శర్మ కాలక్షేపంకబుర్లు-మనం మరచిన మన ఆటలు.

gamesofindia

మనం మరచిన మన ఆటలు.

శ్రీమహావిష్ణువు పాచికలాడుతున్నాడట లక్ష్మీదేవితో, గజేంద్రుడు మొరపెట్టుకునేటప్పటికి. అసలు మహాభారత యుద్ధానికి మూలం పాచికలాటే కదా!బలరాముడు పాచికలాటలో జరిగిన తప్పుకి, హేళనకి, రుక్మిని వధించాడు. పెళ్ళిలో కూడా ఆటలుంటాయి. అసలు ఆట పాట మన జీవితం లో ఒక భాగం, అటువంటిది మనం ఆటలు మరిచిపోయాం.

తెనుగునాట చాలా అటలు ఆడుకునేవారు పిన్నలు, పెద్దలూ కూడా. ఆ రోజులలో ఆట చదువులో ఒక భాగమై ఉండేది. ఆట శరీరానికి వ్యాయామమే కాక విజ్ఞానాన్ని పెంపొందించేదిగానూ,నిశిత పరిశీలన పెంచేదిగానూ ఉండేది. మనం మరచిపోయిన కొన్ని ఆటలు చూద్దాం.

కర్రా బిళ్ళా అదే గిల్లీ దండా లేదా గోటీ బిళ్ళ అనేవారు. మరికొన్ని కోతికొమ్మచ్చి, దాగుడు మూతలు,ఉప్పట్లు,బొంగరాలు,బచ్చాలు, తొక్కుడు బిళ్ళ,దూదుంబిళ్ళ దుక్కుడు బిళ్ళ, గోళీలు, ఉయ్యాల ఊగడం,తొక్కుడు బిళ్ళఇవి కాక కొన్ని ఆటలు ఒకరు ఆడుకునేవి ఇద్దరు ఆడుకునేవి, ఇంట్లో ఆడుకునేవి ఉండేవి అవి. తాడాట,దాడి ఆట,పులి మేక, గవ్వలు,గచ్చకాయలు, చింతపిక్కలాట లేదా వామన గుంటలు,వైకుంఠపాళీ, ఇలా చాలనే ఉండేవి నేను చెప్పడం లో కొన్ని మరచీ ఉండచ్చు,.

వర్గం “తెలుగు ఆటలు” లో వ్యాసాలు. ఈ వర్గంలో ఉన్న మొత్తం 15 పేజీలలో ప్రస్తుతం 15 పేజీలను చూపిస్తున్నాము.
te.wikipedia.org/wiki/వర్గం:తెలుగు_ఆటలు

కరాబిళ్ళా ఆట నేటి క్రికెట్ కు మూల రూపం. ఇందులో ఒక కర్ర (బేట్) బిళ్ళ (బాల్) ఉండేవి. ఈ బిళ్ళ కూడా ఒక చిన్న కర్ర ముక్కే. దీనిని చిన్న గోతి మీద పెట్టి కర్రతో సుతారంగా కొడితే పైకి ఎగిరేది, దానిని మళ్ళీ కర్రతో గాలిలో ఉండగా గట్టిగా కొట్టాలి. అప్పుడు అది ఎంత దూరం లో పడిందో కర్రతో కొలిచేవారు. ఆ కొలతకి కూడా పేరుంది అది “లాల” (రన్) ఇలా ఒకరి తరవాత ఒకరు ఆడితే ఎవరు ఎక్కువ లాలలు చేస్తే అతను గెలిచినట్లు. చిన్న గొయ్యి అనుకున్నాం కదా అది ఏటవాలుగా తీసేవారు. దాని పేరు “కంచా”. బిళ్ళ కర్రముక్కనుకున్నం కదా ఆ కర్ర ముక్క రెండు పక్కలా సూదిగా చెక్కేవాళ్ళం. బిళ్ళ తేలికగా లేవడానికి. దాగుడు మూతలు లో ఒక పాట కూడా ఉండేది, ’వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి’ అని ఒకరు మరొకరి కళ్ళు మూసి అడిగితే వారు ఆ పేరు చెప్పలేకపోతే ఈ కళ్ళు మూయబడినవారు వారు అందరిలో ఒకరినైనా ముట్టుకుంటే ఔట్ అయినట్లు లెక్క. లేకపోతే వారిని పట్టుకోడానికి ప్రయత్నం లో వారు పరుగున వచ్చి కళ్ళు మూసిన వారిని ముట్టుకుంటే ఔట్ కాదు. ఈ కళ్ళు మూసినవారు అక్కడే కూచుని ఉండేవారు. వీరికీ పేరుంది అది “తల్లి” ఉప్పట్లు కొద్ది తేడాతో ఖోకో ఉండేదని గుర్తు. బొంగారలాట అన్నది చరిత్రలో కూడా ప్రసిద్ధి కెక్కినదే, పల్నాటి బాలచంద్రుని మూలంగా. ఇక బచ్చాలాటలో ఒక వృత్తం గీసి అందులో పేక ముక్కలు కాని,సిగరట్టు పెట్టి గుల్లలు కాని పెట్టి వాటిని ఒక రాతితో కొట్టాలి. అవి ఎన్ని బయటికి వస్తే అన్ని గెలిచినట్టు. దూదుంబిళ్ళ ఆటలో ఒక చిన్న పుల్ల ముక్కని దుమ్ము పొడుగుగా దగ్గరకు చేరిస్తే అందులో ఒకరు దూదుంబిళ్ళ దుక్కుడు బిళ్ళ అంటూ బిళ్ళ దాచేవారు. రెండవవారు. రెండు చేతుల వేళ్ళూ ఒక దానిలో ఒకటి దూరి ఆ చేతులను ఒక చోట ఈ మట్టి గుట్టపై ఉంచితే దాచిన వారు బిళ్ళ తీస్తే రెండవ వారు ఓడినట్టు, రెండవావరి చేతులకింద కనక దొరికితే వారు గెలిచినట్టు లెక్క.

