శర్మ కాలక్షేపంకబుర్లు- స్వాతంత్ర్యం?

స్వాతంత్ర్యం?                         ఎల్లరకూ స్వాతంత్ర్య దినోత్సవ శుభ కామనలు.

flag-1

మానవులంతా పుట్టుకతోనే స్వతంత్రులు, పరతంత్రం పనికిరాదంటారు. నిజమే కాని, నిజంగా పుట్టినప్పటినుంచి మానవులు స్వతంత్రులేనా?

ఏ తల్లితండ్రులకు పుట్టాలో, ఎలా, అనగా ఆడా, మగగా పుట్టాలో మన చేతిలో లేదు. పుట్టిన వెంటనే ఒంటినున్న మురికిని అమ్మమ్మ శుభ్రం చేసి నీళ్ళు పోయాలి. వెచ్చగా గుడ్డలో కప్పి పడుకోబెట్టాలి, తరవాత తల్లి పాలు తాగటం నేర్పాలి. చీమ, దోమ కుడితే చెప్పలేం,ఆకలేస్తోందని చెప్పలేం. ఒకటికి, రెంటికి వెళుతున్నామని చెప్పలేం. ఏదీ మనం చేసుకోలేం. అన్నిటికీ చేతనయిన దొకటే ఏడవటం. తరవాత కూచోడం నేర్పాలి, నుంచోడం నేర్పాలి, నడవటం నేర్పాలి, అన్నం తినటం నేర్పాలి, మాట్లాడటం నేర్పాలి. జంతువులలో పుట్టిన కొద్ది నిమిషాలలో లేచి నిలబడుతుంది, తల్లి పాలు తాగుతుంది, కొద్దికాలం తల్లితో తిరుగుతుంది, ఆ తరవాత స్వతంత్రంగానే బతుకుతుంది. మనమో జీవితాంతం ఎవరో ఒకరి పరతంత్రం లోనే బతుకు ఈడ్చేస్తాం. అక్షరాలు నేర్పి చదువుకోడం నేర్పాలి, ఆఖరికి ఆడుకోడం కూడా నేర్పాలి, ఏదీ స్వతంత్రంగా చేసుకోలేం. ఆ తరవాత ఉద్యోగం లో చేరితే పని చేయడం నేర్పాలి, ఇతరులతో మంచిగా మాటాడటం నేర్చుకోవాలి. సొమ్ము సంపాదన, దాచుకోడం నేర్చుకోవాలి. ఆఖరికి జీవిత భాగస్వామిని ఎన్నుకోడం కూడా ఇతరులను చూసి నేర్చుకోవాలి. బతకడం నేర్చుకోవాలి. పిల్లల్ని కని పెంచడం నేర్చుకోవాలి 🙂 . అలా పెంచి పెద్ద చేసిన పిల్లలు ముసలితనంలో చూడకపోతే చచ్చేదాకా బతకడం నేర్చుకోవాలి. 😦 జీవితానికి కావలసిన సర్వస్వం ఇతరులెవరో సమకూర్చాలి. ఇలా బతుకంతా అస్వతంత్రమే.

nicereflection

pl wait u can see rain drops showering.

జీవితంలో ఇష్టమయినట్లు బతికే సావకాశమే కనపడదు. మొదటి చూపులోనే భార్య/భర్తను నిర్ణయించుకోవాలి, వారు జీవితం లో, సగంలో, నువ్వంటే ఇష్టం లేదని, ఆడపిల్లను కన్నావని వదిలేస్తే/ వదిలేసిపోతే మొండిగా బతకడం నేర్చుకోవాలి, పిల్లలకోసం, అన్నికోరికలూ వదులుకుని. ఇంతటి అస్వతంత్రులమైన మనం నిత్యమూ సర్వతంత్రస్వతంత్ర చక్రవర్తి, సమస్త ప్రాణి, అప్రాణికోటికి ఈశ్వరుణ్ణి ప్రార్థించడానికి నిత్యమూ ‘భరతవర్షే భరతఖండే’ అని చెబుతాం, సంకల్పంలో.

