శర్మ కాలక్షేపం కబుర్లు-కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు….

images

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు….

ఈ నానుడి మన తెనుగునాట చాలా విరివిగానే వాడతాం. అసలేంటి దీని సంగతి?

కాలం కలసిరాలేదు, అన్నీ సవ్యంగా ఉన్నా పిల్లలు పుట్టలేదు,ఆ దంపతులకి. వయసా అయిపోయింది ఎలా? పిల్లలు కావాలన్న కోరికా తీరలేదు, వృద్ధాప్యంలో చూస్తారేమోననే ఆశ కదా, పిల్లలుంటే. మరి కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడట. మీరు మరీ విడ్డూరంగా చెబుతున్నారు. కొడుకు కావాలంటే పెళ్ళి చేసుకోవాలి, శోభనం జరగాలి, కిందామీదా పడికష్టపడాలి, కడుపు పండాలి , నిలవాలి, పది నెలలు మొయ్యాలి, ప్రాణం మీద కొచ్చినా భరించాలి, కనాలి, ఉచ్చా,పియ్యా ఎత్తి, రోగాలూ రొచ్చులూ భరించి  చాకిరీ చెయ్యాలి,చదువు చెప్పించాలి,పెంచాలి. ఇవన్నీ అక్కరలేక కొడుకు పెద్దవాడవుతాడా? ఆ కలుగుతాడు, పెద్దవాడే కలుగుతాడు, నడిచొచ్చే కొడుకే పుడతాడు, కాలం కలిసొస్తే అదెలా? ఒకమ్మకి పిల్లలే భాగ్యం, మరొకమ్మకి పిల్లలు లేని భాగ్యం. మొదటి తల్లి దగ్గరకి రెండవ ఆవిడ పోయి చెరగుపట్టి యాచిస్తే, పిల్లలు కలిగినమ్మ తన పాదులో ఒక కాయను యాచించినమ్మకి ఇచ్చింది పెంచుకోమని. మరి ఈ తెచ్చుకున్నమ్మ కన్నమ్మ పడిన బాధలన్నీ పడిందా? లేదే కొడుకు దొరికాడు, ఎటువంటి వాడు పద్నాలుగేళ్ళ వయసువాడు, అందగాడు, తెలివయినవాడు, బుద్ధిమంతుడు దొరికాడు మరి కొద్దికాలం పెంచుకుంటే, అబ్బో జీవితంలో ముందు మిగిలేది ఆనందమే. కొద్దికాలం తరవాత కొడుక్కి పెళ్ళి, కోడలు రాక వంశాభి వృద్ధి ఎంతలో ఎంత మార్పు, దీనినే కాలం కలిసిరావడం అంటారు.కాలం కలిసొచ్చింది కనక నడిచొచ్చేకొడుకు కలిగాడు కదా! ఇదంతా ఎలా సాధ్యం ఒకే ఒక చర్య వల్ల, పెంచుకోడం మూలంగా కదా! అబ్బే సరిగా చెప్పలేకపోయారంటారా! ఒక ఉదాహరణ చెబితే సరిపోతుందా? వినండి.

wine_yRfAl1PE

 

