే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు…ఇలానే ఈ సన్నివేశం లానే ఎప్పుడో జరిగినట్టు అనిపిస్తుంది… ఇవన్నీ ముందే(జరిగి) రాసిపెట్టి ఉన్నయ్…
  మనం నిమిత్త మాత్రులం….
  ఇది అసందర్బం గా అనిపించవచ్చు…కానీ ఇలాంటి సమయాల్లో…మన చేతిలో ఏమీ లేదు…అంతా ముందే నిర్ణమయిపోయింది…
  అనుకుంటె…కొంచెం మన:శాంతి..

  • @kvsvగారు,
   మీరు చెప్పినది నిజం.ఐతే తెలిసిన వారమయినా కొద్దికాలం అందులో ములిగిపోవడం సహజం. నేను నాలుగు రోజులలోనే తేరుకున్నానని చెప్పగలను. మీ ఆత్మీయ పలకరింపుకి
   ధన్యవాదాలు.

 3. శర్మగారూ
  ఎఱుకగల మీకు చెప్పగలవాడిని కాను. అన్నీ‌కాలగతి ననుసరించి సహజంగా జరుగుతూ ఉంటాయి. అన్నీ సుఖదుఃఖాభాసలు నిజానికి, కాని ఉపాధులలో ఉన్నప్పుడు నిజమైన సుఖఃదుఖాలుగానే అనుభవానికి వస్తాయి. ఈ‌ పరిస్థితినుండి తప్పుకోవటం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. స్వరసవాహీ విదుషోపి తథారూఢో అభినివేశః అన్న పాతంజలసూత్రం చెప్పుతున్నట్లు, ఎంతైనా ఉపాదిగతంగా అహమికా మమకారమూ ప్రకృతిసిధ్ధంగా మహనీయులకూ తప్పవు. అందుచేత ప్రాజ్ఞులైన మీకు ఇవి తాత్కాలిక విచారాలే అవుతాయి. హరిగతచిత్తంతో మీరు ఈ‌ విచారాన్ని అధిగమించగలరని విశ్వసిస్తున్నాను.

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   ఎఱుకలో ఉన్నదే, కాని కొద్దికాలం మరుగున పడుతుంది కదా ఉధృతి చేత. మీ ఆత్మీయ పలకరింపుకి
   ధన్యవాదాలు.

 4. శర్మ గారూ ,

  నమ్స్తే .

  ఈ విషాదటపా చదివి కొంచెం బాధపడాల్సి వచ్చింది . మీరన్నట్లు ఈ స్థితి సర్వసామాన్యమే పుట్టిన వారు గిట్టక తప్పదు కదా ! ఎదుగు ఉంటే ఒదుగు తప్పదు . మనం పెద్దవారిగా మిగిలినందులకు , మనకంటే చిన్నవారికి ధైర్యం చెప్పటం తప్ప , బాధపడే అవకాSఅం కూడా సరిగా ఉండదు అన్నది అక్షర సత్యమే .

  • @శర్మాజీ,
   మనమే పెద్దవాళ్ళమయి ఓదార్చ వలసి వస్తే చాలా కష్టం కదా! మనల్ని ఓదార్చేవారుండరు.
   ధన్యవాదాలు.

 5. “Everything that has a beginning… has an end” అని మాట్రిక్స్ సినిమాలో చెప్పినట్లు, ఆరంభమైన ప్రతీదీ అంతమవుతుంది. కాని ఈ అంతం శాశ్వతమా లేక పునర్జన్మ ఉందా అనేదే తేలలేదు.

  • @sree గారు,
   ఎప్పుడో ఒకప్పుడు తప్పదు కాని మరీ ఇంత తక్కువ కాలం లోనా? సనాతన ధర్మం పునర్జీవనం ఉందని చెబుతుంది. దాన్ని నమ్మేవాళ్ళం.
   ధన్యవాదాలు.

 6. శర్మ గారూ , మీ జీవితం లో ,ఈ విచార కర సందర్భం లో మీకు స్వాంతన, ధైర్యం కలిగించాలని దైవాన్ని ప్రార్దిస్తున్నా !

 7. శర్మ గారూ నాదీ మీ అనుభవమే!ఈ సంవత్సరమే తోడ పుట్టిన చెల్లెలు ఇందిరను కోల్పోయాను, ఎనిమిదేల్లకింద తమ్ముడు వీర ప్రకాశ్ ను పోగొట్టుకున్నాను!ఆ ఇరువురూ క్యాన్సర్ వ్యాధి గ్రస్తులైనారు!ఈ కళ్ళతో వాళ్ళ చావులు చూశాను!అలా చూస్తూ చూస్తూనే మనమూ ఏదో ఒక రోజు చల్లగా వెళ్ళిపోతాం!అంతేమరి జీవితం!

  • @ఏ.సూర్య ప్రకాశ్ గారు,
   ఎప్పుడో ఒకప్పుడు జరిగేదే, కాని ఇంత తక్కువ కాలం లో ఇంతమంది గతించడం, బాధగా ఉంది. మీ ఆత్మీయ పలకరింపుకి
   ధన్యవాదాలు.

 8. అయ్యో చదూతుంటే గుండెలు పిండినట్టనిపించిందండీ. తోబుట్టువుల్ని పోగొట్టుకోవటం ఏ వయసులో అయినా శరాఘాతమే హృదయానికి.
  వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s