శర్మ కాలక్షేపంకబుర్లు-Life’s Like That (జీవితం అలా ఉంది.)

 జీవితం అలా ఉంది.

పళ్ళుతోముకోవడం గురించి కూడా వేదం చెప్పింది. పళ్ళుతోముకోడానికి ఉత్తరేణి, వేప శ్రేష్టం, ఆ తరవాత మిగిలిన చెట్టు పుల్లలు. పుల్లని నమలాలి చివర కుచ్చులా చేయాలి. దానితో పళ్ళు చిగుళ్ళూ సున్నితంగా రుద్దాలి. ఆ తరవాత ఆ పుల్లను మధ్యకు చీల్చి ఒక బద్దను మడిచి నాలుకనున్న పాచిని గీయాలి. చక్కగా వచ్చేస్తుంది. ఒక వేళ అది సరిపోకపోతే రెండవ బద్ద వాడాలి. వాటిని పారేసి ముఖప్రఖాళన చేయాలి. గండూషించాలి. ఆ ఆ ( కంగారు పడకండి. గండూషించడమంటే నీళ్ళు నోట్లో పోసుకుని గరగర లాడించి గొంతునుంచి శుభ్రం చేసి ఉమ్మెయ్యాలి. అక్కడికి ముఖ ప్రఖాళన అయింది కదా! పుల్ల వాడకం తో పళ్ళకి ఎక్సరుసైజు, అదీకాక వేప, ఉత్తరేణి పుల్లలనుండి వచ్చేరసం జీర్ణాశయంలో కి పోయి మంచి చేస్తుంది. చిగుళ్ళని రుద్దటం మూలంగా పళ్ళు గట్టిపడతాయి. నాకిప్పుడు ఊడిపోయాయి  74 ఏళ్ళకి లేకపోతే 30 కే ఊడిపోతాయి :). అదెలాగా చేయలేరు కాని వాడే టూత్ పేస్ట్ సంగతేనా చూడండి.

Awareness on selection of  toothpaste… !

Pay attention when buying toothpaste
At the bottom of the toothpaste tube there is a color bar. 

tooth paste

And now I knowthe meaning of the color bar!


Try to choose green and blue

there are four kinds:

Green:  Natural;
Blue   :  Natural + Medicine;
Red    :  Natural + Chemical composition;
Black  :  pure chemical

original (1)

Life’s Like That                       అలా వుంది జీవితం

Big house   Small Family
More degrees Less common Sense
Advanced medicine Poor Health
Landed on Moon Neighbours Unknown
High income Less peace of Mind
High IQ Less Emotions
Abundant knowledge Less Wisdom
Lots of Humour Less Humanity
Costly Watches But no Time

original (3)

Courtesy:- From a friend by mail

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-Life’s Like That (జీవితం అలా ఉంది.)

 1. శర్మ గారూ ,

  నమస్తే ,

  అందరి నోళ్ళలో నానకు అన్నారే గాని , నీ నోటిలో పుల్లను నానిస్తే గదా , మెత్తబడి నమిలే అవకాశాన్ని మనకు కల్గించి మన దంతాలకు వ్యాయామం , మరుగున పడిపోయి దాగి బయటకు రా(లే)ని వ్య్ర్ధ పదార్ధాల పీచుని బయటకు నెట్టేయగల సామర్ధ్యం మన దంతాలకు లభిస్తుంది .
  కనుక జీ = గ్రీన్ ( నేచురల్ ), బీ = బ్లూ ( నేచురల్ + మెడిసిన్ ) ఎల్లప్పుడు మంచిది అనుకుంటున్నాను . నా ఓటు జీ బీ కే .
  జీ బీ కే అంటే గో టువర్డ్స్ బిగ్ ఫ్యామిలీ ఓన్లీ .

 2. మాస్టారూ, మంచి మాటలు చెప్పారు అంతలోనే మీకు అవన్నీ చేతకాదులే అని తీసిపారేశారు. మీ ముఖాలకి పేస్టులైనా సరిగా సెలక్ట్ చేసుకోవటం వచ్హా అనేకదా…. ఏమిచేద్దాం ఎంతైనా గొప్పగారు గొప్పవారే. కానీ మీ టపా ఎప్పుడూ ఉపయోగమే.

  • @ఫాతిమాజీ,
   బహుకాల దర్శనం. తీసిపారెయ్యలేదండి. అయ్యో! మీకు పలుదోముపుల్ల నోట్లో పెట్టుకు నమిలే సమయము కాని, కుచ్చులా చేసుకునే ఓపిక కాని తోముకునే సౌభాగ్యంకాని, పుల్లలు దొరకడం కాని, వాడిన పుల్ల పారేసే చోటు కాని లేనందుకు కలిగిన విచారమండి. మీరు అన్యధా భావించవద్దు. నేనూ సామాన్యుడినే తల్లీ!
   ధన్యవాదాలు.

 3. నోటిలో క్రిములకూ , గుండె జబ్బులకూ స్పష్టమైన లింకు ఉందని తెలిసింది !
  ఈ నేపధ్యం లో దంత ధావనం మీద మీ టపా బాగుంది !

  • @సుధాకర్జీ,
   తీసుకునే ఆహారం మూలంగా చాలా జబ్బులు వస్తాయి, అలాగే నోటి శుభ్రత కూడా చాలా జబ్బుల్ని దూరం చేస్తుది కదా! మీ వ్యాఖ్య నాకు కితాబే
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s