శర్మ కాలక్షేపంకబుర్లు-తగనివానితో స్నేహం

Courtesy:you tube

తగనివానితో స్నేహం

“తాతా మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగానూ చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగానూ కనపడుతుంటారు, వీరిని కనుక్కొవడమెలా?” అని అడిగాడు ధర్మ రాజు భీష్ముని దానికి జవాబుగా భీష్ముడు చెప్పిన కధ అవధరించండి. (భారతం శాంతి పర్వం.ఆశ్వాసం3…..54 నుండి.. 79వరకు స్వేఛ్ఛానువాదం.)

పురిక అనే పట్టణాన్ని పౌరికుడు అనే కౄరాత్ముడు రాజుగా పరిపాలిస్తుండేవాడు. అతను చనిపోయిన తరవాత నక్కగా పుట్టేడు కాని పూర్వ జన్మ జ్ఞాపకం ఉండిపోయింది, గత జన్మలో చేసిన పాపానికి ఈ జన్మ కలిగిందనే స్పృహ కలిగింది. అందుకుగాను ఆ నక్క మాంసం తినక రాలిన ఆకులు, పళ్ళు ఆహారంగా తీసుకుంటూ కాలం గడిపేది. ఇది చూసిన మిగిలిన నక్కలు, ‘నీకు మాంసం మేమిస్తాము తినవయ్యా, ఇదేమని’ అడిగినా బలవంతం చేసినా నక్క అలా పళ్ళు ఆకులతో కాలంగడపడం మానలేదు. ఈ సంగతి నెమ్మదిగా పులికి తెలిసింది. పులి నక్కను వెతుక్కుంటూ వచ్చి’ నీవు యోగ్యుడవని తెలిసింది, నీవు నాతో ఉండి సుఖాలనుభవించు, నన్ను అందరూ కౄరుడని నిందిస్తున్నారు నీ మార్గదర్శనం లో దానిని మార్చుకోవాలనుకుంటున్నాను’ అని వేడుకున్నాడు. అందుకు నక్క ‘నీవు ఆశ్రయించదగినవాడివి కావు, నాకు భోగములమీద ఇఛ్ఛలేదు,కాని నీ, నా స్నేహం మూలంగా, నేను చెప్పేవి నువ్వు ఆచరించడం ఇష్టం లేని నీ అనుచరగణం తో ఇబ్బందులొస్తాయి,అసూయ మూలంగా. వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడతారు, నువ్వు వారి నుండి వచ్చే ఇబ్బందిని గణించక నా మాట వింటానంటే, అలా శపధం చేస్తే, నీదగ్గరుంటా’నంది. అందుకు పులి ఒప్పుకుంటే , పులితో పాటుగా నక్క ఉండి, పులికి మార్గదర్శనం చేస్తూ వచ్చింది. కాలం గడిచింది. నక్క పులికి ఇచ్చే సలహాలు, నక్క తెలివితేటలతో వ్యవహారాలు చక్క బెట్టడం చూసిన పులి అనుచరులకు అసూయ కలిగి ఒక రోజు సమావేశమై ఆలోచించాయి., ఒక పధకం పన్నేయి. పులి తినే మాంసం దొంగిలించి పట్టుకుపోయి నక్క ఇంటి దగ్గర దాచేయి. పులి తినే ఆహారం గురించిన పర్యవేక్షణ నక్క చేస్తున్నందున, మాంసము దొంగిలింపడినది తెలుసుకుని పులికి చెప్పింది. అప్పుడు అనుచరులు కపటోపాయంతో మాంసం నక్క ఇంటి దగ్గర దొరకడం, పులికి చూపిస్తే పులి నక్కను దూరంగా పెట్టింది. ఈ సంగతి తెలుసుకున్న అనుచరగణం ‘మహరాజా! ఇంతకాలం మీకు చెప్పలేకపోయాం, తను మాంసం తినదా ? వ్రతం చేస్తోందా? అంతా నటన మహా ప్రభూ, మీ మాటకి ఎదురు చెప్పలేక నక్క సంగతులు చెప్పలేకపోయా’మన్నాయి. అప్పుడు పులి నక్కను బంధించి వధించమని ఆజ్ఞ ఇచ్చింది. ఇదంతా తెలుసుకున్న పులి తల్లి ‘నీ అనుచరులు కుటిలాత్ములు,నక్కను తప్పుపడుతున్నారు, బుద్ధిమంతుని వలన దుర్మతులు,అధికుల వలన హీనులు, అందమైనవారి పట్ల అందవిహీనులు అసూయ కలిగి ఉంటారు, వీరి అసూయ తెలుసుకోలేకపోయావు’ అని చెప్పింది.

