శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళిలో నవదంపతులతో పేర్లు చెప్పించడం.

పెళ్ళిలో నవదంపతులతో పేర్లు చెప్పించడం.

gif (2)

పెళ్ళిలో నవ దంపతులతో పేర్లు చెప్పించడమొక ఆచారం, ఆనందం కూడా. నాడు ఐదురోజుల పెళ్ళిళ్ళు జరిగేవి కనక ఈ ముచ్చటకి సావకాశమూ ఉండేది.అమ్మాయి కుడిచేతి చిటికిన వేలు పట్టుకున్నవాడు, పట్టుకోడానికి అర్హత ఉన్నవాడు, భర్త మాత్రమే, ఆ చిటికిన వేళ్ళు లంకె వేసి హృదయాలను లంకె వేసుకుంటారు. అందులో భాగమే పేర్లు చెప్పించడం.  పెళ్ళి అయిన వెంటనే పెళ్ళికూతుర్ని తీసుకుని విడిదికి వెళిపోతాడు, పెళ్ళికొడుకు. అక్కడ గడప దగ్గర, ఆడపడుచులు, అత్తగార్లు, పిన్నత్త గార్లు, పిన్నిలు, బావలు, అక్కలు, మామ్మ,తాతా, అమ్మమ్మ తాతా అంతా కలిసి అడ్డేస్తారు,ఇరుపక్కలవారూ. పేర్లు చెప్పిగానిలోపలికి వెళడానికి వీలు లేదని. అప్పుడు మొదలవుతుంది, ఎవరు చెప్పాలి మొదట? అనే తగువు. మీ అబ్బాయి ముందు చెప్పాలంటే, మీ అమ్మాయే ముందు చెప్పాలని వాదులాడుకుని చివరకి అబ్బాయినే చెప్పమని తగువు తీరుస్తారు. కొంత మంది వెంటనే చెప్పేస్తారు. కొంతమంది సిగ్గు పడతారు, నవ వధువు పేరు చెప్పడానికి, ఆ తరవాత అమ్మాయి వంతు. అమ్మాయి కొద్ది సేపు తరవాత పేరు గొణిగేది. ఎవరికీ వినపడలేదు మళ్ళీ చెప్పాలనేవారు. అమ్మాయి చేత చెప్పించేవారు మొత్తానికి.  ఇలా పేర్లు చెప్పడం ఒక సారిదా? పెళ్ళి జరిగిన ఐదురోజులలో వధూవరులు చాలా సార్లు పెళ్ళి ఇంటి నుండి విడిదికి అక్కడనుండి ఇక్కడికీ తిరగడం జరిగేది. ప్రతిసారి ఈ పేర్లు చెప్పడం కార్యక్రమం ఉండేది.

పెళ్ళయి కాపరాని కెళ్ళిన తరవాత దశలుగా పిలుపుల్లో మార్పులొచ్చేవి. చాక్లెట్, చెక్కరకడ్డి, బంగారుకొండా, నుంచి తరవాత కాలంలో ఏమండీ, మిమ్మల్నే, వింటున్నారా, వున్నారా( పొలేదా? ఆడువారి మాటలకి అర్థాలు వేరు కదా) ఆ తరవాత ఒరేయ్ మీనాన్న ఎక్కడ? చెవిటిమేళం పిలవలేక ఛస్తున్నాను, తరవాత ఎక్కడ చచ్చేరూ, వినిపించుకుని చావరు దాకా మారిపోయేది. ఇక భర్త మొదటిలో (పెళ్ళాం బెల్లం, తల్లి అల్లం సామెత కదండీ) రసగుల్లా, రస్సూ,జాంగ్రి, కాజా, నా మడత కాజా,,మైసూర్ పాక్, జిలేబీ, బెల్లం, కుందనం, బంగారం అని పిలుచుకునేవారు లేదా పేరే మార్చేసి లేదా తెగ్గోసి వసూ,రాసూ, విమూ,కామూ,ఈవిడ దిబ్బ మొహందయినా గులాబీ, సంపెంగ, మల్లి, జాజి ఇలా సాగిపోయేవి పిలుపులు. ఇలా ఉండేది.తరవాత కాలం లో ఒసే, ఒసేయ్, ఏమోయ్ దాకా సాగేది ఆ తరవాత కాలం లో చెవిటి మేళం ఎక్కడ చచ్చేవు, దెయ్యం, ఒరేయ్ మీ అమ్మెక్కడ చచ్చిందీ, ఇలా సాగిపోతూ ఉండేది. బయటివారితో మాటాడేటప్పుడు మాత్రం ఇంటావిడ, ఇల్లాలు, శ్రీమతి అని మగవారు, ఇంటాయన( వంటాయన లెండి ), యజమాని, వారు, శ్రీవారు, ఇలా సంబోధనలు జరిగేవి..

