శర్మ కాలక్షేపంకబుర్లు- చంపినా పాపం లేదు

DSCN4133

 చంపినా పాపం లేదు

ధర్మరాజు వ్యాసులవారిని ధర్మాధర్మాలేంటి? పాపం ఏది? అని ప్రశ్నిస్తే ఇలా చెప్పేరు (భారతం శాంతి పర్వం.ఆశ్వాసం.1. 290 నుంది302 స్వేఛ్ఛానువాదం)

“వేదం చెప్పిన ప్రకారం చేయకపోవడం, నిషిద్ధమయినదానిని చేయడం పాపం.

ఇక సామాన్యమైనవి చెబుతావిను. సూర్యోదయ, సూర్యాస్తమయకాలాల్లో నిద్రించడం, పూజించతగినవారు ఇంటికి వచ్చినపుడు పట్టించుకోకపోవడం, ఇతరుల భార్యను కామించడం, గురువులకు ఎదురుచెప్పడం, గ్రామాన్ని పాడుచేయడం, వేదాన్ని అమ్ముకోవడం, రసవిక్రయం (అన్న విక్రయం),నమ్ముకుని ఉన్న భృత్యుని పట్టించుకోకపోవడం, అసత్యం పలకడం, ఇళ్ళు తగులపెట్టడం, ఇతరుల ధర్మాన్ని ఆచరించడం, స్వధర్మాన్ని వదలివేయడం, పశువులను అనవసరంగా కొట్టడం, బలహీనుల కలిమిని ఆక్రమించుకోవడం, శరణు వేడినవారిని రక్షించకపోవడం,బలహీనులను వధించడం పాపాలు.

పాపాలలా కనపడతాయి కాని ఇవి పాపంకాదు విను.
యుద్ధం చేసేటందుకు వచ్చినవాడు వేదాంత వేది అయినా ఎంతగొప్పవాడయినాచంపడం తప్పుకాదు. బలహీనులను వధిస్తున్నవాడిని,వేధిస్తున్నవాడిని చంపినా పాపం లేదు. ప్రాణం పోయేటట్టుగా ఉన్నవేళ యెక్కడా అన్నపానాలు దొరక్కపోతే తెలిసికాని తెలియకకాని కల్లు తాగైనా ప్రాణాలు నిలబెట్టుకోవడం పాపంకాదు. గురువును సంరక్షించేందుకు బలహీనుల సొమ్ము దొంగిలించినా పాపం లేదు. ప్రాణహాని సమయంలో, వివాహాలలో, గురువుల పనికోసం, స్త్రీలతో పరిహాసం లోను, సర్వ ధనాన్ని కోల్పోతున్నవేళ అబద్ధం చెప్పినా పాపం లేదు.

కలలో స్కలనమైతే బ్రహ్మచర్యం చెడదు,అన్న పతితుడయినా అలాకాక సన్యాసి ఐనా అతను వుండగానే వాని భార్యను తమ్ముడు సంగ్రహించుకోవడం పాపం కాదు. గోవులకోసం అడవి కాల్చడం, యజ్ఞంలో పశువును చంపడం, దానం తీసుకోడానికి అర్హతలేనివానికి దానం ఇచ్చినా, తగని భృత్యుని చేరదీయకపోవడం పాపం కాదు.”

ఇక నేడు జరుగుతున్నది చూదాం. ఇందులో చాలా చెప్పినవి మనుజ ధర్మాలే, పాపాలే. కొన్ని ఈ కాలానికి సరిపోకపోవచ్చు, కాలాని బట్టి ధర్మం మారుతుంది కదా!.

ఇప్పటికి సత్యాలైనవి చూదాం! మరొక మాట నాడు పాపం అంటేనయినా వీటిని ఆచరిస్తారని ఇలా చెప్పి ఉండచ్చు.సంధ్యలలో నిద్ర,పరస్త్రీ వ్యామోహం,గురు నింద, గ్రామాని, ఇళ్ళను తగలపెట్టడం, బలహీనుల మాన ప్రాణాలు హరించడం నేడు నిత్య కృత్యంగా జరుగుతున్నవి.స్త్రీలపై అత్యాచారాలకి అంతు వుండతం లేదు,   నిర్భయ చట్టాలు కొరగాకపోతున్నాయి. 

విశేష ధర్మం అంటే ఆపత్కాలంలో, ప్రత్యేక సమయం లో ఆచరించినా తప్పులేనివి, వీటిని నిత్య ధర్మంగా ఆచరించుతున్నారు.ప్రత్యేక  పరిస్థితులలో  కల్లు తాగవచ్చన్నారని నిత్యం తాగుతున్నారు,అన్న సన్యాసయితే వదినను చేపట్టవచ్చని, అన్నను బలవంతంగా సన్యాసిని చేస్తున్నారు. స్త్రీలతో పరిహాసానికి అబధ్హం చెప్పచ్చంటె నిత్యమూ అబద్ధమే చెబుతున్నారు, అందరికి, అన్ని విషయాలలో, చిన్నవాటికి పెద్దవాటికి కూడా. నోరు విప్పితే పలికేది అబద్ధమే! ఇది కాల సహజం అని సరిపెట్టుకోక తప్పటం లేదు.

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- చంపినా పాపం లేదు

 1. నిజమేనండి, గత కొద్ది కాలంగా సమాజంలో విపరీతమైన మార్పులు వచ్చాయి.

  కొద్దికాలం క్రిందట వరకూ కూడా నైతికవిలువలను పాటించని వారికి సమాజంలో ఎక్కువ గౌరవం లభించేది కాదు.

  ఈ రోజుల్లో నైతికవిలువలను పాటించేవారిని వెర్రివెంగళప్పలా, బ్రతకటం చేతకానివారిగా చూసేవిధంగా సమాజం తయారవుతోంది.

  ఎలాగైనా సరే ( అక్రమంగా అయినా సరే ) ఎక్కువ డబ్బును సంపాదించి ధనవంతులైన వారిని గౌరవించే విధంగా సమాజం తయారవుతోంది.

  • @అనురాధ,
   నిన్న జరిగిన్ ATM సంఘటన చూడండి. పట్టణాలలో బతుకు మరీ దుర్భరమయిపోతోందా? హింస డబ్బు ఎలాగయినా సంపాదించాలనే వెర్రి కోరిక జడలు విప్పి ఆడుతోంది. ఇది అంతా అందరి అతప్పు, సమాజం తప్పు, సవరించుకోవలసిన సమయం వచ్చేసినట్టుంది.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s