శర్మ కాలక్షేపం కబుర్లు- అతివలూ పుస్తెల తాళ్ళు జాగ్రత్త!!!.

అతివలూ పుస్తెల తాళ్ళు జాగ్రత్త!!!.

జిలేబీ గారి టపా జిలేబీ నీ వడ్డాణం బరువెంత చదివిన తరవాత రాయాలనిపించింది.http://varudhini.blogspot.in/2013/09/blog-post_10.html

పూర్వకాలం నుంచి సామాన్యులనుంచి మాన్యులదాకా మదుపు బంగారమే, అది సింగారంగానే ఉండేది, అవసరానికి తొందరగా మార్చుకోవచ్చు, కొన్ని ఇబ్బందులున్నా. నాటికాలంలో బంగారం లేదా రత్నాలు. వీటికి మళ్ళీ కొన్ని చిక్కులు. అందుకు ఎక్కువమంది మదుపు బంగారమే. రోజులు మారుతున్నాయి. మనుషుల ఆలోచనలోనూ, అవసరం లోనూ తేడాలొచ్చాయి. ఇప్పుడు మదుపు పద్ధతి మారింది. బంగారం బదులు ప్లాటినం, రత్నాలు ఉపయోగిస్తున్నారు.

భరతమాతకి స్వతంత్రం వచ్చిందనుకున్న తరవాత కొత్త ధనికవర్గం పుట్టింది. ఆ ధనిక వర్గం మొదటిలో బంగారమే మదుపుగా ఉండేది. తరవాత రత్నాలు, వజ్రాలు మదుపుగా మారాయి, ఇప్పుడు ప్లాటినం వాడుతున్నారు. దొంగ తనం చేసేవాడికి ప్లాటినం విలువా తెలియదు, దాన్ని అమ్ముకోడమూ కష్టమే, కొద్ది చోటులో దాచుకోవచ్చు.సామాన్యులు ఎక్కువమందికి ప్లాటినం బంగారం కంటే విలువైన లోహమన్న సంగతీ తెలియదు. ఏభయి ఏళ్ళ కితం జరిగిన ఒక సంఘటన.

నిడదవోలు నరసాపురం రోడ్ లో మార్టేరు దాటిన తరవాత ఒక చోట నలుగురు మనుషులు రాత్రి పూట కారులో వస్తున్న దంపతులను అడ్డుకున్నారు. నాడు కార్లే తక్కువ, కలిగిన వారికే అవి నాడు స్వంతం. ఆ నలుగురు కారులో ఉన్న ఆడ కూతురి ఒంటి మీద బంగారమిమ్మని అడిగారు. తల్లి మారు మాటాడక తీసి ఇచ్చేసింది పుస్తెల తాడుతో సహా. ఆమె ముక్కున రెండు ముక్కెరలుండిపోయాయి. వాటిని కూడా తీసి ఇచ్చెయ్యమన్నాడొక దొంగ. అప్పుడు నోరు విప్పిన తల్లి “అన్నలూ! మీరడిగిన బంగారమంతా ఇచ్చేసేను. ఈ ముక్కుపుడకల సీలలు తిరగడం లేదు, చాలా కాలంగా, వాటిని తీయించెయ్యమని చెబుతున్నా, వీరు అశ్రద్ధ చేసేరు. వాటిని తీయాలంటే వాటినికొయ్యాలి, లేదా నాముక్కు కొయ్యాలి, మీ ఇష్టం ఏం చేస్తారో” అంది. ఒకడికి కొద్దిగా జాలి వేసి “ఒరేయ్! అమ్మ అడగ గానే బంగారపు వస్తువులన్నీ ఒలిచి ఇచ్చేసింది. ఆ రెండు ముక్కెరలూ వదిలేయండి, వచ్చేయం”డని తీసుకుపోయాడు. బతుకు జీవుడా అని వారు బయట పడి సంతోషించారు. కారణమేంటీ? పోయిన బంగారం విలువ కంటే ముక్కులనున్న ముక్కెరలలోని రత్నాలు, వజ్రాల ఖరీదు ఇరవై  రెట్లు ఎక్కువ కనక. అవిపోనందుకు ఆనందించారు.

మొన్ననీ మధ్య మాకు తెలిసిన వారు భార్య భర్త పెళ్ళికెళ్ళేరు, రాత్రి పూట. భార్య ఒంటినిండా వస్తువులు వేసుకెళ్ళింది. వచ్చేటపుడు రాత్రి రెండు గంటల వేళ దొంగ అటకాయిస్తే భార్య మొత్తం నగలు తీసి ఇచ్చేసింది. భార్య భర్త ఆనందంగా వచ్చేసేరు. తరవాత మాకు తెలిసి పరామర్శ చేస్తే పోలీస్ కేస్ పెట్టేరా అని అడిగా. దానికతను నవ్వి పోయిన వస్తువులన్నీ ఒన్ గ్రాం గోల్డ్ అండి . విలువెంతో కాదు, పోలీసులు గోల ఎందుకని కంప్లయింట్ ఇవ్వలేదండి అన్నాడు. ఔరా దొంగకి కూలి కూడా కిట్టుబాటు కాదనీ బాధ పడ్డాడు.పాత కాలం లో వీటిని చిలకలపూడి బంగారమనేవారు.