Courtesy: Philomina minj                                        Wait &see

అనగా అనగా ఒక దేశం, ఆదేశం లో ప్రజాస్వామ్యం ఉందంటారు, కాని మహారాణీ, యువరాజు మాటే చెల్లుబాటు. అనుచరులెంతవారంటే అబ్బో చెప్పలేనంత! వీరభక్తులు. ముక్కు కోస్తే రక్తం తాగేటంత, ఇదంతా ఎందుకు? సొమ్ముకోసం. రాణీ గారి పరిపాలనలో అవినీతి పెరిగిపోయిందని, కోడి ఇల్లెక్కి కూస్తోందిట.  అబ్బే! తిన్నది అరగక ఆ కోడి అలా కూస్తోంది,( దాన్నే కూరొండు కుంటే? ఆ ఆలోచనావచ్చింది కాని కుదరలేదు.) తప్పించి మావాళ్ళంతా మంచి ముత్యాలని మహరాణీ వారి ఉవాచ. యువరాజావారికి పెళ్ళి కాలేదనే బెంగతో నిద్ర పట్టడం మానేస్తే పగటికలస్తున్నాయి, పంచరంగులలో, పోనీ అందులోకి అమ్మాయిలొస్తున్నారా? లేదు చింకిపాత గోచీవాడు కనపడుతున్నాడట, బెదిరిస్తూ. ఇదంతా చూస్తున్న ఒక సామాన్యుడికి తిక్కరేగి ఒక పార్టీ పెట్టేడు. ఇలా పార్టీ పెట్టుకున్నానని ఒక లేఖ రాశాడు, ఎన్నికలసంఘం వారికి. రాబోయే ఎన్నికలలో నాకో గుర్తు దయచేయమన్నాడు. మరి ఏం జరిగిందో తెలీదు కాని, ఇది ఎన్నికల స్వతంత్ర సంఘం లో వారిలో కలిగిన ఆలోచనతో జరిగిన పనో, మహారాణీ వారుగాని, యువరాజావారి రహస్యపు బంగారపు ఆలోచనతో ఇచ్చిన రహస్యపు ఉత్తరువో, లేదా తాబేదారుల బుర్రలో మొలిచినదో తెలియదు కాని, ఆ పార్టీకి మీ స్థాయి ఇదే అని చెప్పినట్లుగా,ఎగతాళీ చేస్తున్నామనుకున్నట్లుగా, ఎన్నికల గుర్తుగా ’చీపురు’ కేటాయించారు. అబ్బా! బలే గుర్తు కేటాయించారని అమ్మ, కొడుకు తాబేదారులూ తెగ సంబరపడిపోయారు, కూశారు కూడా. ఇప్పుడదే గుర్తు ఏకుమేకయి కూచుంది. ప్రతి ఇల్లాలు తెల్లవారి లేచిన తరవాత ముందుగా చూసేది తన అరచేతిని. అరచేతిని చూసి చూసి రేఖలు అరిగిపోయాయికాని, రాత మారలేదనుకుంటున్నారట. ఆ తరవాత చూసేది చీపురుకట్టనే, దీనినే శృంగారపు కట్ట అని కూడా అంటారు. ఇప్పుడాగుర్తున్న పార్టీవారు అమ్మలూ, తల్లులూ! మీరు రోజూ లేవగానే అరచేతిని చూసి చూసి విసిగిపోయారు. చీపురు చేతబట్టి ఇప్పుడు అవినీతిని తుడిచి పారెయ్యండి అంటున్నారట. చూశారా! ఎగతాళీ చెయ్యబోతే ఏంజరిగింది, దుర్యోధనుడికి ఘోషయాత్రలో జరిగినదే జరుగుతుందా? మరి ఆ పార్టీ గెలిస్తే ప్రజలకి నడిచొచ్చేకొడుకు పుట్టినట్టా? లేక ఆ పార్టీ కి అధికారం అనే నడిచొచ్చిన కొడుకు పుట్టినట్టా? కాలమే చెప్పాలి.

natural pearls

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు….

 1. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు… నానుడి గురించి ఎన్నో చక్కటి విషయాలను తెలియజేసారు.

  క్రింది చిత్రం ….ముత్యపు చిప్పలలో ముత్యాలు అనుకుంటున్నాను. నిజమేనాండి ?

  • @ఫాతిమాజీ,
   స్త్రీ లేక సృష్టి లేదు, ఆడదె ఆధారం మనకధ ఆడనె ఆరంభం అన్నారు నా మిత్రులు ఆకెళ్ళ. మరి అంత వారి చెయ్యి పడితేనే దేని కయినా మంచి మార్పు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s