శర్మ కాలక్షేపంకబుర్లు-సంజాయిషీ

సంజాయిషీ

neha chaterjee

Courtesy: neha chatarjee

సంజాయిషీ అంటే సమాధానము, ప్రత్యుత్తరము, explanation అన్నారు నిఘంటుకారులు. ఇప్పుడా అవసరమేం వచ్చిందంటే, ఒక పని చేసినపుడు, మాట అన్నపుడు దాని గురించిన తప్పొప్పుల వివరణే సంజాయిషీ అని నా ఊహ.

మొన్న టపా రాస్తూ” తనువు మనసు అలిశాయాన్నా! విశ్రాంతి కోరుతున్నాయన్నా! వరుసగా కష్టలొస్తున్నందుకన్నా!”  “కష్టాలు మనుషులకి తప్పించి మానుల కొస్తాయా?” అన్నది సామెత. నిజమే అలా ముగ్గురు సోదర సోదరీ మణులను పోగొట్టుకున్నప్పుడు బాధ అనుభవించా, తేరుకున్నా. ఇప్పుడు ఒక ముఖ్యమిత్రుడు సోదరునికంటే ఎక్కువ వాడు, కాలం చేస్తే తట్టుకోలేకపోయా. నేనూ మనిషినే కదా! అంతకు ముందు రెండురోజులకితం, నేను మరచిన పూర్వ గాధలను తవ్విపోసి నా మనసులో కొత్తగా పాత విషయాలు గుర్తు చేసి చెప్పకుండావెళ్ళిపోయాడు. అది తట్టుకోలేని బాధ. మరొకటి, నాకంటే పెద్దవారు వెళుతున్నారంటే అందం, కాల గమనమనుకోవచ్చు కాని వీరంతా నాకంటే చిన్న వాళ్ళు, వీళ్ళు నాకు తెలియకుండా రిసర్వేషన్ కన్ఫం చేసుకుని బండెక్కేస్తుంటే, చూస్తూ ఉండిపోతున్నానన్నదే నా బాధ.

టపా రాసిన రోజు పెద్దబ్బాయి  పక్క స్థలంలో ఇల్లు కట్టుకోడానికి పని మొదలుపెట్టెలా ఎత్తుపోయిస్తానని చెప్పేడు. ఆ రోజు పనిమొదలు పెట్టేరు. చిన్నబ్బాయి సోలార్ పవర్ తాలూకు వేయిస్తున్ననని చెప్పేడు. అల్లుడు గారూ అలాగే చెప్పేరు. టపా వేసిన మరునాడు సాయంత్రం అల్లుడు గారి దగ్గరకెళ్ళి “సోలార్ సిస్టం ఎలా పని చేస్తున్నదంటే,” “బాగానే ఉంది కాని  ముందుఈ మాట చెప్పండి, బ్లాగు చూశారా?” అన్నారు. ” టపా వేసిన తరవాత మరి కంప్యూటర్ దగ్గరికిపోలేద”న్నా. “చూడండి!” అంటూ చూపించారు, ఆయన రాసిన వ్యాఖ్యతో సహా. నేను అవాక్కే అయ్యాను.

మా అల్లుడు గారు, మీ అందరి తరఫున “దీనికి మీ సంజాయిషీ ఏమిట”న్నారు, “మీ చివరి మాట కళ్ళనీళ్ళు తెప్పించింది, మీ నిర్ణయం మార్చుకోండ”న్నారు. “ఏగతి రచించినన్ సమకాలికులెవ్వరు మెచ్చరేగదా!” అని చేమకూర వేంకన్న వాపోయాడు. నేను నిజంగా అదృష్టవంతుడిని. నాకు రెండిళ్ళ అవతలున్న ఒకరు నా ప్రత్యక్ష అభిమాని, ఇది నిజంగా బ్లాగర్ గా నాకు గౌరవమే. దూరానున్నవారికి నేను చెప్పినదే నిజం, కాని ఇక్కడ అల్లుడుగారు నిత్యం నన్ను చూసి మాటాడేవారు, నా అభిమాని మీతరఫున అడిగితే సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందికదా!