మరి బంగారమెక్కడుందని కదా మీ ప్రశ్న,  మహిళల మెడలోని పుస్తెల తాడుల్లో ఉంది, వెంకన్న బాబు దగ్గరుంది . మన మోహనులవారి చూపు అక్కడ పడిందేమో! పెద్దలయిన వారిది ముందే పసికట్టి, వజ్రాలు, రత్నాలు, ప్లాటినం లోకి మారిపోయారు. ఆడలేడీస్ వడ్డాణాలలో లేదు.,  అతివలూ పుస్తెల తాళ్ళు జాగ్రత్త!

12 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు- అతివలూ పుస్తెల తాళ్ళు జాగ్రత్త!!!.

 1. మీ కలం వల్ల దొంగలకి ప్లాటినం విలువ తెలసుస్తుందేమో…..

  http://jusbelieveit.blogspot.in/2013/09/blog-post.htm

  నేను కొత్తగా బ్లాగ్గింగ్ ప్రపంచంలో కి వచ్చాను నా పోస్ట్ చదవి ఎలా రాసానో చెప్పండి

  • @నాగేంద్ర కుమార్ గారు,
   వాళ్ళు మనకంటే తెలివయిన వాళ్ళు కనకే దొంగలయ్యారు. దీనిని అమ్ముకోడం కష్టం, అదీ అసలు తిరకాసు.
   ఇక మీ బ్లాగు చూసాను. “మానులేని దేశమందు అముదపు చెట్టు మహా వృక్షముకాదా” అని, చాలా మంది సీనియర్లున్నారండి, నేనూ చిన్న వాడినే మీలా బ్లాగులో సుమా! నాకు తోచినది చెబుతా అడిగారు కనక, మీరు రాసిన వాటితో నాకు సగమెరిక, వాక్య నిర్మాణం వగైరా చెప్పగల సమర్ధత లేదు.
   ధన్యవాదాలు.

 2. మామయ్యగారు-ఈమధ్య మనవూరిలో ఒకైల్లాలు నగలతో ఇంటి బయట నిలబడిఉండగా మోటారుసైకిలుపై వెళుతున్న దొంగ నగలు లగుకొని వెళ్ళిపోఇనాడు. మరునాడు అదే దొం గ వచ్చి నగలు మీదకు విసిరివేసి నీకు బుద్దిలేదా రోల్డ్ గోల్డ్ నగలు వేసుకొని తిరుగుతావా అని తిడుతూ మోటారు సైకిలుపై వెళ్ళిపోయినాడు.చిత్రంకాదా

 3. When I was in Hyd during May/June 2013, we were told to be careful about this “chain pulling.” Many people in Hyd are experiencing this kind of day light robbery. During twilight hours a couple of guys riding a motor cycle come close, pull the chains and dash on the same vehicle. It is impossible to catch them. If you are not hurt due to chain pulling you are lucky. Life has become difficult in villages too. After 10 PM everyone closes the main gate and would not open even if you are the son of the building owner. I slept in my brother’s place one night and in another friend’s place another night due to delays beyond 10 PM.

  • @సున్నా గారు,
   స్వాగతం. ఇది ఒక హైదరాబాదే కాదండి. జాతీయ క్రీడ అయిపోయింది. ఆరు నెలల కితం మాకు కావలసిన వారిది, పుస్తెలతాడు, ముంబైలో ఇలాగే దోచుకుపోయారు.
   ధన్యవాదాలు

 4. శర్మ గారూ ,

  నమస్తే .

  ఆ మధ్య ప్లాటినం బంగారం కంటే విలువైనదని సినిమాలలో దొంగలు దోచుకొనటం ద్వారా చూపిస్తూనే వున్నారు . కాకుంటే అంత ప్రచారంలోకి రాలేదు . మీ ఈ టప ద్వారా ప్రాచుర్యంలోకి వస్తుందనుకొంటున్నా . ఆడవాళ్ళూ ఆడ వాళ్ళూ వున్నారని గుర్తుంచుకొని జాగ్రత్తలు తీసుకొనటం ఎంతైనా మీకే మంచిది సుమా !

  • @శర్మాజీ,
   ఎంత చెప్పినా సామాన్యులకి ప్లాటినం విలువ తెలియదు. అది చూడటానికి ఇంపుగా ఉండదు. అల్యూమినియం ముక్కనే అనుకుంటారు.అమ్ముకోడం చాలా కష్టం. చాలా ఇబ్బందులండి.మనమెంత చెప్పినా ఆడలేడీస్ వినరండి. 🙂

   ధన్యవాదాలు.

 5. ఆడలేడీస్ వడ్డాణాలలో లేదు!
  అగ్గినిప్పులాంటి మాటనేశారు.
  అదిసరే, కామెంటుల్లో లింకులు ఎలా చూపాలో ఒక టపా వేసాను ఈ‌ మధ్యనే. చూడండి: కామెంట్లలో లింకులు ఇవ్వటం ఎలాగో తెలుసుకోండి.
  ఈ చిట్కా మీరు టపాలు వ్రాసేటప్పుడు వాడవచ్చును అవసరం ఐతే.
  కాని మీ wordpress టపాల్లో లింకులు ఇవ్వటానికి సదుపాయం ఇప్పటికే ఇచ్చిందేమో ఒకసారి పరిశీలించండి.

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   ఆడ లేడిస్ మాట మా జిలేబి గారిదండీ, బాగుందని ఎత్తుకొచ్చేసాను 🙂
   మీ దగ్గర ఒక కొత్త సంగతి నేర్చుకుని జిలేబి గారి బ్లాగు మీదే ప్రయోగించా 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s