శర్మ కాలక్షేపంకబుర్లు- తాంబోలాలిచ్చేశాను ఇహ……

pride-versus-humility

తాంబోలాలిచ్చేశాను ఇహ……

ఈ మాట గురజాడ వారు అగ్నిహోత్రావధానులు చేతనిపించి చిరస్థాయికి చేర్చేశారు. మొన్న రాత్రి నుంచి ఆరోగ్యం బాగోకపోతే పడుకున్నా, ఉదయం ఈ వేళ లేచేటప్పటికి మంత్రివర్గం రాష్ట్ర విభజనకి తీర్మానించిందని తెలిసి ఓపిక చేసుకున్నా.హార్తాళ్ళు, బంద్ లు, నిరశన వ్రతాలు, రాస్తారోకోలు, ఏవీ విభజను ఆపలేకపోయాయి. ఇంకా ప్రజలను పిచ్చి వాళ్ళను చెయ్యలనే రాజకీయ నాయకులు సంకల్పించినట్టు ఉంది, బిల్లు పాస్ అవదు, అసెంబ్లీ లో అడ్డుకుంటాము, వగైరా వగైరా చెప్పి.ఆ క్షణానికి వీరే ఓటూ వేయచ్చు, లేదా గైర్ హాజర్ కావచ్చు, ‘అవ్వ పేరే ముసలమ్మ’, వీరింతకు మించి గొప్పపని చేయగలుగుతారనుకోను, ‘నక్క ఒక చోట గౌరి కల్యాణం చేయద’ని నానుడి, వీరెప్పుడూ ఇంతే, ఇక ముందూ అంతే.

విభజనకి దారి తీయడానికి నీవు కారకుడవంటే నీవని వాదులాడుకోవచ్చు ఇక ముందు కూడా. ‘ఎంచుకుంటే మంచమంతా కంతలే’నని నానుడి. ఈ పరిస్థితికి రాజకీయ నాయకులంతా బాధ్యులే. ‘తమలపాకుతో నీవొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా’ అని వీరూ వారూ రువ్వుకున్న మాటల ఈటెలకు సామాన్యులు కూడా విడిపోయే స్థితి తీసుకొచ్చారు. ఏ ఒక్కరికి సంయమనం లేకపోయింది. అందరూ అధికారం, డబ్బు సంపాదన గురించి ఆలోచించినవారే కాని ప్రజగురించి, అభివృద్ధి గురించి ఆలో చించిన నాయకుడే లేకపోయాడు. తమరు అక్రమంగా సంపాదించుకున్న ఆస్థుల రక్షణ గురించి ఆలోచిఉంచారు తప్పించి రాష్ట్రం గురించి ఆలో చించలేకపోయారు. చిత్రం అప్పుడే ఒక ఛానల్ విడిపోయిన రాష్ట్రం లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో సర్వే చేసిందిట, ప్రసారం చేస్తోంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో. దొంగలు ఊళ్ళు ఏలతారని మార్కండేయుడు చెబుతాడు, తాను చూసిన పద్నాలుగు కలియుగాల్లోనూ, ఇప్పుడు అదే జరుగుతోంది.

కాంగ్రెస్ వారి మహా నాటకం లో ఒక అంతత్భాగం పూర్తయి, మరొక దానికి తెర తీసింది.రాజీనామాలు మరో కొత్త నాటకమా? ఇంతకీ తెలంగాణాలో నెగ్గుతారు, ఎలాగా తప్పదు. విడిపోయిన రాష్ట్రం లో చిరంజీవి తన పార్టిని ఎన్నికల తరవాత కాంగ్రెస్ లో విలీనం చేసినట్టు, మరొకరు లేకపోతారా?తెనుగు ప్రజలకి ఇప్పటికైనా ఆలోచన వస్తుందా? మా అధికారానికి ఢోకా లేదు, ‘తాంబూలాలిచ్చేశా ఇహ తన్నుకు చావండి’,అన్నట్టులేదా?.

 

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- తాంబోలాలిచ్చేశాను ఇహ……

 1. >ఇంతకీ తెలంగాణాలో నెగ్గుతారు, ఎలాగా తప్పదు.
  చెప్పలేమండీ.
  కాంగ్రేసేమో తెరాసావారు వచ్చి తమ మురికిగంగలో ములుగుతారని గంపెడాశ పెట్టుకుంది.
  తెరాస యేమో పెత్తనం మీద ఇంకా గొప్ప ఆశ పెట్టుకుంది.
  కాంగీవారిని పొమ్మని తెరాసావారికే పట్టం‌కట్టవచ్చు తెలంగాణావారు.
  విభజనకు తందానా అంటామని మాట ఇచ్చిన భాజపాకు అటు తెలంగాణలోనూ ఇటు శుధ్ధాంధ్రలోనూ హాయిగా సున్నాయే దొరకవచ్చును.

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   ఏది ఎలా జరిగినా చిన్న చిన్న వారంతా చివరికి ఆ మురికి గంగలో ములిగి తరించాలనుకునేవారే! ఎందుకు? కారణాలందరికి తెలుసు, అదే చిన్నతల్లి. సామాన్యులు ఇది తెలుసుకోలేక మోసపోతున్నారు. రేపు జరగబోయేదీ అదే.ఎక్కడ ఎవరు అధికారం లోకొచ్చినా ప్రజల తలరాతలు మారవు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s