శర్మ కాలక్షేపంకబుర్లు-ఆలసించిన ఆశాభంగం.

ఆలసించిన ఆశాభంగం.

Sahara Desert, Africa

‘ఆలసించిన ఆశాభంగం నేడేచ్చూడండి….పిక్చర్స్ వారి ఎంటీవోడు, నాగేసర్రావు, గుమ్మడి, రేలంగి,సూర్యకాంతం, అందాల తారలు సావిత్రి, జమునల అద్భుత నటనతో……సినిమా ఆఖరాట, నేడేఛ్ఛూడండి, ఆలసించిన ఆశాభంగం’ అని అరుచుకుంటూ రెండు పోస్టర్లని నిలబెట్టి గూడులా తయారు చేసిన రెండు చక్రాలబండిని తోసుకుని పోయాడు. అది నా చిన్నప్పటి, అనగా అరవై సంవత్సరాలనాటి ప్రచార పోకడ. అయ్యో! మంచి సినిమా ఎంటివోడు, నాగేస్వరరావు, సావిత్రి, జమున ఉన్న బొమ్మ చూడకపోతే ఎలా? ఈవేళే ఆఖరాటంటున్నాడు, పోనీ ఇది ఉళ్ళోదా? ఐదుకిలో మీటర్ల దూరం నడిచిపోవాలి, ఆ సినిమా చూడాలంటే, మరీ నేలకి పోలేం దానికి పావలా చాలు, కుర్చీకెళ్ళలేం, అమ్మో రూపాయి టిక్కట్టు మరెలా? బెంచీ మేలు మరి ఆరణాలో అర్థరూపాయో కావాలి, మళ్ళీ ఇంటర్వెల్ లో ఏమయినా తినాలంటే డబ్బులు కావాలి కదా! ఎలా సంపాదించాలి. నాన్నని సినిమాకి డబ్బులడిగే సాహసం లేదు. ఆయన కనపడితేనే లాగూ తడిసిపోతుంది 🙂 ఇంక మిగిలినది అమ్మే. ఇటువంటి ప్రమాదాలొస్తాయనుకునే మేము పుట్టక ముందే వెళ్ళిపోయింది మామ్మ, మరి తాతేమో నేను పుట్టిన ఆరేళ్ళకి ఇక తగలేసేందుకు ఆస్థి లేదు, చాల్లే అని, బాల్చీ తన్నేసేడు. అమ్మమ్మ, తాతల ముఖాలే ఎరగం. అందుచేత ఏంచేసినా అమ్మే! అమ్మ దగ్గర చేరితే ఎంతమందికివ్వగలదు? సినిమాకి బయలుదేరే పటాలానికి? దారిలేదు, ఒక్కణ్ణే చూడాలి, సినిమా . పోనీ అమ్మ పోపులపెట్టి మీదకి రహస్యంగా దండయాత్ర చేస్తేనో! ఎంత చేసినా అణాయో బేడో దొరికేది. పోనీ పెట్టెలో చెయ్యెడితే? అమ్మో! దొరికిపోతే ఒళ్ళు చీరేస్తుంది, మాట్టాడకుండా, చెయ్యి కూడా చేసుకోకుండా. నాన్నని ఎలాగయినా తట్టుకోవచ్చు, అమ్మని తట్టుకోలేను. ఒక్కసారి నీరసమొచ్చేసింది. చేతిలో బండివాడిచ్చిన పేపరు నలుగుతోంది. ఆలోచనా తెగలేదు. దారీ దొరకలేదు. నీరసంగా బడికి బయలుదేరితే మధ్యలో మా లాంగ్ ఫెలో సుబ్రమణ్యం కలిసేడు.’ ఏరా బాచిగా! అలావున్నావేం’ అన్నాడు. ‘ఏం లేద’న్నా! ‘చెప్పకపోతే పోన్లే’ అని పోయాడు. వాడి దగ్గర డబ్బులుంటాయి, అడిగేందుకు నామోషీ, సినిమాకి తీసుకెళ్ళమని అడగలేను. వాడికి డబ్బులుండి వెళ్ళలేడు, సినిమా అంటే వాడింట్లో వీపు చీరేస్తుంది, వాళ్ళమ్మ. నాకయితే రాత్రి మేష్టారింటి దగ్గర చదువుకుని అక్కడే పడుకుంటానని చెప్పి చెక్కెయ్యచ్చు. వాడికి ఆ సావకాశం లేదు. ఎన్ని తడిమిట్లు పడినా సినిమా చూడ్డం పొసగలేదు. మర్నాడు ఉదయమే మళ్ళీ సినిమా బండి వచ్చింది, ‘పురజనులకోరికపై మరి నేడు ఒక్కరోజే రాత్రి రెండాటలు…’ అని చెప్పుకుపోతున్నాడు…ఆ రోజు మొత్తానికి డబ్బులు కూడ పెట్టడం మా లాంగ్ ఫెలోతో సినిమాకి చెక్కెయ్యడం అదంతా పెద్ద కథ, ఇలాగా ఆఖరాటని సరిగా వారం పాటు చెబుతూనే వచ్చాడా తరవాత. 🙂 అసలు ఇదిప్పుడెందుకు గుర్తొచ్చిందంటే….

