శర్మ కాలక్షేపంకబుర్లు- కించిత్ భోగం భవిష్యతి.

Courtesy;-you tube

కించిత్ భోగం భవిష్యతి.

ఈమధ్య ఏ బ్లాగు ముట్టుకున్నా కరుస్తా, నరుకుతా,పొడుస్తా అనే వినపడుతున్నకాలంలో, మిత్రులు కారుమంచి వారి బ్లాగ్ కబుర్లుగురూ లో, http://murthykarumanchi.blogspot.in/2014/03/blog-post_30.html ”బ్రహ్మరాత మార్చగలమా??” అనేది చదివి కామెంట్ రాయబోతే అది టపా అయి కూచుంది. వారి బ్లాగు కబ్జా చేయడం ఇష్టంలేక ఇక్కడ ఇలా. వారు చెప్పినదీ బాగుంది కాని అనూచానంగా చెబుతున్న కధ చెప్పాలనే ప్రయత్నమే సుమా ఇది, అవధరించండి.

ఒకరోజు నారదులు నారాయణనామ స్మరణ చేస్తూ మానవలోకంనుంచి బ్రహ్మలోకానికి వెళుతుంటే, ఒక మర్రి చెట్టుకింద కాలికి ఏదో తగిలితే, వంగుని చూస్తే, అది ఒక మానవుని కపాలం, దాని మీద బ్రహ్మరాత ”కించిత్ భోగం భవిష్యతి” అని కనపడే సరికి నారదులు ఆశ్చర్యపోయి, ఆ కపాలాన్ని చేతులోకి తీసుకుని ”నాయనగారు పెద్దవారైపోవడం మూలంగా ఇలా రాస్తున్నారా! ఈ రాతకి అర్ధం ఏమిటి? వీడా చచ్చి కపాలం స్మశానం దొర్లుతుంటే ఇంకా కొద్ది భోగం భవిషత్తులో” అంటారేంటని అలాగే బ్రహ్మలోకానికి చేరుకుని ఒక ఆసనం మీద ఆ కపాలం ఉంచి తాను నిలబడి తండ్రిగారికి నమస్కారం చేస్తే బ్రహ్మగారు, ”నాయనా అదేమ”ని అడిగితే. ”తండ్రీ మీరీ పుర్రెపై ”కించిత్ భోగం భవిష్యతి” అని రాశారు. వీడా చచ్చి ఉన్నాడు, ఈ కపాలనికి భోగం ఏమిటి? ఎలా?” అని ప్రశ్నిస్తే! ”నారదా! ఇది ఒక సామాన్యుని కపాలం, దానిని నీవు చేతితో తాకేవు, అంతతో ఊరుకోక ఇక్కడిదాకా తెచ్చేవు,బ్రహ్మలోకానికి, అదీ కాక దానిని ఒక ఆసనం మీదుంచి నువ్వు నిలబడి నాతో దానిగురించి మాటాడేవు. ఇదంతా ఆ కపాలనికి భొగం కాదుటయ్యా!” అనేటప్పటికి నారదుడు తెల్లబోయారట, ఆశ్చర్యంతో.

మరి దీనినే ”ప్రమాదో ధీమతామపి” అన్నారు పెద్దలు. అనగా బుద్ధిమంతులు కూడా పొరబడుతుంటారని. నారదునికి ఇదంతా తెలియదా? తెలియనివాడా? కాని బుద్ధి మరుగున పడిపోయింది, ఆ కపాలానికి జరగవలసిన భోగం జరగవలసి ఉన్నది కనక, బ్రహ్మరాత మార్చతరమా?? అందుకే మనవారు తోలుకిందరాత దొంగరాత అన్నారు. అది కనపడదు, ఏం జరగనుందీ తెలియదు. తెలుసుకోవాలనే ఆశ, ఆతృత మాత్రం మానవులను పట్టి పీడిస్తూ ఉంటాయి.కాని కానున్నది కాకమానదు.

శంకరులేమన్నారు ”మా కురు జన ధన యవ్వన గర్వం హరతి నిమేషా….”ఇది  కానకున్నాం. ధనగర్వం, మంది ఉన్నారన్న గర్వం, యవ్వన గర్వాలే ఇప్పుడు పరిపాలిస్తున్నాయి, శాసిస్తున్నాయి. మంచిరోజుకోసం ఎదురు చూడటం తప్పించి ఈ వయసులో చేయగలది లేదేమో!బ్రహ్మరాత తప్పించ వశమా?

9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- కించిత్ భోగం భవిష్యతి.

 1. బాబాయ్ గారు, మీలాంటి పెద్దలు ఇలాంటి మంచి మంచి విషయాలు కనీసం బ్లాగుల ద్వారా ఐనా మాలాంటి వారికి అందజేస్తే చాలా బాగుంటుంది. పెద్ద వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఇలాంటి చక్కని విషయాలు/కథలు మరుగున పడిపోకూడదనే

  • లక్ష్మిగారు,
   నా బ్లాగుకు స్వాగతం.
   రెండున్నర సంవత్సరాలలో అమ్మ ఆరువందలపైచిలుకు టపాలు రాయించింది, అమ్మదయ, మీ అభిమానం ఉన్నవరకు కానిస్తాను.
   మీ బ్లాగు చూశాను, అక్కడ ఆ రోజు కామెంటడానికి ఏదో అడ్డం వచ్చి ఆగిపొయా! కర్మభూమి నుంచి భోగభూమికి వెళ్ళారా? అలా చెబితే ఎంతమందికి అర్ధమవుతుందండీ 🙂 బాగుంది, రాయండి మరి.

   ధన్యవాదాలు.

 2. దీక్షితులు గారు,

  ఈ గోదావరీ తీరం వాళ్ళు కథలు జెప్పడం లో కాకలు దీరిన వారు సుమీ !

  ఇంతకీ మోడీ గారికి కించిత్ భోగం భవిష్యతి ఉందం టా రా ?

  జిలేబి

  • జిలేబిగారు,
   ఏదో ఇలా కబుర్లు చెప్పుకు బతికేస్తున్నాం 🙂
   ఎందుకంత సాగతీశారు టా రా అని.
   మోడి ముగ్గురమ్మల గండాన్నిపుడుతున్నాడు (మాయ, మమత, జయ) మరో పెద్దమ్మా పుడుతోందిట కొత్తగా, ఇప్పుడే అందిన వార్త ఇది. నందో రాజా భవిష్యతి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s