శర్మ కాలక్షేపంకబుర్లు- అరె! మళ్ళీపోయింది!!

http://kasthephali.blogspot.com/

అరె! మళ్ళీపోయింది!!

మొన్న ఆదివారం మధ్యాహ్నం నెట్ పోయింది, ఏమయిందబ్బా! అనుకుని కొద్ది సేపు ఉండి ఫోన్ చేసి చెబితే ”ఆదివారం కదండీ ఎవరూ లేరు, రేపు ఉదయమే చూస్తామ”న్నాడు పాపం. హా! హతవిధీ ఇలా అయిపోయిందా అనుకుని ఊరుకున్నా, చేయగలది లేక. మనకి వచ్చే వైర్ కాని తెగిపోయిందేమో వీలయితే కట్టేద్దామనుకుని బయటికి పోయి చూస్తే అదంతా సవ్యంగానే కనపడింది. గంటకి ఒక సారి రైట్ అయిందేమో ఎదురు చూడటంతోనే తెల్లారిపోయింది. ఉదయం పదయినా ఎవరూ రాకపోతే అనుమానమొచ్చి అడిగితే ”మన ఊరునుంచి పట్నానికి వెళ్ళే ఓ.ఫ్.సి కేబుల్ మనవూరికి కొద్ది దూరం లో ఉన్న తుల్యభాగ మీద ఉన్న పాతవంతెన స్థానం లో కొత్తదాన్ని కట్టడానికి చేసే ప్రయత్నం లో, ఈ కేబుల్ మిగిలిన కేబుల్స్ అన్నీ తెంచేశారండి” అని చావు కబురు చల్లగా చెప్పేడు. సరే ఇది మామూలయిపోయిందనుకుంటే పాత జ్ఞాపకాలు ముసిరాయి. మధ్యాహ్నానికి రైటయింది, అబ్బో చాలా తొందరగా చేసేరే అని ఆనందించినంత సేపు పట్టలేదు, మళ్ళీ పోయింది, ఈ సారి పూర్తి ఒక రోజుపైగానే పోయి మాకు అన్నీ బ్లాకవుట్ అయిపోయాయి, కరంట్ పోతుండటం తోడయి,అవసరమైనరోజు సంగతులు తెలియకుండాపోయాయి.

