శర్మ కాలక్షేపంకబుర్లు-సంభోగంలో ఎవరికి సుఖమెక్కువ?

1

సంభోగంలో ఎవరికి సుఖమెక్కువ?

ఇలా ధర్మరాజు భీష్ముని అడిగాడు. దానికి భీష్ముడు ’దీనిగురించి జరిగిన ఒక కధ ఉంది చెబుతావిన’మన్నాడు. మీ కోసం (భారతం అనుశా.ప. అశ్వా.1…284 నుండి 307 వరకు స్వేఛ్ఛానువాదం)

భంగాస్వనుడనేమహారాజు కుమాళ్ళగురించి ఒక యజ్ఞం మొదలుపెట్టి చేసి నూర్వురు పుత్రులను కన్నాడు. కాని ఆ యజ్ఞం చేయడం ఇంద్రునికి ఇష్టం లేదు. ఒక రోజు  భంగాస్వనుడు వేటకి వెళ్ళేడు. అతనికి భ్రాంతి కలిగించి దూరంగా తీసుకుపోయాడు, ఇంద్రుడు. రాజుకి దాహం కలిగింది, ఒక చెరువు కనపడితే గుర్రం వీఫు తడిసేలోతుకు గుర్రాన్ని దింపి నీరుతాగి ములిగి తేలేటప్పటికి స్త్రీగా మారిపోయాడు. తనని తాను చూచుకుని భంగాస్వనుడు ఆశ్చర్యపోయాడు, కొలనునుంచి బయటపడి, ఈ రూపం తో గుర్రం ఎలా ఎక్కగలను?, పట్నం లోకి వెళితే నన్ను చూసి ఏమనుకుంటారు? నా భార్యలేమనుకుంటారు?, కొడుకులేమనుకుంటారు? పోనీ ఇక్కడే ఉండిపోదామనుకుంటే, అడవిలో ఎలా ఉండటం. అని ఆలోచించి, ఎలానయితేనేం రాజధాని చేరితే, అందరూ అశ్చర్యపోయారు. స్త్రీ రూపంలో ఉన్నభంగాస్వనుడు మంత్రులను రావించి కొడుకులకు రాజ్యం అప్పగించి అడవికి పోయాడు, తపస్సు చేసుకోడానికి. అడవికి పోయి తపస్సు చేసుకునేవాళ్ళతో కూడి తపస్సు చేసుకుంటుండగా, అందులో ఒకడు ప్రియుడయ్యాడు. ప్రియుని వలన స్త్రీ రూపంలో ఉన్న భంగాస్వనునికి నూర్వురు పుత్రులు కలిగారు. ఈ వందమంది పుత్రులను వెంట పెట్టుకుని రాజధానికి చేరి,

lips

Un usual flower.                              Courtersy:K.Raghavendra Rao

మగతనముననాడు మీరు,న్మగువతనమున వీరు నాయందుదయం
బగుట దోడంబుట్టువు లగుదురు ధర పంచి కుడుపు డందరు ననుడున్…292

“నాకు మగతనం లో మీరు, ఆడతనంలో వీరు కలిగేరు కనక మీరంతా అన్నదమ్ములవుతారు. రాజ్యం మీరిద్దరూ పంచుకుని పాలించుకోండి” అనగా,స్త్రీ రూపంలో ఉన్న భంగాస్వనుని మాట విని కొడుకులందరూ సఖ్యంగా ఉంటారు, రాజ్యం పాలిస్తుంటారు. ఇది చూసిన ఇంద్రుడు, ఇతనికి ఏదో చేద్దామనుకుంటే, మరేదో జరిగి, అపకారం చేయబోతే ఉపకారమై,పుత్ర సంతానం అధికమయి అందరూ ఐకమత్యం గా వున్నారని తలచి, బ్రాహ్మణ రూపంలో అన్నదమ్ముల మధ్య భేదాభి ప్రాయం కలగచేస్తే, వారంతా కొట్టుకు చచ్చారు. స్త్రీరూపం లో ఉన్నభంగాస్వనుడు గుండెలుబాదుకుంటూ ఏడుస్తుంటే, చూసిన ఇంద్రుడు బ్రాహ్మణ రూపం లో కనపడితే, జరిగినదంతా చెబుతుంది. అంతా విని ఇంద్రుడు తనను ఎరుకపరచుకొని, నాకు ఇష్టం లేని క్రతువు చేసేవు కనక ఇలా చేసేనని చెబుతాడు. అప్పుడు ఆమె సాగిలమొక్కి, తెలియక తప్పు చేసేను మన్నించమని కోరగా, కొందరు పుత్రులను బతికిస్తానంటే, నేను స్త్రీగా కన్న పుత్రులు కావాలని కోరగా, నీవు మగవాడిగా కన్న పుత్రులను ఎందుకు అడగలేదంటే, సిగ్గుపడుతూ ఆ స్త్రీ రూపం లో భంగాస్వనుడు, స్త్రీగా కన్న పిల్ల మీద ప్రేమ ఎక్కువని చెప్పగా! నిజం చెప్పేవు కనక అందరు పుత్రులనూ బతికిస్తున్నాను, నీకు స్త్రీ రూపం పోయి పురుషుడుగా అనుగ్రహిస్తున్నానని వరమిచ్చేడు, ఇంద్రుడు. దానికి స్త్రీ రూపం లోని భంగాస్వనుడు, పుత్రులను బతికించినందుకు సంతసం, నేను ఇలా స్త్రీగానే ఉండిపోతానన్నాడు. ఆశ్చర్య పోయిన ఇంద్రుడు అలా ఎందుకు స్త్రీగా ఉండిపోవలనుకుంటున్నావని అడుగగా.

