శర్మ కాలక్షేపంకబుర్లు- సౌర శక్తి వినియోగం.

సౌర శక్తి వినియోగం.

sun

వాన రాకడ ప్రాణపోకడ చెప్పలేమనేవారు కాని నేడు కరంటు రాకడ,పోకడ చెప్పలేమంటున్నారు. ఇదిగో ఇక్కడే మరొక శక్తిని వినియోగించుకోవాలనే ఆలోచన పది సంవత్సరాల క్రితమే వచ్చి సోలార్ లైట్లు వాడటం మొదలు పెట్టేను. దీని అవసరం పెరిగి అసలు దేనికి ఎంత శక్తి ఖర్చవుతుందనేది తెలిసినా మళ్ళీ చూడాలనిపించింది. ఇదిగో శక్తి వాడకం ఒక్కొక ఉపకరణానికి ఇలా ఇచ్చారు.

Appliance

Power Rating (in watts)

Aquarium

50 – 1200

Clock Radio

10

Coffee Maker

900 – 1200

Cloths Washer

350 – 500

Cloths Dryer

1800 – 5000

Cloths Iron

1000 – 2000

Dishwasher (with/without dry)

1200 – 2400

Dehumidifier

800

Electric Blanket (single/double)

60 – 100

Ceiling Fans

65 – 175

Window Fans

55 – 250

Furnace Fans

750

Hair Dryer

1200 – 1800

Heater (portable)

800 – 1500

Light Bulb

60 – 1000

Microwave Oven

800 – 1100

Computer CPU

120 – 130

Computer Monitor

150 – 160

Laptop

50

Radio

70 – 350

Refrigerator

700 – 900

Televisions (Color)

70 – 170

Toaster

800 – 1400

Toaster Oven

1225

CD/DVD Player

20 – 25

Vacuum Cleaner

1000 – 1500

Water Heater

4000 – 5500

Water Pump (deep well)

250 – 1000

సాధారణంగా ప్రతి ఉపకరణం మీదా అది తీసుకునే శక్తి( Watts) ముద్రింపబడి ఉంటుంది. కాని ఉపకరణం పాతబడే కొద్దీ పని చేయడానికి ఎక్కువ శక్తి తీసుకుంటుంది. ఒక సామాన్య్ గృహంలో నేడు వాడే వస్తువులు వాటికయ్యే శక్తి వినియోగం ఒక నెలకి చూద్దాం.

Lights are now available in CFL (compact filament lamp) which is available from 5w to 1000w ..ప్రతి ఇంటిలోనూ ఈ ప్రదేశాలలో లైట్ అవసరం, హాల్,బెడ్రూం, బాత్ రూమ్, కిచెన్. ప్రతి ఇంటిలోనూ .వీటి అన్నిటికి కలిపి150 w గా లెక్కేసుకోవచ్చు.ఈ లైట్లు కాక రెండు ఫేన్లు ఉపయోగానికి 200 wమరొక ముఖ్యమైనది కంప్యూటర్. ఇది డెస్క్ టాప్ అయితే 250w తీసుకుంటుంది. అందుకు లేప్ టాప్ వాడకం మంచిది. దీనికి 50w  తీసుకుంటుంది.సాధారణ వాడకం 450w రోజుకు ఎనిమిది గంటల చొప్పున ముఫై రోజులకి

450w X 8 hrs X 30 days/1000= 108 (kilowatt hours) units.దీనికి దగ్గరగా రూ. ఏడువందలవుతున్నది, ముందురోజుల్లో ఇంకా పెరగచ్చు కూడా.

