శర్మ కాలక్షేపంకబుర్లు-గుర్తింపు

గుర్తింపు

తిరపతి వెంకన్న, అన్నవరం సత్తెన్న అంటే గుర్తింపున్న దేవుళ్ళు, మరి ఇతరులంతా అగస్త్య భ్రాతలా? కాదు! వారికీ పేర్లున్నాయి, గుళ్ళూ ఉన్నాయి, కాని సొమ్మే లేదు, అందుకు గుర్తింపు లేదు. అంటే ‘ధనమూల మిదం జగత్’ ఇది దేవుడితో సహా అందరికి వర్తిస్తుంది, కలియుగం లో.. ఆ తరవాత వారు కవులు, పండితులు.  తెనుగులో రాసిన తరవాత గుర్తింపొచ్చి, కానుకలిస్తా! భాగవతం అంకితమివ్వమంటే కుదరదు,  నీ గుర్తింపు వద్దోయ్! అన్న వారు, సహజకవి పోతనగారు. ఏమన్నాడూ భారతితో చూడండి.

“కాటుక కంటినీరు చనుకట్టుపయింబడ నేల నేడ్చెదో,హాటకగర్భురాణి నిన్నాకటికిన్ గొనిపోయి అల్ల కర్ణాటకిరాటకీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ,” అని చెప్పాడని, ప్రసిద్ధంగా చెప్తారు.

కాని ఇందులో నాకో చిన్న అనుమానం, అల్ల కర్ణాట కిరాత కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ అని కదా, అన్నాడన్నారు, అక్కడ త్రిశుద్ధిగ నమ్మ భారతీ అంటే కూడా తప్పులేదేమో! గణమూ సరిపోవచ్చు.త్రిశుద్ధిగ అన్నతరవాత విరామమిస్తే, త్రికరణ శుద్ధిగా అమ్మను అని చెప్పడం కావచ్చు. మరి కిరాతకీచకులకమ్మ అని చెప్పేడు కదయ్యా, ముందు అంటారా! రెండు సార్లు చెప్పి నొక్కి వక్కాణించాడనుకోవచ్చు కదా!, లేక కర్ణాట కిరాత కీచకుల కమ్మ త్రిశుద్ధిగ దగ్గర కామాయేనా ఉండాలి కదా. అప్పుడు అమ్మను త్రిశుద్ధిగ, నమ్ము భారతీ అన్నా త్రికరణ శుద్ధిగా అమ్మను నమ్ము తల్లీ అన్నా సరిపోతుందేమో! కిచకులకమ్మ దగ్గర కామా పెడితే అర్థమే మారిపోతోంది. త్రికరణ శుద్ధిగా నమ్ము తల్లీ అన్నట్టుగా ఉందేమో! అమ్మ త్రికరణ శుద్ధిగా నమ్మటమేంటండీ! నాకయితే ఇది గందర గోళమే అయిపోయింది. మీకేమయినా తెలిస్తే చెప్పండి.

పోతన కంటే ముందువారయిన నన్నయ, తిక్కనలకు ముందు గుర్తింపొచ్చి తరవాత కావ్యం రాశారు. నేడు కూడా రాసినవారు వారికీ వీరికీ పంపి అభిప్రాయాలు సేకరించడం మార్కెట్లో పెట్టి అమ్ముకోవడం గుర్తింపు వచ్చేదాకా తప్పటం లేదు 🙂 ఆ తరవాత ప్రజలే ఫలానా వారి రచన కొత్తదేమైనా వచ్చిందా అని అడుగుతున్నారు.

నేడు ప్రతిదానికి గుర్తింపు అడుగుతున్నారు. ఆధారమన్నారు అది నిరాధారమై కూచుంది. గుర్తింపు వచ్చేదాకా ఒక గోల గుర్తింపు వచ్చాకా మరోగోల జరుగుతోంది. నీకేంటయ్యా గుర్తింపంటే ఫలానా వారబ్బాయిని, మా మామ్మ, ముత్తాతలాగ అని చెప్పుకోడమే కాని స్వయంగా గుర్తింపులేదు. టీ లు మోసుకునైనా బతికేనని చెప్పగల దమ్ములేదేమయ్యా! అంటే మా అమ్మ, మామ్మ, ముత్తాత, ముత్తాత తండ్రి వీరంతాలేరూ గుర్తింపుకి అంటున్నారు. టీలు మోసుకు బతికేవారికీ ఒక రోజు గుర్తింపు వస్తుంది. వేచి చూడాలంతే.

