శర్మ కాలక్షేపంకబుర్లు-పండగనాడూ పాత మొగుడేనా?

పండగనాడూ పాత మొగుడేనా?

kurt orange

wait 4 a moment, u ll see a wonderful waterfall in action

తల్లులంతా నన్ను క్షమించాలి ఈ నానుడి మన తెనుగునాట చాలా విస్తృతంగా వాడతాము. దీని వెనక ఒక ఆచారం ఉంది, ఇప్పటికీ సజీవంగా.

ఒక పల్లెటూరు లో, మకర సంక్రాంతి రోజు, ఊరి అమ్మవారికి జాతర చేస్తారు. ఆ జాతరలో ఆ ఊరిలోని యువ జంటలంతా,అనగా భార్య,భర్తలు పాల్గొంటారు. ఇది ఐఛ్ఛికమే, భార్య, భర్త ఇష్టపడితేనే పాల్గొనవచ్చు, లేదంటే మానేయచ్చు, ఎవరూ బలవంతమూ చెయ్యరు. పగలు సంబరం అయిన తరవాత, రాత్రి ఆ యువ జంటలలో స్త్రీలు తమ రవికెలను అమ్మవారి గుడిలోని ఒక గూనలో వేస్తారు,వాటిని కలిపేస్తారు. ఆ సంబరం లో పాల్గొంటున్న యువజంటలలో మగవారు ఒక్కొకరూ గూనలో చేయిపెట్టి ఒక రవిక తీసుకుని బయటికొస్తారు. అలా ఎవరి చేతికి,ఏ స్త్రీ రవికె వస్తే, ఆ స్త్రీ, ఆ రాత్రి, ఆ పురుషునితో లైంగిక చర్యలో పాల్గొంటుంది. ఇది తప్పుగా భావించరు, ఇది ఆ రోజుకే పరిమితం కూడా.

అలా జరుగుతున్న సందర్భంలొ ఒక పురుషుని చేతికి  రవికె దొరికింది. అదే పుచ్చుకుని బయటకు వచ్చాడు. ఇదెవరిదని విచారిస్తే అది తన భార్యదిగా తెలిసింది. ఆ రవికె తీసుకుని భర్త భార్య దగ్గరకొచ్చాడు,అప్పుడా స్త్రీ పండగ నాడు కూడా పాత మొగుడేనా? అని ఎకసక్కెమాడిందట, . అలా ఈ నానుడి ప్రజలలో ప్రచారంలో ఉంది.

hhbjfaef

ఈ అలవాటు ఇప్పటికీ మన కోస్తా జిల్లాలలో ఒక ఊరిలో అమలు జరుగుతోంది. వారు ఇది అనాచారం గా తలచరు. అదొకరోజు మాత్రమే అలాచేస్తారు.ఈ నానుడి ప్రచారంలో ఉన్నదికాని, ఆచారానికి చారిత్రిక ఆధారాలు లేవు, ఎక్కువ చోట్ల ఉండి ఉండడానికి. చారిత్రలో ఏమున్నది నాకయితే తెలియదు, తెలిసినవారు చెప్పగలరు.

Photos  courtesy:- Owners

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పండగనాడూ పాత మొగుడేనా?

 1. పండగ నాడు పాత మొగుడా ద్వారా సమాజాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు.
  పాత అంటే చీర. అందుకే చింకి పాత అంటుంటారు.
  పండగ నాడు పాత, మొగుడా అని భార్య, భర్తను సంబంధించి చెప్పిన సామెత.

  • అంబాళం పార్థసారథి. గారు,
   ఈ ఆచారం పగోజిల్లాలో ఒక ఊళ్ళో ఉన్నట్టుగా పేపర్లో చదివాను, ఆ తరవాత మీరన్నట్టుగా శ్రీ గరికపాటివారన్నారు. సత్యమే, నేను చెప్పినదే ప్రజలలో ఉన్నది,పాత అంటే బట్ట అనే అర్ధమూ ఉంది.
   ధన్యవాదాలు.

 2. మాస్టారూ.. ముందుగా మీకు మంచి చిత్రం ని పంచినందుకు ధన్యవాదములు. చాలా బావుంది చిత్రం

  ఇక మీరు చెప్పిన సామెత వాడుకలో ఉన్నదే ! ఆచారం అన్నారు. కొన్ని కొండజాతులలో ఈ ఆచారం ఉందని చెప్పుకోవడం విన్నాను.

  ఇకపోతే ప్రస్తుత కాలమాన పరిస్తితులలో నాగరిక కుటుంబాలకి చెందిన జంటలు మూన్ లైట్ డిన్నర్ లలో రవికలు బదులు కారు తాళాలు వేసుకుని భార్యలని మార్చుకుని ఇచ్చాపూర్వక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. భార్య లు కూడా వస్తువులు అయిపోయిన మాయదారి కాలం ఇది. నాగరికత పేరిట అనాగరిక చర్యలు 😦 😦

 3. శర్మ గారూ ,

  నమస్తే .

  ఈ ఆచారం పాశ్చాత్యులది , నేను 40 ఏళ్ళ క్రితం ఓ ఆంగ్ల చిత్రం చూశాను . అది ఓ నిండు పున్నమి నాడు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు . దానివల్ల మనసులలో అణగిమణిగి వున్న కోరికలను తీర్చుకుంటారు . అంటే ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణి మార్పు కోరుకుంటుంది అన్నది అక్షర సత్యం .
  కోరికలను లోలోపలే వుంచుకొంటూ సారీ చంపుకుంటూ బ్రతకటం కన్న ఇలాంటి ఓ చిన్న సర్దుబాటుతో
  తీర్చుకొనటం బెటర్ అనుకొని వుంటారనుకొనటం వల్లనే ఇలాంటివి అమలులోకి వచ్చి వుంటాయి .
  ఇవి మనలాంటి సంస్కృతి వారికి వినటానికే ఏవగింపుగ వుంటాయి .
  పైగా యిలాంటి వాటి వల్ల ఓ కొత్త భావాలతో కూడిన జనరేషన్ పుట్టవచ్చు .( జిలేబీ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను .

  • @ జిలేబిగారు,
   ఆలస్యానికి మన్నించాలి.
   మరో టపా రాసే కామెంట్లు వచ్చాయి, వీలుబట్టి మరొక టపా రాయాలి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s