శర్మ కాలక్షేపంకబుర్లు-కార్తీకం.

కార్తీకం.

కృత్తికా నక్షత్రం తో కలసివచ్చే పున్నమి కల నెల కార్తీక మాసం. ఇదివరలో ఒక టపాకి కార్తీక మాసం అని పేరు పెట్టేను కనక దీనికి కార్తీకం అన్నా. అసలు మీకు కార్తీక మాసం అంటే ఎందుకంత ఇష్టం అన్నారొక మిత్రులు. ఏం చెప్పను. శివ కేశవులు లకు భేదం లేదని నమ్మినవాడిని,  ఈ నెల సంవత్సరం లో ఎనిమిదవది. ఇప్పటికి గడచిన ఋతువులు వసంతం,గ్రీష్మం, వర్ష ఋతువులు చెల్లిపోగా శరదృతువు ఋతువు నడుస్తూ ఉంటుంది. అందులోనూ ఈ నెల ఋతువులో రెండవది. మరుసటి నెల మార్గశీర్షం మరో విశిష్టమయిన నెల. ఈ కార్తీకం వచ్చేటప్పటికి వర్షం వెనకపడుతుంది, కొద్దిగా చిరు చలి ప్రారంభమవుతుంది. నదులన్నీ ఉరవడి తగ్గి ప్రశాంతంగా ఉంటాయి. ప్రకృతి బాగుఉంటుంది. గోదావరమ్మ మెల్లమెల్లగా నడుస్తూ ఉంటుంది.అమ్మ కట్టుకున్న తెల్ల చీరలా కనపడుతుంది, ఇసుక తిప్ప.గోదావరి మధ్యలో వీరభద్ర స్వామి నేనున్ననని అభయమిస్తూ ఉంటాడు. చివర దక్షారామం లో భీమేశ్వరుడు కాపు కాస్తుంటాడు. ప్రతి శివాలయం పెళ్ళివారిల్లులా ఉంటుంది. స్వామి అమ్మతో కలసి దర్శనమిస్తూ ఆశీర్వదిస్తారు.

దీపావళి గడచిన మరునాడు కార్తీకం ప్రారంభం. మొదటి రోజు ఆకాశదీప ప్రారంభం, అఖండ దీపం కూడా ప్రారంభం. ఇళ్ళ దగ్గర ఇల్లాళ్ళు సంద్యదీపం పెడతారు గడపలో, లక్ష్మిని ఆహ్వానిస్తూ, అప మృత్యుదోషం తొలగడానికి. మరుసటి రోజు యమ విదియ, భగినీ హస్త భోజనం. నాల్గవరోజు నాగుల చవితి. ఈ రోజు పుట్టలో పాలు పోసి శివాలయం లో టెంకతో కూడిన తేగలు, బూడిద గుమ్మడి, పెద్ద గుమ్మడి, పిలకలతో ఉన్న కంద, పిలకలతో పసుపు ఇవ్వడం అలవాటు. మరునాడు నాగ పంచమి. అష్టమి కార్తవీర్య జయంతి. నవమి, దశమి, ఏకాదశి మూడురోజులు విష్ణుత్రిరాత్ర వ్రతం. ఏకాదశి విష్ణువు యోగనిద్రనుంచి లేచేరోజని చాతుర్మాస చివరిరోజు. మరునాడు చిలుకు ద్వాదశి అనే క్షీరాబ్ధి ద్వాదశి, చతుర్దశి వైకుంఠ చతుర్దశి. పున్నమి చెప్పేదేమి? జ్వాలాతోరణం సాయంత్రం కార్తీక దామోదర, చంద్ర పూజ. బహుళ నవమి నా ఆశ శ్వాస దగ్గరున్న బుల్లి మనవరాలి పుట్టిన రోజు త్రయోదశి మాస శివరాత్రి, ఇలా అన్నీ పండుగలే. అందుకే నాకు కార్తీకమంటే ఇష్టం.ఇక ఈ నెలలో నాలుగు గాని ఐదుకాని సోమవారాలు నక్తం ఉపవాసం. కార్తీక చంద్రుని చూస్తే ఆనందం.

