శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మీయ పలకరింపు.

ఆత్మీయ పలకరింపు.

rose helen val

Courtesy:Dan probert

ఆత్మీయ పలకరింపంటే, కావలసిన వారిని మనసారా ఒక సారి సంభావించడం,కరువుతీరా మాటాడుకోడం. కొంతమందితో మాటాడితోంటే సమయమూ తెలియదు,ఆ సంభాషణకి అంతూ ఉండదు.అదో ఆనంద డోలిక.  మనసు ఆనందపు పల్లకిలో ఊరేగుతుంది. ఆ తరవాత కూడా ఆ సంభాషణ మనల్ని వదిలిపెట్టదు. మరికొంతమందితో మాటాడితే ప్రశ్న జవాబుల్లా ఉంటుంది. ఒక ముక్క ఆ పైన మాటాడరు. వీరికి భయమో, బిడియమో తెలియదు. గలగలా మాటాడేవారితో మాటాడితే, మన మనసుకున్న బాధ తొలగిపోతుంది, కొత్త ఉత్సాహం పుడుతుంది.

రామాయణంలో రాముడు చిరునవ్వు నవ్వుతూ ముందుగా పలకరించేవాడట, కనపడిన వారిని. ఎంత మంచి గుణం.ఈ ఆత్మీయ పలకరింపుకి ఖర్చేమీ లేదు, ఒక చిరునవ్వు, ఒక మాట, “బాగున్నారా?”అంటే ఏనుగెక్కినంత సంబరమైపోతుంది, బాగున్నాననే సమాధానమొస్తే మరింత ఆనందం.కొంతమంది పలకరిస్తే మది పులకరిస్తుంది, ఎంత హాయిగా ఆనందంగా ఉంటుందో చెప్పలేను.

మానవ సంబంధాలలో మనకు చాలా మంది బంధువులు, మిత్రులు, ఆత్మీయులు ఉంటారు. బంధువులయినా, స్నేహితులయినా, ఆత్మీయులయినా ఒక సారి ఆత్మీయ పలకరింపు అత్యవసరం కదా! కొంతమంది మన పలకరింపుకోసం ఎదురు చూసేవారూ ఉంటారు,పడికాపులు కాస్తారంటే నమ్ముతారా?  వారే మన మనసుకు దగ్గరగా వచ్చిన వారు. వారు బంధువుల్లోనూ ఉండచ్చు, స్నేహితుల్లోనూ ఉండచ్చు. మనం చాలా పనుల్లో ఉండచ్చు, ఊపిరి పీల్చుకోడానికి కూడా ఖాళీ లేనంతగా పనిలో వుండచ్చు. ఎలా వున్నా ఒక సారి వారానికో, నెలకో, ఒక సారి ఒక చిన్నమాట పలకరించిపోతే మానవ సంబంధాలు బాగుంటాయి. నెలల తరబడి సంవత్సరాల తరబడి కావలసిన వారితో మాట మానేస్తే, పలకరించడమే మరచిపోతాం, తద్వారా మనలని వారూ మరచే ప్రమాదం వుంది, మరో రకంగా అలోచించే సావకాశమూ ఉంది. వారు పలకరించలేదు మనమెందుకు పలకరించాలి? మనం మెయిలిచ్చినా,ఎస్.ఎమ్.ఎస్ ఇచ్చినా మాటాడలేదు మనమెందుకు మాటాడాలి? అనే అహం సహజంగా వస్తుంది. మరొక సారి పలకరించి చూదాం అనిపించదు. పంతం వచ్చేస్తుంది. మనసు పిచ్చిది కదా! అందుకు మనమే దానిని సమాధానపరచి ఎదుటివారిని పలకరిస్తే సరిపోతుంది. మనం పలకరించినా వారు ముక్త సరిగా సమాధానం చెప్పి వూరుకుంటే మరో సారి ప్రయత్నం చేయడం ఎల్లవేళలా మంచిది,పొరపాటుగా అర్థం చేసుకోకుండా. అప్పుడు కూడా వారు పలక్కపోతే సరేలే అని సరిపెట్టుకోడమే చేయగలది. ఆత్మీయులయిన వారు అప్పటి దాకా తీసుకురారు. ఒక వేళ వారు అలా చేస్తే వారు మిమ్మల్ని ఆత్మీయులుగా పరిగణించలేదనమాటేగా! తెలుసుకోడమే, తగినట్లు వ్యవహరించడమే.కొంతమందితో మాటాడితే ఉన్న ప్రశాంతత కూడా చెడుతుంది. 🙂

