శర్మ కాలక్షేపంకబుర్లు-నిజం.

http://kasthephali.blogspot.com/

నిజం.

మోడీ అంటే అటు అమెరికావాడి నుంచి ఇక్కడి కాంగ్రెస్ వాడిదాకా, ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళ దాకా అందరికి వణుకే!!! ఎందుకు?భయం ”నిజం”. అమెరికా వాడికి మనదేశపు ప్రతినిధులు 75 మంది ‘విసా ఇవ్వకండి’ మోడీకని రాశారు, మోడీ పని ఆగిపోయిందా? అమెరికావాడి బుర్రే తిరిగింది అప్పుడు, గుర్తుందా? అమెరికా వాడు అది చూసి నవ్వుకుని ఉంటాడు కదూ! మరి ఇప్పుడు మళ్ళీ అమెరికావాడు మోడీ చుట్టు ఎందుకు తిరుగుతున్నాడబ్బా? ప్రత్యేక దూతను కూడా పంపుతున్నాడు!, ”మోడీ నెగ్గుతాడు, ప్రభుత్వం ఏర్పాటుచేస్తాడు, అప్పుడు దేబెమొహంతో వెళ్ళేకంటే ముందేవెళితే మంచి”దనుకున్నాడు. అదేంటి మోడీ దగ్గరకెళుతున్నారు, విసా ఇవ్వడానికా అంటే అబ్బే అదేంలేదు,మా పోలసీలో మార్పులేదు, ఊరికే కలుస్తున్నామంటున్నారు.” తాడిచెట్టు ఎందుకురా ఎక్కుతున్నావంటే దూడగడ్డికోసం” అన్న సామెతలా లేదూ? అలాలేదూ సమాధానం. గుజరాతీలంటే అమెరికా వాడికి భయం,అమెరికా వాడికి గుజరాతీలన్నా, అందునా వ్యాపారులన్నా భయమే. మన దేశంలో అధికారం లో ఉన్నవారు ఒకరితో మరొకరు కాట్లాడుకుంటున్నారు, సామాన్యుడి సమస్యలు గాలికొదిలేశారు,మాటాడవలసినవారు, సమాధానపరచవలసినవారు, మౌనంగా ఉంటున్నారు, ప్రత్యక్ష సాక్షిగా, ఎందుకు? భయం నిజం.మాట చెల్లదేమోనని భయం, అమ్మేమంటుందో అని భయం, ఇదీ నిజం. రేపటి నిజం నేడు చెబుతున్నా వినండి ”మోడీ సునామీ సృష్టించబోతున్నా”డంటోంది టైమ్స్ నవ్ టి.వి. నిన్న రాత్రి ఆరుగంటలనుండి.

నిజమంటే నిజవే! ఆ….. కాదు అబద్ధం కానిది. అబద్ధం అంటే న+బద్ధం= బద్ధం కానిది అంటే? , ఆగండి మీకేమయిందని అడగద్దు. దేనికి బద్ధం కానిది? ధర్మానికి, న్యాయానికి, తర్కానికి బద్ధం కానిది అబద్ధం. అంటే న్యాయానికి, తర్కానికి, ధర్మానికి బద్ధమయ్యేదే నిజం.అమ్మయ్య! నిజం అంటే అర్ధం తెలుసుకోడానికి ఇన్ని తిప్పలా!

నిజం నిప్పులాటిది. నిజమాడితే నిష్ఠురం. నిజం చెబితే నమ్మరు, సత్యమేవ జయతే,నిజం నిలకడమీదయినా గెలుస్తుంది, ఇలా చాలా చాలా ఉన్నాయి నిజం మీద. నిజం అంటే సత్యమనీ అర్ధం కదా! మన చరిత్రలో హరిశ్చంద్రుడుని ఒక్క అబద్ధం చెప్పు ”నీ గురువుకి బాకీ లేన”ని నేను వెళ్ళిపోతా! నిన్ను బాకీ గురించి సతాయించనని కాలకౌశికుడు ఎంత బలవంత పెట్టినా అబద్ధం చెప్పలేదు, చివరికి భార్యను అమ్ముకోవలసివచ్చినా, కుమారుడు చనిపోయినా. అందుకే సత్యహరిశ్చంద్రుడుగా మిగిలిపోయాడు. మరినేడు నోరు విప్పితే చెప్పేది అబద్ధమే. సత్యాన్ని దేవునిగాను భావించారు,మనవారు. ఆయనే మా అన్నవరం సత్తెన్న అని మేము ముద్దుగా పిలుచుకునే సత్యనారాయణుడు. సత్యనారాయణ వ్రతం ఎన్నిసార్లు చేసుకుని ఉంటాం. కధ విన్నారా ఎప్పుడయినా శ్రద్ధగా, నిజం చెప్పండి మీకు కధ గుర్తుందా? ఆ కధలో విశేషం ఏంటీ? ఏం చెప్పిందా కధ? తర్కించారా? అదుగో నవ్వకండి, పేజి తిప్పేయకండి, మీకేపాపం 🙂 నిజమే చెప్పండి.    ఎవరికీ గుర్తులేదు. వ్రతమపోయిన తరవాత ప్రసాదం తీసుకోడంతో ఆ కధ ప్రసాదం అడుగున పడిపోయిందేం. 🙂

