శర్మ కాలక్షేపంకబుర్లు- వృద్ధస్థావత్….

 దీపావళీ నించి శర్మ గారు మరీ నిరాశా నిర్వేదం లో కి వెళ్లి పోయినట్టు ఉన్నారు !

కాస్త బయట పడండి స్వామివారూ !!

జిలేబి
(ఈ కామెంట్ చాలా సీరియస్ కామెంట్!)

వృద్ధస్థావత్….

మొన్ననొక టపాలో జిలేబి గారు వ్యాఖ్యానిస్తూ దీపావళినుంచి శర్మగారు మరీ నిరాశా నిర్వేదంలోకి వెళ్ళిపోయినట్లున్నారంటే బుర్ర కాస్త ఆలోచనలోపడింది.నిజమేనా? మరీ నిరాశావాదంగా కనపడుతున్నాయా నా మాటలు అని చూస్తే నిజమేనేమో అనిపించేలాగే ఉన్నాయి. మన మనస్సు మనం మాట్లాడే మాటలలో ప్రతిఫలించడం సహజం. చదువుకున్నవారయితే సైకాలజీ అని చెప్పేస్తారు. ఈ సందర్భం లో ఆది శంకరులు గుర్తుకొచ్చారు.

శంకరులు భజగోవింద స్తోత్రం చెప్పేందుకు గురించి ఒక పిట్ట కధ చెబుతారు. శంకరులు గంగలో స్నానం చేసి వస్తుంటే ఒడ్డున, ఒక ముసలి పండితుడు వ్యాకరణ సూత్రాలు వల్లె వేస్తూ కనపడ్డాడట. ఆయన నుద్దేసించి ఈ మధురమైన భజగోవింద స్తోత్రం ఆశువుగా చెప్పేరట. అందులో, కాలుడు సమీపిస్తున్న సమయంలో నీవు వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తున్నావు, ఇది దానికి తగిన సమయం కాదని సూచిస్తూ గోవిందుని భజించమంటారు. ఇంకా ముందుకు వెళుతూ చిన్న తనం లో ఆటలలో ఆసక్తి, వయసొచ్చిన తరవాత తరుణీ ఆసక్తి వృధావస్థలో చింతాసక్తి తప్పించి మానవులకు గోవిందుని భజించాలనిపించదు బాబూ, అందుకే గోవిందుని భజించు అని చెబుతారు. ఇది చాలా నిజం ఎలాగంటే!

వయసైపోయింది, కాల”మా’సన్న’”మైపోయింది ఇప్పుడు చింతాసక్తే మిగిలింది. ఏ పని చేయగల ఓపికా ఉండదు, ఎవరూ మాటాడేవారుండరు, ఎవరిని పిలిచినా పలకరు. ఎవరినైనా ఏమన్నా కోపాలొస్తాయి, మళ్ళీ ‘మీరే కోపపడుతున్నార’ని అంటారు, ‘మీకు వినపడక చంపుతున్నారు మమ్మల్ని’ అంటారు. పెద్దమ్మాయెలావుందో! దాని మనవరాలు  గొడవచేస్తోందని చెప్పింది, ఉద్యోగంకి వెళ్ళిరావడం ఇబ్బందిగా ఉందంది, ఏమి బాధ పడుతోందో! చిన్నమ్మాయి పెద్ద కూతురు అమెరికా వెళ్ళిందో లేదో మొగుడు దగ్గరికి, చిన్న దానికి సంబంధాలు చూస్తున్నారో లేదో!, పెద్ద మనవడికి ఉద్యోగం వస్తుందన్నాడు ఏమయిందో, చిన్న కోడలికి అనారోగ్యంగా ఉంది డాక్టర్ ఏమంటాడో!పెద్దబాయికి ఇల్లు కట్టివ్వలేకపోయాను. .ఏభయి సంవత్సరాల పైబడి నాకు సేవ చేసిన ఇల్లాలికి ఏమిచ్చాను?, ఏమివ్వగలిగేను, కష్టాలు, కన్నీళ్ళు తప్పించి. ఇలా తాపత్రయం తప్ప మరేమి కనపడటం లేదు.చేయగలది ఉందా? లేదు, అదీ తెలుసు కాని ఈ మనసుంది చూడండి ఇలా బాధ పడుతూనే ఉంటుంది. మరో సారి ఆది శంకరులే, నా మనసనే కోతి విషయ సుఖాల మీద నుంచి మరలటం లేదు, నీవు ఎలాగా బిచ్చగాడివే కనక నీ భక్తి అనే తాడుతో నా మనసనే కోతిని కట్టేసి తీసుకుపోవయ్యా అన్నారు. ఇప్పుడు రోజులలో సైకాలజిస్టులు ఈ విషయాలు మరచిపొండి అంటున్నారు, ఏదో చెబుతున్నారు, కుదురుతోందా? కుదిరితే ఇన్ని గోలలెందుకు? శంకరులు సూపర్ మాస్టర్ సైకాలజిస్టు. ఆయనకు తెలుసు ఈ మనసనే కోతి మామూలుగా కట్టుబడదు,మొక్కగా ఉన్నపుడు వంగనిది మానయినప్పుడు అసలు వంగదని నానుడి తెలిసినవాడు కనక, చిన్నప్పటి నుంచి భక్తి అనే తాడు పేనుకుని ఉంచుకుంటే వృద్ధావస్థలో చింతనుండి మరల్చడానికి భక్తి అనే తాడు సిద్ధంగా ఉంటుంది, అందుకు చిన్నప్పటినుంచి భజగోవిందం అన్నారు.

