శర్మ కాలక్షేపంకబుర్లు- (వి)భజన

(వి)భజన

SeljalandsfossIceland

wt u can see waterfall in action if not click on it

చాలా కాలం తరవాత మా సత్తిబాబొచ్చాడు. కూచోమని కుర్చీ చూపిస్తూ, ఇల్లాలికో కేకవేసి కాఫీ కోసం, సత్తిబాబునిలా అడిగాను.

“ఢిల్లీవారు రాష్ట్రాన్ని విభజించేసేరు, మాకు తెలియదు అంటున్నారు,మనసత్తా చూపిద్దామంటున్నారు, బందులంటున్నారు, రాజీనామాలంటున్నారు, ఇక్కడివారు,ఏంటీ గందరగోళం అంతా?” అన్నా.

అందుకు మా సత్తిబాబు “అసలువారికి గందరగోళం లేదండి, అంతా మనకే, అధికార పక్షం వారి మహా నాటకంలో అంతర్నాటకం మహా పసందుగా జరుతోందండి. 2004 ఎన్నికలలో గెలిచేందుకు ఒక భూతాన్ని లేవదీసి ప్రయోగించి నెగ్గేరు, 2009 ఎన్నికలలో ఒక నటుడి చేత పార్టీ పెట్టించి ప్రతిపక్ష వోట్లు చీల్చి గెలిచేరు, మరి నటుడేమో అప్పటిదాకా పడతిట్టిన పార్టీలో,ఆ పార్టీవారిని పంచలూడగొట్టి తంతామన్న పార్టీలో చేరిపోయాడు, తరవాత, ప్రజలనెత్తిన చెంగేసి. మరి 2014 ఎన్నికలలో గెలవాలంటే ఏదో   ఒకటి చెయ్యాలికదండీ!..మొన్నటిదాకా అధికార పక్షానికి, రాబోయే ఎన్నికలలో ఉప్పు పుట్టే యోగం లేదు. విభజించి పాలించమని తెల్లోడు చెప్పిపోయాడు. అదే ఉపయోగంలొ కొచ్చింది, ఇప్పుడు. అరవై ఏళ్ళనుంచి ఉన్న దానిని అడ్డం పెట్టుకుని విభజన చేస్తే, విభజన కొరుకున్నవారు అధికార పక్షాన్ని గెలిపిస్తారు, సగం గెలిచేరు. మిగిలినదానికోసం జరుగుతున్నదే ప్రస్తుత నాటకం. విభజనలో లొసుగులెట్టి చేస్తే, నాయకులెలాగా అక్కడ తోక రెండు కాళ్ళ మధ్య పెట్టుకునే ఉంటారు, భయం లేదు, కాని ఇక్కడికొస్తే ప్రజలూరుకోరే, అందుకు కొన్ని కొర్రీలుంచి విభజన చేస్తే వీరిక్కడకొచ్చి మాకేం తెలియదు, మాకు చెప్పలేదనీ చెప్పుకోవచ్చు, నాలుగు బస్సులూ, నాలుగు రైళ్ళూ తగలబెట్టిన తరవాత,వందలమంది చచ్చిన తరవాత, రాజీనామాల నాటకం రక్తికట్టిస్తే, ఎదుటివాళ్ళనీ లొంగ తీయచ్చు, ఇక్కడి ప్రజలకి కూడా మా ప్రయత్నం మేము చేశాము, ఫలితంలేకపోయిందని చెప్పుకుంటే ఇక్కడ కూడా, మరి గెలవచ్చు కదా! అదీ దింపుడు కళ్ళం ఆశ. ఈ రాజీనామాలు కూడా ఊకపుచ్చుకుని జల్లెడ అడ్డం పెట్టుకుని పెళ్ళాన్ని కొట్టిన కధే కదా! ఒక వేళ మీదు మిక్కిలొస్తే రాష్ట్రపతి పాలనొస్తే గొడవే లేదు. వారిష్టం వచ్చినట్లు చేసేరు, మేము అక్కడికీ ప్రయత్నం చేసేం కదా! మీరు చూసేరు కదా అని బొల్లి ఏడుపులు ఏడవచ్చు. ఇంకా వోపికుంటే, వినేవాళ్ళుంటే, ప్రతి పక్ష కుట్ర అని చెప్పచ్చు, ప్రతి పక్షాన్నీ తిట్టచ్చు, ఇంతకీ, ఇంత చేసినవారిని నోరెత్తి, పన్నెత్తి మాటనలేరు, పార్టీకి రాజీనామాలు చేయలేరు, లోపలుండి సాధిస్తామంటారు.అన్నీ కుళ్ళబెడతారు. . అసలు లేని దగ్గర ముప్పాతిక సంపాదన బాగోలేదా? మరి అబ్బాయి గారికి పట్టాభిషేకం చేయించాలిగా. ఇంకా ఇక్కడికీ సరిపోకపోతే ప్లాన్ బి అమలు చేస్తారు.” అన్నాడు.

