అంధపంగు న్యాయం http://kasthephali.blogspot.in/ (new blog)
అంధ అంటే గుడ్డివాడు పంగు అంటే కుంటివాడు. ఇదేంటి! కుంటివాడు గుడ్డివాడు అని కదా మీ అనుమానం. గుడ్డివాడు సవ్యంగా కదలలేడు కళ్ళు లేవు కనక కుంటివాడూ సవ్యంగా కదలలేడు కాళ్ళు లేవు కనక. కుంటివాడికి కళ్ళున్నాయి, గుడ్డివాడికి కాళ్ళున్నాయి. ఒకరికి లేనివి, మరొకరిదగ్గర ఉన్నవి ఉపయోగించుకుని ఇద్దరూ లబ్ధి పొందడం చెప్పేందుకు చెప్పిన న్యాయమిది. దీనినే అన్యోన్యాశ్రయ న్యాయం అని కూడా చెప్పచ్చు. మీరనుకుంటున్నట్టు క్విడ్ ప్రొ అవునో కాదో చెప్పలేను, సుమా! 🙂
ఉలూఖలమర్దల న్యాయం.
ఉలూఖలం అంటే రోలు మర్దలం అంటే మద్దెల. పాతకాలం లో కఱ్ఱరోళ్ళుండేవి, ఇప్పుడు కనపడటం లేదు, నేను దాని ఫోటో తీద్దామని ప్రయత్నం చేస్తున్నా, దొరికితే ఫోటో తీసిపెడతాను, బ్లాగులో. రోటిలో దంచ వలసినవి వేసి రోకలితో దంపుతారు. రోటిలో వేసినవాటికి ఎంత దెబ్బ తగులుతుందో రోటికి అంతదెబ్బా తగులుతుంది కదా! ఇక మద్దెల వాయిస్తారు. ఇది వాద్య విశేషం, రోటిలోదంచడానికి ఒక పక్కేదంచుతారు (వాయిస్తారు) మరి శబ్దం రావడానికి మద్దెలను రెండు పక్కలా వాయిస్తారు. మన వారు దీనినే’ రోలెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు’ అంటారు. బాధలలో ఉన్నవాడు అంతకంటే ఎక్కువ బాధలో ఉన్నవానితో చెప్పుకోవడమనమాట. నీటిలో ములిగిపోతున్నవాడి మెడను మరొకడు పట్టుకున్నట్టు. బెయిలు రాక ఏడుస్తున్నవాడి దగ్గర నామీద కేస్ పఏట్టేరని చెప్పుకుని ఏడవటంలాగా.
శాఖాచంక్రమణన్యాయం
శాఖ అంటే చెట్టుకొమ్మ చంక్రమణం అంటే ఒక దానినుంచి మరొకదానికి దూకడం. కోతి చెట్టు మీదకి ఎక్కినపుడు ఒకచోటినుంచి మరొక చోటికి పోవడానికి ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదికి దూకుతూ ఉంటుంది కదా! ఐతే మాటల మూటలు, కబుర్ల పోగులు మాటాడుతుంటే, చెప్పే విషయాన్ని వదిలేసి, మరొక దానిలోకి, అక్కడినుంచి మరింకోదానిలోకి దూకుతూ, విషయం చెప్పకపోవడం, ఊకదంపుడు కబుర్లు చెప్పడాన్ని, శాఖా చంక్రమణ న్యాయం అంటారు. మరో రకంగా చెప్పలంటే కోతిపని అనమాట.
వృశ్చికచోరన్యాయం
వృశ్చికము అంటే తేలు, చోరుడు అంటే దొంగ. ఒకడు దొంగతనం చేయడానికి ఒక ఇంటికి కన్నం తవ్వేడు. ఇటుకల మధ్య చల్లటి ప్రదేశంలో నివాసముంటున్న తేలుకి నివాసం లేకుండా చేసేడు, కన్నం తవ్వడం మూలంగా. ఇప్పుడు ఆ తేలు కన్నం లో ఉంది, దొంగ లోపలికి దూరబోతే గట్టిగా అంటపొడిచింది. దొంగ తేలు కుట్టినందుకు అమ్మో అని బాధపడ లేడు, ఏడవలేడు, సరికదా నోరు విప్పి శబ్దం చేయలేడు ,ఎందుకంటే, శబ్దం చేస్తే ఇంటివారు లేచి దొంగతనానికి కన్నం తవ్వినవాడని వీపు చిట్లకొడతారు, పోలీస్ కి పట్టిస్తారు. అందుకు బాధను అణుచుకోవడం, లోపల లోపల ఏడవడం తప్పించి ఏమీ చేయలేని అవస్థనమాట.
ఇక్కడొక ఉదాహరణ చెప్పుకోవాలి. కలిగినవారింట దొంగతనం జరిగింది. వంద తులాల బంగారం పోయింది. పోలీస్ కంప్లయింట్లో తులం బంగారం మాత్రమే పోయినట్టు చెప్పుకున్నారు. కారణం, వంద తులాల బంగారం పోయిందంటే ఇన్ కం టాక్స్ వాళ్ళు పట్టుకుంటారు. ఎలా సంపాదించావు? టాక్స్ కట్టేవా అని. ఈ బాధ భరించేకంటే బంగారం పోయిన బాధ అనుభవించడమే తేలిక అనిపించి నోరు మూసుకు కూచోడాన్ని దొంగకి తేలుకుట్టినట్టు అంటారు, మనవారు.