దొంగలకి గుర్తింపు వస్తోంది కదా? ఎలా అంటే వారికి నాలుగు పక్కలా నలుగురు పోలీసులు గన్ పట్టుకు నడుస్తారు. పాపం మన రాజకీయనాయకులూ అలాగే నలుగురు గన్ పట్టుకుని నడుస్తూంటే మధ్యనే నడుస్తారు,దొంగల లాగా, ఎప్పుడేనా చూశారా! ఎర్ర బుగ్గ కారుంటే నే గుర్తింపు,వెంకన్న బాబు దగ్గర బ్రేక్ దర్శనమిస్తేనే గుర్తింపు, అదీ సంగతి.

గుర్తింపొచ్చిన తరవాత కాలు కదపలేరు, బయటికెళితే ఎవరు పట్టేసుకుంటారోననే భయమే! రాజకీయ నాయకులైతే వారికి ప్రజల భయం, నటులయితే అభిమానుల భయం వగైరా వగైరా.ఇంతకీ నీ గోలేంటంటారా. నాదీ గుర్తింపు సమస్యే.

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గుర్తింపు

 1. మీరు మమ్మల్ని గుర్తించారు.
  మేము మిమ్మల్ని గుర్తించాము.
  మనలాంటివాళ్ళకి ఈ గుర్తింపు చాలదటండి?
  వేరే అవార్డులు, రివార్డులు కావాలా?

 2. “కాటుక కంటినీరు చనుకట్టుపయింబడ నేల నేడ్చెదో,హాటకగర్భురాణి నిన్నాకటికిన్ గొనిపోయి అల్లకర్ణాటకిరాటకీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ,” అని చెప్పాడని, ప్రసిద్ధంగా చెప్తారు.
  పోతన గారి , అత్భుతమైన , ఆవేశ భరితమైన, భావ గర్భితమైన పద్యం ! నాకు తెలుగు లో ఎక్కువ ‘ పట్టు ‘ లేదు కానీ ప్రయత్నిస్తాను !
  కాటుక కంటి నీరు , చనుకట్టు పయింబడ ( అంటే స్త్రీల స్థన ద్వయం మీద ఆ కాలం లో ధరించే ఆచ్ఛా దన ) అంటే
  ( సరస్వతీ దేవి ) ‘భారతి’ని ఒక శక్తి స్వరూపిణి గా కవి చూడడం జరిగింది !
  హాటక గర్భు రాణి అంటే నాకు తెలియదు . నిన్నాకటికిన్ అంటే ( నా ) ఆకలి వల్ల లేదా పేదరికం వల్ల , గొని పోయి = తీసుకు వెళ్లి , అల్ల= అక్కడి, కర్నాట కిరాట కీచకుల అంటే, ఆ కాలం లో కర్ణాటక రాజులు ప్రజలను బాధించే వారనీ , అందువల్ల నే , వారిని కౌరవులతో పోల్చినట్టు , మనకు తెలుస్తున్నది !
  …. కీచకులకమ్మ త్రిశుద్ధిగ అంటే , పోతన తాను రచించిన భాగవతాన్ని , మనసా , వాచా , కర్మ ణ్యా , అంటే మనసు లోనూ, మాట లోనూ , లేదా చేతల లోనూ కూడా అమ్మను నేను , నన్ను నమ్ము భారతీ అని ‘ ప్రతిజ్ఞ ‘ చేసినట్టు గా అనిపిస్తుంది ! దుర్భర దారిద్ర్యం అనుభవిస్తూ కూడా , తదేకమైన నిష్ఠ తో , రాజు ఆశ్రయం తృ ణీక రించి , ఆ బాధతో మనో వేదన చెందిన పోతన మహాకవి , రాజు కు తన గ్రంధాన్ని అంకితం ఇద్దామనుకుని కూడా , శోక తప్త అయిన సరస్వతీ దేవిని ఊహించుకుని ,తన నిర్ణయం మార్చుకుని , పై పద్యాన్ని రాసి ఉండ వచ్చు !
  గమనించ వలసినది , పోతన కాలం లో మనకు కామాలూ ఫుల్ స్టాపు లూ, విరామాలూ , తెలిసి ఉండవు ! ఆ తరువాత అవి ( వలస ) వచ్చి మన తెలుగు గ్రంధాలనూ , అర్థాలనూ తారుమారు చేస్తూ , మనల్ని అయోమయం లో పడ వేస్తున్నాయి !
  మన దేశం లో పోతన లాంటి కవులు చాలా మంది ఉండి ఉంటారు ! కానీ వారు నిజాయితీ తో జీవితాంతం వారి రచనలను ఎవరికీ అమ్ముకోలేదు కనుకే , వారి రచనలు కూడా కనుమరుగయ్యాయి ! కానీ ఇట్లా రాజులను ‘ కాకా ‘ పడితే ఒక ప్రయోజనం కూడా ఉంది ! రచనలు కాలం ఉండే విధం గా, వాటిని నిక్షిప్త పరచడమూ , ప్రచారం ఇవ్వడమూ జరుగుతుంది ! మన అదృష్టం కొద్దీ , పోతన భాగవతం ఇంకా బ్రతికి ఉంది !
  ఇక , ఇంటర్నెట్ ‘ ఉషశ్రీ ‘ గారికి ఇంకా గుర్తింపు కావాలంటే , నేనూ నా సహకారం అందిస్తాను ! ( టపా పెద్దదైంది, క్షంతవ్యుడిని ! )

