శర్మ కాలక్షేపంకబుర్లు- రుక్మవతీ కల్యాణం.(రుక్మిణీ కల్యాణం కాదు)

3

రుక్మవతీ కల్యాణం.
కృష్ణుడు, రుక్మిణీ దేవిని రాక్షసవివాహం చేసుకున్నాడు. అలాగే ఆయన కొడుకు ప్రద్యుమ్నుడు, మేనమామ రుక్మి కూతుర్ని రాక్షస వివాహం చేసుకున్నాడంటే అది చెప్పమన్నారు, అదే కాదు ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు మేనమామ కూతురినే చేసుకున్నాడు, ఈ సారి రాక్షసం కాదు,రుక్మి మనవరాలి పెళ్ళి చేసేడు.అవధరించండి

“రుక్మిణి,కృష్ణుల కల్యాణం జరిగింది. రుక్మిణికి ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, సుధేష్ణుడు, చారుదేవుడు,సుచారువు,చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు అనే పుత్రులు కలిగారు.అక్కడ రుక్మికి రుక్మవతి అనే కూతురు కలిగింది. రుక్మి, రుక్మిణీ కల్యాణానికి ముందు చేసినట్లుగానే

బరగ రుక్మవతీ స్వయంవరము కెలమి

నరుగుదెం డని భీష్మభూవర సుతుండు

వరుస రప్పించె రాజన్యవర కుమార

వరుల నను వార్త కలరి యా హరిసుతుండు…దశమ.స్కం..ఉత్తర భా..281
రుక్మవతీస్వయంవరనికి రండని రాజులందరిని పిలిచాడు రుక్మి, ఈ వార్త తెలిసిన ప్రద్యుమ్నుడు…

ఈ సారి రుక్మి స్వయంవరం ప్రకటించేడే తప్పించి వరుణ్ణి మాత్రం నిర్ణయం చేయలేదు,అమ్మాయి మనసు తెలుసుకుని ఉంటే స్వయంవరం ప్రకటించక్కరలేకపోను. కాని రుక్మి ఆ పని చేయక స్వయంవరం ప్రకటించాడు.

true-lovers-jitendra-r-sharma

Courtesy:jitendra Goswamy

స్వయంవర వార్త తెలిసిన ప్రద్యుమ్నుడు చక్కగా అలంకరించుకుని,ఆయుధాలతో రధమెక్కి రుక్మి పట్టణానికి వెళ్ళేడు.ఒక్కడే వెళ్ళేడు, మేనమామ ఇంటికి.అక్కడికి వెళ్ళి స్వయంవరానికి విచ్చేసిన రాజులందరినీ చావకొట్టి,మేనమామ కూతురు రుక్మవతిని,తండ్రి శ్రీకృష్ణుని ఆచారం పాటిస్తూ, ఇంటికి తీసుకువచ్చి రాక్షసవివాహం చేసుకున్నాడు. పెళ్ళి చేసుకున్నాడు, ఎక్కడ? తన ఇంటిలో.ఈ సారి రుక్మి కాని అనుచరులు కాని అడ్డుపడలేదు. ఇలా రుక్మవతీ కల్యాణం అయింది.

రుక్మవతీ ప్రద్యుమ్నులకు అనిరుద్ధుడు కలిగాడు, అక్కడ మరల రుక్మి కొడుకుకి రుక్మలోచన కలిగింది. ఇప్పటికి రుక్మికి కొంత జ్ఞానోదయమయిoది, మనుమరాలి మనసు తెలుసుకున్నాడు. తన మనుమరాలు రుక్మలోచనను అనిరుద్ధునకిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. వివాహం జరిగింది.” ఈ సందర్భంగా పాచికలాడి ప్రాణం పోగొట్టుకున్నాడు. కళ్యాణ ఘట్టం లో అదెందుకుగాని మరొక సారి చెప్పుకుందాం, ఆ సంగతి. అలా కృష్ణుడు రుక్మిణిని, ప్రద్యుమ్నుడు రుక్మవతిని, అనిరుద్ధుడు రుక్మలోచనను వివాహం చేసుకున్నా రు, మూడు తరాలు వివాహాలు జరిగాయి. 

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- రుక్మవతీ కల్యాణం.(రుక్మిణీ కల్యాణం కాదు)

 1. ప్రద్యుమ్నుడు రుక్మవతికి, అనిరుద్ధుడు రుక్మలోచనకు జరిగిన వివాహాల గురించి నేను ఇంతకుముందు చదవలేదు.

  ఈ విశేషాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదములండి.

  • @

   అనురాధ గారు,
   సాధారణం గా భాగవతం నవమ దశమ స్కంధాలు చదివి వదిలేస్తారు. దశమ స్కంధం లో ఉత్తరభాగం కూడా చదవాలిసినదే.మొత్తం భాగవతం చదవాలి.
   ధన్యవాదాలు

 2. Mohan garu, this happens about 5100+ years earlier (Latest Dwaraka diggings support our Purana dates). We do not know what type of marriages are there? The present Dharma Sastras modified and written for Kaliyuga people (For example In ancient times at the time of Shradda (pitru tithies) Brahmins are allowed to take Non Veg – The case of Vasista – Vasista cursed his King (Linage of Sri Rama) as he recieved dead Human body!!!!

   • @
    మోహన్జీ
    ఒడిసా, పశ్చిమ బంగాలు బ్రాహ్మణులు మాంసభుక్కులు కాదు కాని జల పుష్పాలు చాలా ప్రీతిగా సేవిస్తారు, నేటికీ, నారాయవతారంగా భావించి. 🙂
    ధన్యవాదాలు

  • @
   వేంకట్రాం కలగ గారు,
   నాడు జరిగిందది. దాని మంచి చెడ్డల విమర్శ అనవసరమేమో కదా. భీష్ములు పితృ కర్మలో మేక మాంసం వడ్డించాలన్నారు. కాలక్రమేణా మార్పులొచ్చి మేక మాంసం బదులు మాషచక్రాలు వడ్డిస్తూ వచ్చారు. ఇప్పుడవీ పోయాయి లెండి. తద్దినాలెవరు పెడుతున్నారు ? అసలు వర్గత్రయం ఎంతమందికి తెలుసంటారు?
   ధన్యవాదాలు

 3. మేనరికం ఉత్తరాది లో పూర్తిగా వర్జితం.
  దక్షిణాన కూడా శాస్త్ర రీత్యా
  మంచిది కాదని తెలిసిన వారు ఎడం పాటిస్తున్నారు,
  మీరేమంటారు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s