శర్మ కాలక్షేపంకబుర్లు-అసూయ.

అసూయ.

examlife (1)

ఈ సంఘటన నేను జబల్పూర్ లో టెలికమ్ ట్రయినింగ్ సెంటర్ లో ఉండగా జరిగింది. ఇదొక పెద్ద సంస్థ, చాలా పెద్ద కేంపస్ లో ఉంటుంది, it is a deemed university, biggest in Asia. కంటోన్మెంట్ మధ్యలో ఉంది. అసలు చెప్పాలంటే టెలికం కి పుట్టినిల్లని చెప్పచ్చు. ఇక్కడే ఆర్మీ వారి టెలికం వ్యవస్థ కూడా ఉంది, అదీ ట్రయినింగ్ సెంటరే. అక్కడ జె.యి గా ట్రయినింగ్ కు నన్ను పంపేరు,నాకు బాగా పరిచయమున్న సబ్జక్ట్ transmission లో.కింది కేడర్లవారికి పోటీ పరీక్షలో నెగ్గితే ఇలా ట్రయినింగ్ ఇస్తారు.

అక్కడ ట్రయినింగ్ లో ఉదయం ధియరీ, మధ్యాహ్నం ప్రాక్టికల్స్ లేబ్ లో ఉండేవి. మా బేచ్ లో మొత్తం ముఫై మందికి మొదటి పది మంది తెలుగువారు, మిగిలినవారు దేశం మొత్తం మీద నుంచి వచ్చినవారూ ఉన్నారు, నేను మా బేచ్ కి లీడర్ని కూడా. మొత్తం ముఫై మందిలో పది మంది మాత్రమే, ఇదివరలో ఈ సబ్జక్ట్ గురించి కొద్దో గొప్పో తెలిసినవారు. మిగిలినవారికి ఇది అంతా అయోమయం. మా బేచ్ ని ప్రాక్టికల్స్ కోసం మూడుగా విభజించారు. అందులో మొదటి పది మంది తెలుగువాళ్ళం, నా రోల్ నంబర్ ఒన్.

మొదటిరోజు లేబ్ కి వెళ్ళేం, పరిచయాల తరవాత, అనగా ఎవరు ఏ ఉద్యోగం చేసేవారన్నది తెలుసుకున్న తరవాత, ప్రాక్టికల్స్ మొదలు పెట్టేరు, మొదటి రెండు రోజులూ మెసరింగ్ ఇనుస్ట్రు మెంట్స్, అనగా ఎవో మీటర్ వగైరా, చెప్పేరు. మూడవరోజు ఒక సిస్టం గురించి చెబుతామని చెప్పేరు, దాని దగ్గర చేరేము, అందరూ దాని గురించి చెప్పుతున్నారు, ఎవరికి తోచినది వారు. నేను దూరంగా కూచున్నా. మా పది మందిలో ఆరుగురం టెక్నికల్ అసిస్టెంట్ లం ఉన్నాం. అందులో ఒకడు ‘నీకు ఈ సిస్టం గురించి తెలుసా?’ అన్నాడు, ఎకసెక్కెమాడుతున్నట్లు. ‘తెలుసు’ అన్నా. అప్పటికి నా వయసు నలభై, అతని ఉద్దేశం నాకేం తెలియదని. నేను చెప్పడం మొదలు పెట్టేను. ఎక్కడ ఉన్నది మరచాను,అందులో ములిగిపొయా, చెప్పుకుపోతున్నా, సమయమూ మరచాను. కొద్ది సేపటికి పక్కనున్న వాడు గిల్లేడు. ఆగి వెనక్కి చూస్తే ఇనస్ట్రక్టర్ కనపడ్డారు. ‘పొరపాటయింది చూడలేదని’ చెప్పుకుని క్షమాపణ వేడాను. ఆయన ‘నువ్వు చెబుతున్నది చాలా సేపటి నుంచి విన్నాను, బాగా చెబుతున్నావు, పూర్తి చెయ్య’మన్నారు. మళ్ళీ మొదలు పెట్టి పూర్తి చేసి, విన్న వారిని ‘అనుమానాలుంటే అడగ’మన్నా. ఎవరూ మాటాడలేదు, ఇనసట్రక్టర్ గారు మాత్రం కొన్ని కీలక ప్రశ్నలేసి నేను చెప్పిన సమాధానాలు విని భుజం తట్టి వెళ్ళిపోయారు. ప్రతి రోజు విద్యార్ధి అవగాహన చేసుకున్నదానికి పది మార్క్ లకు గాను అందరికి తొమ్మిది వేసి నాకు తొమ్మిదిన్నర వేశారు,మార్కుల లిస్ట్ అందరూ చూసేలా బయట వదిలేసేవారు.. మర్నాడు ఆ తరవాత రోజు అలా తొమ్మిదిన్నర మార్కులు వేస్తూ పోయారు. ఒక వారం గడిచింది. ఒక రోజు డైరెక్టర్ గారు వచ్చేరు, నన్ను బయటి కూచోమన్నారు, పిలుస్తామన్నారు. ఏంటో అర్ధం కాలేదు, బయటికి వెళ్ళి కూచున్నా. అరగంట తరవాత పిలిచి ఒక సిస్టం చూపించి ‘దీనిలో ఫాల్ట్ ఉంది, సరి చేయ’మన్నారు. డైరెక్టర్ గారు చూస్తున్నారు. నేను కావలసిన పని ముట్లు తీసుకుని సరి చూసి ఎక్కడ ఫాల్ట్ ఉన్నదీ కనిపెట్టి, ఒక ట్రాన్సిస్టర్ చెడిపోయినది బయటకు తీసేసి మరొక కొత్తది అడిగి తీసుకుని,దానిని పరీక్షించి, జాగ్రత్తలు తీసుకుని వేసి బాగున్నట్లుగా చూపించాను, రీడింగ్ మీటర్ మీద. డైరెక్టర్ గారు దగ్గరకొచ్చి భుజం తట్టి వెళిపోయారు. జరిగినదేమో నాకు తెలియలేదు. మర్నాడు మరల డైరెక్టర్ గారు వచ్చి, మా బేచ్ లో కొంతమందిని పేరు పెట్టి పిలిచి, ‘మీరు జి.ఎం గారికి చేసిన కంప్లయింట్ మీద నిన్న శర్మ కి పరిక్ష పెట్టేము, అతను నెగ్గేడు, మీరూ చూశారుకదా! అతనికి తొమ్మిదిన్నర మార్కులు వేయడం సమజసమే’ అని చెప్పమన్నారని చెప్పి వెళిపోయారు.

