శర్మ కాలక్షేపంకబుర్లు-ధర్మరాజు కి పట్టాభిషేకంఎవరు చేశారు?మంత్రి వర్గం?

21`

ధర్మరాజు కి పట్టాభిషేకం ఎవరు చేశారు?మంత్రి వర్గం?

ఈ ప్రశ్న నా మనసులో చాలా కాలం నుంచి ఉందికాని దీనికి సమాధానం మొన్న దొరికింది. భారతం. శాంతి. పర్వంఆశ్వా.371 నుండి…

“బయట పెద్ద స్థలంలో పెద్దదయిన బంగారు సింహాసనం వేయబడింది, తూర్పుగా. ధర్మ రాజు, మిగిలిన ఎవరెవరు ఎక్కడ కూచోవాలన్నదానికి సభ నిర్వహణ అర్జునునికి అప్పచెప్పబడింది. ధర్మ రాజు సింహాసనానికి ఎదురుగా బంగారు ఆసనం మీద శ్రీకృష్ణుడు, సాత్యకి కూచున్నారు. ధర్మరాజుకు కుడి ఎడమల భీముడు, అర్జునునికి ఆసనాలు వేశారు, సింహాసనానికి వెనుక ఇరు పక్కల చిన్న ఆసనాలమీద నకులుడు సహదేవుడు తో కుంతి కూచుంది. శ్రీకృష్ణునికి కుడివైపు ధృతరాష్ట్రుడు,ఆయన వెనక గాంధారి, యుయుత్సుడు, ఆయనకు తూర్పున విదురుడు, ధౌమ్యుడు కూచున్నారు. ఆ సమయంలో కృపాచార్యునికి తగు ఆసనం ఇచ్చారు, ధౌమ్యుని సమీపంలో. మిగిలిన నానా దేశరాజులకు, వాణిజ్య ప్రతినిధులకు, పౌరులకు, వివిధ జానపదులకు ఆసనాలు ఇవ్వబడ్డాయి.

అంతట అభీషేక ద్రవ్యాలు, కృష్ణుని అనుమతితో ధౌమ్యుడు, తూర్పుగా వేయబడిన వేదికమీదకు చేర్చారు. గట్టికోళ్ళు కలిగిన కాంచన సింహాసనం వేయబడింది, తూర్పు ముఖంగా. దానిపై పులితోలు కప్పేరు. సింహాసనాన్ని అర్చించారు. బంగారు శంఖం సముచిత స్థానం లో ఉంచారు, దానికి పూజ చేశారు. దాని చుట్టు బంగారు కలశలు, మట్టి పాత్రలు ఉంచారు. వాటిలో వివిధ నదుల జలాలు ఉంచారు. అక్కడే పువ్వులు, పంచగవ్యాలు, సమంత్రకంగా ఉంచారు. ఆ సమయం లో గొప్పవైన మంత్రాలతో బ్రాహ్మణులు ధర్మరాజును పాంచాలి సహితంగా సింహాసనం దగ్గరకి ఆహ్వానించేరు. అంతట అభిషేక ముహూర్త సమయమయింది. “శ్రీ కృష్ణుడు శంఖం ఎత్తి పృధివికి అధిపతివి కమ్మని పట్టాభిషేకం చేసేడు”. అక్కడ వున్న బంగారు కలశాలలో ఒకదానిని ధౌమ్యుడు అందివ్వగా ధృతరాష్ట్రుడు అభిషేకించాడు. ఆ సమయంలో మంగళారావాలు, దుంధుభి మోతలు మారుమోగాయి. అంతట ధర్మరాజు సముచితమైన దానాలు చేశాడు. పౌర జానపదులు ఎల్లరు అభినందించగా ఎల్లరకు ధృతరాష్ట్రుని చూపి ‘ఈ మహారాజును ఇదివరలో ఎలా గౌరవించారో ఇప్పుడూ అలాగే గౌరవించాలని’ చెప్పేడు. ‘మీరంతా ఆయన మాట వింటే నాకు ఆనందం’ అన్నాడు. ఆ తరవాత గాంధారి సహితంగా ధృతరాష్ట్రుని నగరిలోకి పంపించి, పౌర జానపదులకు వీడ్కోలిచ్చి, కృపాచారునికి వీడ్కోలు పలికి అప్పుడు తన మంత్రాంగం, మంత్రివర్గం ఏర్పాటు చేశాడు.

అందులో భీముడు యువరాజు అనగా రాజు తరవాతివాడు. విదేశీ వ్యవహారాలు, యుద్ధము, సంధి వగయిరా సంగతులకు విదురుని నియమించాడు. విత్త మంత్రి, ఆదాయ వ్యయాలు, ఖర్చు ముందువెనుకలు విషయాలు చూసేందుకు సంజయుని నియమించాడు. సేనల, ఉద్యోగుల జీతభత్యాలు చూడటానికి పనులు చేయించడానికి డిఫెన్స్ మినిస్టర్ గా నకులుని నియమించాడు. పర రాజ్య ఆక్రమణ, బలవంతులను దండించడం వగైరా పనులకు హోం మరియు వార్ పోర్ట్ ఫోలియో అర్జునునికి ఇచ్చాడు. పుణ్యకార్యకలాపాలు నిర్వహణా భారం అనగా ఎండోమెంట్స్ ధౌమ్యునికి ఇచ్చాడు. మినిస్టర్ ఇన్ వైటింగ్ అండ్ పర్సనల్ సెక్రెటరి గా సహదేవుని నియమించాడు.సర్వకాలాలో తన దగ్గరే ఉండాలన్నాడు. అందరికి అధికారాలిచ్చాడు. యుయుత్సుడు, విదుర, సంజయులకు ఉమ్మడిగా ప్రజల బాగోగులు, రాజుకు ప్రజలు సమర్పించే పిటిషన్లు వగైరాలు రాజు దృష్టికి తీసుకొచ్చేందుకు నియమించాడు.”

నాటి పరిపాలనా విధానం చూస్తే నేటి విధానానికి తేడాగా ఏమీ కనపడలేదు. గూఢచారిత్వం వగైరా అన్నీ వీటికిందకే వచ్చేసి ఉంటాయి. ఔరా! నాటి వ్యవస్థ ఎంత కట్టుదిట్టంగా ఉంది అనిపించింది.

images

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ధర్మరాజు కి పట్టాభిషేకంఎవరు చేశారు?మంత్రి వర్గం?

  1. నిజమేనండి , నాటి వ్యవస్థ ఎంత కట్టుదిట్టంగా ఉంది అనిపించింది.

    ఇప్పటి వాళ్ళు , ప్రాచీనకాలం వారికి ఎక్కువ విషయాలు తెలియవు అనుకుంటారు గానీ పూర్వీకుల నుంచే మనం ఎన్నో విషయాలను తెలుసుకోవాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s