మత్స్య న్యాయం.
మత్స్యము అంటే చేప. చేప న్యాయమేంటంటే, ప్రకృతిలో చాలా వింతలున్నాయి, అందులో ఇదొకటి. మీరు చూసే ఉంటారు ఏనిమల్ ప్లానెట్ టి.వీ లో సముద్రంలో అతి చిన్న చేపను పెద్ద చేప ఆ పెద్ద చేపను మరో పెద్ద చేప దానిని తిమింగలం ఇలా ఒకటి మరొక దానిని ఆహారంగా తీసుకుంటాయి. మరో సంగతి త్రాచుపాము, కింగ్ కోబ్రా పాములనే ఆహారంగా తీసుకుంటుంది. అలాగే మనుషులలో చిన్నవారి మీద పెద్దవారు, వారిపై అంతకంటే పెద్దవారు, వారిపై (రాజు)నేడు రాజకీయనాయకులు స్వారీ చెయ్యడాన్ని మత్స్య న్యాయం అంటారు. ఒకరిని మరొకరు దోచుకోడమనమాట.
sir
namaste!
Nice post!
there is a telugu padyam:
RAAJULU RAJYAMANDU,BHOO RAAJULU DAANAMANDU, RAA RAAJULU SANTATA TEJAMANDU… like this, i belive its DHHOORJAI MAHA KAVI… can you post it if you have a chance.., just trying to get it, but couldnt\
many thanks
Krishna Palakollu
క్రిష్ గారు,
ఆ పద్యం నా దగ్గరా లేదండి, నేనూ ప్రయత్నం చేస్తా.టపా నచ్చినందుకు
ధన్యవాదాలు.
దొరికింది సర్ అ పద్యం, మొల్ల రామాయణం లోన అట,
గూగుల్ బ్లాగ్స్ లోనే మరో మాస్టారు గారు చెప్పేరు!
రాజులు కాంతి యందు రతిరాజులు రూపము నందు వాహినీ
రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళి యందు గో
రాజులు భోగమందు దిన రాజులు సంతత తేజమందు రా
రాజులు మానమందు నగరమ్మున రాజకుమారు లందరున్.
థాంక్స్
కృష్ణ
@కిష్ణ గారు,
ఆ పద్యాన్ని పట్టుకుని చెప్పినందులకు మిక్కిలి ఆనందం.
ధన్యవాదాలు.
ఇంతకుముందు వ్రాసిన వ్యాఖ్యలో ఒక సవరణ…
మొదట ఆరు శతకాలు అని వ్రాసి ,
మళ్ళీ మార్చి , 600 టపాలు అని వ్రాయాలనుకున్నాను.
అయితే, టపాలు అని వ్రాసి 600 అని వ్రాయటం మర్చిపోయాను.
చూసుకునే సరికి వ్యాఖ్య ప్రచురితమైపోయింది.
జరిగిన పొరపాటుకు దయచేసి క్షమించండి.
ఆరు టపాలు పూర్తి చేసిన సంధర్భంగా అనేక అభినందనలండి.
మీరు మరిన్ని చక్కటి విషయాలను అందిస్తారని అందరమూ కోరుకుంటున్నాము.
జిలేబీ గారు వ్రాసినది కూడా చక్కగా ఉంది.
అనురాధ గారు,
నా సొల్లు కబుర్ల తలనొప్పి ఆరువందల టపాలు భరించినందుకు
ధన్యవాదాలు.
ఆరు శతకాలు పూర్తి చెసిన సంధర్భంగా ఆరు వేల అభినందనలు
జిలేబీ గారి పారొడీ కూడా చాలా బాగుంది.
@మోహన్జీ
ధన్యవాదాలు.
సర్రున దూసుకొచ్చే వే
ర్వేరు టపా గమకం తో
జనాలని ఆకట్టు కొని ఏ
నా టికైనా నిలిచి పోయే
సుమేరు కంటెంట్ అ
ఖిల విజ్ఞానం, మ
నో విహంగ మధురాను
భవ పరిమళానికి
వంకసరకు ఇది అది అన్నీ-
తురంగ వేగ ‘టపా’శ్రమం వారిది !
కల ‘కాలమ్’ మృ
ష్టేరుక మేఘం
ఫలదాయక జ్ఞాన
లేపనం ! లే లెమ్మని
శరవేగం తో భాస్కర శ
ర్మ టపా గీతమ్
కాలానికి నిలిచే
లకార ని
క్షే ప భాండాగారం
పంచు కునే ఫల వృక్షం !
కలం కితా
బు ఆరు నూ
ర్లు పై కబుర్లు !
శుభాకాంక్షల తో
జిలేబి
@జిలేబిగారు,
అసలే శీతాకాలం, చలి, మీరిలా అభిమాన వర్షం లో తడిపేస్తే 🙂 జరుక్ శాస్త్రి పేరడీలకి ప్రసిద్ధి.శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి.
ధన్యవాదాలు.