tazein mirza saad

అప్పుడుమా ఇనస్ట్రక్టర్లు అందరూ, ‘నిన్న నువ్వు ఫాల్ట్ అటెండ్ చేస్తున్నంత సేపు, నీకు కాదు పరిక్ష, మాకు పరిక్షయిందయ్యా!’ అన్నారు. ‘నువ్వు ట్రయినింగ్ కు ముందే పరీక్ష నెగ్గేవు’ అని, ‘నీ వాళ్ళే జి.ఎం గారికి కంప్లయింట్ చేసారయ్యా! నీకు రోజుకు అర మార్క్ ఎక్కువేస్తే మొత్తం అన్ని రోజులలో ఎన్ని మార్కులు ఎక్కువ వస్తాయో చూసుకుని అసూయ పడి మీ వాళ్ళు పరోక్షంగా నీ మీద, ప్రత్యక్షంగా మా మీద కంప్లయింట్ చేసేరు, జి.ఎం అడిగితే మేము సమాధానం చెప్పేము, దాని ఫలితమే నీకు డయిరెక్టర్ గారు, నిన్న  పెట్టిన పరీక్ష, మేము నీ తరఫున భరోసా ఇచ్చిన దాని ప్రకారం,నీకు వీటి గురించి పూర్తిగా తెలుసునని చెప్పినందుకు’ అన్నారు. అలా నాకు రోజూ తొమ్మిదిన్నర మార్కులు వేశారు. ఈ కంప్లయింట్ చేసిన వారిని తిట్టేరు. అసలు నాకు, నా కూడా ఉన్నవారే జి.ఎం గారిదగ్గరకెళ్ళి నాకు తొమ్మిదిన్నర మార్కులు వేస్తున్నారని కంప్లయింట్ చేసినట్టే తెలియలేదు. 

