శర్మ కాలక్షేపంకబుర్లు-సంక్రాంతి శుభకామనలు.

సంక్రాంతి శుభకామనలు.

3

సూర్యుడు లేకపోతే ఏమీ లేదు. మనం సూర్యుడినుంచి పుట్టేం. ఎలా? సూర్యుడు భూమి మీదకి శక్తిని ప్రసరిస్తే, అది ఆహారంగా మారితే స్త్రీ పురుషులు అది తీసుకుంటే, శుక్ర శోణితాలుగామారి, వాటి కలయికతో, మన జన్మ జరిగింది. మనమూ వాటినే తీసుకుని పెరుగుతాము. అండాండం నుంచి పిండాండం పుడుతుంది, మరల అందులోనే కలిసిపోతుంది. పంచభూతాలు కలిస్తే జీవుడు పుట్టుక. అవి విడిపోతే మరణం, ఇంతే.

అటువంటి సూర్యుడు ఇప్పటిదాకా మనకు కొద్ది దూరంగా ఉన్నాడు. భూమి ఉత్తరార్ధగోళం లో ఎక్కువ దక్షణార్ధ గోళం లో తక్కువా ఉంటుంది. సూర్యుడు సెప్టెంబర్ నెల మొదలుకొని దక్షణార్ధ గోళానికి అభిముఖంగా ఉంటాడు, అందుకు మనకు చలి ఎక్కువగా ఉంటుంది. ఉత్తర ధృవందగ్గర ఈ ఆరునెలలు చీకటి ఉంటుంది. ఈ రోజు మొదలు సూర్యుడు మరల ఉత్తరార్ధగోళానికి అభిముఖంగా రావడానికి ప్రారంభం అవుతుంది.ఇప్పుడు ఆస్ట్రేలియా, దక్షణ ఆఫ్రికా,దక్షణ అమెరికా దేశాలలో వేసవి కాలం. మంచి జరిగే రోజు పండగ కదా! అందుకే ఈ రోజు మానవాళికి పండగ. ముఖ్యంగా మన దేశానికి పండగ. మన దేశం ౭ నుండి ౩౨ డిగ్రీల మధ్య ఉంటుంది, అందుకే సమశీతోష్ణ ప్రాంతం, అందుకు మనకు పండగ, పెద్ద పండగ. ఈ పండుగ ఎప్పటినుంచి చేస్తున్నాం? తెలియదు…కాదు చెప్పలేం. ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ ఆ మార్పులను గుర్తిస్తూ పండుగలు చేసుకోడం మన ఆచారం.

ప్రకృతికి దగ్గరగా జీవించండి, ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించండి ఆనందంగా జీవించండి. అందరికి శుభకామనలు.

1

సంక్రాంతి శుభకామనలు.

2

సంక్రాంతి శుభకామనలు.

download (1)

సంక్రాంతి శుభకామనలు.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సంక్రాంతి శుభకామనలు.

  1. చక్కటి విషయాలను తెలియజేసారు.
    మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s