oie_18112552XGGS341W

ఇప్పటి కాలం లో ఐదురోజుల పెళ్ళిళ్ళు కాదు కదా ఒక రోజు పెళ్ళి కాక కొన్ని గంటల పెళ్ళి అయిపోయింది కనకా, ఇప్పుడు పెళ్ళిళ్ళన్నీ గాంధర్వాలే! ఊరికే తంతు నడిపించి అయిందనిపిస్తున్నారు. అమ్మాయి అబ్బాయి యూనివర్సిటీ లోనో ఆఫీసులోనో కలిసి చదువు కాని, ఉద్యోగం గాని సాగిస్తున్నారు. అప్పటినుంచే శీనూ ( అదే లెండి చీనూ  మరీ ప్రేమెక్కువయిపోతే), వగైరా పిలులతో మగవారు స్వీటీ,బ్యూటీ, నాటీ, బర్ఫీ ( బూరి బుగ్గలతో ఉంటే ముద్దుగా) అనీ పిలుచుకుంటూనే ఉన్నారు. మరో వింత చూశా ఈ మధ్య, పిల్లవాడిని ఒడిలో పెట్టుకుని పెళ్ళి చేసుకున్నారు. ఇదేమన్నా! అక్కడెక్కడో ఉండగా సహజీవనం చేసేరట,దాని ఫలితం తో దేశం లో అడుగు పెట్టేరట, విదేశీ పౌరునితో, ఇక్కడ కొచ్చాకా ఇద్దరి తల్లి తండ్రులూ జుట్లు పీక్కుని పెళ్ళి చేసారు,ఇంక పేర్లు చెప్పడం ముచ్చటెక్కడ?.

ప్రకటనలు

11 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళిలో నవదంపతులతో పేర్లు చెప్పించడం.

 1. మా ఆవిడ పేరు ఉమా రాణి,
  తనని నేను రాణి అని, తను నన్ను రాజా
  అని పిలవడం ముప్పై ఐదేల్ల
  మిలిటరీ కాపురం లో అలవాటై పొయింది.
  ఉమా అమ్మమ్మ మోహన్ తాతను రాజా
  అని ఎందుకు పిలుస్తుందీ?
  అని మా లండన్ రిటర్ న్ డ్ మనమరాలి సందేహం!

 2. ‘పిల్ల వాడిని ఒడిలో పెట్టుకుని ‘ మన దేశం లో ‘ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని మీరు ఆశ్చర్య పోతున్నారు శర్మగారూ !
  కనీసం ఒక దశాబ్దం క్రితం మాట ! ఇంగ్లండు లో ఒక వివాహానికి ఆహ్వానించారు నన్ను ! ఉత్సాహం గా వెళ్లాను ! అక్కడ, వరుడి వయసు ముప్పై నాలుగు ! వధువు వయసు అరవై మూడు ! వధువు తో పాటుగా , ఆమె కూతురు , ఆమె కూతురు తో కూడా వచ్చారు ! వారిది ప్రేమ వివాహం ! ప్రేయసీ ప్రియుల ఇరువురి మధ్యా ప్రేమ చిగురించాక , ఆ ప్రేమ ఫలాలు జనించాక, వారితో కూడా వివాహం చేసుకోవడం పాశ్చాత్య దేశాలలో సామాన్యమే ! ‘ ఈ విషయం లో మన దేశం ఇంకా ‘ వెనుక బడి ‘ ఉందేమో !

  • @సుధాకర్ జీ,
   ప్రస్తుతానికి మీరు చెప్పినట్టు జరగటం లేదు మన దేశంలో, వెనకపడ్డారేమో, కొద్ది కాలం లో ఆ ముచ్చటా తీరచ్చు.
   నమస్కారం.

 3. మామయ్యగారు,-ఆనటి పెళ్ళిళ్ళు ఆతంతులు ఆ ఆనందం ఎప్పటికీ మరువలేని మధురానుభూతులు. ఆడపడుచు అలగటం,మరదలు మాడ, దొంగవేలం,దండాడింపు ఇలాచెప్పుకుంటూపోతే ఎన్నిముచ్చట్లు. ఇప్పటివారికి ఇవేమీ అక్కర్లేదు. ఇప్పుడు మేము ఇక్కడ పెళ్ళి చేసుకుంటున్నాము. మీరు అక్కడ టీవీలో చూడండి అనే రోజులు వచ్చినవి. మీ ఫుణ్యమా అని మాకు పాతరోజులు గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదములు.

 4. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళిలో నవదంపతులతో పేర్లు చెప్పించడం. | Bagunnaraa Blogs

 5. మీరు వ్రాసిన టపా , జిలేబి గారి వ్యాఖ్య రెండూ బాగున్నాయండి.

  ఈ కాలంలో కొందరు , జీవిత భాగస్వామినే మార్చేస్తున్నారు ఇక పేర్లలో వచ్చే మార్పులు (సంబోధనలు ) ఒక లెక్కా ?

 6. శర్మ గారు,

  ఈ కాలం వారు, చీను తో మొదలెట్టినా అరవై దాటినా కూడా చీను అనే పిలుస్తున్నారు మరి ! ఈ కాలం వారి ‘రాస గుల్లా’ నిత్య నూతనం !

  చీర్స్
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s