దారేదీ? సౌరశక్తి వినియోగమే!నేడు ఇన్వర్టర్,బేటరీ ఉంటున్నాయి,
ఇప్పటికే మీదగ్గర 500w ఇన్వర్టర్ బేటరీ ఉన్నాయి కదా! ఈ సౌర శక్తి వినియోగానికి కావలసినవి. for 500 watts.ఇన్వర్టర్ బేటరీ ఉన్నవారు కంట్రోలర్, సోలార్ పేనల్స్ కొనుక్కుంటే చాలు.
సోలార్ ప్లేట్లు   30,000
కంట్రోలర్          3,000
బేటరీ 180AH  16,000
ఇన్వర్టర్              7,500.
మొత్తం ఖరీదు మార్కెట్లో 6౦,౦౦౦/- పై మాట చెబుతున్నరు

solar power

దగ్గరగా 7౦౦౦౦/ అవుతోంది. దీనికి ప్రభుత్వాలు 50% సబ్సిడీ ఇస్తున్నామంటున్నారు. ఎలా ఇస్తునారో తెలియదు. ఇక మార్కెట్ శక్తులు సబ్సిడీ గురించి అడిగితే వీటి ఖరీదు రెట్టింపు చేసి చెబుతున్నాయి.
మొత్తం అన్నిటికీ అనగా ఫ్రిజ్, కూలర్,ఎ.సి ఇటువంటి వాటిని కలుపుకుంటే పెట్టుబడి దగ్గరగా ఆరు లక్షలవుతుంది. అంతా సవ్యంగా జరిగితే మంచిదే కాని స్వార్ధపరులు సావకాశాన్ని వినియోగించుకుంటున్నారు, సొమ్ము సంపాదనకి. ప్రభుత్వాలు అచేతనంగా ఉండిపోతున్నాయి.
నాకు ఈ సబ్సిడీ వచ్చే మార్గమూ, ఉపకరణాల గురించి మన్నిక గురించి ఏది మంచిదో తెలిసిన వారు చెప్పవలసినదిగా కోరుతున్నాను.

5waterfallanger

ఇంత కష్టంతో సోలార్ వాడకమెందుకంటే మనం ఋతువునుబట్టి కరంట్ వాడుతాము. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా వాడకం తక్కువ., మిగతా సమయంలో ఎక్కువ. ఈ గోల పడి సోలార్ పెట్టుకోడం రెండేళ్ళకి బేటరీ మార్చుకోడం గోల కంటే ఖర్చయితే అయిందని  కరంట్ వారిని నమ్ముకుందామంటే వేసవిలో కరంటే ఉండటం లేదు కదా. ఇక పిచిక గూళ్ళలో ఉండేవారికి ఎలాగూ సావకాశం లేదు. కొద్దిగా ఎండ తగిలే సావకాశం ఉండి చోటున్నవారు ఈ సోలార్ సిస్టం పెట్టుకుంటే వేసవిలో కనీసావసరాలు చెల్లుతాయనేదే కోరిక. మీకీ ఆలోచన నచ్చితే ప్రయత్నం చేయండి. దీని మూలంగా పర్యావరణాన్ని రక్షిస్తున్నాము, అవసరమూ తీర్చుకుంటున్నాము. ఇక మిగిలిన ఉపకరణాలకి ఎలాగా కరంట్ వారిపై ఆధారం తప్పదు. మీకు నచ్చినా నచ్చక పోయినా మాట కలపండి. ఆలోచన కలపండి ఉపయోగంచుకుందాం, వీలును బట్టి. నాకయితే పెట్టుకోవాలని ఉ0ది మీరేమంటారు ?

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- సౌర శక్తి వినియోగం.

 1. సూర్య శక్తి తో నడిచే వేణీళ్ళ గీసర్,
  ఇరవై(పాతిక) వేల తొలి మదుపు తో,
  ఖర్చు లేని వేడి నీళ్ళు రోజంతా, సంవత్సరం పొడుగునా
  +నెలకు 50 రూపాయల రిబేటు,బెంగళూరు కరెంటు బిల్లులో,
  నేను చెసిన ఉత్తమ పొదుపైన మదుపు.
  mega saving

  • @మోహన్జీ,
   ఉభయ కుశలోపరి.
   చాలా మంచి పని చేసేరు. తరుగులేని శక్తిని ఉపయోగించుకోడం లో ఆనందమూ ఉందికదండీ! లైటింగ్ ఫేన్ లకి మీకు ఇబ్బందులు ఉండవనుకుంటా, మా లాగా.
   ధన్యవాదాలు.

