శర్మ కాలక్షేపంకబుర్లు-ఊరకరారు మహాత్ములు….

 b.patel

ఊరకరారు మహాత్ములు….

‘ఊరకరారు మహాత్ములు’ అని ఒక ప్రయోగం విరివిగానే వాడతాము వ్యంగ్యంగా.  ఎవరైనా బాగా పరిచయమున్నవారు ఎదో సమస్యను పట్టుకొచ్చినపుడు అనగా, స్వకార్యం లేక కనపడని వారిని ఉద్దేశించి ఈ మాట వాడుతున్నాం .కాని నిజానికి దీని వెనక  మంచి విషయమే ఉంది. వాడుకలో ఇలా ఎందుకయిందో చెప్పలేను. ఈ మాట అన్నది నందుడు, తన ఇంటికి వచ్చిన గర్గ మహాముని తో అన్నమాట.

ఊరకరారు మహాత్ములు, వారధముల యిండ్ల కడకు వచ్చుటలెల్లన్

గారణము మంగళములకు, నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా..భా..స్కం.10…..283

మహాత్ములయినవారు అధముల ఇండ్లకు ఊరకరారు, వారికేదో మంగళం (శుభం) చేకూర్చడానికే వస్తారు,నిజంగా మీరాక మాకు శుభాన్ని చేకూరుస్తుంది మహాత్మా!

సమయం సందర్భం చెప్పేసుకుందాం.కృష్ణుడు చెరసాలలో పుట్టడం వ్రేపల్లె చేరడం, పూతన సంహారం,శకటాసుర సంహారం, తృణావర్త సంహారం జరిగిపోయింది. కాని ఇంకా యశోదా దేవి పుత్రునికి నామకరణం జరగలేదు. ఒక రోజు యాదవులకు పురోహితుడయిన గర్గ మాహామునిని వసుదేవుడు కలిసివ్రేపల్లె లోని తనయులకు నామకరణాది సంస్కారాలు చేయమని కోరతాడు. ఇది రహస్యంగా జరగాలి, అందుకు గర్గమహాముని వ్రేపల్లెకు చేరి నందునిచే అభ్యర్ధింపబడి పెద్దవానికి జనులు రమించి తిరుగువాడు కనుక రాముడని, ఘనబలం చేత బలరాముడని పిలవబడతాడని చెబుతారు. ఆ తరవాత కృష్ణుని చూచి నల్లని వాడు కనుక కృష్ణుడు అని నామకరణం చేశారు.

ఇంత మంచి సంగతికి మూలమైన మాట ఊరకరారు మహాత్ములన్నదానితో మొదలయిందికదా. మరి నేడు వాడుకలో ఇలా ఎందుకయిందీ తెలియదు.అదీగాక మహత్ములు అన్న మాటకు మంగళం అన్న మాటకు వ్యతిరేకార్ధాలే చెబుతున్నారు నేడు.

Vijay Stambh

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఊరకరారు మహాత్ములు….

 1. అవునండి, ఇప్పుడు ఇలాంటి పదప్రయోగాలు ఎక్కువయ్యాయి.
  గురూ ! అనే గౌరవసూచకమైన పదాన్ని కూడా వేళాకోళంగా , వ్యంగ్యంగా అర్ధం వచ్చేట్లు వాడుతున్నారు.
  ఇలా జరగటానికి సినిమాలు కూడా కొంతవరకు కారణం.
  ఇలాంటి వాటిని ఖండించాలి.

  • @అనురాధ,
   జీవితం లో అన్నీ సంకరాలే అయిపోతున్నాయి. భాషను కూడా సంకర పరచేస్తున్నారు. అవహేళన నేటి నైజం.
   ధన్యవాదాలు.

 2. ఎగతాళి, హేళన, వెక్కిరింత, ఇవి ఎక్కువై,
  మాటలలో మెత్త దనం, ఎదుటి మనిషిని గౌరవించడం తగ్గి పోయి,
  తెలుగు జాతి మ్రుక్కలు కావడానికి దోహదం చేసాయి. మీరేమంటారు?

  • @మోహన్జీ,
   మాట చాలా పదునైనది, కత్తి కంటే కూడా. అందునా ఇటువంటి హేళన వ్యంగ్యం వగైరాలయితే ఇక చెప్పేది లేదు. గౌరవం మర్యాద ఎప్పుడో చచ్చిపోయాయి. ఇప్పుడంతా సొమ్ము..సొమ్ము..సొమ్ము
   ధన్యవాదాలు.

 3. కానీ ఈ మాట వ్యంగ్యానికే వాడటం అలవాటై ఎవరినైనా గొప్పవారిగా సంభోదిద్దామంటే వెటకారముగా ద్వనిస్తుంది.
  సర్, ఇలాంటి నానుడులు ఇంకా ఉన్నాయి అవికూడా వివరించగలరు.

  • @ఫాతిమాజీ,
   మొన్ననొక మిత్రుల ఇంటి దగ్గర ఈ మాట వాడేరు. అప్పుడు అడిగాను దీని గురించి తెలుసా అని. దనికి వారు అందరూ వాడుతారు నేనూ వాడేనన్నారు. అప్పుడు చెప్పేను ఈ సంగతి. అది గుర్తుకు వచ్చి బ్లాగ్ టపాగా పెట్టేను.
   ఇటువంటివి గుర్తుకు రావాలికదా! కొద్దిగా సాయం చేయండి మరి 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s