శర్మ కాలక్షేపంకబుర్లు- బ్లాగిల్లు బాగుంది / రొంపండీ బాబూ రొంప…

బ్లాగిల్లు బాగుంది / రొంపండీ బాబూ రొంప…

రొంపనే పడిశం అంటాం. దీనికి  చెలికత్తెలు, దగ్గు, జ్వరం,తల నొప్పి . అదేం ఖర్మో కాని చలి కాలం వస్తే చాలు దాడి చేస్తుంది, చెలికత్తెలతో, ఏం చేసినా వదలిపోదు. పడిశెం పది రోగాల పెట్టు అంటారు. ఇంగ్లీషు వారు ట్రీటెడ్ కోల్డ్ లాస్ట్స్ ఫర్ అ వీక్ అండ్ అస్న్ట్రీటెడ్ కోల్డ్ లస్ట్స్ ఫర్ సెవెన్ డేస్ అంటారు. అబ్బే ఇది నిజం మాత్రం కాదు.

దగ్గరగా మూడు వారాల కితం “హారం” ఉపసంహారం తో నా తిప్పలు ప్రారభమయ్యాయి.ఓ రోజు ఉదయానికి ఈ రొంప తన చెలికత్తెలతో వచ్చి నన్ను ఆవహించింది. స్వంత వైద్యాలయ్యాయి, డాక్టర్ వైద్యాలయ్యాయి, ఎన్నయినా ఇది వదలటం లేదు. సుగర్ బాగుందా అని చూస్తే అది మామూలు గానే ఉంది, కాని దీనికి మాత్రం స్థావరం ఏర్పాటయిపోయింది శరీరం లో. పోనీ తప్పక భరిద్దామనుకుంటే అబ్బే శ్వాస ఆడదు, ఏదో రాస్తాం, కాసేపు బాగుంటుంది, ఆ తరవాత మామూలే ముక్కులు మూసుకుపోతాయి, నోరు తెరుచుకుని గాలి పీల్చుకోవలసిందే.

దీని మూలంగా ఉదయం నడక చెట్టెక్కేసింది,చలిగాలిలో బయట తిరగద్దంటే, బయటకు కదిలినదే లేదు, సాయంత్రం నడిస్తే, బాగానే ఉంది ఐడియా కాని చెమట పడితే వేడి నీరు స్నానం చేసినా రొంప పెరుగుతోంది కాని తగ్గటం లేదు. అందుకు నడకా బందే. మరి కాలక్షేపం ఎలా? ఎలక గాని చిలక గాని పట్టుకు కూచుంటే? ఎంతకాలం కూచోగలం. బ్లాగులు చదువుదాం అనుకుంటే బ్లాగులన్నీ ఒక చోట కనపడక ఒకటి దొరికితే మరోటి దొరక్క, నానా అవస్థ. పోనీ టపా రాసుకోవచ్చుగా అంటే ఈ చెలికత్తెలతో  మేళం పెడితే అసలు ఏదీ తోచదు , ఇక టపా ఎలా?.నిన్న సాయంత్రం చినుకులా ఒక టపా చూశాను బ్లాగిల్లు వారిది. చూస్తే బ్లాగిల్లులో మార్పు చేశాo చూడమన్నారు. చూస్తే ప్రాణం లేచొచ్చింది. బ్లాగు పేరు టపా కనపడుతున్నాయి. మరి మీరూ  చూడండి.    http://www.blogillu.com/     గబగబా నాలుగయిదు బ్లాగులు చదివేసి కామెంట్లు సాయించాను. బ్లాగిల్లు వారికి ధన్యవాదాలు. కామెంట్లకి కూడా ఒకటి ఏర్పాటు చేయమని ప్రార్ధన..బ్లాగిల్లు లో చేరనివారు చేరండి.     రొంప జ్వరం కాల్చుకు తింటూనే ఉన్నాయి. లేచి తిరగకా తప్పదు, చేసేపనీ కనపడటం లేదు.

ఎవరికైనా సూచనలిచ్చెయ్యడం సలహా చెప్పడం తేలిక. ఆచరించడమే కష్టం, అసలు ఈ అగ్రిగేటర్ నడిపేవారు ఆశించేదేంటి? మనం వారి మీద ఇది కావాలి అది కావాలని సవారీ చేయడం ఏంటీ? ఇదో విష్ణుమాయ. బ్లాగిల్లు వారు చాలా చాలా మంచి పని చేశారు, చేస్తున్నారు. వారికి అభినందనలు. బ్లాగు పేరుకు, టపాకి రంగులిచ్చినట్టుంది, నాకు సరిగా కనపడలే, బ్లాగు పేరుకు గ్రీన్, టపా పేరుకు బ్లూ ఇస్తే బాగుంటుందని ఓ ఉచిత సలహా! వీలయితే చూడండి.