 2. చదువు తుంటే మెదడుకు కరంట్ పాకినట్లుంది. ఈ పోస్ట్ లో మీరు ఇతరులను కూడా చైతన్యవంతులను చేయటం కనిపిస్తుంది. సర్వదా మీ రాతలను చదవాలని ఆకాంక్షిస్తూ…

  • @ఫాతిమాజీ,
   మీ అభిమానానికి కృతజ్ఞత సవినయంగా తెలుపుకుంటున్నా. సుఖం అందరికీ పంచి పెట్టు, దుఃఖం కొందరితో పంచుకో మన్నది నా అనుభవమండి. మన చుట్టూ ఉన్నవారు బాధపడుతుంటే మనం సుఖం గా ఉండలేం. అలా ఉన్నవాడు మనిషి కాదు.
   ధన్యవాదాలు.

   • సర్, మీ సంస్కారానికి మరోమారు నా ధన్యవాదాలు. మీకు తెలియకుండానే మీరు చాలా విషయాలల్లో మాకు (ముఖ్యంగా నాకు) మనశ్శాంతిని ఇచ్హారు, ఎన్నో విషయాలల్లో ఎలా ప్రవర్తించ కూడదో.., ఇతరుల దుష్ప్రవర్తన నుండి ఎలా మనస్తాపాన్ని దూరం చేసుకోవాలో వివరించారు. యే పోస్ట్ లో ఏమి చెప్పారో చెప్పలేను కానీ, మీ మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి.

   • ఫాతిమాజీ,
    మీలో అమ్మకి నమస్కారం.( చిన్నవాళ్ళకి నమస్కారం పెట్టకూడదు, ఆయుః క్షీణమంటారు) నేను సామన్యుడిని.నా మాటలేమైనా మీకు ఉపయోగపడితే అది అమ్మ కృప(భగవంతుడుని నేను అమ్మగా చూస్తాను)నేను నిమిత్త మాత్రుడినే.

    మీరు పొగొడేస్తే గర్వం వచ్చేస్తుందండీ :). సర్ అన్న మాట వదిలేయండి, దయచేసి.

    మరల మరల ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.

 3. శర్మ గారూ ,

  నమస్తే ,

  ఈ సౌర శక్తి వినియోగం ఎక్కువగా స్వంత విడి ఇళ్ళ వాళ్ళకి ఎంతో లాభదాయకం . అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లో అద్దెకున్న వాళ్ళకి అచ్చి రాకపోవచ్చు . ఎందుకంటే ఎప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుందో ఎవరికి ఎఱుక . దీనికి రకరకాల కారణాలు ఉద్యోగ పరంగా కాని , స్థలా లేమి వల్ల . అంతే కాకుండా అంత డబ్బు వెచ్చించి దూరాలోచన చేసి భవిష్యత్తులో లాభంగా వుంటుందని , తమ వంతు సహకారం ( ప్రభుత్వం సరఫరా చేసే కరెంట్ వాడుకోకుండా వుండటం వల్ల , సామాన్య మానవులకు ఉపయోగం వుంటుందని / రైతులకు ఉచిత కరెంట్ యిచ్చి నూతన పధకాలను ) అందిస్తే మనమూ ఇంకొకరిపైన ఆధారపడకుండా , మనకు వున్నంతలో మనం జీవించే అవకాశాలు అధికంగా వుంటాయని ఆలోచించవచ్చు . అంత మాత్రాన ఇంధనముండగానే సరిపోదు , అవకాశం అత్యంత ప్రాధ్ముఖ్యమైనది .
  ఇలా ప్రజలు స్వంతంగా తాము కరెంటుని తయారు చేసుకొంటుంటే , ప్రభుత్వ ఎనుబోతులు మిగిలి వున్న ఆ కరెంటుని వాళ్ళ వాళ్ళ స్వార్ధ అవసరాలతో దుర్వినియోగం చేసే అవకాశం కూడా లేకపోలేదు . ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితులలోనే అత్యంత నీచంగా వినియోగిస్తూనే వున్నారు .
  చిట్ట చివరగా తుది మాట . ఇది యిండివిడ్యువల్ స్వంత యిళ్ళ వాళ్ళకే ఉపయోగమని , దానిని కూడా ప్రభుత్వం సబ్సిడీ యిచ్చి ప్రోత్సహిస్తూ కొనసాగిస్తుందని నేను భావించటం లేదు .
  ఇది ఎవరికి వాళ్ళు స్వంతంగా ఏర్ప`ఋఆఛూఖొవాతాం ఆఢీఖా వ్YఆYఆంటొ ఖుదూఖోణ్ణాడెణాందీ .
  మీరు ఆ కాలంలో వుంటూ , ఈ కాలంలో ఆచరించవలసినవి ఆచరణలో పెట్టి చూపిస్తున్నందులకు మీకు నా అభివాదములు మరోమారు .