original

Courtesy: Sri. K.Raghavendra Rao

ఈ పలకరింపు భార్యా భర్తలలో అతి ముఖ్యం! దూరంగా వున్నా దగ్గరగా వున్నా! ఆవిడే పిల్సుతుందిలే అని ఈయన, ఆయనే పిలుస్తాడులే అని ఆవిడ తడిసిపోయిన నులకమంచంలా బిగుసుకుపోతే చాలా ఇబ్బందులొచ్చేస్తాయిఅలకలుండచ్చు కాని రెండవ పక్కనుంచి బుజ్జగింపులుండాలి. అదే జీవితం, భార్య భర్తలలో ఎవరూ ఎక్కువకాదు, ఎవరూ తక్కువా కాదు. ఒక బండికి రెండు చక్రాలు. ఒక మనిషికి రెండు కళ్ళు. అర్ధ నారీశ్వరులు. .తగవులాడి అయినా మాటాడుకోవాలి 🙂 కలసిపోవాలి. ఇక చిన్నవారిని, మాలాటి పనిలేని వారు పలకరించాలనుకుంటారు. కాని భయం ఆపేస్తుంది. ఏం మాట వినవలసివస్తుందోనని. అలా మాటాడని వారినేమనగలం ? పలుకే బంగారమాయెనా? అని పాడుకోడం తప్పించి.

సాధారణ మానవుల్లో మూడు రకాలవారు కనపడతారు. మొదటివారు ఏదీ దాచుకోలేరు మనసులో, బడబడ లాంచీలు. కష్టమొచ్చినా సుఖమొచ్చినా ఎవరో ఒకరికి చెప్పేసుకోవాలి, నాలాగ కదూ? 🙂 ఇక మూడవరకం వారు కష్టమొచ్చినా మాట్లాడరు, సుఖమొచ్చినా మాటాడరు. అయ్యో! అదేమి కష్టం చెప్పచ్చుగా, అంటే మిమ్మల్ని బాధ పెట్టడమెందుకని చెప్పలేదంటారు. ఇప్పుడు మాత్రం బాధ తప్పిందా? వీరు మరీ విచిత్రం, అన్నీ మనసులో దాచేసుకుంటారు. ఇటువంటి వారితో చాలా కష్టం. ఇటువంటివారు జీవిత భాగస్వాములయితే అబ్బో చాలా కష్టం,  ఇలా అంతర్ముఖులవడం మానసిక అనారోగ్యాన్నేసూచిస్తుంది.      దెబ్బలాడి అయినా మనసులో భావం అవతలివారికి అందచేయాలి కాని ముడుచుకుపోతే ఎలా? వీరిని అంతర్ముఖులనచ్చేమో! ఇక రెండవ తరగతివారు. కష్టం సుఖం చెప్పుకుంటారు, తాము కావాలనుకున్నవారితో, పంచుకుంటారు. మానవ మనస్తత్వం ప్రకారం మన బాధను ప్రపంచం బాధగా మార్చడానికి ప్రయత్నించద్దు, మనసులోనే దాచుకుని బాధా పడద్దు. కావలసిన వారనుకున్నవారికి చెప్పుకుని కొంత స్వాంతన పొందాలిసిందే. ఇది తప్పూకాదు, కాదు తప్పదు.