steven krohn

courtesy: Steven krohn

మరోమాట, నలభై సంవత్సరాల అలవాటు, సిగరట్టును వదలిన వాడిని, రెండు సంవత్సరాల క్రితపు అలవాటు నెట్ వదలలేనా అనేది కూడా ఆలోచన. ఇంటి దగ్గరున్నపుడు సెల్ ఫోన్ ఎక్కడో పడేస్తాను. కోడలుంటే చూసి తెచ్చి ఇస్తుంది. పది రోజులుగా కోడలు పుట్టింటికి వెళ్ళడంతో దానిని చూసేవారు లేరు. నెట్ లోకి రావడం మానేశాను. అందుకు ఎవరు ఏమన్నదీ చూడలేదు. ఇప్పుడు చూశాను. అందరికి వందనాలు.

ఇక “ఆ మాట ఎందుకన్నావని” నిలదీసింది బుద్ధి, మనసును..మనసందీ “నాకు బాధ కలిగింది విశ్రాంతి కోరుతున్నా! ఏమో తిరిగిరాలేనేమో ననుకున్నా. అందుకు నలుగురుకలిసి నవ్వేవేళ నా పేరొక సారి తలవండి” అన్నా. నిజంగా ఆ మాటన్నపుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగిన మాట సత్యం. మరి లా ఎందుకన్నావంటే వయసు తక్కువ వాళ్ళం కదా ( మా జిలేబీ గారి భాషలో మిగిలిన వయసు) చెప్పి మానేస్తే ఇంత తర్జనభర్జన పడితే, ఇక చెప్పాపెట్టక మానేస్తే ఎంత బాధ పడతారు, ఇంతకీ ఈ బాలా కుమారుడు ఉన్నట్లా అని, అంత ఉత్సుకత అవసరమా అని, ఇలా చెప్పేననమాట. బ్లాగ్ గురువుగారు మొదటిలోనే ఒక మాట చెప్పేరు, “ఇదొక మాఫియా, మనసు మాఫియా! మీరు వచ్చేదాకానే మీ ఇష్టం, తిరివెళ్ళడం మీ చేతులలో లేద”ని. ముఖపుస్తకానికి ఒకటే ద్వారం లోపలికేకాని బయటకు కాదని. నాకూ దానికీ సగమెరికలెండి.

steven krohn (1)

తీరుబడిగా పెద్దబ్బాయి పని పూర్తి చేసి సోలార్ పవర్ వేయించి, ఆలోచిస్తే బాధ కలగడమూ సహజమే, బాధ పడటమూ సహజమే, మనిషివి కనక, మనసున్నది కనక కనక,నిరాశలో కూరుకుపోవద్దన్నదీ మనసే, మళ్ళీ తేరుకుని మనుషుల్లో పడటమూ అవసరమే అంది మనసు, బుద్ధీ కూడా. నా ఈ సంజాయిషీని పెద్ద మనసుతో అంగీకరించమని వేడుకోలు.

మనసెంత చిత్రమైనదీ! అందుకే శంకరులు సౌందర్యలహరిలో “శివా! నీవొక బిచ్చగాడివి, నా మనసనే కోతి, విషయ సుఖాలనే అడవిలో తిరుగుతూ ఉంది, స్థిరం లేక. నీవెలాగా బిచ్చగాడవు కనుక, నా మనసనే కోతిని, నీ భక్తి అనే తాడుతో బంధింపచేసి తీసుకుపో!” అని వేడుతారు. పూర్తి శరణాగతి అంటే ఇదేనేమో!

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సంజాయిషీ

 1. మాస్టారూ .. బ్లాగ్ వ్రాయడం కొనసాగించే ఆసక్తి లేకున్నా ..అభిమానులని పలకరించడానికైనా మీరు వ్రాస్తూ ఉండాలి . వ్రాస్తారు కూడా .. ధన్యవాదములు .

