శర్మ కాలక్షేపంకబుర్లు-మార్పు

images

మార్పు

“శరణాగత రక్షణ గొప్పతనం ఏంటి తాతా?” అని అడిగాడు ధర్మరాజు భీష్ముని దానికి భీష్ముడు ముచుకుందుడనే రాజుకు శుక్రుడు చెప్పినది నీకు చెబుతున్నా వినవయ్యా అన్నారు. (భారతం. శాంతి పర్వం. తృతీయాశ్వాసం 304 నుంది 340 వరకు స్వేఛ్ఛానువాదం)

ఒక బోయవాడు పక్షులను పట్టి చంపితింటూ, అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఒక రోజు పెద్ద అడవిలో వేట చేస్తూ తిరుగుతుండగా పెద్ద గాలివానా వచ్చింది. అన్నీ నాశనమవుతున్నాయి, ఎక్కడచూసినా నీరే కనపడుతోంది. అటువంటి సమయంలో కొద్దిగా మెరకమీద ఉన్న ఒక చెట్టుకిందికి చేరి రాతి మీద చలికి వణుకుతూ, ఈ అడవిలోని సర్వ జీవులూ, నన్ను రక్షించాలి అని మొక్కి పడుకున్నాడు. ఇలా పడుకున్న చెట్టు పైనున్న తొర్రలో ఉంటున్న ఒక పావురం “అయ్యో పెంటి మేతకోసం పోయింది, ఎక్కడ తిరుగుతోందో, చాలాపొద్దుపోయింది, ఆమెలేక నాకు గడవదు, ఆమె లేక నాబతుకు వ్యర్ధం, నాశనం చూస్తుంటే భయమేస్తోంది” అని చింతిస్తున్న మగ పావురం అనుకుంటున్న మాటలు విన్న బోయవాని వలలో చిక్కుకుని ఉన్న ఆడుపావురం విని సంతసించింది, మగనికి తనపై ఉన్న ప్రేమకు, అదృష్టం చేసుకుంటే కాని ఇటువంటి ప్రేమతో కలిగిన మాటలు వినే అవకాశం దొరకదు, చావును గెలిచినంత ఆనందంగా ఉందనుకుంది. అప్పుడు మగ పక్షికి తను వలలో చిక్కుకున్న విషయం చెప్పి, జరిగినదానికి బాధపడి లాభం లేదని,శరణు వేడినవాడిని రక్షించడం కర్తవ్యమని చెప్పింది. మగ పక్షి కోపం దిగ మింగుకుని మనుష్య భాషలో “అలసిపోయావు, నా ఇంటికి అతిధిగా వచ్చావు, నీకు ఏమికావాలో చెప్ప”మని అడిగింది. దానికి ఆ బోయ “చలికి వణుకుతున్నా,చలి బాధ నుంచి విముక్తుని చేయ”మని కోరాడు. మగపావురం ముక్కున చితుకులు తెచ్చి ఆ తరవాత పక్క పల్లెకుపోయి మండుతున్న కొరవిని ముక్కున కరుచుకుని తెచ్చి అగ్ని చేస్తే కాళ్ళు చేతులు కాచుకున్నాడు, చలి తీరింది. ఆ తరవాత ఆకలేస్తోందన్నాడు, బోయ ఆకలి తీర్చే ఉపాయం దొరకక పావురం “నీవు నాకు అతిధివి నీకు ఆతిధ్యం ఇచ్చి తీరుతాను నా శరీరం ఆహారం గా తీసుకో” అని అగ్నిలో పడింది. ఇది చూచిన బోయకు మనసు చలించింది, ఆతిధ్యం ఇవ్వడానికి తన శరీరమే త్యాగం చేసిన పక్షి గురువుగా నేను ఇప్పటినుంచి ఘోరమైన వేట మానేస్తానని అనుకుని వైరాగ్యం పొంది వలలో ఉన్న పక్షులను వదిలేసి, వేట సాధనాలన్నీ వదలి వెళ్ళిపోయాడు.ఇలా విడిచి పుచ్చబడిన పెంటి పావురం ఏడుస్తూ, నా ఆకలికి ఓర్వలేక బాధపడేవాడివి, నన్ను   వదలి ఇలా వెళ్ళిపోవడం భావ్యంగా ఉందా అని అంటూ తనుకూడా అగ్ని మరికొంత ప్రోదు చేసి ఆత్మ సమర్పణ చేసింది అగ్నిలో.పావురం ఆత్మ త్యాగానికి నివ్వెరబోయిన బోయ మార్పు తెచ్చుకుని అడవిలోని దావాగ్నిలో పడి ఆత్మత్యాగం చేశాడు.

ఈ కధలో మనం తెలుసుకోవలసిన విషయాలున్నాయి పరిశీలించండి.

పావురం జీవితం లో ఒక సారి మాత్రమే జత కడుతుంది. ఏ పరిస్థితులలో ఐనా ఒకరు లేకపోతే మరొకరిని చేపట్టే సంప్రదాయమే లేదు. అందుకే కధలో కపోతాన్ని చెప్పేడు. తను వలలో చిక్కుకుని మరణానికి దగ్గరలో ఉన్నా భర్త చేత మంచి కార్యం చేయించాలనుకుని ప్రోత్సహించింది.ప్రతీకారానికి ఆలోచించలేదు. చిత్రంగా మగపావురం పెంటి చెప్పిన మాట ఆచరించింది. జంటలో ఏకత్వాన్ని చూపింది. ఇవి మనం అనుసరించవలసినవేమో ఆలోచించండి.

మరొక ముఖ్యమైన మాట అతిధికి సపర్యలు చేయడం కోసం ఆ అకలి తీర్చడం కోసం ఆత్మత్యాగానికి పాల్పడటం ఊహించలేనిది. మనం అంత చేయలేముగాని కొద్ది సాయం, ఒక మాట చేయలేమా? మరీ స్వార్ధ పరులమైపోతున్నామా? ఆలోచించండి. 

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మార్పు

  1. Kshaminchaali. Telugu key pad morayinchindi. Paavurame kaadu. Chilaka koodaaa eka partner vratame. Anduke daaniki raama chiluka ani peru. Raamudi laagaa ekapatni vratudani

    Nimmagadda Chandra sekhar

  2. లోకంలో మొక్కలు, పశుపక్ష్యాదులు లేకపోతే మనుషులు జీవించటం కష్టం. కానీ మనుషులు లేకపోయినా మొక్కలు, పశుపక్ష్యాదులు చక్కగా జీవించగలవు.

    పశుపక్ష్యాదుల కన్నా మనుషులే గొప్పవారు … అని కొందరంటారు గానీ, చాలా మంది మనుషుల కన్నా ఈ పక్షులు ఎంతో గొప్పవి .. అని నిరభ్యంతరంగా చెప్పవచ్చు.

    తీసుకోవటమే తప్ప, ఇవ్వటం అనే పదాన్ని మర్చిపోతున్న స్వార్ధపరులైన మనుషుల సంఖ్య ఎక్కువైన ఇప్పటి మనుషుల్లో మంచి మార్పు వస్తే బాగుండు .. అని ఆశించుదామండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s