అలా అన్నారని ఆస్థిపాస్థులన్నీ వదిలేశాను,ఇంటి విషయాలే పట్టించుకోటం లేదు,బంధుత్వాలూ తగ్గిపోయాయి, పలకరింపులూ లేవు, మాటాడేవారికి విసుగొస్తూవుంది, ఇలా సంసారం నుంచి వేరుపడిన నేను, పూర్వ జన్మలో రాజుగా ఉన్నపుడు జడభరతుడు రాజ్యమూ సంపదా, సంసారమూ వదిలేసి అడవిలో తపస్సు చేసుకుంటూ, అప్పుడే తల్లి మరణిస్తూ పుట్టిన లేడిపిల్ల ప్రేమలో పడి తపస్సు చెడగొట్టుకుని లేడిగా పుట్టాడు.https://kastephale.wordpress.com/2012/06/24/ నేను కూడా అలా అన్నీ వదిలేసి బ్లాగనే లేడిపిల్లకి చిక్కిపోయినట్లుందని తపన,చింత మాత్రం తగ్గలేదు.

తాపత్రయాలు మూడు. ఆధ్యాత్మిక,ఆదిదైవిక, ఆదిభౌతికం అన్నారు. మొదటి రెండిటినుంచి ఎలాగా తప్పించుకోలేం, మూడవదానినుంచయినా సాద్యమైనవరకు తప్పించుకోవాలని కోరిక.

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- వృద్ధస్థావత్….

 1. నిరాశ, నిస్పృహల తో కూడిన
  వృధ్యాప్యపు కాలంలో టనిక్ లాంటిదీ
  బ్లాగ్ ప్రపంచం, ఉపసంహారం, స్వస్తి లాంటి
  ఆలోచనలు దగ్గరకు రానివ్వకండి, ప్లీజ్

  • @మోహన్జీ,
   ఏదీ మన చేతిలో లేదన్నది తెలిసి కూడా బాధ తప్పదన్నదే మాట తప్పించి, జరిగినంత కాలం కొన సాగించడమే. ఎవరికి ఇబ్బంది లేని వ్యాసంగం కదా. వారెవరూ మాటాడరు కదా! దీని దగ్గర కూచుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టక్కర లేదు.
   ధన్యవాదాలు.

 2. వృద్దాప్యం రెండవ బాల్యం కదా తాతగారు..
  మన పిల్లలు మన అమ్మా నాన్నలన్న మాట ఇప్పుడు..
  అమ్మ నాన్నా కొప్పడుతున్నారని మనం బాధపడవచ్చునా??
  హన్నా!

  జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడం ఒక వరం కదా తాతగారు.. 🙂
  నిరాశ కూడా అప్పుడప్పుడు జీవితంలో భాగమే కదా..
  అందుకని మా మంచి తాతగారు మకింకెన్నొ మంచి మంచి కబుర్లు చెప్పాలి..
  తప్పుగా ఎమైనా మాట్లాడితే మన్నించగలరు.

  • @ధాత్రి,
   జీవితం అంటేనే ఆశ నిరాశల సమ్మేళనం కదా చక్కగా చెప్పేవు కదా, నీకు తత్వం బాగా బోధ పడింది.
   ధన్యవాదాలు.

 3. బాగుందండీ !! కామెంటు ఆక్సిజన్ మరో టపా కి మూలం అయినందుకు !! దీనినే కదా ప్రకృతి అంటారు మరి !

  నిరాశావేదం నించి ‘సమ’ వేదం లో పడ్డా రన్న మాట ! తధాస్తు !!

  జిలేబి

  • @జిలేబిగారు,
   మీ కామెంటా మజాకా? వెంటనే రాశా టపా కాని వేయడమా మానడమా అని ఆలోచనలో పడి ఆలస్యమయింది.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s