  • @శర్మాజీ,
   పదేళ్ళకితమే ఈ ఆలోచనొచ్చి రెండు లైట్లు కొన్నాను. అప్పటికి వాటి రేటు ఒక్కొకటి రెండు వేల ఐదువందలు. ఇప్పుడిక రూఫ్ టాప్ వేయించాలని కోరిక. ఇక ఎనుబోతులు ఎప్పుడూ మేస్తూనే ఉంటాయండి. మనపని మనం చేసుకోడమే.
   ధన్యవాదాలు.

 4. శర్మ గారు,

  మరీ ఇంత కష్ట పడి కరెంటు సంపాదించి బ్లాగాడా లంటా రా ! జేకే

  దీని వివరాలు అంత గా తెలీవండీ . అయినా ఆ మధ్య మా ఊళ్ళో ఒక ఫేను, ఒక లైటు ఒక మరేదో ఉపకరిణి కి మొత్తం కలిపి సోలార్ పీనల్ ఆరువేల రూపాయలని నోటీసు కనబడింది . అది ఆరువేలా లేక అరవై వేలా అన్నది ఇప్పుడు సందేహం వస్తోంది మీ టపా చూసేక

  జిలేబి

  • @జిలేబి గారు,
   ఈ ఆడలేడీస్ కి బలే తెలిసిపోతాయండీ! ఇల్లాలు ఇదే మాటంది. బ్లాగాడటం కోసమేగా ఇవన్నీ వేయిస్తున్నారూ అని 🙂

   ఆరు వేలుకాదండి అరవయ్యే! కొన్ని వివరాలు దొరికేయి, కొన్నిటికి ప్రయత్నం జరుగుతోందండి.
   ధన్యవాదాలు.