కొంత మంది ఆత్మీయులలా మెలుగుతూ మన విషయాలను ఇతరులకు చేరవేస్తూ మనలని హేళన చేస్తారు, కొంతమంది అనుకోకుండానూ ఈ పని చేస్తారు, అటువంటివారిని గుర్తించి దూరంగానే ఉండడం మంచిది.ఆత్మీయులను పలకరించండి, మది పులకరిస్తుంది, మరచిపోకండి.ఈ ఆత్మీయ పలకరింపు మాట వనజగారినుంచి కొట్టేశా.

mithu hussan

Courtesy:mithu-hussan

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మీయ పలకరింపు.

  • @ప్రేరణ గారు,
   ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం’ అన్నారో సినీకవి.ఇది అన్ని వేళలా నిజం కాదండీ. నచ్చినందుకు
   ధన్యవాదాలు.

 1. శర్మ గారూ ,

  నమస్తే .

  ఈ నడుమ నేను బ్లాగులు చూడటం లేదండి . మా చుట్టాలైన వదినె గారి అపర కర్మలకు హాజరు అవటంలో చూసే అవకాశం లేకపోయింది . మరి బ్లాగులో రోజూ ఓ టపా వస్తుందే అన్న అనుమానం కలగవచ్చు . మీకు తెలియనిదేమీ కాదు . ముందే షెడ్యుల్ చేయటం వల్ల అవి వెలువడ్డాయి .

  అందువల్లనే మిమ్మల్ని సారీ ఎవరినీ పలకరించలేకపోయాను ( కమెంట్ల వీక్షణ ద్వారా ) .

  పలకరింపులు మానవ సంబంధాలలో మనుగడకు అత్యంత ప్రాధానమైనవన్నది అక్షర , ఆచరణ సత్యమే .

  • @శర్మాజీ,
   కష్టంలో ఉన్నపుడే మరొకరి ఆత్మీయ పలకరింపు అవసరం, మానవులం కనక, మనసున్నది కనక. మీకు నా సహానుభూతి తెలియ చేస్తున్నాను. మీరు ఈ కష్టాన్నించి గట్టెక్కాలని భగవంతుని ప్రార్ధిస్తాను. మీ వ్యాఖ్యకు
   ధన్యవాదాలు.

 2. తాతయ్య గారు.. భలే మంచి మాటలు చెప్పారు. పోస్ట్ చాలా బావుంది.
  ఇంతకూ ఇది చెప్పండి .. నా మీద మీకు కోపం లేదుగా??

  • @అమ్మాయ్ ప్రియా!
   ప్రేమ ఉన్న చోట అలకలు బుజ్జగింపులే కాని కోపాలు క్షమాపణలు ఉండవురా తల్లీ! 🙂 మనవల మీద కోపమా? అబ్బే ఊహించలేను. ఇక మనవరాళ్ళ మీద కోపమా? అసలు ఆలోచించనే లేను. చిట్టి తల్లులు ఎంత కష్టపడతారని….ఎంత ఓపిక, అందుకు కోపం కాదు, ఆవేదన,బాధ కష్టపడిపోతున్నారే అని….:)
   ధన్యవాదాలు.

  • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
   మూడురకాల మనుషులూ ఉన్నారు కదు తల్లీ! రెండవ వారిలా బతికేద్దామని…మరిపోలికంటావా తడిసిపోయిన నులక మంచం చూడలేదా? మరలా బిగుసుకుపోయి అష్ట వంకర్లు తిరిగిపోకూడదని….
   ధన్యవాదాలు.

 3. మంచి మాటలు చెప్పారు శర్మగారూ, ఇద్దరు మనుషుల్లో ఉండే మంచి గుణమే వారిని ఆకర్షించి ఆత్మీయులను చేస్తుంది.ఎవరైనా వినే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇటువంటి మంచి మాటలు చెప్పాల్సిన ధర్మం పెద్దవాళ్లది.ఆత్మీయబంధాల గురించీ పిలుపుల్లో ఆత్మీయతల గురించీ నేనో రెండు మూడు పోస్టులు ఇదివరలో వ్రాసి ఉన్నాను .కాలం తరుగు లేనిదీ పృథ్వి విశాలమైనదీ అన్నారు కదా.ఏనాడైనా ఎక్కడైనా ఇవి అలా వినే వాళ్ల చెవులలో పడవచ్చునని అశ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s