ఈ నెలలో వచ్చేవి. శీతా ఫలాలు, చెరకు, దీనినుంచి పానకం, చెరకు రసం, గోకుడు బెల్లం వగైరా అంతా అదొక గొప్ప అనుభూతి. బెల్లం ఆడే పొయ్యి దగ్గర చలి కాగుతూ చెరకు రసం పుచ్చుకోవడం ఒక గొప్ప ఆనందం. చెరకు రసాని తీసిన వెంటనే అలా తాగితే తిక్క ఎక్కుతుంది, అందుకు అందులో అల్లం కాని లేదా పచ్చి మిరపకాయలు కాని వేసి పుచ్చుకుంటారు. ఇక జొన్న చేలు పంటకి వస్తే ఊచబియ్యం. తెనుగు భాషలో లోపలికి తీసుకునే ద్రవ పదార్ధాన్ని పుచ్చుకోవటం అనాలనీ, తాగటం అనడం నీ చార్ధం లో వాడే మాటనీ నా అభిమాన రచయిత శ్రీ పాదవారన్న మాట. తెనుగు భాషా సంప్రదాయం అంత గొప్పది. తాగడం అనే మాట కల్లు సారా లాటివాటిని తీసుకునేటపుడు వాడే మాటన్నారు వారు. పుచ్చుకోవడం అన్న మాట బాగుంది కదా. ఇప్పుడన్నీ తాగేస్తున్నవే మనం.

ఈ నెలలో స్నానం, దీపం, ఉపవాసం, దానం ముఖ్యమైనవని పెద్దలు చెబుతారు. ఉపవాసం పిల్లలకి ముసలివారికి చెప్పబడ లేదు. పిల్లలు అంటే ఏ వయసువారు అని ప్రశ్న రావచ్చు. పద్నాలుగు సంవత్సరాల వరకు పిల్లలు వారు చేసిన తప్పులకు వారు బాధ్యులు కారు, వారు చేసిన పాపం తల్లి తండ్రులదే. ఇక ఆ తరవాత వారు చేసిన తప్పులకు వారిదే బాధ్యత. ఈ నియమం మృకండు మహాముని యముని చేత చేయించినది. ఆ కధ మరొక సారి చెప్పుకుందాం.

DSCN4127

కార్తీకపున్నమి చంద్రుడు                                                    17.11.13

సహస్ర చంద్రదర్శనం అని ఒకటి ఉంది, అంటే ఒకరి జీవితంలో వెయ్యి నిండు పున్నమిలు చూడటం, సాధ్యమా? ఆహా సాధ్యమే ఎనుబది మూడు సంవత్సరముల నాలుగు గాని ఐదు నెలలు జీవించినవారు సహస్ర చంద్ర దర్శనం చేసినవారే. అప్పుడు ఉగ్రరధ శాంతి అని ఒక ఆయుష్ హోమం చేస్తారు,  డెభ్భయి రెండు సంవత్సరాలకితం ఇదేరోజున ఈ భూమి మీద పడటం కూడా ఒక కారణం.అందుకే  ఈ నెలంటే ఇష్టం

ప్రకటనలు

24 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కార్తీకం.

 1. మాస్టారూ ..ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు. కార్తీకం ని వ్యక్తిగతంగా కలుపుకుని ఇష్టంగా అందించారు.బావుంది.

  • @వనజగారు,
   ఈ మధ్య అన్నీ ఆలస్యంగానే జరుగుతున్నాయి 🙂 నచ్చినందుకు, జన్మ దిన శుభకామనలకు
   ధన్యవాదాలు.

 2. ఎన్నెల గారికి। వచ్చిన సందేహం నాకూ వచ్చింది ,కానీ అడగలేకపోయాను.బావున్నారాండీ?చాలా రోజులైపోయింది,మీతో మాట్లాడి, మీకు జన్మ దిన శుభాకాంక్షలు .మీ టపాలు చదువుతూనే ఉన్నాను,కానీ। వ్యాఖ్యలు పెట్టలేకపోతున్నాను,సమయం దొరక్క

  • @ నాగ రాణి గారు,
   మీ చిన్నబ్బాయి పెళ్ళి పనుల హడావిడిలో కూడా నా బ్లాగు చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. పసుపు బాగా కొట్టేరు చూశాను. నడుము నొప్పితో కామెంట్లు రాయలేకపోయాను. కులాసాగానే ఉన్నాను.
   ధన్యవాదాలు.

 3. అడిగానని అనుకోవద్దు, చెప్పకుండ దాటేయద్దు ఏమిటీ రహస్యం, స్వామీ ఏమిటీ విచిత్రం:
  మీ పేరు చిర్రావూరి భాస్కర శర్మ అనే మాచనవఝల వేంకట దీక్షితులు అని ఉంటుంది. దీని భావమేమి తిరుమలేశా..