 5. శర్మ గారూ ,
  సౌర శక్తి ని నిత్యావసరాలకు వినియోగించుకోవాలని, ఆ ప్రయత్నాలకు పదేళ్ళ క్రితమే శ్రీకారం చుట్టిన మీ అభ్యుదయ భావాలకు అభినందనలు !మన దేశం లో సౌర శక్తి పుష్కలం గా ఉంది, వినియోగం లోనే సమస్యలు ఏర్పడుతున్నాయి ప్రస్తుతం ! ఇంగ్లండు దేశం లో కూడా సౌర శక్తి పధకాలకు ఒక ఏడాది పాటు సబ్సిడీ ఇచ్చి , జనాలు సోలార్ ప్యానెల్స్ కోసం విపరీతం గా ఎగ బడుతూ ఉంటే ,అది తమకు లాభ సాటి కాదనుకుని , సబ్సిడీ ని క్యాన్సిల్ చేశారు , ప్రభుత్వం వారు ! భారత దేశం లో బహుశా , ఆ సబ్సిడీని కూడా కొట్టేద్దామనుకునే , ఏజెంట్లు ప్రజలకు తెలియచేయట్లేదేమో !వెర్రి వెర్రి అంటే వేలం వెర్రి అన్నట్టు , కొత్త పేరు వినబడగానే జనాలు సహజం గా నే ఎగ బడతారు కదా ! ఆ వెర్రిని ( వీలైనంత ) ఎక్కువ సొమ్ము చేసుకుందామని ఏజెంట్లు చూస్తున్నట్టు గోచరిస్తుంది !నేను కొంత శోధన చేసి ఈ క్రింది వెబ్ సైట్లు ఇస్తున్నాను.
  మీరు గమనించ వలసిన విషయాలు:
  1. మీరు పూర్తి గా సౌర శక్తి ని పగలూ రాత్రీ వినియోగించుకోలేక పోవచ్చు , ఎందుకంటే , రాత్రి సమయాలలో సహజమైన వెలుతురు ఉండదు కాబట్టి ( సోలార్ పానెల్స్ పని చేసేది సూర్య కాంతి తో నే , సూర్యుడి వేడి తో కాదు )
  2. అందువల్ల మీరు తప్పని సరిగా విద్యుత్ సరఫరా కనెక్షన్ కూడా ఉంచుకోవాలి ! ( కనీసం ప్రస్తుతం ! )
  3.మీ ఊరి లో ఏడాది పొడుగునా ఎక్కువ రోజులు సూర్యుడు కనిపిస్తేనే , మీరు సోలార్ ప్యానెల్స్ తో ఎక్కువ లాభ పడతారు !
  4. మీ ఊరి ( పట్టణ ) వాసులంతా కలిసి, సరాసరి, ప్రతి ఏడూ , కరెంట్ వారికి ఎంత కడుతున్నారో లెక్క కట్టి , ఆ డబ్బు తో ఒక చిన్న సౌర శక్తి ప్లాంటు ను ( అందరూ కలిసి ) ఏర్పాటు చేసుకోవచ్చు ! అప్పుడు మీకు చాలా చౌక అవుతుంది !

  మిగతా వివరాల కోసం ఈ క్రింది సైట్లు చూడ గలరు !

  1.http://www.sunpowercorp.co.in/success-stories/
  2.http://www.solarpowerenergyindia.com/home_package.php
  3. http://www.gpclindia.com/showpage.aspx?contentid=15
  ( గుజరాత్ ప్రభుత్వం , ప్రపంచం లోనే అతి పెద్ద సౌర / వాయు శక్తి హైబ్రిడ్ ప్లాంటు ను నిర్మిస్తుంది ! )

  • @సుదాకర్జీ,
   నేను గత పదేళ్ళుగా రెండు లైట్లు వాడుతున్నా. ఇప్పుడు మరికొంత పెంచుకోవాలని ఆశ. ఈ సౌర శక్తి వినియోగం, ఇవి పని చేసేవిధానం గురించిన అవగాహన చాలానే ఉంది. సోలార్ పేనల్స్ వెలుగుకు స్పందిస్తాయి తప్పించి వేడికి కాదు.
   పదిహేను సంవత్సరాల కితమే వీటిని అమర్చి, నిర్వహించిన అనుభవమూ ఉంది, డిపార్ట్మెంట్ లో. గుజరాత్ వారు ప్రపంచంలోనే పెద్ద ప్లాంట్ నిర్మిస్తున్నారన్నారు, మంచి మాట వినిపించారు.
   వీటి ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది, నేడుకూడా ఎక్కువగానే కనపడుతోంది, సామాన్యుని చేరేలా లేదు. మీ సహకారానికి
   ధన్యవాదాలు.

  • @s.venkataramayya
   అల్లుడుగారికీ జిందాబాద్! మామయ్య మాట నచ్చినందుకు. వివరాలు కనుక్కుంటున్నాను. మీరూ సేకరించండి. వేయించేసుకుందాం ఏమంటారు?
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s