సాధారణంగా ఈ కేబుల్స్ ని కొంత లోతులో వేస్తారు, ఎవరూ పాడు చేయడానికి వీలు లేకుండా, రోడ్ అంచున. ఆ ప్రాంత ప్రజల అవసరాల కోసం ప్రజలూ, కొన్ని కట్టడాల కోసం రహదారుల శాఖ తవ్వకాలు చేస్తుంటాయి. ప్రజలు తవ్వినపుడు జరిగే నష్టం కంటే రహదారుల శాఖ తవ్వించినపుడే ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ శాఖ పని చేయదు, చేయిస్తుంది, కాంట్రాక్టర్ చేత. ఆ కాంట్రాక్టర్ కి ఇటువంటి విషయాలు చాలా చిన్నవిగా కనపడతాయి, అందులోనూ ఆయన ఒక బడా రాజకీయనాయకుడో వారి స్థానీయుడో అయి ఉంటాడు, అందుచేత అసలు పట్టదు. ఆ అధికారులకూ పట్టదు, ఆ కాంట్రాక్టర్ ని ఏమీ అనలేరు. ఒక వేళ ఎవరేనా అధికారి ఇటువంటిది అడిగినా, సమాధానం చెప్పేనాధుడు ఉండడు. రహదారుల శాఖ అధికారులూ, ఈ కేబుల్స్ వారి కాంట్రాక్టర్ తవ్వించడం మూలంగా చెడిపోయినందుకు బాధ్యత వహించరు, సరికదా ఈ కేబుల్ వేయనివ్వడమే గొప్ప అవకాశం ఇచ్చినట్లుగా భావిస్తారు. ఇది నా స్వానుభవం. ఒక సారి ఇటువంటి విషయం లో నరసాపురం లో ఉన్నపుడు ఒక రహదారుల శాఖ అధికారిని రోడ్ మీద పట్టుకుని కడిగేసి, నిలదీయాల్సి వచ్చింది. నరసాపురం నుంచి పాలకొల్లు దారిలో ఓ.ఫ్.సి కేబుల్ వేశాం. ఒక పక్క పెద్ద కాలవ, మరో పక్క పంటకాలవ చిన్నది, ఈ మధ్యలో కాలవ గట్టుమీద రోడ్డు, దానికి చివరగా మా కేబులు. వేసిన సంవత్సరంలోనే రహదారుల శాఖ వారు పనిమొదలుపెట్టడం తో, ఆ కాంట్రాకటర్ ఈ కేబుల్ తెంపేసేడు. పరుగెట్టుకుపోయి కేబుల్ తెంపేసేరని పని ఆపుచేయమంటే ”దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు” కాంట్రాక్టరు. చేయగలది లేదు, వారా బలవంతులు, మా ఆఫీసర్లు అందరికి విషయం తెలిపేను. మర్నాడు మా ఆఫీసర్లు, రహదారుల వారు అందరూ వచ్చేరు, నేనూ వెళ్ళేను. మాటల్లో అక్కడ సెక్షన్ ఆఫీసర్ని ”ఇలా కేబుల్స్ తెంపేస్తే కష్టం కదా! పని మొదలుపెట్టే ముందు చెబితే మా మనిషిని ఇక్కడుంచి మీకు మా కేబుల్స్ ఎక్కడున్నాయో చెబుతాడు కదా! నష్టం నివారించచ్చు కదా” అంటే ఆయనకి కోపం వచ్చి ”మీ కేబుల్స్ ఇక్కడ వున్నాయని ఎవరికి తెలుసు, చెప్పడానికి” అన్నాడు. నాకు కోపం నసాళానికి అంటింది. ”ఈ కేబుల్స్ ఇక్కడున్నాయని, ఇక్కడ వేస్తున్నామని మీకు తెలియచేయడం, మీరు పర్మిషన్లు ఇవ్వడం, దానికి గాను మా దగ్గరనుంచి మీకు లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది, ఆ విషయమేనా మీకు తెలుసా? మీ శాఖ ఇచ్చిన అనుమతులున్నాయి తెలుసా? ఇక్కడ కేబుల్ ఉందని మీకు మీ శాఖకు తెలుసు, కాని మీరు పెద్దవారమని, ఏమి చేసినా చెల్లిపోతుందని చేస్తున్న పని ఇది. అసలు ఒక యుటిలిటీ కమిటీ ఉంటుందని, అది మీశాఖ అద్యక్షతన సమావేశం కావాలని, మునిసిపాలిటీ, రదారుల శాఖ, టెలికం శాఖ, కరంట్ శాఖా ఇందులో సభ్యులని, ఎవరు పని మొదలు పెట్టినా ఈ కమిటీ సమావేశం కావాలని, ప్రతిపాదనలలో అవసరాలు గుర్తించాలని, ఒకరికి ఒకరు సహకరించాలని, మీకు తెలుసా?” అని అక్కడ మూగి ఉన్న జనం మధ్య ఆయనను అడిగేటప్పటికి, పాపం చిన్నబోయాడు. మా ఆఫీసర్లు ”ఊరుకోండి, ఊరుకోండి” అనడంతో, ”చేసిన తప్పును కప్పిపుచ్చుకోకండి, పొరపాటు జరిగిందనండి, ఎంత నష్టం? ఇది మీకూ నాకూ కాకపోవచ్చు, దేశానికి నష్టం, గుర్తించండ”ని ఆవేశంగా చెప్పి ముగించేను., పని పూర్తయ్యింది, కేబుల్ అతుక్కున్నాం, ఆ సాయంత్రానికి. మా ఆఫీసర్ ఒకాయన కొత్తవాడు, చిన్నవాడు నాకంటే వయసులో, వెళుతూ బయటికొచ్చిన తరవాత కారెక్కుతూ ”యువకులలా మరీ అంత ఆవేశపడి కడిగేసేరు,” అన్నారు. నవ్వుకున్నా. ఆయనకు కొత్తగాని నాకిటువంటి అనుభవాలు కొత్తకాదు.

ఇలాగే కరంట్ శాఖతో మీటింగులు జరిగేవి, అక్కడా ఒక సారి ఇటువంటి సంఘటన జరిగింది, అది మరోసారి.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- అరె! మళ్ళీపోయింది!!

  1. శర్మ గారూ, మీ ఇంట్లో వి’ భజన ‘ విషయాలు మాట్లాడు కుంటూ ఉండి ఉంటారు ! మరి ఓటింగ్ జరగ కుండానే బ్లాక్ ఔట్ అవుతూ ఉండడం మాత్రం విచిత్రమే !

    • సుధాకర్జీ,
      సోమవారం విచిత్రమే జరిగింది. మాకు సోలార్ తో కరంట్ ఉంది. ఊరంతా పోయింది. కేబుల్ లేదు, టి.వి. లేదు. నెట్ ముందేపోయింది. ఇక మార్గం లేకపోయింది, రాత్రి కరంట్ వచ్చేదాకా. వి’భజన’గురించి రోజూ మాటాడుకుంటున్నదే !
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s