శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగులు-ఉపసం”హారం”

images

బ్లాగులు-ఉపసం”హారం”

బ్లాగు భావప్రకటనా మాధ్యమంగా గుర్తింపబడి, రచయితలు కాకపోయినా రాయాలనే కోరిక ఉన్నవారు రాస్తే, మరికొంతమంది చదివి అభిప్రాయం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఐతే ఎవరు ఎప్పుడు రాశారు అన్నది తెలుసుకోడానికి ఉపయోగించేదే ఆగ్రిగేటర్. ఎవరి మటుకు వారు ఏవో కొన్ని బ్లాగుల్ని వారి బ్లాగులో పెట్టుకుంటారు, చదువుకుంటారు, అలా కొద్ది మందిని చదవడం మూలం గా ‘కూపకూర్మా’లయిపోతామని ఆగ్రిగేటర్ కి వస్తాము, కొత్త కొత్త భావాల కోసం. మన తెనుగులో చాలా ఆగ్రిగేటర్లు చిన్నవి పెద్దవి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవలసినవి, కూడలి, జల్లెడ,హారం,సంకలిని( మూతపడిందట), మాలిక…..ఇలా ఎన్నో. వీటన్నిటికి దేని ప్రత్యేకత దానిదే. కూడలి లో టపాలన్నీ కనపడతాయి,వ్యాఖ్యలు ఎప్పుడో కనపడతాయి, చెప్పలేం, బాగా నెమ్మదిగా పని చేసే ఆగ్రిగేటర్. ఇక మాలిక వారు కొన్నాళ్ళు నా బ్లాగును చేర్చేరు కాని తరవాతేమయిందో తెలియదు, కనపడలేదు, వారికి చెప్పినా పట్టించుకోలేదు, అదేసంకలినితో కూడా నా అనుభవం. ఇక జల్లెడ వారెందుకో మొదటినుంచీ నా మీద శీత కన్నే వేశారు. నేనెన్ని సార్లు అడిగినా బ్లాగును జతపరచుకోలేదు, కారణం కూడా చెప్పలేదు. ఈ విషయం లో మొదటిగా చెప్పుకోవలసినది హారం. శ్రీ భాస్కరరామి రెడ్డి గారు నన్నొకప్పుడు అపార్ధం చేసుకున్నా వారి గొప్పతనాన్ని చెప్పాల్సివచ్చినపుడు వెను తీయను. నా బ్లాగును మొదటగా చేర్చిన ఆగ్రిగేటర్ హారం. హారం చాలా తొందరగా పని చేసే ఆగ్రిగేటర్. టపాలన్ని ఒకరివి ఒక చోట కనపడతాయి. టపా వేసిన తరవాత ఒక రోజుకంటే ఎక్కువ కాలం టపా కనపడుతుంది.అన్నిటి కంటే ముఖ్యమైనది, బ్లాగు రాసేవారికి కామెంట్ ఆక్సిజన్. అది హారం కనిపెట్టి, అన్ని కామెంట్ లూ ప్రచురించేవారు. ఒకరి కామెంట్లన్నీ ఒక చోట కనపడేవి. ఈ రెండు నాకు చాలా నచ్చిన విషయాలు, సాధారణ బ్లాగరు మరియు పాఠకునికి నచ్చేవి. ఇంత గొప్పగా పని చేస్తున్న ఆగ్రిగేటర్ పదిహేను రోజులనుంచి ఎందుకో ఆగింది, కారణాలు తెలియవు, వారి ఇబ్బందులేవో తెలియవు. హారం చాలా క్లిష్ట పరిస్థితులలో కూడా పని చేసింది. అవి సూపర్ సైక్లోన్ సమయం, ప్రెసిడెంట్ ఎలక్షన్ సమయం, అప్పుడు కూడా ఆగ్రిగేటర్ నడిపేరు. వారికి నా కృతజ్ఞత తెలుపుకుంటూ, ఆగ్రిగేటర్ ని పునరుద్ధరించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను.గత పదిహేనురోజులుగా హారం ఇబ్బందితో నేను బ్లాగులు చదవడం కామెంట్ పెట్టడం జరగటం లేదు.

Vijay Stambh

ఇక బ్లాగిల్లు వారు నా బ్లాగును నేనుబ్లాగు మొదలు పెట్టిన వందరోజులలోపే మంచి బ్లాగుగా గుర్తించి వారి ఆగ్రిగేటర్ లో ప్రచురించారు. ధన్యవాదాలు తెలుపుకున్నా. వారిప్పుడు ఆగ్రిగేటర్ లో ఏమి కావాలని అడిగినదానికి నా ఉద్దేశం చెబుతున్నా.

