శర్మ కాలక్షేపంకబుర్లు- ఎక్కాలు చిక్కులా? మేజిక్కులా?

download

ఎక్కాలు చిక్కులా? మేజిక్కులా?

రెండొకట్ల రెండు రెండు రెళ్ళు నాలుగు,రెండు మూళ్ళారు, ఇలా చిన్నప్పుడు ఎక్కాలంతా బట్టీ వేసి ఇరవై ఇరవైలు నాలుగొందలు అని పాడి, ఆ తరవాత మళ్ళీ తిరగేసి ఇరవై ఇరవైలు  నాలుగొందలుతో మొదలెట్టి రెండొకట్లరెండు వచ్చేవాళ్ళం. నిజానికి ఇంత కష్టపడక్కరలేదు. మరి ఎందుకలా చేయించేవారంటే మనసుకు తర్ఫీదు ఇచ్చేవారనమాట. అసలు  ఎక్కాలు నేర్చుకోవాలంటే రెండు రెళ్ళు నాలుగు, రెండు మూళ్ళారు, రెండు నాలుగులెనిమిది, రెండయిదులు పది అని అలాగే మూడవ ఎక్కం మూడయిదులుదాకా,ఐదో ఎక్కం, ఏడో ఎక్కం,ఏడో ఎక్కం వస్తే ఎక్కా లొచ్చేసినట్లే. ఎందుకంటే రెండో ఎక్కం రెండయిదుల తరవాత అంత మొదటిదానికి రెట్టింపు కదా! ఎలాగో చూడండి ఉదాహరణకి రెండు మూళ్ళారు, రెండార్లు పన్నెండు, అలా అనమాట.నాలుగెక్కాలు సరిగా నేర్చుకోరా! లెక్కలవే వస్తాయనేవారు, నిజం కదా!! అవి రెండు, మూడు, ఐదు, ఏడు ఎక్కా లని అర్ధమయ్యేటప్పటికి ఈ వయసు వచ్చేసింది 🙂

2 x 1 =02        0+2= 2

2 X 2 =04       0+ 4= 4

2 X 3 =06        0+6=6

2 X 4 =08        0+8=8

2 X 5 =10        1+0=1

2 X 6 =12        1+2=3

2 X 7 =14        1+4=5

2 X 8 =16        1+6=7

2 X 9 =18        1+8=9

 పై ఎక్కంలో చివర వచ్చిన లబ్ధం అంకెలు కలుపుకుంటూ వెళితే మొదట నాలుగు స్థానాలు సరి, తరవాత నాలుగు స్థానాలు బేసి అంకెలొచ్చాయి చూశారా?తొమ్మిదితో గుణించినదేదయినా చివరకు లబ్ఢం తొమ్మిదే వస్తుంది అన్ని ఎక్కాలలో చూడండి.

3 X 1=03         0+3=3

3 X 2=06         0+6=6

3 X 3=09         0+9=9

3 X 4=12         1+2=3

3 X 5=15         1+5=6

3 X 6=18         1+8=9

3 X 7=21         2+1=3

3 X 8=24         2+4=6

3 X 9=27         2+7=9

 ఈ ఎక్కంలో మూడు, ఆరు, తొమ్మిది లబ్ధాలు సైకిలిక్ గా వస్తున్నాయి చూడండి.

4 X 1=04               0+4=4

4 X 2=08               0+8=8

4 X 3=12               1+2=3

4 X 4=16               1+6=7

4 X 5=20               2+0=2

4 X 6=24                2+4=6

4 X 7=28                 2+8=1

4 X 8=32                 3+2=5

4 X 9=36                 3+6=9

 రెండో ఎక్కంలో మొదటినాలుగు లబ్ధాలూ సరి, ఆ తరవాత బేసి వస్తే ఈ ఎక్కంలో మొదటి రెండు సరి ఆ తర్వాత బేసి అంకెలు జంటగా,సైకిలిక్ గా వస్తున్నాయి కదూ!

5 X 1=05                 0+5=5

5 X 2=10                 1+0=1

5 X 3=15                 1+5=6

5 X 4=20                 2+0=2

5 X 5=25                 2+5=7

5 X 6=30                 3+0=3

5 X 7=35                 3+5=8

5 X 8=40                 4+0=4

5 X 9=45                 4+5=9

పై ఎక్కంలో సరి బేసి జంటలుగా లబ్ధాలొస్తే, ఈ ఎక్కంలో బేసి, సరి లభ్ధాలు జంటగా సైకిలిక్ గా వస్తున్నాయి చూడండి.  