ఆ కధలో వ్రతం ఎప్పుడు చేస్తానని మొక్కుకున్నాడు, తనకి పెళ్ళయి పిల్లలు కలగనపుడు, ఆడబిడ్డ కలిగింది వ్రతం చేసేడా? పుట్టిన రోజుకి అన్నాడు. అప్పుడు చేసేడా? అక్షరాభ్యాసానికన్నాడు, అప్పుడు చేసేడా, పెద్దమనిషి అయినపుడన్నాడు. ఇలా వాయిదాలమీద వాయిదాలేసుకుంటూ పోయాడు. పెళ్ళికి చేస్తానన్నాడు, చెయ్యలేదు, ఎప్పుడు జ్ఞప్తికి వచ్చింది, చెరలో పడినపుడు, అల్లుడితో సహా. ఆ తరవాత వచ్చేటపుడు పడవ నిండా ధనం ఉంటే సాధువుకి ఏం చెప్పేడు ఆకులు అలములు అనికదా! నిజంగా ధనం ఆకులు అలములు అయితే మళ్ళీ ఏడ్చాడు, దేవుడు కరుణించాడు. అందుకే సత్యానికి అంత బలం ఉంది. సత్యాన్ని చూస్తే అబద్ధానికి అంత వణుకు.

ఒకప్పుడు అసత్యం, అధర్మం నెగ్గినట్టు కనపడచ్చు, దానిదే రాజ్యమూ కావచ్చు, కాని నిజాన్ని దాచలేరు, ఎప్పుడో ఒకప్పుడు గుండెలలోంచి తన్నుకొస్తుంది మొన్న సి.బి.ఐ డైరక్టర్ చెప్పినట్లు కదా! సత్యాన్ని దేవునిగా కొలిచిన, కొలుస్తున్న జాతి మనది, దాని నుంచి కొంతకాలం తప్పిపోయి ఉండచ్చు, మళ్ళీ దారిలో పడదాం, అందరం సుఖంగా బతుకుదాం. విడిపోతే పడిపోతాం, కలిసుంటే నిలబడతాం. విడతీయాలని ప్రభువులు స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి పన్నుగడలు పన్నుతూనే ఉన్నారు, కులమతాల పేరుతో, వెనుకబడ్డ, ముందుబడ్డ అనే పేరుతో విడతీసిపాలిస్తున్నారు. నిజంగా వెనకబడ్డవారేమైనా బాగుపడ్డారా?. నిజం చెప్పండి. తెలివి తెచ్చుకుందాం.

సత్యమేవ జయతే.

సర్వేజనాః సుఖినోభవంతు

 

ప్రకటనలు

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నిజం.

 1. రాజ్యం మొదలు ….. పెళ్ళాం బిడ్డల దాకా అన్నీ పోయాయి . చివరకు శవాల వద్ద పెట్టే పిండం తింటూ …. ఇంకా ఎందుకీ బతుకు ? అని అడిగిన వాళ్ళకు ఆ కాటి కాపరి అన్నీ పోయినా అందరూ వీడినా చెలికాడు నన్ను వీడనంత వరకూ ఏమీ కాదు అని బదులిచ్చాడు . ప్రతి వాడినీ ధైర్యమనే చెలికాడు వీడనంత కాలం ఏమీ కాదనీ , సత్యాది నిష్ఠలను ఆచరించాలంటే ధైర్యం అవసరమనీ , పిరికివాళ్ళు సత్యాచరణకు పనికిరారనీ సత్య హరిశ్చంద్రుని కథ మనకు చెబుతోంది కదా ! మంచి పోష్టు పెట్టినందుకు ధన్యవాదాలు శర్మగారూ !

 2. కలిసున్నా, విడిపోయినా , దొంగలు , దొంగలు ఊళ్లు పంచుకున్నట్టే !
  కలిబోసి పెట్టినా, ఉట్టి వంక చూసినట్టే !

 3. నిజమేనండి, సత్యనారాయణ వ్రతం కధ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవచ్చు.

  మన సంస్కృతిని నిర్లక్ష్యం చేస్తూ ఆధునిక సంస్కృతి కోసం అర్రులు చాస్తున్న జనం పెరగటం వల్ల దేశానికి ఈ దుస్థితి దాపురించింది.

  • @అనురాధ గారు,
   సత్యనారాయణ వ్రత కధను ఎందుకు విశ్లేషించుకోలేకపోతున్నారో తెలియదు! మరి ఆ వ్రతం ఎందుకు చేస్తున్నట్లు? సత్యాన్నే పలకాలనే మాట వంట బట్టించుకోటం లేదు.
   మీకు టపా నచ్చినందుకు
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s