ధర్మమధర్మముభంగిన,ధర్మము ధర్మంబుమాడ్కి దనయా తోచున్
నిర్మలమతి నరయ వలయు, ధార్మికతన కోరువాడు దన కేర్పడగన్….71
ధర్మం అధర్మంలాగా, అధర్మం ధర్మంలాగా కనపడుతూ ఉంటుంది, అసలైన మంచివాణ్ణి కనిపెట్టుకోవాలిసుమా.

download (1)

‘నక్కవచ్చినప్పటి నుంచి మనకు చేసిన హితాలు చూడద్దా! ఇప్పుడిలా చేసేడనుకోవడం పొరపాటుకదా.  మంచి మంత్రిని కుటిలుల ఉపాయంతో పోగొట్టుకోకు’ అని హితబోధ చేసింది.

అప్పుడు పులి నక్కను పిలిపించి కౌగలించి అశ్రువులు రాలగా గౌరవిస్తే నక్క, రాజా!  ‘ఒకప్పుడు వీడు చాలామంచివాడని పొగొడి, ఇప్పుడు ఆ పేరు తెగటార్చి చెడ్డవాడన్నావు, నిండు సభలో. నన్ను నీదగ్గరకు తీసుకునేటప్పుడు, నీ అనుచరుల వల్ల వచ్చే ఇబ్బందులను లెక్కచేయనని నాకు మాట కూడా ఇచ్చావు, తెలిసికాని తెలియక కాని గౌరవ భగం కలిగించి మరలా నీవు గొప్పవాడవు, నీ స్నేహం కావాలంటే కుదురుతుందా?’ అని చెప్పిఅరణ్యానికి పోయి నిరశన దీక్షతో పరమ స్థానానికి నక్క చేరుకుంది.”

కధ చదివారు కదా! ఇందులో నక్క చేసిన తప్పు తగనివానితో స్నేహం చేయడం. ఒకప్పుడు మనకూ ఇటువంటివి తగలచ్చు.నక్క మంచిగా ఉండి మంచి చేసినా చెడ్డదయి, తల్లి పులి చెప్పడం మూలంగా దండన తప్పించుకుంది, ఆ సావకాశాలు రాకపోతే అన్యాయమయ్యేది కదా! అందుకే స్నేహం సమానమయినవారితోనే చేయాలి, గొప్పవారి స్నేహం చేటు తెచ్చిపెడుతుంది. మంచి చేసినా చెడ్డగానే కనపడుతుంది.మంచి చెడ్డల విచక్షణ చేసుకోగలిగి ఉండాలి.

download

నేటి రాజకీయాలలో ఇటువంటి సంఘటనలు చాలా కనపడుతున్నాయి కదా! అన్వయించుకోండి.

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తగనివానితో స్నేహం

 1. శర్మగారు నిజానికి మీరు చెప్పేవి కాలక్షేపం కబుర్లు కావు….జ్ఞాన నిక్షిప్తమైనవి .చాలా బాగుంది మీ వివరణ.

  • శ్రీ దేవి గారు,
   నిజానికి నేను కాలక్షేపం కోసమే ఈ వ్యాపకం పెట్టుకున్నది. అందుకే ”కాలక్షేపంకబురు” అని తలకట్టు పెట్టేను.
   ధన్యవాదాలు.

  • @నాగిని గారు,
   స్వాగతం, సుస్వాగతం, బ్లాగు చదివి ”అబ్బే ఇది పాత టపా” అనుకోక వ్యాఖ్య చేయమని ప్రార్ధన.
   ధన్యవాదాలు.

  • @పద్మగారు,
   ఏంటో చిన్నప్పటినుంచి అలా అలవాటయిపోయింది. ఇల్లాలూ అదే కోవ మరి, ఏంచెయ్యను చెప్పండి. 🙂 నచ్చినందుకు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s