తెనుగువారు అనేక కారణాలవల్ల విడిపోతున్నారు. బ్లాగుల్ని కూడా ఇలా విడతీయకండి, సినిమా వగిరా వగిరా పేర్లతో….. ఈ రోజు నా బ్లాగు రాజకీయంలో కనపడితే రేపు పత్రికలో కనపడుతుంది. బ్లాగుల్ని వెతుక్కోడానికే సమయం సరిపోతుంది.దానికి వారు మొబైల్ లో కనపడే అగ్రిగేటర్ చిరునామా ఇచ్చారు, బాగుంది, దానిని వాడుకోవచ్చు.ఇక్కడ బ్లాగ్ పేరు టపా పేరు కనపడేలా ఉంటే బాగుంటుంది.

www.blogillu.com/m/

See posts on the above link

ఇక కామెంట్లు గురించి హారం వారు చేసినట్లు చేస్తే బాగుంటుందని,ఎక్కువగా చదివిన టపాలు, వీటినో లుక్కెయ్యండి కూడా చొప్పిస్తే బాగుంటుందని సూచన. మిగతావి వారిష్ట ప్రకారంగా చేయచ్చని నా ఊహ వారికి తెలియచేస్తున్నాను. కామెంట్లు అనేవి బ్లాగర్ కి ఆక్సిజన్ లాటివి, వీటిని మరవద్దని నా విజ్ఞప్తి.

ఇక నేడు చాలా జాల పత్రికలొస్తున్నాయి. చాలా మంది బ్లాగర్లు మా రచన ఫలానా జాల పత్రికలో వచ్చింది చూడండని చెప్పడానికే బ్లాగును వాడుతున్నారు.ఈ జాల పత్రికల గురించి అమెరికన్ బ్లాగర్లలో పెద్ద చర్చ నడుస్తోంది(ట). బ్లాగిల్లు వారికి నేనిచ్చిన సలహా మీకూ నచ్చితే ఇక్కడొక కామెంట్ పెట్టిపొండి.నేను ఒక టపా రాస్తానని వారికి మాటిచ్చిన మూలంగా ఈ టపా వేశాను. వారడగలేదు సుమా!

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగులు-ఉపసం”హారం”

 1. బాబాయి గారూ హారం గురించి మీ అభిప్రాయమే నాది కూడానూ. బ్లాగు మొదలెట్టిన మొదట్లో టపాల కోసం, ముఖ్యంగా వ్యాఖ్యల కోసం హారం మాత్రమే చూసేదాన్ని. అప్పట్లో జిలేబి గారి కామెంట్లు చదవడం మహా సరదాగా ఉండేది. ఆవిడ(ఆవిడేనా) కామెంట్లు పట్టుకుని టపాలు చూసేదాన్ని.

  బ్లాగులు రాయకపోవడానికి కారణం జాల పత్రికలు మాత్రమే కాదు బాబాయి గారు. గూగుల్ ప్లస్, ఫేస్ బుక్ ఇంకా ఇలాంటివే. ఏమైనా బ్లాగుల్లో అప్పటి సందడి మాత్రం మచ్చుకైనా కనిపించడం లేదు.

  • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
   హారం వారి సేవలను మరువలేము. శ్రీ భాస్కర రామిరెడ్డి గారి సేవలు నిరుపమానం. వారి ఇబ్బంది మనకు తెలియదు. ఇంకా ఏదో ఆశ మినుకు మినుకు మంటూనే వుంది, హారం పునరుద్ధరింపబడుతుందని. జిలేబి గారు ఆవిడేనా అని బలే అనుమానం పెట్టేవు కదమ్మా! ఆవిడేతల్లీ అమ్మతల్లి. ఈ మాటన్నందుకు కోపవస్తుందేమో తల్లీ నమస్కారం.గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్ అన్నారు కదమ్మా! అదన మాట.
   నువ్వు చెప్పిన్ జి+, ఫేస్ బుక్ గురించి తెలియక…
   నా చాదస్తం కాని ఒక ఆగ్రిగేటర్ నడుపుతున్న బ్లాగిల్లు వారికి వివరాలు తెలియవంటావా? వారి పరిమితులేవో తెలియదు కదా!
   అనారోగ్య కారణం తో ఆలస్యానికి మన్నించాలి
   ధన్యవాదాలు.