ఈ విద్య నీకెలా పట్టుబడిందంటారా! నేను టెక్నికల్ అసిస్టెంట్ గా ట్రయినింగ్ పూర్తి చేసేలోగా ఒక ఆఫీసర్ గారితో తగువొస్తే ఆయన నన్ను బయటికి పంపేసేరు. అదుగో అప్పుడూ నన్ను పాలకొల్లు వేసేరు టెక్నికల్ అసిస్టెంట్ గా. అప్పుడు అక్కడ గంగరాజు గారని ఒక టెక్నీషియను గురువు దొరికేరు. ఆయన ఇందులో నిధి. తండ్రి కొడుక్కి విద్య నేర్పితే ఎలా వుంటుందో అలా నేర్పేరు ఆయన ఈ విద్య. ఇందులో చిట్కాలు, ఫాల్ట్ పట్టుకునే విధానం, చూడగానే రోగ నిర్ణయం ఎలా చేయాలో వగైరా అంతా ఆరు నెలల్లో పూర్తి చేసేరు.ఆరు నెలలు పెళ్ళాం పిల్లలు దగ్గర లేరు కనక గురువుకి శుశ్రూష చేసేను.అప్పుడే ఆయన ఓపికకి ఉన్న ప్రాముఖ్యత కూడా వివరించారు. అలా ఆ గురువు విద్య నేర్పి నేను ఆరు నెలల తరవాత కాకినాడకి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా నమస్కరించి ఆశీర్వచనం కోరితే,’నీకు ఈ విద్యలో తిరుగులేదు, ఎక్కడయినా జయించుకురాగలవ’ని ఆశీర్వదించారు. ఆ రోజు ఆయనే నా చెయ్యి పట్టి, నా వెనక ఉండి పరీక్షలో నెగ్గించి ఉంటారు. వారు స్వర్గస్తులయ్యారు, స్వర్గంలో ఉన్న గురువుకి వందనం.

మా వాళ్ళు కోపం తీరక మరొక సారి ఇటువంటి ప్రయత్నం చేసేరు.    నేను పెద్దమ్మాయి పెళ్ళికోసం ఐదురోజులు శలవు పెట్టి కాకినాడ వచ్చాను. ఆ సమయం లో ఒక సబ్జక్ట్ మీద ఫైనల్ ఎగ్జాం పెట్టమని,లెక్చరర్ గారిని  ఒత్తిడి చేశారట. అలా కనక నేను పరిక్షకి హాజరుకాకపోతే, సప్లిమెంటరీ రాసి మొదటి మార్క్ తెచ్చుకున్నా జూనియర్ అయిపోతాను. అలా నన్ను జూనియర్ని చేసి నాకు వచ్చే మంచి పోస్టింగ్ ఛాన్సులు పోగొట్టాలని ప్రయత్నం.     అందుకు ఆ లెక్చరర్ మీద ఒత్తిడి తెచ్చేరట, నేను శలవులో ఉండగా, ఆఖరికి ఆయన చేత పరీక్ష నేను రయిల్ దిగి వచ్చేరోజున  పెట్టడానికి ఒప్పించారట. నేను రయిల్ దిగి వెళితే ఆ రోజు ఫలానా ఫైనల్ ఎగ్జాం అని చెప్పేరు. అందరూ పుస్తకాలు పుచ్చుకుని తెగ చదివేస్తున్నారు. నేను తిన్నగా హాల్ లోకి పోయా. హాయిగా పరీక్ష శాను, చిత్రం నాదే మొదటి మార్కు.

వారి అసూయ అప్పుడూ ఫలించలేదు. అంతా అమ్మ దయనుకున్నా. ఇటువంటి అనుభవాలు రాస్తే స్వంత డబ్బా వాయించుకున్నట్టు ఉంటుందేమోనని కొద్దిగా….భయం..

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అసూయ.

 1. జై గంగరాజు గారూ!! ఆయన నేర్పేక ఇంకా ఎందుకూ సందేహం? హాలాహలాన్ని ఇట్టే పట్టేసారు. సాధారంగా ట్రాన్సిస్టర్, కెపాసిటర్ల ప్రోబ్లెం పట్టుకోవడానికి చాలా నేర్పు ఉండాలి. మీకు తగువొచ్చినా గంగరాజు గారు దొరకడం మంచిదైంది కదా? అన్ని చోట్లా ఇలాంటి వాళ్లు ఉంటారు. మనకి కనబడకుండా. దబ్బా కొట్టుకోడానికి ఈ ఏజ్ లో మీకు భయం అనవసరం. ఇంకా ఉద్యోగం చేస్తూ ఉంటే అలా అనుకోవచ్చు గానీ.

  ఇంతకీ అనపర్తి కాలేజీలో పార్ట్ టైం పాఠాలు చెప్పకూడదూ? మీ నాలెడ్జ్ ఉత్తినే పాడుచేసుకోవడం ఎందుకూ?

  • @సున్నా గారు,
   నిజమే! ప్రతి చోటా మనకు ఉపకారం చేసేవారూ దొరుకుతారు. ఐతే మనమేవారిని గుర్తించలేము. మీరు చెప్పిన సూచన బాగుంది, ప్రయత్నం చేస్తా.
   ధన్యవాదాలు.