దాడి

తాడాట నేడు స్కిప్పింగ్ అని చెబుతున్నది నాటిరోజులలో ఆడపిల్లలు తప్పని సరిగా చేసేవారు. దీని మూలంగా ఎముకబలం పెరుతుందంటున్నారు, మరి ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ తాటికి కొలత ఉంది. తాడుతీసుకుని ఆ తాడును రెండు మడతలు వేసి కాలి బొటతన వేలుతో మద్యతొక్కి పట్టుకుని ఆ రెండు కొసలు ముక్కు దాకా వచ్చేలా చూసుకుని ఆట ప్రారంభించేవారు. ఇక గవ్వలు గచ్చకాయలు ఆడేవారు ఐదు గవ్వలు కాని కచ్చకాయలు కాని తీసుకుని గుప్పెట పట్టి నాలుగు నేలన కుప్పలా ఉంచి ఒకటి పైకి ఎగరేసి కింద ఉన్న నాలుగూ చేత్తో తీసుకుని ఎగరేసినది కింద పడుతుంటే పట్టుకోవాలి,వీటిని కాయలనేవారు, ఈ ఆటకి ఎంత ఏకాగ్రతకావాలో. ఇలా ఎన్ని సార్లు చేయగలిగితే అది గెలుపు, ఇద్దరు ఆడుకునేవారు. వామన గుంటలు చాలా పెద్ద ఆట అందులో వాడే మాటలు కొన్ని చెబుతా. ఈ ఆట గురించి వివరంగా చెబుతానంది నా కోడలు, కుదరలేదు. మరొక సారి వివరంగా రాస్తా కదా! ఇందులో “పుంజీ” అంటే నాలుగు అని అర్థం, ఇప్పటికి ఈ మాట తెనుగునాట వాడుకలో ఉంది. “ఆ సభలో గట్టిగా పుంజీడు మంది లేరు” మరొక మాట “కచ్చటం” అంటే ఎనిమిదని అర్ధం. “గుర్రం” అంటే పదహారని అర్ధం. దీనికి ఒక గుంటల బల్ల కూడా ఉండేది. ఇక వైకుంఠపాళీ ఒక బొమ్మల అట్ట, దాని మీద కొన్ని నిచ్చెనలు, పాములు చివరికి వైకుంఠం పైన ఉంటాయి. నాలుగు గవ్వలు తీసుకుని ఆట మొదలెట్టచ్చు. ఇద్దరేనా ఆడచ్చు, ఒకరికి ఒక కాయ అని గడులలో నప్పడానికి ఉంటుంది. గవ్వలు గిలకరించి కింద పోస్తే అన్నీ బోర్లా పడితే ఎనిమిది, అన్నీ వెల్లకిలా పడితే నాలుగు, ఒక గవ్వ వెల్లకిలా పడి మిగిలినవి బోర్లా పడితే ఒకటి. ఇలా లెక్కించి కాయను నప్పుకుంటూ వెళితే నిచ్చనదగ్గరకి వెళితే పైకి ప్రమోషన్, పాము నోట్లో పడితే కిందకి దిగిపోవడం, ఇలా ఆట జరుతూ చివరికి వైకుంఠం చేరుతారు. అక్కడికి చేరడాన్ని పండటం అంటారు. మరొకటి పెద్దవాళ్ళు ఆడుకునేవారు దానినీ మరచిపోయాం,అదే దశావతారీ.