  • @ఎన్నెల, నాగ రాణి గారు,
   మీకొచ్చిన అనుమానమే నాగరాణి గారికి కూడా వచ్చింది కదా 🙂
   మనవరాలు చి. లాస్య ఒక సారి నన్ను ఇంటర్వ్యూ చేసింది అప్పుడు చెప్పేను. బ్లాగులో కూడా రాశాను ఐనా మీకోసం మళ్ళీ,

   పేరు:- “పుట్టినప్పటినుంచి పేరొకలా ఏడిచిందా? చిన్నప్పుడు, గిర్రడని, ఆతర్వాత గిరీశమని, గీరీశంగారని” గురజాడ వారన్నట్లు నాకు ఒక పేరు కాదమ్మాయ్! రెండు పేర్లు. పెద్ద కధే ఉంది మరి, చెప్పమన్నావా? ఒక పేరు కన్నమ్మ పెట్టింది, పెంచుకున్నమ్మ పొద్దుచూసేది, చూడలేక నాకు ’భాస్కరశర్మ’ అని పేరు కన్నమ్మ చేత పెట్టించి, తనుపొద్దు చూడటం మానేసిందిట. అలా మొదటిపేరు కన్నమ్మ పెట్టినా అది పెంచుకున్నమ్మ ఆలోచనే. ఆ తరవాత పద్నాలుగో సంవత్సరం లో పెంచుకున్నమ్మ పుట్టినప్పుడు తను పెట్టించిన పేరు మార్చేసి ’వేంకట దీక్షితులు’ అని మళ్ళీ నామ కరణం చేసింది. రెండు పేర్లూ చెప్పుకుంటాను. అప్పటికే బడిలో పుట్టినప్పటి పేరు రాసేయడం తో ఆ రోజులలో మార్పులు చేసేసావకాశం లేక మొదటి పేరుతో మిగిలిపోయా.
   ధన్యవాదాలు.

   • క్షమించాలండీ.. ఈ కథ ఇదివరకు చదివాను కానీ మళ్ళీ కొత్తగా అనుమానం ఎందుకు వచ్చిందో! మెదడు లో పొరలు సరిగ్గా పనిచేస్తున్నట్టు లేవు నాకు !అయినా మంచిదే లెండి, పుణ్య కథలు ఎన్ని సార్లు వింటే అంత పుణ్యం ట…ఈ లెక్కన మరి కొంచెం పుణ్యం నా ఎకవుంటులో పడి, నా మెదడు పొరలని సరిచేయు గాక అని ఆశీర్వదించెయ్యండి.

    నా పుట్టిన రోజు కాదండీ, చిన్నారి ఎన్నెల కార్తిక పౌర్ణమి రోజున పుట్టిందండీ..మీ విషెస్ కి ధన్యవాదాలు.

   • @ఎన్నెలగారు,
    మరచిపోయి ఉండచ్చు, దానుకేం లెండి. మరో సారి ఆశీర్వచనం. మీ అభిమానానికి మనసు నిండింది.
    ధన్యవాదాలు.

 4. ఎన్నెల కూడా మీరు పుట్టిన రోజునే పుట్టిందన్నమాట. మీకు జన్మ దిన శుభాకాంక్షలండీ.కొంచెం ఆలస్యమయినందుకు క్షమించండి..కానీ ఈ నెలంతా పండుగలే కనక, మీరు నెల మొత్తం పుట్టిన రోజు పండుగలు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మీ ఆశ శ్వాస కి కూడా పుట్టిన రోజు దీవెనలు అందజేయండి. మీ నుంచి మరిన్ని మంచి విషయాలని వినాలని ఆశిస్తున్నా (మీ టపాలు అన్నీ చదువుతూనే ఉంటానండీ)

  • @ఎన్నెల గారు,
   మీరు పుట్టిన రోజే నేనూ పుట్టానా బావుంది కదూ 🙂 మీ తరఫున మనవరాలికి అభినందనలు తెలియ చేస్తాను.
   ధన్యవాదాలు.

 5. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలండి.

  సాధారణంగా పెద్దవాళ్ళు శతమానం భవతి ..అని దీవిస్తుంటారు.
  అయితే, లోకంలో కొందరు వ్యక్తులు నూరు సంవత్సరాల తరువాత కూడా ఆరోగ్యంగా ఆనందంగా చక్కటి జీవితాన్ని గడుపుతుంటారు.
  ఉదా.. ప్రపంచంలో 110 .. సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు కదా !
  ఇలాంటి వారిని గమనిస్తే , బహుశా శతమానం భవతి .. అనే దీవెనను మించిన దీవెన ఏమైనా ఉండి ఉంటుంది… అనిపిస్తుంది.

  మీరు కూడా మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటూ , మరెన్నో చక్కటి విషయాలను మా అందరికి అందించాలని కోరుకుంటున్నాను.

 6. జన్మదిన శుభాకాంక్షలు. మరెన్నో సంవత్సరాలు ఇలాగే ఆయురారోగ్యాలతో వర్థిల్లుతూ, మంచి మంచి మాటలు చెబుతూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s