 2. మీ టపా కి అర్దం సుధాకర్ గారి వాఖ్యలో తెలుస్తుంది. వారన్నట్లు బ్రతుకు పరీ్క్షకీ,మెతుకు పరీక్షకీ్ వ్యత్యాసం ఉంది.
  అతి భయంకరమైనదీ అసూయ, మనిషిని నొప్పితెలీకుండా కుత్తుక కోసేది ఈ అసూయ.
  బ్రతుకు బాటలో ఈ అసూయా పరులను ఏరి పారేయండి.

  • @ఫాతిమాజీ,
   అసూయాపరులెప్పుడూ వ్యధ చెందుతారు. వారిని మనమెవరం తొలగించడానికి, అమ్మ తొలగిస్తుంది, సమయానికి.మనలో కావలసింది స్వఛ్ఛత, పట్టుదల, ఓర్పు.
   ధన్యవాదాలు.

 3. నిజమే !
  జీవితం, ఎన్నో పాఠాలు చెబుతుంది !
  సిలబస్, బ్రతుకు పుస్తకమంతా !
  ఎన్నో పరీక్షలు కూడా పెడుతుంది !
  చాలామందికి, ఈ పరీక్షలకు సిద్ధం చేసే వారుంటారు !
  కొందరికి, పరీక్షలు రాసే వారూ ఉంటారు !
  కొందరు, పరీక్షలు లేకుండా ప్రమోట్ అవుతుంటారు !
  కొందరు ‘ బాగా రాసే ‘ వారి తో అసూయ గా ఉంటారు !
  చాలా మంది , పరీక్షలు రాస్తూ, సతమతమవుతుంటారు !
  బ్రతుకు పరీక్షలకూ , మెతుకు కోసం పరీక్షలకూ తేడా ఒకటే !
  బ్రతుకు పరీక్షల్లో విజయానికి , విత్తం దోహద పడుతుంది !
  మెతుకు కోసం పరీక్షల్లో విజయానికి, దృఢ చిత్తం దోహద పడుతుంది !

  • @సుధాకర్ జీ,
   జీవిత పాఠాలని చిన్న చిన్న మాటలలో బాగా ఆవిష్కరించారు.మెతుకు కోసం పరీక్షల్లో విజయానికి, దృఢ చిత్తం దోహద పడుతుంది ! నిజం, నాకు బాగా నచ్చిన మాట
   ధన్యవాదాలు.

 4. శర్మగారు.
  > ఆయన ఓపికకి ఉన్న ప్రాముఖ్యత కూడా వివరించారు……….నీకు ఈ విద్యలో తిరుగులేదు, ఎక్కడయినా జయించుకురాగలవ’ని ఆశీర్వదించారు.
  ఓరిమి గలవారికి విజయం తథ్యం. గురువుగారి ఆశీర్వచనం దైవవాక్యమే!

  >అందరూ పుస్తకాలు పుచ్చుకుని తెగ చదివేస్తున్నారు. నేను తిన్నగా హాల్ లోకి పోయా. హాయిగా పరీక్ష శాను, చిత్రం నాదే మొదటి మార్కు.
  భలే వారే! మీకు మొదటి మార్కు రాకపోతేనే కదా చిత్రం అనేది!

  >వారి అసూయ అప్పుడూ ఫలించలేదు. అంతా అమ్మ దయనుకున్నా.
  అసూయాపరులను వారి వారి అసహనమూ దుశ్చింతలే చెరుస్తాయి కాబట్టి వారు ఎన్నటికీ సరైన విజయం సాధించలేరు.
  ఒక్కొక్కసారి అసూయాపరులకు చిన్న చిన్న విజయాలు అందుతూ‌ ఉంటాయి. కాని అధర్మం యొక్క గెలుపు తాత్కాలికమే. అటువంటి అల్పవిజయాలు తదనంతరకాలంలో భయంకరమైన వినాశనాన్ని అపాదిస్తాయి వారికి. ఉదాహరణలు బోలెడు. మాటవరసకు దుష్టచతుష్టయం పాండుతనయుల్ని అడవులపాలు జేసి తాత్కాలికంగా గెలిచారే, అది వారికి కులనాశన హేతువై కూర్చోలేదా! అలాగన్నమాట.

  ఈ మీ‌ టపా నాకు అమితమైన సంతోషాన్ని చేకూర్చింది. మీ వలెనే నేనూ ఓరిమితో మంచి ఫలితాలే రాబట్టుకున్నాను. కొన్ని ఇప్పటికే‌ వేరే వ్యాఖ్యల్లో ప్రస్తావించినట్లున్నాను కూడా. అందుచేత మీ‌ టపా నాకు మరింతగా నచ్చింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s