శర్మ కాలక్షేపంకబుర్లు-వానర సేన?-(500 వ టపా)

 వానర సేన?                                                                  ( 501 post )

subrahmanya

రామాయణం లో సంఖ్యా మానం

శతం శతసహస్రాణాం కోటిమాహుర్మనీషణః
శతం కోటిసహస్రాణాం శంఖ ఇత్యభిధీయతే.          రామా..యు.కాం…సర్గ..28..33

శతం శంఖసహస్రాణాం మాహాశంఖ ఇతి స్మ్రతః
మహా శంఖసహస్రాణాం శతం బృందమితిస్మ్రతమ్.   రామా..యు.కాం…సర్గ..28..34

శత బృందసహస్రాణాం మహాబౄందమితి స్మ్రతమ్
మహాబృందసహస్రాణాం శతం పద్మమితిస్మ్రతమ్.    రామా..యు.కాం…సర్గ..28..35

శతం పద్మసహస్రాణాం మహాపద్మమితిస్మ్రతమ్
మహాపద్మసహస్రాణాం శతం ఖర్వమిహోచ్యతే     రామా..యు.కాం…సర్గ..28..36

శతం ఖర్వసహస్రాణాం మహాఖర్వమిహోచ్యతే
మహాఖర్వ సహస్రాణాం సముద్రమ్ అభిభీయతే    రామా..యు.కాం…సర్గ..28..37

శతం సముద్రసాహస్రమ్ ఓఘ ఇత్యభీభీయతే
శతమోఘసహస్రాణాం మహోఘ ఇతి విశ్రుతః      రామా..యు.కాం…సర్గ..28..38

అర్థం
నూరు లక్షలు ఒక కోటి.లక్షకోట్లు ఒక శంఖము. లక్ష శంఖములు మహాశంఖము.లక్షమహాశంఖములు ఒక బృందము. లక్ష బృందములు ఒక మహాబృందము.లక్షమహాబృందములు ఒక పద్మము. లక్షపద్మములు ఒక మహాపద్మము. లక్ష మహాపద్మములు ఒక ఖర్వము. లక్ష ఖర్వములు ఒక మహా ఖర్వము. లక్షమహాఖర్వములు ఒక సముద్రము.లక్ష సముద్రములు ఒక ఓఘము.లక్ష ఓఘములు మహౌఘము.

ఒకటి1=1

పది10=101

నూరు లేక వంద 100=102

వెయ్యి1000=103

లక్ష100,000=105

కోటి10,000,000= 107

కోటి102X105=107

లక్ష Xకోటి=105X107=1012   శంఖము

లక్ష X  శంఖము= 105X1012=1017 మహా శంఖము

లక్ష X మహా శంఖము=105X1017=1022బృందము

లక్ష X బృందము=105X1022=1027మహాబృందము

లక్ష Xమహాబృందము=105X 1027=1032పద్మము

లక్ష Xపద్మము=105X 1032=1037మహా పద్మము

లక్ష Xమహాపద్మము=105X 1037=1042ఖర్వము

లక్ష Xఖర్వము=105X 1042=1047మహా ఖర్వము

లక్ష Xమహా ఖర్వము=105X 1047=1052సముద్రము

లక్ష Xసముద్రము=105X 1052=1057ఓఘము

లక్ష Xఓఘము=105X 1057=1062మహౌఘము

  ——————————————————————————————–

ఇప్పటి వరకు సంఖ్యామానం చెప్పేరు. ఇక ముందు వానరసేన ఎలా ఉన్నది చెప్పేరు వాల్మీకి మహముని.

ఏవంకోటి సహస్రేణ శంఖానం శతేన చ
మహాశంఖసహస్రేణ తథా బృందశతేన చ…39

మహాబృందసహస్రేణ తథ పద్మశతేన చ
మహాపద్మసహస్రేణ తథా ఖర్వ శతేన చ..40

సముద్రేణ శతేనైవ మహౌఘేన తధైవ చ

ఏష కోటిమహౌఘ్హేన సముద్రసద్శేన చ..41

వేయికోట్లు,నూరుశంఖములు,వేయిమహాశంఖములు,వంద బృందములు,వేయి మహాబృందములు,వంద పద్మములు,వేయి మహాపద్మములు,వందఖర్వములు,నూరు సముద్రములు,వందమహౌఘములు,, కోటి మహౌఘములు-ఇట్లు ఒక మహాసముద్రమువలె అసంఖ్యాకములైన వానరులతోకూడి ఉన్నది. 

 వేయి కోట్లు 103x107 =1010

నూరు శంఖాలు102x1012=1014

వేయి మహాశంఖాలు103x1014=1017

వంద బృందములు102X1022=1024

వేయి మహా బృమ్దాలు103X1027=1030

వంద పద్మాలు102X1032=1034

వేయి మహా పద్మాలు103X1037=1040

వంద ఖర్వాలు 102X1042=1044

నురు సముద్రాలు102X1052=1054

వంద మహౌఘలు102X1062=1064

కొటి మహౌఘాలు 107X1062=1069

 

[1010+1014+1017+1024+1030+1034+1040+1044+1054+1064+1069]

baisakhi mother temple Indonesia

Photos Courtesy:- From a friend by mail

వీటిని విడతీసివేసి కలపడం నావల్లకాలేదు, మీరేమయినా ప్రయత్నం చేయండి.

                  


 

ప్రకటనలు

21 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వానర సేన?-(500 వ టపా)

 1. అయ్య బాబొయ్ , అన్ని కోతులే,
  జనాభా లెక్కలే లేవు కదండీ,
  కోతుల నెవరు లెక్కెట్టారండీ?
  ఒక్క కోతి లంకను తగలెట్టేసింది కదండీ
  మరన్ని కోతులెందుకండీ?