ఈ భరతవర్షం, ఇప్పటి ఇరాన్, ఇరాక్ నుంచి ఆస్ట్రేలియా దాకా ఉండేది. అందులో భరత ఖండం మూడుపక్కల నీరు నాలుగవ పక్క పెట్టని కోట ఉత్తరాన హీమాలయాలు హద్దులుగా ఉన్నదానిని ఎంతమందో ఆక్రమించారు. ఇక్కడివారి భీరత్వం మూలానా? కాదు. ఒక రాజు పరిపాలన చేస్తుంటే, అతనిపైనున్న ఈర్ష్యతో, పక్క రాజు, దేశం పై దండెత్తివచ్చిన వారికి సాయపడట మూలంగా విభజించి గెలుచుకున్నారు, చివరికి ఆంగ్లేయులతో సహా. అవసరం లేని చోట దయ చూపడం, దేశాన్ని ఆక్రమించుకున్న వారిపట్ల కూడా స్నేహం చూపడం, అతి మంచితనం,స్వార్ధం,  చరిత్రలో కనపడే తప్పిదాలు. అరవైఅయిదు సంవత్సరాల కితం మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు, అదెంత నిజం? మీకు నచ్చిన వాణ్ణి చట్ట సభకు ఎన్నుకోలేరు, పార్టీలు అభ్యర్ధులుగా నిలబెట్టిన వారిలో ఎక్కువమంది ,  గూండాలు,హత్యలు మాన భంగాలూ చేసిన వారు,లంచగొండులు, డబ్బున్నవారే, వారిలోనే ఒకరిని ఎన్నుకుంటున్నారు ప్రజలు, ఇది నిజమైన స్వాతంత్ర్యమా? తెల్ల దొంగలు పోయి నల్ల దొంగలొచ్చారంతే తేడా, పాలకులిగా.   సామాన్య మానవుని బతుకులో తేడా రాలేదు. దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటున్నారు, దోపిడికి.

1

పరిపాలకులు ఒక చట్టం చేశారు, ప్రభుత్వ సహాయం పొందినవారంతా తమ తమ విషయాలలో గోప్యత పనికి రాదని, అదే సమాచార హక్కు చట్టం. ఒకరెవరో ఒక రాజకీయ పక్షాన్ని వారి రాబడి ఖర్చుల వివరాలడిగారు, స.హ చట్టం కింద. ‘అదెలా ఇస్తాం కుదరద’న్నారు. అప్పీలు లో స.హ లో అత్యున్నతమైన వారు ‘ఇచ్చి తీరాల్సిందే’ అన్నారు. దానిమీద ప్రభుత్వం అప్పీలుకు వెళ్ళచ్చు, కాని పాలకులేం చేస్తున్నారు. కొన్ని రాజకీయ పక్షాలను సమాచార హక్కు చట్టం నుంచి,మినహాయిస్తూ ఏకంగా చట్టానికి మార్పు చేసేస్తున్నారు.

అలాగే పోలీస్/న్యాయ పరిధిలో అరస్టయిన వారు ప్రజాప్రతినిధులుగా పోటీ చేయడానికి వీలులేదని సుప్రీం కోర్ట్ రూలింగ్ ఇచ్చింది. ప్రభుత్వం, ప్రతి పక్షాలు అన్నీ కూడా దీనిని వ్యతిరేకిస్తూ చట్టం చేస్తున్నాయి. ఇది ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా జరుగుతోంది.

దీనిని అడ్డుకునే స్వాతంత్ర్యం మనకు లేదు, నిజంగా మనం స్వతంత్రులమేనా? పాలకులకొక చట్టం పాలితులకొక చట్టమా? ఆలోచించండి.ఈ చట్ట సవరణను మరే ఇతర రాజకీయ పక్షమూ వ్యతిరేకించటం లేదు. అందరూ ఆ తానులో ముక్కలే 🙂 ఇదీ మన స్వాతంత్రం…….మన స్వాతంత్ర్యం ఒక పెద్ద పూర్వానుస్వారం, అది నేతిబీరలో నెయ్యి చందం.

నిజమే చెబుతున్నా! మరో స్వాతంత్ర్య సమరానికి సిద్ధంకండి.

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- స్వాతంత్ర్యం?

