శర్మ కాలక్షేపంకబుర్లు- ఐదు రకాల వివాహాలు.

1

ఐదు రకాల వివాహాలు.

భీష్ముడు అంపశయ్యపై ఉండగా ధర్మరాజు ప్రశ్నకు సమాధానంగా వివిధ వివాహాలగురించి ఇలా చెప్పేరు. భారతం అనుశాసనిక పర్వం. అశ్వాసం.2.. 220 నుండి 226 వరకు.

“కుల శీలాలు చూసి అటువంటివానికి పిలిచి సమంత్రకంగా పిల్లనివ్వడం అనగా పెళ్ళి చేయడo  బ్రాహ్మ్య వివాహం అంటారు.

కన్య పురుషుణ్ణికొరితే, ఆ పురుషుడు ఆమెపై ఆశ పడితే జరిగే వివాహం రాజస వివాహం అన్నారు.

కన్ను మనంబు తనిసిన అన్నారు తిక్కనగారు, అంటే రూపం నచ్చి మనసుకి ఇష్టమైనవాడిని కన్య కోరితే అతడు ఆశపడితే జరిగే వివాహం గాంధర్వం.

కన్య పురుషులు మనసు తనువులు ఏకమైనట్లుగా ప్రేమించుకున్నవారు ఒక వెల కడితే అది ఆసుర వివాహం.

కన్య తరఫువారిని హింసించి కన్యనెత్తుకుపోయి వివాహం చేసుకోవడం రాక్షస వివాహమన్నారు.”

2

సీతా రాములది ఆర్ష వివాహం. విల్లు విరిచిన వెంటనే వరమాల వేయలేదు. రాముడు వివాహం చేసుకోలేదు. వీర్య శుల్కగా సీతను ప్రకటించానని చెబితే మానాన్న గారు గురువు గారు చెప్పాలన్నాడు. అప్పుడు దశరధునికి కబురు పంపేరు, ఆయన వచ్చాకా వి వాహాలు నిశ్చయమయ్యాయి. కన్యను వెతుకుతూ వరుని తరఫు వారు వెళ్ళడమే సంప్రదాయం. ఇప్పటికి పెళ్ళిలో కన్యావరణ అని చేస్తారు. మా అబ్బాయికి వివాహం చేయలనుకుంటున్నాం, మీరు యోగ్యమైన కన్యను చూసి చెప్పండని నలుగురు పెద్దలకి తాంబూలాలిప్పిస్తారు. నేడివన్నీ మరుగున పడిపోయాయి.

రాజస గాంధర్వాలకి పెద్ద తేడా లేదు. దీనికి ఉదాహరణలు చాలా, శకుంతలా దుష్యంతులు, యయాతి, దేవయాని. శర్మిష్ఠ యయాతిని కోరినపుడు ఒక వాదన చేస్తుంది. అసలు నీకు నేను భార్యనే అంది, నా యజమానురాలి భర్తవు కనక నాకూ భర్తవే అంది, అదే కాక ఋతుకాలం లో అడుగుతున్నా కాదనలేవు, అలా అంటే పాపం చుట్టుకుంటుంది అని బెదిరిoచింది, ఇదీ గాంధర్వమే.  ఇప్పుడు జరుగుతున్నవి గాంధర్వాలే. 

నేడు కట్నాలు తీసుకుని చేసుకుంటున్న పెళ్ళిళ్ళన్నీ అసుర వివాహాలే.

రాక్షస వివాహం కి ఖచ్చితమైన నిదర్శనం శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకొచ్చి పెళ్ళి చేసుకోవడం. అక్కడ కూడా కన్య ఇష్టపడినపుడు మాత్రమే వివాహం జరిగింది. రుక్మిణి రాయబారం పంపినపుడే చెప్పిందన్నారు పోతన గారు

3

అంకిలి సెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే
యంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చెదన్. దశ..1705

నీవు శౌర్యంతో శిశుపాల జరాసంధులను జయించి వచ్చి నన్ను తీసుకుపో వస్తానని చెప్పి రాయబారం పంపింది కదా. ఇది అసలు రాక్షస వివాహానికి ప్రతీక. ఆ తరవాత తండ్రి గారు చేసినట్లే కొడుకు కూడా మేనమామ కూతుర్ని అంటే రుక్మి కూతుర్ని ఎత్తుకొచ్చి పెళ్ళి చేసుకున్నాడు. ఇది కావాలనుకుంటే చెప్పండి మరో టపా రాస్తా, మీరడిగితేనే సుమా!

ఏ వివాహంలో నయినా కన్య ఒప్పుకుంటేనే వివాహం జరిగేది, అదీ నాటి స్త్రీ స్వాతంత్ర్యం.

stephy gal

సుప్రీం కోర్ట్ స్వలింగ సంపర్కం కూడదంది, ఆ వివాహాలూ పనికి రావనే కదా! కోర్ట్ మీద విరుచుకుపడుతున్నారు, వ్యక్తి స్వాతంత్ర్యం,మానవ హక్కులు పోయాయని.  స్త్రీ పురుషుల సంసారం ప్రకృతి నియమం.ప్రకృతి నియమం కాదనడం ఏమిటో తెలియదు. మరీ వెర్రి తల, తలపు,ఇది పురోభి వృద్ధి అంటున్నారు. మీడియా వంత పాడుతోంది చిత్రంగా, మానవ హక్కులు, వ్యక్తి స్వాతంత్ర్యం పోయాయని, పిదపకాలం.

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- ఐదు రకాల వివాహాలు.

  1. ఎలాంటి వివాహం చేసుకున్నా కూడా భార్యాభర్త ఇద్దరూ సుఖంగా , మనశ్శాంతిగా ఉండటమనేది ముఖ్యం. తమ సంతానాన్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దటం ముఖ్యం.

    దయచేసి రుక్మి కూతురు కధ కూడా చెప్పండి.

  2. కొడుకు కూడా మేనమామ కూతుర్ని అంటే రుక్మి కూతుర్ని ఎత్తుకొచ్చి పెళ్ళి చేసుకున్నాడు…Ee story cheppandi mastaru…telusukovalani vundi…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s