సురతంబున కడునెక్కుడు, పురుషులకంటెను సుఖంబు పొలతులకు సురే
శ్వర యట్లగుటను నాకీ వెరవున రమియించి నిలువ వేడుక కలిగెన్…అను,ప..అశ్వా.1.307

సంభోగం లో స్త్రీలకు పురుషులకంటే సుఖం ఎక్కువ అందుచేత నేను ఆ సుఖం అనుభవించాలని, ఇలా ఉండిపోవాలని కోరిక. అని చెప్పేడు. దానికి ఇంద్రుడు అంగీకరించేడు.

ఏంటి ఇదీ ఉందా భారతం లో అంటారా? ఇలలో ఉన్నదే భారతం లో ఉంది, భారతం లో లేనిదేదీ ఇలలో లేదు.

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సంభోగంలో ఎవరికి సుఖమెక్కువ?

    • @మిత్రులు GLN Murthy,గారు,
      స్వాగతం,
      బలే కవ్వించారు సుమా! నేనీ ప్రశ్న విదేశాలలో బాగా చదువుకున్న అమ్మాయికి వేస్తే ’మన జాగ్రత్తలో మనం ఉంటే రేపు లెందుకు జరుతాయి?’ అంది. మళ్ళీ ఇదే ప్రశ్న మా ఊళ్ళో చదువుకోని అమ్మాయినడిగితే ’నా ఇష్టం లేకుండా మాగాడు నా మీద చెయ్యె వెయ్యడమే, చంపెయ్యనూ’ అందండి! అదీ సంగతి.
      ధన్యవాదాలు.

  1. ఆసక్తి కరంగా ఉంది మీ టపా !
    శాస్త్రీయం గా చూస్తే , సంభోగం లో సుఖం అనేక కారణాల మీద ఆధార పడి ఉంటుంది ! పురుషుడు త్వరగా ‘ వేడెక్కి ‘ త్వరగా ‘ చల్లారతాడనీ , స్త్రీ నిదానం గా ‘ వేడెక్కి ‘ నిదానం గానే ‘ చల్లారుతుందనీ ‘ అనుకోవడం జరుగుతుంది ప్రస్తుతం ! మనసులు కలిసిన సంభోగం లో సుఖం, అవుతుంది, చెరి సగం !

    • @సుధాకర్జీ,
      మీరు చెప్పినది నిజమే కాని సంభోగంలో స్త్రీలకి సుఖం అధిక సమానమనమాట. సంభోగం అంటేనే సమమైన అనుభవంకదా!
      ధన్యవాదాలు.

  2. అనుకోకుండా… రెండు రోజుల క్రితమే ప్రయాగ రామకృష్ణ గారి ‘భారతంలో చిన్నకథలు’లో ఇదే కథ చదివాను. ఇంతలోనే మళ్ళీ మీ బ్లాగులో. మీదైన శైలిలో అందంగా చెప్పారు భారత కథను.

    • @ఫణీంద్ర గారు,
      బహుకాల దర్శనం, కుశలమే కదా! రెండు నెలల కితం రాసిన టపా, వేయడానికి భయపడ్డా.
      ధన్యవాదాలు.

  3. ఘోటక బ్రహ్మచారి, భీష్ముని అడగవలసిన ప్రశ్నేనా?
    ఈ ప్రశ్న ఎందుకు అడగవలసి వచ్చింది?

    • @మోహన్జీ,
      బహుకాల దర్శనం, కుశలమే కదా! టపాకి సరిపడి సమాధానం రాయాల్సిన ప్రశ్నలేశారు.

      భీష్మ పితామహులు అంపశయ్యమీద ఉండి ఉత్తరాయణ కోసం చూస్తుండగా, పట్టాభిషేకం తరవాత పరమాత్మ ’మీ అన్నదామ్ములంతా తాతగారి దగ్గర ధర్మాలూ, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోండయ్యా’ అని పాండవులను వెంటబెట్టుకుని వచ్చి భీష్ముని చేత ధర్మరాజుకు చాలా విషయాలు చెప్పిస్తారు, పరమాత్మ. ఆ సందర్భంలో చెప్పినదే విష్ణు సహస్రనామం కూడా. అలా చెబుతుండగా ఒక నాడు లక్ష్మీ స్థానాలేవనే ప్రశ్న వేస్తాడు ధర్మరాజు ఆ సందర్భంగా సమాధానం చెబుతూ పొడిగింపుగా ధర్మ రాజు ప్రశ్నకు సమాధానం చెప్పినదే నేను రాసినది. భీష్ములు తనకు తానుగా చెప్పినవి కొన్ని, ఇతరులు మరొకరికి చెప్పినవి కొన్ని, కొన్ని కధల రూపంలో చాలా చెబుతారు. వివరంగా ఒక టపా రాసేస్తా, మీరు అనుమతిస్తే.

      ఘోటక బ్రహ్మచారిని అడగవలసిన ప్రశ్నా అన్నారు. భీష్ములు బ్రహ్మచారి మాత్రమే! ఆయనకు స్వానుభం లేకపోవచ్చుకాని లోకానుభవం మెండు కదా!
      ఇదే టపా అయిపోతోంది.
      ధన్యవాదాలు.

      • చాలా బాగా చెప్పారండి.
        మీ కబుర్లు నీతి చంద్రికలే.
        దయ చేసి కొనసాగించండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s