6 X 1=06                  0+6=6 

6 X 2=12                  1+2+3 

6 X 3=18                  1+8=9

6 X 4=24                  2+4=6

6 X 5=30                  3+0=3

6 X 6=36                  3+6=9

6 X 7=42                  4+2=6

6 X 8=48                   4=8=3

6 X 9=54                   5+4=9

 ఇందాకా మూడో ఎక్కంలో మూడు, ఆరు తొమ్మిది లబ్ధాలు సైకిలిక్ గా వస్తే ఇందులో ఆరు,మూడు, తొమ్మిది సైకిలిక్ గా వస్తున్నాయి చూడండి.

7 X 1=07                0+7=7

7 X 2=14                1+4=5

7 X 3=21                2+1=3

7 X 4=28                2+8=1

7 X 5=35                3+5=8

7 X 6=42                4+2=6

7 X 7=49                4+9=4

7 X 8=56                5+6=2

7 X 9=63                6+3=9

 రెండో ఎక్కంలో మొదటి నాలుగు లబ్ధాలు సరి ఆ తరవాత బేసి అయితే ఇందులో మొదటి నాలుగు లబ్ధాలు బేసి, ఆ తరవాత నాలుగు సరి వస్తున్నాయి చూడండి. 

8 X 1=08                 0+8=8

8 X 2=16                 1+6=7

8 X 3=24                 2+4=6

8 X 4=32                 3+2=5

8 X 5=40                 4+0=4

8 X 6=48                 4+8=3

8 X 7=56                 5+6=2

8 X 8=64                 6+4=1

8 X 9=72                 7+2=9

 ఎనిమిది రెండుకు క్యూబ్ కదా! ఇందులో లబ్ధాలన్నీ వరుస సంఖ్యలే వస్తున్నాయి చూడండి, పైనుంచి కిందికి.  

9 X 1=09                 0+9=9

9 X 2=18                 1+8=9

9 X 3=27                 2+7=9

9 X 4=36                 3+6=9

9 X 5=45                 4+5=9

9 X 6=54                 5+4=9

9 X 7=63                 6+3=9

9 X 8=72                 7+2=9

9 X 9=81                 8+1=9

ఈ ఎక్కంలో అంతా చిత్రమే! లబ్ధంకి ముందు వచ్చిన అంకెలు పైనుంచి కిందికి చూస్తూ వెళ్ళండి, పదుల స్థానంలో సున్ననుంచి ఎనిమిది దాకా వరుస అంకెలొస్తే ఒకట్ల స్థానం లో కిందినుంచి ఒకటి నుంచి ఎనిమిది వరకు అంకెలు పైకి వరుసలో ఉంటాయి చూడండి.

నేను పెద్దగా చదువుకోలేదు, నా చదువు పెద్దబాలశిక్ష, ఎక్కాల బుక్కు దగ్గరే ఆగిపోయింది. చెప్పినదానిలో తప్పులుంటే మన్నించి సరిచేయండి. పిల్లలకి ఇవి చెబుదామా? అవసరమేనా? వారిలో ఆలోచనా పరిధి పెంచుతుందా?

2

plz wait and see

Prime number

ఏ పూర్ణంకంతోనూ విభజించడానికి వీలులేని అంకెను ప్రైం నంబర్ అంటాం. అన్నిటిలో చిన్నదయిన ప్రయిం నంబర్ చెప్పండి.

ఏకం సత్ విప్రా బహుధా వదంతి.

ఇక్కడ 1858 సం.రంలో కోల్కతా యూనివర్సిటీలో ఎంట్రన్స్ పరీక్షకి లెక్కలపేపరు చూడండి.నా దగ్గర డెభ్భయి సంవత్సరాల కితం, పాతకాలపు లెక్కలబుక్కులో దొరికింది.

University of Calcutta.       Entrance examination paper-1858

1.Multiply Rs.18957 .13a by Rs568 113/4a and devide the same sum by the same sum. Show that one of these operations is absurd and impossible and perform the other

2. Find the value the decimal .16854 and deduce the rule arithmetically or algebraically.

3. Extract the square root of 3 and of .3 to 7 decimal places, and explain the rule that in integers the pointing off of the periods begins from the right hand, and in decimals from the left.

4. A plate of metal is beaten to the thickness of 1/8 of an inch and the weight of the circular medal cut from it, whose diameter is 1 1/8 inches, is 1 3/4 oz.Troy. If the same plate is beaten to 1/9 of an inch, what will be the weight of the medal cut out of it of the diameter 1 3/7 inches. ( the area of the circle being proportional to the squares of their diameter.)

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- ఎక్కాలు చిక్కులా? మేజిక్కులా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s