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- బ్లాగిల్లు బాగుంది / రొంపండీ బాబూ రొంప…

  • @
   అమ్మాయ్ ప్రియా!
   రొంపకి చెలికత్తెలు, దగ్గు, జ్వరం, తలనొప్పి కదా! ఇందులో చివరి ఇద్దరూ వెళ్ళిపోయారు. ఇక మిగిలిన ఇద్దరికీ నా మీద వల్లమాలిన ప్రేమ కదా! అప్పుడే వెళ్తారా?
   ధన్యవాదాలు.

   • వాటి నుండి కూడా మీకు అత్యంత త్వరగా ఉపశమనం కలగాలని మనసారా కోరుకుంటున్నాను తాతయ్య గారు.

 1. http://www.blogillu.com/ ను ఇంతకుముందు చూడలేదండి. ఇప్పుడే చూశాను. బ్లాగిల్లు చాలా బాగుంది. వారికి నా కృతజ్ఞతలు. బ్లాగిల్లు గురించి తెలియజేసినందుకు మీకు కూడా కృతజ్ఞతలు.
  ……………………………
  ఉసిరిని ఏదో విధంగా ఆహారంలో తీసుకుంటే ఎంతో మంచిదంటారు.
  జలుబు, దగ్గు వంటి వాటికి ఉసిరితో తయారుచేసే చ్యవనప్రాశ ఎంతో చక్కటి మందు. మేము అప్పుడప్పుడూ వాడుతుంటాము. చ్యవనప్రాశను ఆయుర్వేదవైద్యులు తయారుచేసి ఇస్తారట. ఆయుర్వేదవైద్యులు తయారుచేసి ఇచ్చేది వాడుకుంటే మరీ మంచిది.

  ఇప్పుడు చ్యవనప్రాశను మందుల షాపుల్లో కూడా అమ్ముతున్నారు కాబట్టి మేము అవే కొంటున్నాము. అయితే ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి అమ్ముతున్నారు. అదే నాకు నచ్చలేదు. సీసాలో అమ్మితే బాగుంటుంది కదా .. అని నా అభిప్రాయం.

  ప్లాస్టిక్ తో కలిసి ఏమైనా రసాయనిక చర్య జరిగితే మందు సరిగ్గా పనిచేస్తుందా ? అని నాకు సందేహం. అదేం ఖర్మో నాకు ఇలాంటి సందేహాలు ఎక్కువగా వస్తుంటాయి.

  ధనియాలు జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయట. జీర్ణశక్తి బాగుంటే జలుబు వంటి ఎన్నో జబ్బులు తగ్గుతాయంటారు. అందుకే సాంబారు పొడి లో ధనియాలు వేసి తయారుచేస్తారు. అయితే ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో సాంబారు పొడిని కొట్టడానికి బద్ధకించి బయట అమ్మే పొడిని కొంటున్నారు. బయట అమ్మే పొడిలో ధనియాలు పొడి ఎక్కువుంటుందో లేక శనగపప్పు పొడి ఎక్కువుంటుందో నాకు తెలియదు.

  చాలామంది రాత్రిపూట భోజనంలో పెరుగును తింటారు. రాత్రిభోజనంలో పెరుగువాడితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆయుర్వేద వైద్యులు తెలియజేస్తున్నారు. రాత్రి పూట పెరుగు బదులు మజ్జిగలో ఉప్పు వేసి తీసుకోవచ్చట. రాత్రిపూట పాలు తీసుకోవటం మరీ మంచిదట.

  ఈ విషయాలన్నీ మీకూ తెలియవనికాదు. నాకు తెలిసిన విషయాలను వ్రాయాలనిపించి వ్రాసానంతేనండి.

 2. ఒక సామెత ఉంది ఏంటంటే రొంపకి మందు వేసుకుంటే వారం రోజుల్లొ తగ్గుతుంది వేసుకోకపోతే ఏడు రోజుల్లొ తగ్గుతుంది అని

 3. BABAAI GARU ROMPAKI ‘VAMU WATER’ CHALA MANCHI MANDU. MANAKI CYCLE MEEDA VACCHI AMMUTARU. PARAGADUPUNA 3 GUKKALU TINNATARUVATA 2, 3 TIMES TAGANDI. NAAKU CHALAMONDI 3MONTHS DAAGGU, SLESHMAM DEBBAKI POOYAI.TRY CHESI CHUDANDI.

  • @శ్రీనివాస్ జీ,
   ఇప్పుడు బ్లాగిల్లు చూడటానికి ఉపయోగించుకోడానికి బలే సౌకర్యంగా ఉంది. ఆ మార్పు కూడా మీరు గమనించి ఉంటారనుకుంటా. స్పీడ్ ప్రస్తుతానికి టపా వేసిన పది నిమిషాలకి కనపడుతోంది. ఇక పేజ్ వెంటనే లోడ్ అవుతోంది. కామెంట్ లలో మార్పులు కూడా త్వరలో చేయగలరు. తక్కువ కామెంట్లు కనపడుతున్నాయి.మీ వీలు బట్టి చేయండి.టపాలకి రంగులిచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా అందంగా తెలిసేలా వుంది.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s