  • @వనజగారు,
   ఈ అలవాటు నన్నొదిలేలా లేదు. ఇక వదిలించుకోడానికీ ప్రయత్నం చేయను, ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 2. మామయ్యగారు,-ధన్యవాదములు. మీపునరాగమనమునకు నన్ను భాగస్వామినిచేసి మీవిశాల హ్రుదయంలో నాకీ అవకాశం దక్కడం నాఅద్రుష్టం. సదామీఆదరాభిమానాలకోరుతూ మీ అభిమానులతో ఈఅనుసంధానానికి సహకరించిన సోలార్ కీజై

  • @అల్లుడు గారు,
   తన వారిని ప్రేమించలేక, పక్క వారిని ప్రేమించలేక, ఒంటరిగా ఎందుకండీ బతుకు? మీ అభిమానమే నన్ను మరల బ్లాగులోకి లాక్కొచ్చింది 🙂 మరి సోలార్ గురించి రాయాలి, ఒక టపా రాసేస్తా.
   ధన్యవాదాలు.

 3. ఆయువున్నంత వరకు వ్రాయండి – జీవి / తానుభవము చిత్రించి – సజీవ చిత్ర / ములు – చదువరులందరకు ప్రమోద మిడును / ఆయు రారోగ్య భాగ్య సౌఖ్యములు కలుగు .

 4. ‘మిధునం’ లో ‘మధనం’
  కారాదు , మీ సమాధానం !
  ఝుపిళిన్చండి, మీ కలం !
  దూకండి, ‘ కధన ‘ రంగం లో,
  చేయండి, బ్లాగోజ్వలనం !

  • @సుధాకర్ జీ,
   నన్నేమో రాయండి రాయండి అంటారు, మీరేమో మంచి కవితలు రాస్తున్నారు వ్యాఖ్యలుగా, కొన్ని చోట్ల చూశానుకూడా, మీరొక బ్లాగు మొదలెట్టాలిసిందే! ఈ అలవాటు మరో పది మందికి అంటించాలిట 🙂 అప్పుడు తగ్గుతుండిట ఈ రోగం :). మళ్ళీ మొదలెట్టేసేను, ఈ సారి చెప్పడం, చెప్పకపోవడం రాదండి! మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 5. ఇప్పుడే చూశానండి. హమ్మయ్య ! దైవం దయ వల్ల మీరు మళ్ళీ బ్లాగ్ వ్రాస్తున్నారు.

  మీరన్నట్లు, నిరాశలో కూరుకుపోకుండా మళ్ళీ తేరుకుని మనుషుల్లో పడటమూ అవసరమే .

  సోలార్ పవర్ వేయించినట్లు వ్రాసారు. మనకు సూర్యరశ్మి ఎక్కువే కాబట్టి, అందరూ కూడా తమ గృహ అవసరాలు తీరటం కోసం సోలార్ విద్యుత్ వాడుకుంటే మంచిది.

  సోలార్ విద్యుత్ వల్ల ముఖ్యంగా ఎండాకాలంలో విద్యుత్ కోతల బాధ ఉండదు.

  పెట్టుబడి ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా.. వేల రూపాయల కరెంట్ బిల్లుల బాధ తప్పుతుంది. ఇంకా సహజవనరులు తరిగిపోవు.

  • @అమ్మాయ్ అనురాధ,
   మాటకు ప్రాణము సత్యము కదా! మీ అభిమానపు మాటలు మళ్ళీ నాకు ఆత్మ విశ్వాసం కలిగించాయి. ఎక్కడికిపోతానమ్మా! ఇదో పెద్ద బలహీనత? నిజమేకదూ 🙂 సోలార్ వేయించాము, ఆ టపా ఒకటి రాయాలి, మీ అందరికీ చెప్పద్దూ!
   ధన్యవాదాలు.

  • @మిత్రులు పంతుల జోగారావు గారు (పంజోగారు)
   ఆత్మ విశ్వాసం కోల్పోతే సర్వమూ కోల్పోయినట్లే కదండీ. మీ అభిమానానికి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s