శర్మ కాలక్షేపంకబుర్లు-హన్నా! మిమ్మల్ని వదిలిపెడతానా?

హన్నా! మిమ్మల్ని వదిలిపెడతానా?DSCN3720

“హన్నా! మిమ్మల్ని వదిలిపెడతానా? వెంపాటారి దయ్యంలా పట్టుకోనూ?? ” అంటే “తాతా! వెంపాటారి దయ్యం కధ చెప్పవా?” అంది గడుగ్గాయి మనవరాలు.

అనగనగా ఒక పల్లెటూరు, ఆ వూళ్ళో “వెంపాటి” అనే ఇంటి పేరున్న ఒక పెద్ద కుటుంబం, ఒక పెద్ద ఇంట్లో ఉండేది. ఆ ఇంట్లో ఒక దయ్యం కూడా ఉండేది. ఆ దయ్యం ఎవరినీ ఏమీ అనేదికాదు, ఏమీ చేసేది కాదు, కాని “ఒరేయ్! పశువులు ఆరుస్తున్నాయి మేతెయ్యండిరా!మీరు తిని పడుకోడం కాదు!”, “ఒసేయ్ లచ్చమ్మా! వంటింటి తలుపులు వెయ్యలేదే! కుక్క దూరుతుంది,కుక్క ముట్టిన కూడెడతావా? అందరికీ! సిగ్గులేనిదానా!”  “వర్షం వచ్చేలా ఉందర్రా! దొడ్లో ఆరేసిన బట్టలు తీసుకోరూ?”  “ఒరేయ్! అందరూ పడి నిద్దర్లోతున్నారు, వీధి తలుపులు బార్లా    తీసుకుని,  దొంగ దూరడూ ?”   “సత్తెమ్మా! పాల దాలి దిగిపోయింది, చూసుకో!” “ఒరేయ్! దొగమొహం వెధవా!! సత్తిగా!!! దొడ్లో కొబ్బరి చెట్టు కాయలెవడో తీసుకుపోతున్నాడురా! నిద్ర మొహం సన్నాసి, లే! నిద్దరోడం కాదు””ఒరేయ్! వెర్రి వెధవా! క, ఖ లకి తేడా తెలీదురా! స,శ,ష,చ లకి తేడా తెలీని మలప సన్నాసి, తెనుగు జాగ్రత్తగా చదువుకో!”  ఇలా కాల్చుకు తినేది, మరచిపోయిన, చేయవలసిన పనులు గుర్తు చేస్తూ. ఇది ఇంటివాళ్ళందరికీ చిరాకు,బాధ, కలిగించేది. ఒక రోజు అంతా సమావేశమయి “ఈ దయ్యం బాధ భరించలేకున్నాం, ప్రతి దానికి ఛంపుతోంది, కేకలేసి, అంచేత గుట్టు చప్పుడు కాకుండా ‘ఇల్లు ఖాళీ చేసి వెళిపోదా’మనే” నిర్ణయానికి వచ్చి ఒక రోజు ఇల్లు ఖాళీ చేసి వెళిపోయారు, సామానుతొ సహా. కొత్త ఇంట్లోకి మారి అంతా హాయిగా నిద్ర పోతుండగా, ఒక్క సారి ఒక అరుపు వినిపించింది, ‘ధబీ’ మనే శబ్దంతో. ఇంట్లో వాళ్ళంతా లేచేరు,  చూస్తే తాము పాత ఇంట్లో, బరువుగా ఉందని వదలేసి వచ్చిన రుబ్బురోలు, మండువాలోపడివుంది. దానితో పాటు మాట వినపడింది, “మీ మొహాలు మండ! ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు చూసుకోవద్దూ! బంగారంలాటి రుబ్బురోలూ, పొత్రం వదిలేసి వచ్చారని పట్టుకొచ్చా”నంది,వెంపాటారి దయ్యం. ఈ మాటలు విన్న ఇంటిపెద్ద, అబ్బా! మనం ఇల్లు ఖాళీ చేసి వచ్చినా, మనలని వదిలేలా లేదు ఈ దయ్యం! మన మంచికే చెబుతోందనుకుని, తమ తప్పు తెలుసుకుని, ఇంకెప్పుడూ దయ్యాన్ని ఏమీ అనుకోమని చెప్పి, పాత ఇంటికే వెళిపోయారట. అప్పటినుంచి దయ్యం మామూలు గానే వాళ్ళు మరచిపోయిన ప్రతీదీ గుర్తు చేస్తూ వచ్చింది. అల్లా వదలిపెట్టకుండా వేధించే వారిని, మంచి చేసేవారయినా “వెంపాటారి దయ్యంలా వదిలేలాలేవ”ని, అనే నానుడి ఉంది. ఇప్పుడు ఇళ్ళలో పెద్దాళ్ళెవరేనా, ఇలా చెబుతోంటే వెంపాటారి దయ్యంలా వదిలేలా లేవనటం మామూలైపోయింది.

