శర్మ కాలక్షేపంకబుర్లు-ఉపపాండవులెందరు?

Click 2 my new blog                             http://kasthephali.blogspot.in

ఉపపాండవులెందరు?

ఈ ప్రశ్నకు సమాధానం, భారతం..ఆది.పర్వం…అశ్వాశం4….115స్వేఛ్ఛానువాదం.

“ధర్మరాజు కు పాంచాలియందు ప్రతివింధ్యుడు,భీమునికి శ్రుతసోముడు, అర్జునునకు శ్రుత కీర్తి, నకులునకు శతానీకుడు, సహదేవునకు శ్రుత సేనుడు కలిగారు. వీరు కాక ధర్మరాజుకు స్వయంవరంలో భార్యయైన దేవిక అనే ఆమెకు యౌధేయుడు కలిగాడు. భీమునికి జలంధర అనే ఆమెయందు సర్వగుడు కలిగాడు. అర్జునునకు సుభద్రయందు అభిమన్యుడు కలిగాడు. నకులునకు చేది రాజపుత్రి కరేణుమతికి నిరమిత్రుడు కలిగాడు. సహదేవునికి స్వయంవరం మూలంగా లభించిన భార్య విజయకు సుహోత్రుడు కలిగాడు.భీమునకు హిడింబ వలన ఘటోత్కచుడు కలిగాడు. వీళ్ళు మొత్తం పదకొండు మంది.”

1.ధర్మ రాజు+ద్రౌపది= ప్రతివింధ్యుడు,
2.భీముడు+ద్రౌపది= శ్రుతసోముడు
3.అర్జునుడు+ద్రౌపది= శ్రుత కీర్తి
4.నకులుడు+ ద్రౌపది=శతానీకుడు
5.సహదేవుడు+ద్రౌపది= శ్రుత సేనుడు 

6.ధర్మరాజు+దేవిక=యౌధేయుడు.
7.భీముడు+జలంధర=సర్వగుడు
8.భీముడు+హిడింబ= ఘటోత్కచుడు
9.అర్జునుడు+సుభద్ర=అభిమన్యుడు.
10.నకులుడు+కరేణుమతి=నిరమిత్రుడు.
11.సహదేవుడు+విజయ=సుహోత్రుడు.

వీరిలో భీమునికి హిడింబ వలన కలిగిన ఘటోత్కచుడే పెద్దవాడు. పాంచాలి వలన కలిగిన వారు కాక, మిగిలినవారంతా యుద్ధం లో మరణించారు. ఉపపాండవులలో మిగిలిన, పాంచాలి పుత్రులు ఐదిగురిని పాండవులుగా భ్రమించి, అశ్వద్ధామ నిదరపోతుండగా చంపేశాడు. ఇదీ ఉపపాండవుల చరిత్ర. ఇక అభిమన్యునికి ఉత్తర కు జన్మించినవాడు పరీక్షిత్తు.

వీరుకాక అర్జునునికి ఉలూపి, చిత్రాంగద అనే ఇద్దరు భార్యలున్నారు. ఇందులో చిత్రాంగద కుమారుడు భభ్రువాహనుడు, ఇతను మణి పురాజ్యాధిపతి, తాత గారి రాజ్యానికి వారసుడయ్యాడు, అందుకు ఉప పాండవులలో చేర్చలేదు. ఇతను భారత యుద్ధం తరవాత బతికి ఉన్నవాడు. ఇతను యుద్ధం లో పాల్గొనలేనట్టే ఉంది,. 

మీ అనుమానం?

ప్రకటనలు

20 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఉపపాండవులెందరు?

  1. చక్కటి విషయాలను తెలియజేసారు.

    పురాణేతిహాసాలలో ప్రతి చిన్న విషయం నుంచి కూడా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.

    ఉపపాండవులు, వారిలో కొందరి మరణం వంటి విషయాల గురించి లోతుగా ఆలోచిస్తే ఎన్నో విషయాలు ఉంటాయి.

    • @అనురాధ గారు,
      ఉపపాండవులలో ఘటోత్కచుడు కర్ణుడు ప్రయోగించిన శక్తికి మరణిస్తే పరమాత్మ శంఖనాదం చేస్తారు. అభిమన్యుని మరణానికి కారణం ఉందంటారు. వివరాలు తెలియవు. ఎక్కడా వ్యాస భారతం చెప్పలేదు.
      ధన్యవాదాలు.

    • @ఫాతిమాజీ,
      అశ్వద్ధామ చంపిన ద్రౌపది పుత్రులు ఐదుగురు కాక మరొక ఆరుగురూ ఉపపాండవులే, పాండవ పుత్రులే. వారప్పటికే యుద్ధం లో మరణించారు.
      ధన్యవాదాలు.

    • అశ్వద్ధామ చంపాలనుకొని వచ్చినది, పాండవులనండి. కాని క్రిష్ణుడు మాయ చేసి, ఆ రోజు ఉప పాండవులు ఆ గుడారంలో పడుకునేటట్టు చేసి, పాండవులని తప్పిస్తాడు.

      • @రవిగారు,
        మీరన్నది నిజం.
        యుద్ధం పరిసమాప్తి కావచ్చిన సమయం, పరమాత్మ పాండవులను ఆరోజు గుడారం లో పడుకోనియ్యకుండా చేసి, యుద్ధరంగానికి దూరంగా తీసుకుపోయిన మాట భారతం లో ఉంది. అశ్వద్ధామ పాండవులను చంపుతున్నాననుకుని ఉప పాండవులను నిద్రలో చంపేశాడు.ఆ మాటే చెప్పేను.
        ధన్యవాదాలు.