  • @సుధాకర్జీ,
   మీ ప్రయత్నం మీరు బాగానే చేసేరు. ఇహపోతే పద్యభావం.
   కాటుక కళ్ళనుండి ధారగా వచ్చే కన్నీరు చనుకట్టు అంటే స్థనద్వయం, లేదా పాలిండ్లపై పడేలా ఎందుకు ఏడుస్తావు తల్లీ! నిన్ను నా ఆకలి తీర్చుకోడానికి కర్ణాట ప్రభువుకు, కిరాత కీచక అన్నవి విశేషణాలు, ఎవరినైనా చెరపడితే కీచకుడిలా ఉన్నవంటారు కదా! సర్స్వతీ దేవిని బలవంతంగా అంకితం తీసుకుంటే , ఆ ప్రభువు చెరబట్టినట్లేకదా, బలవంతాగా తీసుకున్నపుడు, అటువంటివారికి అమ్మను, త్రికరణ శుద్ధిగా అని చెప్పేడు. ఇక్కడ నేను, నమ్ము అన్న దాని నమ్మ (న+అమ్మ) అంటే అమ్మను అని మరొక సారి పునరుక్తి చేసేడని కూడా చెప్పచ్చని చిన్న చమత్కారం.
   మరోమాట మనకీ కామాలు, ఫుల్ స్టాపులూ ఉన్నాయి. మనమే మరచిపోయాం, తెనుగునే మరచిపోయాం. హాటక గర్భురాణి అంటే బ్రహ్మగారి భార్య సరస్వతి.హాటక గర్భుడు అంటే బ్రహ్మ.
   ఇక నా గుర్తింపంటారా? దాని గురించి వదిలేయండి. వివరంగా ఒక టపా వచ్చేరోజు దూరంలో లేదు.
   ధన్యవాదాలు.

 3. శర్మ గారూ ,

  నమస్తే .

  మీరు అపుడెపుడో పోతన గారు వ్రాసినదానికర్ధం అడిగారు .

  “కాటుక కంటినీరు చనుకట్టుపయింబడ నేల నేడ్చెదో,హాటకగర్భురాణి నిన్నాకటికిన్ గొనిపోయి అల్ల కర్ణాటకిరాటకీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ,” అని చెప్పాడని, ప్రసిద్ధంగా చెప్తారు.

  దీనిని కూలంకుషంగా పరిశీలిస్తే చాలా చాలా అర్ధాల కంటే అనర్ధాలెక్కువ వున్నట్లుగా న మనసుకు తోస్తోంది .

  అందుకని ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను .

  గుర్తింపు విషయానికొస్తే , ఏ యుగంలో నైనా ఎవరైనా , ఆఖరికి మనలను పుట్టించారనుకుంటున్న దేవుళ్ళైనా ఈ భూమ్మీదకు వస్తే , మన మానవులకు ఈ భూమ్మీద ఏ ఏ నీతి , నియమాలు శిలాసాసనంగా లిఖించబడ్డాయో , అవి అన్నీ ఆవాళ్ళకు కూడా వర్తించి తీరుతాయి . కనుక ఎవరైనా గుర్తింపు కార్డు లేకుంటే జీవించలేడని ఈ మధ్య మన భారత దేశం ఆధార్ కార్డునే గుర్తింపు కార్డుగా జారీ చేశారు .
  మఱి ఆ దేవుళ్ళకైనా ఆ గుర్తింపు ఆధార్ కార్డ్లు అనుక్షణం ఆయన పక్కనే వుండి ఆయనను అహోరాత్రాలు చూసుకునే ఆ పూజారులైనా యిప్పించి పుణ్యం కట్టుకొంటే బాగుండు . లేకుంటే అన్ని నామాలున్న ( అన్ని నామాలున్నాయి కనుక మీకే పేరుతో ఈ ఆధార్ కార్డు యివ్వాలి అని ఆ పంగనామాల స్వామికి కూడా ఎగనామమే పెట్టవచ్చు . పైగా మీకీ నామాలు అలవాటే కదా ! అని అన్నా అనవచ్చు . ఇలా గనక జరిగితే ఆయన(వెంకన్న)కిపంగనామమే మిగిలేట్టుంది .