 1. యువత ఎక్కువున్నదేశం మనదేకదా అయితే యువత యువతరాన్నే ఎన్నికలలో ఎన్నుకోవాలి!వయస్సు మళ్ళిన ఎముకలు కుళ్ళిన సోమరులారా చావండి -అని శ్రీశ్రీ అన్నట్లు చేతులు వణకుతున్నా కళ్ళు కనిపించకున్నా పీటాలు పట్టుకు వేలాడుతున్నవారి పీచమణచి ఎన్నికలలో కణకణ మండే శక్తులు నిండే యువతను ఎన్నుకొని చూడండి!నేరనేపధ్యం ఉన్నవాళ్ళకు ససేమిరా వోటు వేయకండి!జైల్లో ఊచలు లెక్కపెడుతున్న నేర ఆరోపితులు పెట్టిన పార్టీ అభ్యర్తులను శాసనసభలకు ఎందుకు పంపుతారు?వారు మచ్చ లేని సచ్చరిత్రులుగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చేదాకా వేచిచూడండి! తొందరపడి వోటు వేయకండి!వోటు ఒక బ్రహ్మాస్త్రం!నేను ఏ రాజకీయ పక్ష సమర్తకుడను కాను!సప్తతి చేసుకోబోయే వాడిని!

  • @మిత్రులు ఎ.సూర్యప్రకాశ్ గారు,
   చాలా మంచి ప్రశ్నలు లేవనెత్తేరు, వీటిని చర్చిస్తూ ఒక టపా రాయాలని ఉంది. అమ్మ కరుణ, మీ దయ ఉండాలి. యువత రావాలి నమో నమః
   ధన్యవాదాలు

 2. శర్మ గారూ ,

  నమస్తే ,

  నిజంగా మనము చిన్ననాటినుంచి , చివరి క్షణం వరకు అస్వతంత్రులమే .
  జంతువుల గురించి చెప్తూ , వాటికి స్వతంత్రం వున్నదన్నారు . నిజమే వాటి ఆయుః పరిమాణం బహు తక్కువ కదా! అలా బ్రతుకుతున్న వాటి స్వతంత్రాన్ని హరించివేయాలని , వాటినీ మనలా అస్వతంత్రుల్ని చేయాలని తమ ప్రయత్నాలు తాము చేస్తూనే వున్నారుగా .
  మన స్వాతంత్ర్యం ఒక పెద్ద పూర్వానుస్వారం, అది నేతిబీరలో నెయ్యి చందం.
  నిజమే చెబుతున్నా! మరో స్వాతంత్ర్య సమరానికి సిద్ధంకండి.
  ఇది చాలా అవసరమైనది అనటం కంటే అత్యవసరమైన నిత్యావసరమైనది . మీలాంటి పెద్దలు ముందు యువతరాన్ని మార్గదర్శకత్వం చేస్తే కనీసం కొన్నేళ్ళ పిమ్మటైనా మేం స్వతంత్రులం అని ధైర్యంగా చెప్పగలరు .

 3. మనస్వాతంత్ర్యంమేడిపండు!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!.మన దారిద్ర్యం రాచపుండు!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!కవిగారి మాటలు నాకు ఎప్పుడూ గుర్తొస్తాయి!

 4. శర్మ గారు,

  మరో స్వాతంత్ర్య సమరానికి సిద్ధంకండి అంటున్నారు !

  కొంప దీసి మీరూ ఇవ్వాళ జిలేబీ పార్టీ ఏమైనా కొత్త గా పెట్టేసేరా !

  శుభాకాంక్షలు !

  Despite of all these anomalies, contradictions, corruption still India is moving ahead !

  The Indian youth is now the world’s youth.

  Say cheers to India on her old age pension days.

  A counter to the ‘వార్ధక్య’ ramblings can be done by the youth of India !

  నవ భారత నిర్మాణం లో యువ భారతం మరో మారు పిలుపు నందు కుంటుందని ఆశిస్తూ ..

  జై భారతః !
  జిలేబి

  • @జిలేబి గారు,
   డబ్బుంటే పార్టీ పెట్టి పది మందిని గెలిపించుకుని అమ్మేసుకుని మంచి సొమ్ము చేసుకోడం, మంచి వ్యాపార లక్షణం. ఇప్పుడు బాగున్న మంచి వ్యాపరమదే!
   ప్రపంచ దేశాలలో యువత ఎక్కువగా ఉన్న దేశం మనదే. కాని ఆ యువత ఉత్సాహాన్ని,ఉత్పాదకతని ప్రభుత్వం మట్టి పాలు చేస్తే, స్వార్ధపరులు నీచులు అందలాలెక్కితే, ఇదంతా వ్యర్ధమయిపోతుంది. యువత దేశాలు పట్టిపోతోంది. డబ్బొకటే సర్వస్వంకాదని మీకూ తెలుసుకదా!
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s