    • ఫణీంద్ర గారు,
      మనం ఇక్కడే పొరబడతాం. వీరంతా ఉపపాండవులేనని వ్యాసులవారు చెప్పేరు. నేను కవిత్రయం లోని ఎక్కడి భాగం నుంచి సంగ్రహించినదీ ఇచ్చాను చూడగలరు. మరొకమాట భీష్ముడు పన్నెండు రకాల పుత్ర సంతానం ఉంది అన్నారు. ఈ టపా చూడండి. భభ్రువాహనుడు గురించిన అనుమానం రావచ్చనే నేను ప్రత్యేకం చెప్పేను.మీ అనుమానం తీరిందనుకుంటా.
      ధన్యవాదాలు.
      https://kastephale.wordpress.com/2013/12/07/

  2. ఉలూపికి అర్జునుడివలన కలిగిన కుమారుడు(పేరు జ్ఞాపకం లేదు)కూడా భారత యుద్ధంలో పాల్గొని మరణించేడని చదివినట్లు గుర్తు.చిత్రాంగద కొడుకు బభ్రువాహనుడు భారత యుద్ధంలో పాల్గోలేదు.ప్రమీలకథ వ్యాసభారతంలో లేదు.జైమిని భారతంలో ఉంది.

    • @మిత్రులు రమణరావు గారు,
      భారతం లో పేర్లు వరసగా రాసుకుంటూపోతే ఒక పుస్తకం అవుతుంది. యుద్ధం లో కూడా కొన్నిచోట్ల ఆ చనిపోయినవారి వివరాలుంటాయి, మరికొన్ని చోట్ల లేవు. ఆ తరవాత ఒకే పేరు గలవారు కూడా ఉన్నారు. మీరన్నట్లు ఉలూపి కుమారుడి గురించి నాకూ తెలియదు. ప్రమీల గురించి వ్యాసభారతం లో లేదు. నాకు తెలిసినది చెప్పేను, నా దగ్గరౌన్నది కవిత్రయం మాత్రమే. అదే నా సర్వస్వం. జైమినిలో మరి కొన్ని విశేషాలు ఉన్నాయనుకుంటా. మన పిచ్చి కాని ఇప్పుడు ఇవన్నీ ఎవరికి కావాలండి? కూటికా గుడ్డకా?
      ధన్యవాదాలు.

  3. Sarma garu,

    Yuddam prarambaniki mundu Yajna pasuvu ga Babruvahanudini bali icharane kada nenu ekkado chadivanu. adi nijamena? ee sandeham konche teerchagalaru.
    Alage paina Ulupi koomarudu Babruvahanudu ani rasaaaru.
    English lo comment pettinanduku kshamapanalu

    • @భవాని గారు,
      భభ్రువాహనుడిని బలి ఇవ్వడం అనేది కాకమ్మ కధ. భారతం లో లేదు. భభ్రువాహనుడు చిత్రాంగద కుమారుడు, పొరపాటున ఉలూపి అన్నాను. సరిచేసేను. తప్పు సరి చేయాల్సిన బాధ్యత ఉన్నది కదా.
      ధన్యవాదాలు.

    • @మిత్రులు ranpungav గారు,
      నిష్టురమైనా నిజం చెప్పి కళ్ళు తెరిపించారు. మీకు శతకోటి వందనాలు. ఇప్పుడే మరొక టపా మొదలు పెట్టబోతున్నా, వెంటనే మానేస్తున్నా. ఇదేదో కోపం మ్తో అంటున్నమాట కాదు.
      మరలా గుర్తొచ్చింది, మారీచుడు చెప్పినమాట…
      సులభా పురుషా రాజన్ సతతః ప్రియవాదినః
      శతకోటి ధన్యవాదాలు.
      స్వస్తి

    • ranpungav Garu, i’m very unhappy with your comment.I’m sure you have not followed this blog. if you are not interested please stay calm and dont disappoint others.Sarma garu with his experience and knowledge shares his experiences and tells many stories as a grandfather and preaches some good values which are in our great epics ramayana and mahabaharatha. these days no one is spending time to read but atleast if people listen to some of the words they will understand the greatness of India.
      i dont mean to hurt or argue with you.

      Sarma garu in your service you would have dealed with many people,so please dot mind about others and continue with what you are doing.people like me will be very disappointed if you discotinue.

  4. నకులుడు+కరేణుమతి=నిరమిత్రుడు.

    ఈ చేది రాజ్యమేమైనా అరవ దేశపు చేరణ్ దేశమా ? కరేణుమతి – కణిమణి యా ? పాండవుల కాల మానానికి చేది దేశం ఉండేదా ??

    ౨ –> చిత్రాంగద మణుగూరు అనబడు మదురై కి సంబంధించిన యువరాణి అని కూడా విన్నాను అంటే అర్జునిని తీర్థ యాత్రల లో దక్షిణా పథం వైపు ఏమైనా వచ్చి అట్లా గుజరాతు వైపు వెళ్లి సుభద్ర ని ద్వారకలో వివాహ మాడాడేమో మరి !

    జిలేబి

    • @జిలేబిగారు,
      మీరుచెప్పిన చేది రాజ్యం కరేణుమతి నిజమేనని నా అభిప్రాయం కూడా. కాని అర్జునుని విషయంలో కాదు. అది ప్రస్థుత ఈశాన్య రాష్ట్రాలలో మణిపురమే. భబ్రువాహనుడు తాతకి దత్తునిగా వెళ్ళేడనుకుంటా. అతను భారత యుద్ధం నాటికి చిన్నవాడయి ఉండచ్చనేది నా ఊహ.
      ప్రమీల గురించి అడుగుతారనుకున్నా!
      ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s