ఇప్పుడు ఆటలు ఆడుకునేందుకు చోటూ లేదు, ఆడుకోడానికి సమయమూ లేదు. అంతా చదువు మార్కులు, అనవసరపు పోటీ. మార్పు వస్తుందా?

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మనం మరచిన మన ఆటలు.

 1. తాతగారు క్షేమమని తలుస్తాను..
  రోజు మీ బ్లాగు దర్శనం అవుతుందిగాని..
  కొత్త టపాతో సందర్శనం అవడంలేదు..:(
  ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తాతగారు..:)

  • @ధాత్రి,
   ఆలస్యానికి మన్నించాలి.
   అనారోగ్యం లో పడ్డాను. రెండు రోజులనుంచి కొద్దిగా బానే ఉంది 🙂
   ధన్యవాదాలు.

 2. శర్మ గారు ఆటల్లో పడి బ్లాగు లోకాన్ని మరిచి పోయినట్టు ఉన్నారు ! కుశల మేనా ??

  నూతన సంవత్సర శుభాకాంక్షల తో

  జిలేబి

  • @జిలేబి గారు,
   ఆలస్యానికి మన్నించాలి.
   మీకు నూతన సంవత్సర శుభకామనలు.ఆటల్లో పడి మరవలేదండి, అనారోగ్యం లో పడ్డాను 🙂
   ధన్యవాదాలు.

 3. తెలుగు నాటి ఆటలను, చక్కగా వివరించి , మీ టపా తో, ఠ పీ మని, బాల్యం లోకి తీసుకు పోయారు , చదివే వారిని !
  వైకుంఠ పాళీ ని ‘ పరమ పద సోపాన పటము ‘ అని కూడా పేరు పెట్టి అమ్మే వారు ! ఆ పటం లో బొమ్మలన్నీ కూడా ఆకర్షణీయం గా ఉండేవి !
  బొంగరాల ఆట కూడా ! ఒక బొంగరాన్ని తాడు తో చుట్టి , గిర్రున గాలి లో ఎగిరి, తిరిగే ఆ బొంగరాన్ని, ఒడుపు గా అర చేతిలోకి ‘ ఆహ్వానించి ‘ అది ఇంకా తిరుగుతూ ఉండగానే , స్నేహితుల చేతుల్లో పెట్టడం, ఆ గిలిగింతలు ఆస్వాదించడం ! ! వా ! మహదానందం గా ఉండేది !

  • ఖండాంతరాల ఆవల ఉన్నా, ఉన్నత పదవుల్లో మునిగి ఉన్నా, చిన్ననాటి ఆటలు మరచిపోని నిరాడంబరం డాక్టర్ గారిది, గుర్తుచేసిన శర్మగారు గొప్పవారు.:-))

   • @ఫాతిమాజీ,
    ఆలస్యానికి మన్నించాలి,
    ఎంత పెద్దవారయినా పెట్టిన గడ్డను, కన్న తల్లిని మరువలేరు.
    ధన్యవాదాలు.

  • @సుధాకర్జీ,
   ఆలస్యానికి మన్నించాలి,
   ఇప్పుడు ఈ ఆటలన్నీ మరచిపోయారండి. బొంగరాలాట అసలు కనపడటమే లేదు.
   ధన్యవాదాలు.

 4. నిజమే ఆటలుకూడా అంతర్జాలమ్లో ఆడుకోవాల్సి వస్తుంది ఇప్పటి పిల్లలు.
  అందుకే శారీరక మానసిక వికాసం ఉండటం లేదు.
  మంచి టపా, సర్.

  • @ఫాతిమాజీ,
   ఆలస్యానికి మన్నించాలి,
   ఇప్పుడు పిల్లలు పెద్దలు నెట్ లోనే ఆడుకుంటున్నారు 🙂
   ధన్యవాదాలు.

 5. చాలా ఆటల గురించి వ్రాసాను. వీటిలో కొన్ని ఆటల గురించి నాకు తెలుసు.

  మీరన్నట్లు, ఇప్పుడు ఆటలు ఆడుకునేందుకు చోటూ లేదు, ఆడుకోడానికి సమయమూ లేదు. అంతా చదువు మార్కులు, అనవసరపు పోటీ. మార్పు ఎప్పుడు వస్తుందో భగవంతునికే తెలియాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s