1Little EarthJohn Muir

మొన్ననొకరోజు మందులు తెచ్చుకుందామని ఇల్లాలితో కలిసి బజారు కెళ్ళేను. అక్కడ మందులకొట్టు ఎదురుగా బట్టల కొట్టువాడు ‘గొప్ప తగ్గింపు ఆఫర్, ఆషాఢమాసం సేల్స్, ఒకటికి ఒకటి ఫ్రీ’ అని అరుస్తున్నాడు మైక్ లో, ‘మూడు చీరలు ఐదు వందలు మాత్రమే, కొద్ది స్టాకు మాత్రమే ఉన్నది, ఆలసించిన ఆశాభంగం,’ అని అరుస్తున్నాడు. ‘ఏంటీ వాడు అలా అరుస్తున్నాడు, ఏంటి కొంటే ఏది ఫ్రీ’ అన్నా. ‘ఒక చీరకొంటే మరొకటి ఫ్రీ’ అంది. ‘వెళదామా’ అన్నా. ‘అటుచూడండి తీర్ధంలా ఉన్నారు జనం, ఇప్పుడొద్దు నడవండి’ అని ఇంటికి చేర్చింది. ఇంటికొస్తే ఇంటి దగ్గరొక గ్లేజ్ పేపర్ మీద ఇదే ప్రకటన కనపడింది. అది చూసి ఇల్లాలికిస్తే ‘చూశాను’ అంది. నాలుగు రోజుల తరవాత పదిగంటలకి బజారుకెళ్ళొస్తామని బయలుదేరారు అత్తా, కోడలూ.’చీరలు కొనుక్కొస్తారా?’ అన్నా. ‘కాదు వాడెలా మోసం చేస్తున్నాడో చూసొస్తాం’ అన్నారు. పన్నెండు గంటలకి తిరిగొచ్చారు,మరేవో కొనుక్కుని. ‘ఏం చీరలు కొనలేదేం’ అంటే వాడు ‘రెండు చీరలఖరీదు ఒక చీరకి చెబుతున్నాడు. ఒకదాని ఖరీదులో సగానికి ఇమ్మన్నాం. అలా ఒక చీర ఇవ్వడట.ఆ చీర ఖరీదు వాడు చెబుతున్నంత చెయ్యదు. తెగ కొనుక్కుపోతున్నారు, వేలం వెర్రిగా.దానికి తోడు పరిమితమైన సరుకు మాత్రమే ఉన్నది అని చెబుతున్నాడు, మైక్ లో దాంతో పిచ్చాళ్ళలా కొనుక్కుపోతున్నారు. వాడి సంవత్సర లాభం అమ్మకం మొత్తం ఈ నెలలోనే జరిగిపోతుంది,’ అంది.మర్నాడెందుకో మళ్ళీ బజారు కెళ్ళేను, అప్పుడూ వాడలాగే అరుస్తున్నాడు. కొట్లో దూరేను, ‘రండి రండి’ అని ఆహ్వానించాడు. తెలిసినవాడేమో ‘ఒరేయ్ టీ పట్రా’ అని అరిచాడు. ‘వద్దు’ అన్నా. కబుర్లలో పడ్డాం, తనపనికి అడ్డులేకుండా. ‘అదేంటీ ఫ్రీ అని అరుస్తున్నాడు తప్పించి అసలైన తెనుగులో ఉచితం అనచ్చుగా’ అని నా భాషాభిమానాన్ని చూపించాను. ‘నిజమేనండి, నేనూ అలాగే చెప్పమన్నా! అలా చెప్పినన్ని రోజులూ జనం కొట్టు గడపతొక్కితే ఒట్టు. ఇప్పుడు ఫ్రీ అని అరుస్తోంటే జనం ఎలా తోసుకుంటున్నారో’ అన్నాడు. ‘లాభం’ అన్నా! ‘సంవత్సరం ఈగలు తోలుకుంటూ, వీళ్ళందరికీ జీతాలిచ్చికుంటూ, కొట్టద్దెలు, వడ్డీలు కట్టుకుంటూ వస్తూ బతకడమెలా చెప్పండి? ఇదిగో ఈ ఆషాఢ, శ్రావణ మాసాలు రక్షిస్తాయి. మీలాటివారు మా బతుకు గుట్టు బయట పెడితే ఎలా’ అన్నాడు. నెమ్మదిగా బయటికొచ్చేసేను.

సిక్కిం లాటరీ టిక్కట్, రేపే గెలుపు పదికోట్ల రూపాయలు, మీదే కావచ్చు, కొద్ది టిక్కట్లు మాత్రమే ఉన్నాయని అదృష్టం పంచిపెట్టే లాటరీ టిక్కట్లు అమ్ముకునేవాడి కేకలు గుర్తొచ్చాయి. ఇప్పుడు లాటరీలు లేవు కదా!

ఇది చదివిన తరవాత మన బ్లాగులలో జరిగే ప్రచారం గురించి ఏమయినా గుర్తొచ్చిందా?

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆలసించిన ఆశాభంగం.

  1. ఆలసించిన ఆశా భంగం !

    ఈ టపా కి ఇంత దాకా కామెంటు రాకపోవడం , నేనే మొట్ట మొట్ట మొదట గా కామెంటడం … చదువరులారా … ఆలసించిన ఆశా భంగం – ఈ ‘భంగ్’ టపా చదవక పోయిన మీరు జీవితం లో అతి ముఖ్యమైన ఇన్ఫో కోల్పోతారు ! వెంట నే విచ్చేయండి !

    ‘కామెంట డానికి ఆలసించిన ఆశా భామ’
    జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s