  • @మిత్రులు మోహన్జీ,
   వాల్మీకి కోతుల లెక్క చెప్పేరండి. అందుకే శ్లోకాలు కూడా పెట్టేను. 🙂 రాముడు మానవుడినని చెప్పి కదండీ యుద్ధం చేసేడు, అందుకు అన్ని కోతులవసరమయ్యాయి, హనుమ ఒకడే సరిపోయినా. లంకను రెండు సార్లు తగలపెట్టేరు! ఒక సారి కాదు ! నిజం.
   అమ్మ దయ మీ అభిమాన రూపంలో నా పట్ల ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూ
   ధన్యవాదాలు

 2. అభినందనలు, మీకు , అయిదు వందలకు,
  కొన సాగించండి, మీ టపా యజ్ఞం, అనేక వేలకు !
  కనువిప్పు కావాలి, మీ టపాలు, అవినీతి ‘మందల’ కు !
  శాంతీ సుఖాలు కలిగించాలి, మన తెలుగు నేలకు !

  • @మిత్రులు సుధాకర్జీ,
   సుధాకరుడు అంటే అమృతం చిలికేవాడు కదూ! అంటే చంద్రుడు, మీ అభిమానం చంద్రుని వెన్నెలంత హాయిగా ఉంది.
   ధన్యవాదాలు

  • @మిత్రులు బోనగిరి గారు,
   అబ్బ! మీ కామెంట్లే టపా హెడ్డింగులండీ బాబూ! అదీ మీ అభిమానం,” మనం రాస్తే….” 🙂 మీ అభిమానం నా పట్ల ఇలాగే ఉండాలని కోరుకుంటూ ….
   ధన్యవాదాలు

 3. శర్మ గారూ మీ అర్ధ సహస్ర టపాలకు నమస్సులు ..అభినందనలు …మీరిలాగే మరిన్ని టపాలతో మమ్మల్ని అలరిస్తారని ఆకాంక్షిస్తూ… @శ్రీ

  • @శ్రీనివాస్ జీ,
   మీ అభిమానానికి కృతజ్ఞత.అమ్మ చేయిస్తే అదెంత? “పంగుం లఘయతే గిరిం” అన్నారు శంకరులు.
   ధన్యవాదాలు

 4. సరేనండీ

  10^10
  10000000000
  . + 10^14
  100010000000000
  . + 10^17
  100100010000000000
  . + 10^24
  1000000100100010000000000
  . + 10^30
  1000001000000100100010000000000
  . + 10^34
  10001000001000000100100010000000000
  . + 10^40
  10000010001000001000000100100010000000000
  . + 10^44
  100010000010001000001000000100100010000000000
  . + 10^54
  1000000000100010000010001000001000000100100010000000000
  . + 10^64
  10000000001000000000100010000010001000001000000100100010000000000
  . + 10^69
  1000010000000001000000000100010000010001000001000000100100010000000000

  అదండీ చివరికి తేలిన సంఖ్య!

  • @మిత్రులు శ్యామల రావుగారు,
   నిజంగా చాలా కష్టపడ్డారు. నేను సున్నాలు పెట్టి, వాటిలెక్క తప్పి విసుగొచ్చి వదిలేశాను. ఈ టపా రాయడానికి ఒక నెల సమయం తీసుకుంది 🙂
   ధన్యవాదాలు

   • అబ్బే, కష్టం గిష్టం ఏమీ లేదండి నాకు. నేను చూపింది కంప్యూటరు మీద చేసిన గణితం.
    ఇది చెయ్యటానికి మహా అయితే మాన్యువల్ ఇంటరాక్షన్ తో కలిపి కొన్ని సెకన్లు పట్టిందండీ అంతే.
    ఇలాంటి లెక్కలు కాగితం కలం పుచ్చుకుని చేస్తే సరిగా కుదరవు.

   • @శ్యామలరావుగారు,
    నాకెందుకో కంప్యూటర్ మీద కుదరలేదు, కాగితం మీద కూడా. 🙂
    ధన్యవాదాలు.

 5. శర్మ గారు,

  శుభాభినందనలు !

  నరముల కదలిక లో ఐదు వందల టపా ‘రమ్ముల’ ఆవిష్కరించడం మీకే చెల్లు !

  పై పెచ్చు, కోట్ల లో కోతుల గురించి లెక్ఖ చెప్పడమున్నూ !

  డాట్ కాం ల లో వర్డు ని వరద లా ప్రవహింప జేసిన దీక్షితుల గారికి శుభా (డాట్) కాం క్షల తో !

  చీర్స్
  జిలేబి

  • @జిలేబిగారు,
   మీ అభిమానానికి కృతజ్ఞత, అమ్మ మీరూపంలో ప్రోత్సహించి నాచేత అన్ని రాయించిందేమో!
   నిజంగా ఈ టపాకి కష్టపడ్డాను. మొదటగా ఒకటి పక్క సున్నాలు పెట్టుకుంటూ వచ్చాను. ఊహు! కుదరలేదు, ఎక్కడో లెక్క తప్పుతోంది, ప్రతి సారి. ఇప్పుడు పవర్ లో చెప్పాలనుకున్నాను. కుదరలేదు. అప్పుడు వర్డ్ లో, పవర్లో చేసి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేను. నిజం, కష్టం బాగా గుర్తించారు. మరి మనవారికి అంత పెద్ద సంఖ్యకి పేరు తెలుసు 🙂
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s