 2. నమస్కారం శర్మ గారూ! “బ్లాగుల్ని కూడా ఇలా విడతీయకండి,” అన్నారు. చాలా బ్లాగులు ఎలాగూ విడిపోయేకదా ఉన్నాయి?! సాహిత్య బ్లాగులని, సినిమా బ్లాగులని, వార్తా బ్లాగులనీ …
  కానీ ఇక్కడ నా( బ్లాగిల్లు) ప్రయత్నం బ్లాగు టపాలను వర్గాలవారీ విడగోడదామని ..అంటే వంటల గురించి వ్రాస్తే మహిళా విభాగంలోకీ, ఆ బ్లాగులోనే సాహిత్యం, గురించి వ్రాస్తే ఆ విభాగంలోకీ …అన్ని టపాలూ చూపడానికి మెయిన్ పేజీ ఎలాగూ ఉంటుంది కదా..
  ఇకపొతే
  కామెంట్ల గురించి- కామెంట్ల కోసం ఓ ఆగ్రిగేటర్ విభాగం 2-3 రోజుల్లో రాబోతుంది.
  ‘ఎక్కువగా చదివిన టపాలు’, ‘ఇవి చదివారా? ‘ ఎలాగూ ఉండనే ఉన్నాయి http://blogillu.com/blogs ( సంకలిని ) లో .
  మీరన్నట్లు చాలామంది బ్లాగుల టపాలను లింకులను పంచడానికి ఉపయోగిస్తున్నారు . వారి మరొక బ్లాగులో ఆల్రెడీ వ్రాసిన టపాకు మరోసారి లింక్ ఇస్తున్నారు.

  • శ్రీనివాస గారు,
   నమస్కారం. దయతో నా బ్లాగ్ చదివి కామెంట్ పెట్టినందుకు ముందుగా అభినందనలు. ఊరికే పెట్టే అమ్మని నీ మొగుడుతో సమానంగా పెట్టమన్నట్టు మా గొతెమ్మ కోరికలు చెబుతున్నాం. వీలుబట్టి మన్నించండి.

   టపా లు ఇచ్చేచోట బాల్గుపేరు కనపడటం లేదు, టపా పేరు ప్రముఖంగా కనపడుతోంది. బ్లాగు పేరు టపా పేరు చాలు. మిగిలిన వివరాలవసరం లేదు. వీటి రెండిటికి వేరు రంగులు వాడితే బాగుంటుంది.
   అగ్రిగేటర్ మూడు నాలుగు ఐ.డి లతో ఉందని గ్రహించలేకపోయాను. ప్రతి దానిలోనూ మిగిలినవాటి అడ్రస్ లు ఇస్తే బాగుంటుంది.
   బ్లాగులు:http://blogillu.com/blogs
   మొబైల్: http://www.blogillu.com/m/
   కామెంట్లు:
   ఇలా. మొత్తం టపా చదవండి తీసేసి బ్లాగుమీద క్లిక్ చేస్తే బ్లాగుకు వెళ్ళేలా లింక్ ఇస్తే చాలు.
   ఒక మాట చెబితే నొచ్చుకోవద్దు. మీ అగ్రిగేటర్ గజిబిజిగా ఉందని నేను అర్ధం చేసుకోలేకపోతున్ననని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా. తాజా టపాలన్నీ ఒకటి రెండు పేజీలలో స్క్రోల్ చేసుకునేలా ఇస్తే బాగుంటుంది. బహుశః నేను అర్ధం చేసుకోలేకపోతున్ననేమో! సామాన్యుని అర్ధం కావాలన్నదే నా బాధ, గమనించగలరు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షంతవ్యుడిని.కామెంట్ల కి ఒక సెక్షన్ మొదలు పెడుతున్నందుకు అభినందనలు. విసిగించి ఉంటే క్షమించండి.
   ధన్యవాదాలు.

  • శ్రీనివాస్ గారు,
   బ్లాగు పేరు, టపాపేరు ఉంటె చాలు రచయిత పేరు అక్కరలేదు. అగ్రిగేటర్ లో టపా పేరు ప్రముఖంగా కనపడుతోంది తప్ప బ్లాగు పేరు లేదు.
   ఉదాహరణకి నా
   బ్లాగ్ పేరు:కష్టేఫలే
   రచయిత: శర్మ
   టపాపేరు: శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగులు-ఉపసం”హారం”
   దీనిలోనే గజిబిజి ఉంది గుర్తించగలరు.
   బ్లాగు పేరు మీద క్లిక్ చేస్తే ఆ బ్లాగ్ లోకి వెళ్ళాలి. అదీ కావలసినది, మీరు చాలా శ్రమ తీసుకుని పని చేస్తున్నారు, కాని అది ఉపయోగపడటం లేదని చెప్పవలసివస్తున్నందుకు చింతిస్తున్నాను.
   ధన్యవాదాలు.

  • @శ్రీనివాస్ గారు,
   వీడేంటి ఇలా వెనకపడ్డాడనుకోకపోతే ఇలా మార్పు చేయండి సరిపోతుంది.
   ———————————————-======—————–
   కష్టేఫలె:శర్మకాలక్షేపంకబుర్లు-బ్లాగులు-ఉపసం”హారం”
   బ్లాగ్ మొత్తం టపాలు.
   ————————————————————————
   ఇది కాక మీరు ఇంకా ఇవ్వలనుకున్నవి మీ ఇష్టం. clcik on the blog name should lead to the blog.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s