శర్మ కాలక్షేపంకబుర్లు-బొండాలవాడు పొర్లి పొర్లి ఏడిస్తే….

..2

బొండాలవాడు పొర్లి పొర్లి ఏడిస్తే, తామలపాకులవాడు తమామూ ఏడ్చాడని.

కొబ్బరితోటలో మొక్కల వరుసలమధ్య ఖాళీ లో అవిశె మొక్కలు దగ్గర దగ్గరగా పెంచుతారు. వాటిని దడిలా దగ్గరగా కట్టేస్తారు.అవిశె మొక్కల మొడటిలో తామలపాకుల తీగె నాటుతారు. అది పెరిగి అవిశె మొక్క పైకి ఎక్కుతుంది. ఆకులిస్తుంది, వాటిని కోస్తారు.  సామాన్య గాలి వానలకి పడిపోయే సావకాశం లేదు. గాలికి అవిశె మొక్కలు వంగుతాయి. కొబ్బరి బొండాలు సామాన్య గాలికి పడవు. సామన్య గాలి వానకి ఇద్దరికి నష్టమన్నదే లేదు.

1

ఇదిగో ఇటువంటి చేను ఒక యజమాని ఇద్దరికి కౌలు కిచ్చాడు. ఒకడు కొబ్బరి కాయలు తీసుకోడానికి, మరొకరు తమలపాకులు కోసుకోడానికి. ఒక రోజు గాలి వానా వచ్చింది, కొన్ని బొండాలు రాలాయి. కొన్ని అవిశె మొక్కలూ వంగాయి. నిలదీసుకుని కట్టుకోవాలి. ఇది చూసిన తరవాత ఇద్దరిలోనూ స్వార్ధం పెరిగి కౌలు సొమ్ము ఎగకొట్టడం కోసమని యజమాని దగ్గరికి పోయి, తామలపాకులవాడు అవిశె మొక్కలు వంగిపోయి నష్టం వచ్చింది, తోట పాడయింది కనక సొమ్మివ్వలేనని చెప్పేడు. ఇది చూసిన తరవాత కొబ్బరి బొండాల వాడు పొర్లి పొర్లి ఏడుస్తూ తనకు తమల పాకులవాడి కంటే ఎక్కువ నష్టం వచ్చిందని తలుచుకు తలుచుకు ఏడ్చాడట. అసలు కొబ్బరి బొండాల వాడికి, కొన్ని బొండాలు రాలినా వాటిని అమ్ముకోవచ్చు, దింపు ఖర్చు కూడా తప్పింది. కాని స్వార్ధం అలా ఏడిపించింది ఇద్దరినీ.యజమాని ఏం చేసేడన్నది అప్రస్థుతం. 

చేతులు కాలేకా అకులు పట్టుకోడమని ఒక సామెత ఉంది, మన తెనుగు నాట. దానికి నిదర్శనం కావాలా? ప్రస్థుతం జరుగుతున్న రాజకీయ చిత్రం చూడండి. 

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బొండాలవాడు పొర్లి పొర్లి ఏడిస్తే….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s