  అమ్మా ఫాతిమా ,

  మీరు త్వరలో ” శర్మగారి అభిమాన సంఘం ” పెట్టబోతున్నారు . చిన్న సవరణ ” కష్టే ఫలి శర్మ గారి అభిమాన సంఘం ” అని పెట్టాలమ్మా . ఎందుకంటే నా పేరు శర్మయే కదా! . లేనిపోనిది మా యిరువురి నడుమ అసలు గుర్తింపు కరువై బరువవుతుందేమో .

  • @శర్మాజీ,
   మానవుల నీతి అలావున్నది. భగవంతునికి కూడా సొమ్ముతోనే గుర్తింపు చెప్పడమే! ప్రభువులు ఏడుకొండలవాడికీ నామాలు పెట్టేస్తారు.అధార్ అన్నదో పెద్ద ప్రహసనం అయి ఊరుకుంది. ఈ పేరు చెప్పి ఎంత ఖర్చయిందో మరి.
   ధన్యవాదాలు.

 4. మామయ్యగారు,-అర్ద సహస్రందాటి బ్లాగులో మంచి మంచి విషయాలు తెలిపిన మీకు కాదు గుర్తింపు సమశ్య. ఈబ్లాగుకు స్పందన ద్వారా మీబ్లాగులో మాదే అసలైన గుర్తింపు కోసమని నాఅభిప్రాయం.[ఈమధ్య ఛోటా మోటా నాయకులు పాపం సమ్మె పేరుమీద గుర్తింపు కోసం చాలా ఆదుర్దా పడుతున్నారు.]

  • @s.venkataramayya
   అల్లుడుగారు ఆరూట్లో వచ్చారా!. ఇదంతా మీ ప్రేమ అభిమానం కాదుటండీ.మీరు అల్లుడయినపుడే మాకు గుర్తింపు వచ్చింది కదండీ.హిమవంతుడు శివునికి మామగారయినందువల్ల గొప్ప గుర్తింపురాలేదూ?
   ధన్యవాదాలు.

 5. మీ పోస్ట్ చాలా ఉన్నతంగా ఉంటుంది, నేను చనువుగా ఏదైనా అని ఉంటే మన్నించండి, ఇకపోతే అచ్హుతప్పు (బ్లూగ్ ) బ్లాగ్ అని గుర్తించగలరు.

  • @ఫాతిమాజీ,
   టపాలు ఉన్నతమన్నది మీ కు నా పట్ల ఉన్న అభిమానానికి ప్రతీక. ఇక మీరు పొరపాటు, నాకు తెలిసి చెయ్యలేదు, ఎప్పుడూ, మీరెందుకలా అనుకున్నారో తెలియదు.
   ధన్యవాదాలు.

 6. సర్, ఇంతమంది అభిమానులం మేముండగా మీకు గుర్తిపు ఎందుకు లేదు,నిజానికి మీ ప్రతి పలుకూ గుర్తుండిపోతుంది. నేను త్వరలో “శర్మగారి అభిమాన సంఘం ” అని పెట్టాలని చూస్తున్నా..( ఉష్…ఏమీ లేదు మీ బ్లూగ్ చూసే పెద్దల ద్వారా నాకు గుర్తింపు వస్తుంది కదా..:-)

  • @ఫాతిమాజీ,
   ఇంకా నాకు గుర్తింపేంటండీ! ‘ఊరుపొమ్మంటోంది కాడు రమ్మంటోంది’, వయసు మూడు పొఆతికలకి ఉరకలేస్తోంది. ‘The day of destiny is nearing’. మనసు ముఫ్ఫయిల్లో ఆగిపోయింది.శ్రమ తీసుకుని అభిమాన సంఘాలు పెట్టెయ్యకండి :)నా బ్లాగ్ ద్వారా మీకు గుర్తింపా! బలేవారే, ఆ మాట మీ సౌజన్యానికి ప్రతీక
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s