“ప్లాన్ బి ఏంటాయ్యా?” అంటే “అవన్నీ ఇప్పుడు చెప్పేవి కాదండీ,” అన్నాడు

“సత్తిబాబూ నాకో అనుమానమయ్యా! వీరంతా మాకేంతెలియదంటున్నారు, వారేమో అందరికి చెప్పేచేసేమంటున్నారు” అంటే

  

1098139_604979132867723_861626052_n

“అదంతేనండి, వారలాగే అంటారు, వీరిలాగే అంటారు.అమ్మ చెప్పినది మాకిష్టమే అని వీరు     భజన చేసేరు , అమ్మ అబ్బాయి పట్టాభిషేకంకోసం విభజన చెప్పింది, వీరికి చెప్పడమూ నిజమే,  వీరు చెప్పలేదన్నదీ నిజమే, చెప్పాల్సిన అవసరం లేదు కనక, నీ ఇష్టం అన్నారు కనక,వారు చెప్పలేదు. . కాకపోయినా! వేలకోట్ల కాంట్రాక్టులు ఎవరికి చేదండీ! రేపు ముఖ్య పట్టణం కట్టుకోడానికి సొమ్మొస్తే ఎవరు బాగుపడతారు? అందుకు, అసలు కావలసినది విభజనే, పట్టాభిషేకానికి సొమ్మూ కూడుతుంది, మళ్ళీ అధికారము దక్కుతుంది. ఇదో నాటకం అంతే. ఇందులో ప్రతిపక్షాలూ తమ పాత్ర పోషించాయి.అందరికీ కావలసినది డబ్బూ, అధికారమూ, ప్రజలే పిచ్చివాళ్ళు,ఒకరి నొకరు తిట్టుకుంటున్నారు అనవసరంగా, నువ్వంటే, నువ్వని.నాయకులు పెట్టిన చిచ్చుకి ప్రజలు బలయిపోతున్నా గమనించుకోటం లేదు.. మరో సంగతి, మనదేశంలో ప్రభుత్వ పక్షం ప్రతి పక్షాన్ని తిడుతుంది.  ప్రతిపక్షం ప్రభుత్వపక్షాన్నీ తిడుతుంది. అంతా మీరు అభివృద్ధి నిరోధకులంటే, మీరు అధికారదాహంతో కొట్టుకుంటున్నారని తెగ రెచ్చిపోయి డోక్కుంటారు. మరో విచిత్రం ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నదే. ప్రతి పక్షం, మరో ప్రతిపక్ష పార్టీని మాత్రమే తిడుతుంది, ప్రభుత్వం చేసిన తప్పులికికూడా! 🙂 మరి అదీ మన దేశ ప్రజాస్వామ్యం!!! (వి)భజన కోసమే ఈపాట్లు”

“నాకో అనుమానమోయ్! అసెంబ్లీలో తీర్మానం చెయ్యం,పార్లమెంట్ లో బిల్లు పాసవదంటునారదేంటీ?”

“బలేవారండి! అసెంబ్లీ తీర్మానాలు రెండున్నాయి, చాలవా? పార్లమెంట్ లో బిల్లా? ఈ పాసవదని చెప్పినవాళ్ళే ఓటేస్తారు చూడండి. అక్కడ అమ్మ (వి)భజనే!”అని చెప్పి కాఫీ తాగి వెళిపోయాడు.

ఏంటో మరికొంత గందరగొళంలో పడేశాడు.

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- (వి)భజన

 1. భజనపరులకి విభజన కష్టాలు ఏమి అర్థమవుతాయిలెండి.

  నా అనుమానం ఏమిటంటే అన్ని పార్టీలలోని బడా నాయకులందరికీ ‘స్క్రిప్ట్’ బాగా తెలుసు. జనాల ముందు నాటకాలాడుతున్నారు అంతే.

 2. ఆహా, ఈ భజన్ గురించి శర్మ గారు ఏమీ రాయటం లేదే అనుకున్నా ! మీరూ బరి లో ‘జారి’ పడ్డా రన్న మాట !

  జై సమైక్యాంధ్ర జై జై సమైక్యాంధ్ర !

  జిలేబి

  • @జిలేబిగారు,
   ఆలస్యానికి మన్నించాలి. ఉన్న మాటకదండీ! నిజంచెప్పడానికి వెనకాడక్కర లేదు కదా!
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s