DSCN3729

           “తాతా! ఉండగా ఉండగా నీకు మతిపోతోంది, కిందటి టపా బంద్ కీ, వెంపాటారి దయ్యానికి, ఈ ఫోటోకి, సంబంధం ఉందా? బోడిగుండుకి బొటనవేలుకి ముడెలా వేస్తావు?” అంది. గత ఇరవైరోజుల పైగా స్కూళ్ళు బంద్, కాలేజిలు బంద్, ఆఫీసులు బంద్,టీ.వీ బంద్,  బస్సులు, ఆటోలూ బంద్, నా తలకాయ కూడా బందయిపోయింది. బంద్ మూలంగా,  పిల్లలు క్రికెట్ ఆడటం మొదలెట్టేరు, ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో, ఉదయం నుంచి రాత్రి దాకా, అలా ఆడుతుండగా, ఒక సారి ఆ క్రికెట్ బాల్ వచ్చి నా ఎడమ మోచేతి పైన తగిలింది, విసురుగా, రాయిలాగా, చెయ్యి వాచిపోయింది. అదుగో ఆప్పుడు కేకలేసి , ఇలా పట్టుకున్నా కెమేరాలో!  ” హన్నా! మిమ్మల్ని వదిలిపెడతానా?” అని. ఇక బంద్ అని వాచిపోయిన చేత్తో రాయలేక, “బంద్” అని టపా వేస్తే,  ప్రతిస్పందించారు, ముచ్చటగా. ఒకరేమో అయ్యో! మానేస్తున్నారా? రాయడం అన్నారు, మరొకరు అనుమానం వెలిబుచ్చారు, మరొకరు,అమ్మయ్య! ఒక  వికెట్ పడిపోయిందనమాట! అన్నారు, మరొకరు వీలు చూసుకుని తలపుల తలుపులు తీయమన్నారు.మరొకరు నాకు సంఘీభావం ప్రకటించారు, మోచేతి వాపు, నెప్పి తగ్గింది.  “హన్నా! మిమ్మల్ని వదిలిపెడతానా?, వదలిపెట్టను, వెంపాటారి దయ్యం లా, వయసు వజ్రోత్సవం పూర్తి అయినా వదలిపెట్టను….:)నాకీ విషయంలో మా మాలతీ అక్క ఆదర్శం, నిన్న కాలం చేసిన అక్క ఆత్మ శాంతికి  అశ్రుతర్పణం.          

“తాతా! బోడిగుండుకీ బొటనివేలుకీ బలే ముడెట్టేవు సుమా!”  అని పరుగెట్టుకుని అమ్మమ్మ దగ్గరకెళిపోయింది, గడుగ్గాయి మనవరాలు..                    

Yosemite

Courtesy:-Owner of the photo Dan probert. location not specified

ప్రకటనలు

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-హన్నా! మిమ్మల్ని వదిలిపెడతానా?

 1. క్రింద ఉన్న జలపాతం లా ఉన్నారు చిన్నారులు , పైన, స్వచ్ఛ మైన చిరునవ్వులతో ! మంచి కాంబినేషన్ చిత్రాలను టపాలో ఉంచారు !

  • @సుధాకర్జీ,
   వీళ్ళు పిల్లలు కాదండి పిడుగులు,అల్లరిలో దిట్టలు, నిజంగా జలపాతం లాటివారే.
   ధన్యవాదాలు.

  • @అనామికగారు,
   దెబ్బ తగిలింది కనకే దయ్యం కధ బయటికొచ్చింది, లేకపోతే రాదుగా, నచ్చినందుకు
   ధన్యవాదాలు.

 2. హమ్మయ్య శర్మ గారు,

  బందు బందు అంటే ఎదో అనుకున్నా ఇది ‘పందు’ దెబ్బా !

  మా అరవం లో పందు అంటే బంతి !

  మొత్తం మీద మోచేతి మీద పడ్డ బంతి వెంపాటి వారి దెయ్యం దాకా కథ లాక్కొచ్చిందంటే ఇది నిజం గా మంచి బందే !!

  శుభాకాంక్షలు మీరు అతి త్వరగా కోలుకుని ‘టపాలు మణి’ లోకములో మళ్ళీ పడ్డందు ల కు !

  జిలేబి

  • @జ్లేబిగారు,
   అరవంలో పందు అంటే బంతి అని అర్ధమా? అన్నట్టు అడగడం మరిచాను, తెనుగునాట పుట్టి పెరిగి అయ్యరు గారిని చేసుకున్నంతలో “మా అరవం” అయిపోయిందా? బంద్ నచ్చినందుకు, దెయ్యంకధకు
   ధన్యవాదాలు.

  • @పద్మగారు,
   మా డాక్టర్ గారు చాలా మంచివాడు. ఇదేంటండీ చిన్నపిల్లల్లా దెబ్బతగుల్చుకున్నారూ? అన్నారు. కధంతా చెప్పేను. మంచి మందిచ్చారు,నాలుగురోజుల్లో బాగుంది.దెబ్బ పెద్దది కాకపోడం అదృష్టం. గోడకి తగిలిన బంతి తిరిగొచ్చి నన్ను తాకింది. Last pic courtesy of Dan probert, good pic. Thank u 4 ur appreciation of my selection.
   ధన్యవాదాలు.

 3. నమస్కారం। శర్మ గారు .నేననుకున్నట్లుగానే మీరు త్వరగా బంద్ విరమించినందుకు సంతోషమండీ!టపాలో నా వ్యాఖ్యను ప్రస్తావించారు, ఇంకా సంతోషం .

  • శ్యామలీయం వారూ,

   మంచి ఐడియా !

   ఒక దెయ్యం కథల బ్లాగు ఓపెన్ చేసెయ్యండి !(పేరు: ఆ రాత్రి ఏమయ్యిందంటే …. బ్లాగు పేరు బాగుందంటే ఓ కామెంటు కాణీ పడెయ్యండి మరి !)

   మీకు ఆ బ్లాగు కి వీక్షకులు ఒక నెలలో లక్ష దాట కుంటే నా పేరు త్రిప్పి పెట్టేసు కుంటా బీ లేజీ అని !!

   చీర్స్
   జిలేబి

   • @జిలేబి గారు,
    ప్రతిజ్ఞలు చేసెయ్యద్దు. చాలా మంది ప్రతిజ్ఞలు నిలబెట్టుకోవలసివచ్చేలా వుంది, నేటి పరిస్థితి. ఏమంటారు?
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s